ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –4
నిర్వేదం
గత వైభవాన్ని ఏవ రైనా ఒక సారి ఫ్లాష్ బాక్ లో చూసు కోవటం మానవ నైజం .ఎంత ఉచ్చ స్థితి నుంచి పతనం చెందామో సమీక్షించు కొనే సంఘటన అది .రాక్షస మంత్రి కూడా అదే ఆలోచన లో మనసు రీలును వెనక్కి ఒక సారి తిప్పాడు .కఠోర సత్యాలు దృశ్య మానం అయాయి .”ఆ రోజుల్లో రాజులు అందరు కొలుస్తూ ,మెచ్చుతూ వుంటే ,ఠీవి గా మన వూరు వెళ్ళే వాడిని .ప్రజలంతా నన్ను చూసి ,ఆనంద పర వశులయే వారు .అలాంటి వూరి లో ,నా శ్రమ అంతా నిష్ఫలమయి,దొంగలా ,తలకు ముసుగు వేసు కోని ,ఒంటరిగా ,ఈ పాడు పడిన తోటలో ,వేగంగా ఇప్పుడు నడుస్తున్నాను .”అని వ్యధ చెందుతాడు ”.దీనార టంకాల తీర్ధ మాదించే ”నన్న మన శ్రీ నాద కవి సార్వ భౌముడి మనో వేదన లా కని పిస్తుంది .జాలి పడతాం .సాను భూతి చూపిస్తాం .సహవేదన చెందుతాం .ఇతరుల కష్టాలకు కరిగే హృదయం మనకు వుంది .-మనం మానవ మాత్రులం కదా ! , ,
గుణ గ్రహణం
చేసేది లేక ,గమ్యం తెలీక ,సమస్యల తో రాజీ పడ లేక ,కిమ్కర్తవ్యతా మూదుడై రాక్షస మంత్రి ,ఆత్మ హత్యా ప్రయత్నం పై ఆలోచన సాగిస్తాడు .మందులకు అందని రోగం ,రాజు కోపం ,నిప్పు ,విషం లాగానే చావుని తెస్తాయి .అందుకోలేని స్త్రీ పై వున్న మొహం మాన్చు కోవ టానికి ,ఉపాయం లేని ప్రియ మిత్రుడి వినాశం -ఇవే సాధారణం గా లోకం లో ఆత్మ హత్య కు కారణాలు అని భావిస్తాడు .ఒక ప్రక్క చంద్ర గుప్తుని విజయోత్సవం మన్నూ ,మిన్నూ అంటే సంరంభం గా సాగి పోతోంది .రాక్షస మానసం పరి పరి విధాల ఆలోచిస్తోంది .
మిత్రుడు చందన దాసు ఋణం తీర్చ టానికి తన కత్తికి పని చెప్పాలని మనసు వేధిస్తోంది .వీరుడు కనుక కట్టి తోనే సాధించాలని ఆరాటం .తాను మంత్రి కనుక ఉపాయంతో కూడా సాధించ వచ్చు .అయితె ,అంతా అయి పోయింది .మృత్యు ఘంటలు మ్రోగు తున్నాయి .చేసేది లేదు కనుక దేహ సమర్పణ తో ,దేశ ఋణం ,రాజు ఋణం ,మిత్ర ఋణం ,తీర్చు కోవాలని ఆవేశ పడ్డాడు .ఆరాటమూ హెచ్చింది .శత్రువుకు చిక్క కుండా ఇలా చేస్తే ,తన తనువు ధన్యం ఆవు తుందని తీర్మానించు కొన్నాడు .ఆ సమయం లోనే ఆర్య చాణక్యుని కంత (kantha ) ధ్వని విని పించింది .
”జ్వాలలతో భగ ,భాగా మండే నిప్పు ఎవరి కొంగున వుందో ,ఎవరు తాళ్ళ తో గాలిని ని కూడా బంధించాడో ,మదపు తెనుగు కుంభ స్థలాన్ని కొట్టి చంపినా ”సింహం జూలునూ ”పట్టు కోని ,దాన్ని ,”పంజరం ” లో వుంచాడో ,మొసళ్ళు ,తిమింగిలాలు వంటి భయంకర జల చరాలున్న సముద్రాన్ని చేతులతో ఈది దాటాడో ,ఆ గొప్ప వాడిని ,చాణక్యుడిని నేనే”అంతు గంభీర సవనం విని పించింది .అంటే కాదు -చాణక్యుడు ఇంత గొప్ప గా తన్ను ఆవిష్కరించుకొన్నా ,చివరకు ”ఇదంతా దైవ ప్రేరణా ,సహాయమే ”అన్నాడు అతి వినమ్రం గా .రాక్షస మంత్రి ని కూడా పట్టు కోన్నా ననే భావం ”ఆ సింహం ”అనే మాటలో పోదిగాడు .ఈ మాటలు విన్న రాక్షస మంత్రి నిశ్చేష్టు డయాడు .చాణక్యుని పై గురుభావం ఆర్య భావం ,భక్తీ ఒక్కుమ్మడి గా అతన్ని ఆవేశించాయి .అప్పుడు రాక్షసుడు తనను తాను ప్రకటించు కొన్నాడు .

”అయం దురాత్మా !అధవా మహాత్మా కౌటిల్యాః –ఆకరః సర్వ శస్త్రానాం రాత్నానామివ సాగరః
గునైర్ణ పరి తుష్యామో యస్య మత్సరి నో ,వయం ”
రత్నాలకు సముద్రం లాగా ,శాస్త్రాలకు నిధి లాగా ,మంచి గుణాలతో వున్న చాణక్యుడు నంద వంశ నిర్మూలనానికి దేవుడే కారణం అన్నాడు . అంతటి గొప్ప వాణ్ని ,సద్గుణ రాశి నీ ,నేను ఈర్ష్య తో లెక్క చేయ లేదు ”ఒక్క మాట ”దైవేన ” ఆ ఒక్క మాట రాక్షసుడి లో పరి వర్తన” తెచ్చింది .సందేహాలన్నీ పాటా పంచ లయాయి .కర్తవ్యమ్ బోధ పడింది .తన తప్పేమిటో తెలిసింది ..”దైవేన అన్న చాణక్యుని ఒక్క మాటా నాలో మార్పు తెచ్చింది .”అని పశ్చాత్తాప హృదయం తో ఆవేదన చెండాడు .శత్రువు లోని గొప్ప గుణాన్ని ప్రస్తు తించ టానికి గొప్ప సంస్కారం కావాలి .ఆ సంస్క్రారం ఇంత కాలమ్ గా మనోగ్ని దగ్ధ మై న చెడు తలంపు లను కాల్చి ,పునీతు డైనాడు .రాక్షస నామం పేరు కే గాని ,ఇప్పుడు దేవతాంశ తో ప్రతి ఫలిస్తున్నాడు .
వేదన -వేద రహశ్యాన్ని చూపింది .పశ్చాత్తాపం -పరమ మార్గాన్ని చూపింది .దేశ సేవ కు పునరంకితం ఆయె భావాన్నీ కల్గించింది .చాణక్యుడు అన్న ”దైవేన ”అన్న ఒక్క మాట ,ఇంతటి మార్పు కు కారణమయింది .కనుక మనం ప్రయోగించే ,ప్రతి మాటా కూ పర మార్ధం ఉంటుందని ,అది -అవతలి వాడి లో ఎంతైనా మార్పు తెస్తుందని నిరూపించే అద్భుత సన్ని వేశం .చాలా చక్కగా ,మానవ హృదయ యశో ధనం గా ,మానవత్వానికి ఒక మహోన్నత వేదిక గా ,విశాఖ దత్త కవి తీర్చి దిద్దాడు .ఇంత క్రూర నాటకం లో ఇదొక గొప్ప మలుపు .దేశ ప్రాభావోద్దీపనకు ఆర్య చాణక్య మహా మంత్రి ఇచ్చిన పిలుపు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -02 -12 .