ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –5 (చివరి భాగం )
మనిషి కంటే దేశం గొప్పది
రాక్షస మంత్రి దగ్గరకు వస్తు ”భో అమాత్య రాక్షస ,విష్ణు గుప్తోహ మభి వాదయే ”అని సంబోధిస్తూ ,చాణక్య మహా మంత్రి తన వినయాన్ని ప్రదర్శిస్తూ ,అవతలి వ్యక్తీ గొప్ప తనాన్ని కీర్తిస్తూ గొప్ప సంస్కార హృదయం తో చాణక్యుడు అన్న మాటలివి .హృదయపు లోతుల్లోంచి వచ్చిన అమృతపు ఊటలే .మానవ జాతికి మహత్తర సందేశమే .అతనితో పాటు చక్ర వర్తి చంద్ర గుప్తుడూ వచ్చాడు .తన గురువు చాణక్య మంత్రి వుండగా ,తనకు విల్లు ,బాణాలు తో పని ఏమీ లేదని ,ఏది జయిన్చాలన్నా ,సర్వ సమర్ధులైన తన గురువు లున్నారనీ మాటల మంత్రాలతో గురు పూజ చేస్తాడు .తన రాజ్యపు షడం గాలలో చాణక్యుడు ,ఆయనకు దీటైన రాక్షస మంత్రి వుంటే సర్వం జయించ గలను అన్నాడు .రాజు అభ్యర్ధన ను ఔదల దాల్చు తానని అమాత్య రాక్షసుడు ఆమోద ముద్ర వేస్తాడు .అప్పుడు రాక్షస మంత్రి మగధ సార్వ భౌముడు చంద్ర గుప్త మౌర్యుని తో ఇలా అంటాడు అతి వినయం గా ,విశ్వాస పాత్రం గా.
”ద్రవ్యం జిగిశీషు మధి గమ్య జడాత్మ నోపి –నేతుర్యశస్విని పదే నియతం ప్రతిష్టా
అద్రవ్య మేత్య భువి శుద్ధ నయోపి ,మంత్రీ –శీర్నాశ్రయః పతతి కూలజ వృక్ష వృత్యా”
జయించే కోరిక వున్న ఉత్తమ రాజును పొంది ,చేత గాని మంత్రి నైన నేను కూడా కేర్తి ని పొందు తాను .అలా కాకుండా ,మంత్రి యెంత సమర్దుడైనా ,రాజు అపాత్రుడు అయితె ,ఆ ఆశ్రయం కూలి పోతుంది తానూ కూలి పోతాడు .ఏటి ఒడ్డున వున్న చెట్టు ,ఏటి ఉధృతికి ,ఎంత గట్టి దైనా ,తానూ కూలి పోతుంది .కనుక సమర్దు దిన చంద్ర గుప్త మౌర్యునికి ,తాను మంత్రి నయి తే తన గౌరవం పెరుగు తుందని రాక్షస మంత్రి వినమ్రం గా విశదీక రించాడు .ఈ సన్ని వేశం లో అటు చంద్ర గుప్తుడు ,చాణక్యుడు రాక్షసుని ప్రతిభకు జేజేలు పలకటం ,ఇటు రాక్షసుడు కూడా ఆ ఇద్దరి వ్యక్తిత్వాల వల్ల తన గౌరవం హోదా పెరుగు తాయని బావించటం స్పష్ట మైంది .రాజ్యానికి రాక్షసుని వంటి శక్తి ,ఆలచన ,సమర్ధత వున్న మంత్రి వుండాలి అని చాణక్య మతం .మన కంటే దేశం ముఖ్యం అన భావన ముగ్గుర్లో ను వచ్చింది .అదీ రావాల్సిన మార్పు .చాణక్యుడు కోరిన మార్పు .
శాంతి సౌభ్రాతృత్వం
మౌర్య సామ్రాజ్యానికి రాక్షసుని వంటి మహా మేధావి మా మంత్రి గా వుంటే సామ్రాజ్యం సర్వతో జయం గా ,సర్వతో భద్రం గా ,అభివృద్ధి పధం లో నడుస్తుందని ప్రజలు సురక్శకం గా సుభిక్షం గా సుఖ శాంతులతో వర్ధీల్లు తారని ,శాంతి సౌహార్ద్రం వెళ్లి విరుస్తాయని బావించి ,రాక్షస మంత్రి ని చాణక్య మహా మంత్రి అభ్యర్దిస్తాడు .అతని నుంచి సానుకూల స్పందనా రా బడు తాడు .తన శపథం అంటే చాణక్య శపథం నెర వేరింది .ఇంక తనకు వాన ప్రస్తాశ్రయమే శరణ్యం ,శ్రేయష్కరం .రక్తం తో ,కౌటిల్యం తో అంటిన మరకలను చేరి పేసు కోవాలి అంటే మనశ్శాంతి చాలా ముఖ్యం .అందుకు పూర్వపు వారు చూపిన మార్గ మైన మహా అరణ్యమే శ్రేష్టం .మనో మాలిన్యం మహా ప్రక్షాళన మవాలి .అదే చాణక్యుని ఆకాంక్ష .అందుకే సావి నయం గా రాక్షసా మాత్యుని తో
”అశ్వైహ్ సార్ధ మజశ్ర దత్త కవికైహ్ క్శామైరశోన్యాసనైహ్ –స్నానా హార విహార పాన శయన స్వేచ్చా సుఖైర్వర్జితాన్
మాహాత్మ్యాత్తవ పౌరుషస్య మతి మన్ ద్రుప్తారి గర్వచ్చిదః –పశ్యైతాన్పరి కల్పనా ,వ్యతి కర ప్రోచ్చూన వంశాన్ గజాన్ ”
” రాక్షసా మాత్యా !మహా మంత్రివి వి .నీ పరాక్రమం తలచు కొంటె నాకు ఒడ లెల్లా హడలు. ఎప్పుడూ గుర్రాలను సిద్ధం చేసి వుంచటం వల్ల అవి ఎలా చిక్కి పోయాయో చూడు .ఎప్పుడూ యుద్ధ రంగానికి అవి సిద్ధమే .ఏనుగుల వెన్నెముక ఎలా వాచి వున్నాయో చూడు . .సంవత్సరం నుంచి ఒక్క క్షణం కూడా నీ భయం వల్ల ,నిత్య జాగురూకతతో వుండటం వల్ల వీటికి విశ్రాంతి అనేది లేకుండా పోయింది .వాటి గుండెల్లో నువ్వు అను క్షణం నిద్ర పోయావు .మాకూ కంటి మీద కునుకు లేకుండా చేశావు .” అని అతని మహా మతిత్వానికి కీర్తి కిరీటం పెట్టాడు .యుద్ధ భయం మానవ జాతి కి శ్రేయస్కరం కాదు .శాంతియ అందరి తక్షణ కర్తవ్యమ్ .ప్రజాజీవితం నిత్యం సంక్షోభం లో వుంటే ,ప్రగతి శూన్యం అవుతుంది .చీకటి, అజ్ఞానం, అసమర్ధతా రాజ్యమేలు తాయి ..కనుక సుభిక్షం గా రాజ్య పాలన చేసి ,ప్రజాభిమానం సంపాదించాలి అనే జీవిత సత్యం ఇక్కడ ఆవిష్కరింప బడింది .
మంత్రిత్వాన్ని అంగీకరిస్తూ రాక్షస మంత్రి తాను ఇప్పుడు సేవకుడ నయానని ,రాజు ఎంత గౌర విన్చినా ,సేవకుడి నే కదా అని లోలోపల బాధ పడ్డాడు .”నా కట్టి ఎప్పుడూ నా మిత్రులను కాపాడాలి బ్రహ్మ దేవు దైనా ,కార్య నిర్వహణ లో చాలాకాలానికి నౌకరు అవుతాడు అన్నట్లు వుంది నా పరిస్థితి ”అను కొంటాడు .చంద్ర గుప్తుని కోసం శస్త్రం దాల్చటం గతి లేక మంత్రి పదవి ని అంగీక రించటమే నని కుమిలి పోతాడు .గుండె గూళ్ళు కదిలి పోతున్నట్లు తన మనో భావాన్ని వెళ్ళ దించాడు .అయితె వ్యక్తీ కంటే రాజ్యం పూజ నీయం సేవ నీయం .అని నిర్ణ యించుకొన్నాడు .ఇదంతా అంతః సంఘర్షణ .ఈ విధం గా ప్రతి పాత్ర లో మానవతా ముద్ర ను వేశాడు ముద్రా రాక్షస సృష్టి కర్త విశాఖ దత్త మహా కవి .గుండె లోతుల్ని తడి మాడు ,ఆర్ద్రత కల్గించాడు .కర్తవ్య బోధ చేశాడు .దేశం కోసం సర్వస్వం ధార పోయాలి అనే నిష్టను తెలియ జేశాడు .అసమాన ప్రతిభా వ్యుత్పత్తు లతో నాట కాన్ని మహా రక్తి కట్టించాడు .
అయి పోయింది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -02 -12 .
రాక్షస మంత్రి దగ్గరకు వస్తు ”భో అమాత్య రాక్షస ,విష్ణు గుప్తోహ మభి వాదయే ”అని సంబోధిస్తూ ,చాణక్య మహా మంత్రి తన వినయాన్ని ప్రదర్శిస్తూ ,అవతలి వ్యక్తీ గొప్ప తనాన్ని కీర్తిస్తూ గొప్ప సంస్కార హృదయం తో చాణక్యుడు అన్న మాటలివి .హృదయపు లోతుల్లోంచి వచ్చిన అమృతపు ఊటలే .మానవ జాతికి మహత్తర సందేశమే .అతనితో పాటు చక్ర వర్తి చంద్ర గుప్తుడూ వచ్చాడు .తన గురువు చాణక్య మంత్రి వుండగా ,తనకు విల్లు ,బాణాలు తో పని ఏమీ లేదని ,ఏది జయిన్చాలన్నా ,సర్వ సమర్ధులైన తన గురువు లున్నారనీ మాటల మంత్రాలతో గురు పూజ చేస్తాడు .తన రాజ్యపు షడం గాలలో చాణక్యుడు ,ఆయనకు దీటైన రాక్షస మంత్రి వుంటే సర్వం జయించ గలను అన్నాడు .రాజు అభ్యర్ధన ను ఔదల దాల్చు తానని అమాత్య రాక్షసుడు ఆమోద ముద్ర వేస్తాడు .అప్పుడు రాక్షస మంత్రి మగధ సార్వ భౌముడు చంద్ర గుప్త మౌర్యుని తో ఇలా అంటాడు అతి వినయం గా ,విశ్వాస పాత్రం గా.
”ద్రవ్యం జిగిశీషు మధి గమ్య జడాత్మ నోపి –నేతుర్యశస్విని పదే నియతం ప్రతిష్టా
అద్రవ్య మేత్య భువి శుద్ధ నయోపి ,మంత్రీ –శీర్నాశ్రయః పతతి కూలజ వృక్ష వృత్యా”
జయించే కోరిక వున్న ఉత్తమ రాజును పొంది ,చేత గాని మంత్రి నైన నేను కూడా కేర్తి ని పొందు తాను .అలా కాకుండా ,మంత్రి యెంత సమర్దుడైనా ,రాజు అపాత్రుడు అయితె ,ఆ ఆశ్రయం కూలి పోతుంది తానూ కూలి పోతాడు .ఏటి ఒడ్డున వున్న చెట్టు ,ఏటి ఉధృతికి ,ఎంత గట్టి దైనా ,తానూ కూలి పోతుంది .కనుక సమర్దు దిన చంద్ర గుప్త మౌర్యునికి ,తాను మంత్రి నయి తే తన గౌరవం పెరుగు తుందని రాక్షస మంత్రి వినమ్రం గా విశదీక రించాడు .ఈ సన్ని వేశం లో అటు చంద్ర గుప్తుడు ,చాణక్యుడు రాక్షసుని ప్రతిభకు జేజేలు పలకటం ,ఇటు రాక్షసుడు కూడా ఆ ఇద్దరి వ్యక్తిత్వాల వల్ల తన గౌరవం హోదా పెరుగు తాయని బావించటం స్పష్ట మైంది .రాజ్యానికి రాక్షసుని వంటి శక్తి ,ఆలచన ,సమర్ధత వున్న మంత్రి వుండాలి అని చాణక్య మతం .మన కంటే దేశం ముఖ్యం అన భావన ముగ్గుర్లో ను వచ్చింది .అదీ రావాల్సిన మార్పు .చాణక్యుడు కోరిన మార్పు .
శాంతి సౌభ్రాతృత్వంమౌర్య సామ్రాజ్యానికి రాక్షసుని వంటి మహా మేధావి మా మంత్రి గా వుంటే సామ్రాజ్యం సర్వతో జయం గా ,సర్వతో భద్రం గా ,అభివృద్ధి పధం లో నడుస్తుందని ప్రజలు సురక్శకం గా సుభిక్షం గా సుఖ శాంతులతో వర్ధీల్లు తారని ,శాంతి సౌహార్ద్రం వెళ్లి విరుస్తాయని బావించి ,రాక్షస మంత్రి ని చాణక్య మహా మంత్రి అభ్యర్దిస్తాడు .అతని నుంచి సానుకూల స్పందనా రా బడు తాడు .తన శపథం అంటే చాణక్య శపథం నెర వేరింది .ఇంక తనకు వాన ప్రస్తాశ్రయమే శరణ్యం ,శ్రేయష్కరం .రక్తం తో ,కౌటిల్యం తో అంటిన మరకలను చేరి పేసు కోవాలి అంటే మనశ్శాంతి చాలా ముఖ్యం .అందుకు పూర్వపు వారు చూపిన మార్గ మైన మహా అరణ్యమే శ్రేష్టం .మనో మాలిన్యం మహా ప్రక్షాళన మవాలి .అదే చాణక్యుని ఆకాంక్ష .అందుకే సావి నయం గా రాక్షసా మాత్యుని తో
”అశ్వైహ్ సార్ధ మజశ్ర దత్త కవికైహ్ క్శామైరశోన్యాసనైహ్ –స్నానా హార విహార పాన శయన స్వేచ్చా సుఖైర్వర్జితాన్
మాహాత్మ్యాత్తవ పౌరుషస్య మతి మన్ ద్రుప్తారి గర్వచ్చిదః –పశ్యైతాన్పరి కల్పనా ,వ్యతి కర ప్రోచ్చూన వంశాన్ గజాన్ ”
” రాక్షసా మాత్యా !మహా మంత్రివి వి .నీ పరాక్రమం తలచు కొంటె నాకు ఒడ లెల్లా హడలు. ఎప్పుడూ గుర్రాలను సిద్ధం చేసి వుంచటం వల్ల అవి ఎలా చిక్కి పోయాయో చూడు .ఎప్పుడూ యుద్ధ రంగానికి అవి సిద్ధమే .ఏనుగుల వెన్నెముక ఎలా వాచి వున్నాయో చూడు . .సంవత్సరం నుంచి ఒక్క క్షణం కూడా నీ భయం వల్ల ,నిత్య జాగురూకతతో వుండటం వల్ల వీటికి విశ్రాంతి అనేది లేకుండా పోయింది .వాటి గుండెల్లో నువ్వు అను క్షణం నిద్ర పోయావు .మాకూ కంటి మీద కునుకు లేకుండా చేశావు .” అని అతని మహా మతిత్వానికి కీర్తి కిరీటం పెట్టాడు .యుద్ధ భయం మానవ జాతి కి శ్రేయస్కరం కాదు .శాంతియ అందరి తక్షణ కర్తవ్యమ్ .ప్రజాజీవితం నిత్యం సంక్షోభం లో వుంటే ,ప్రగతి శూన్యం అవుతుంది .చీకటి, అజ్ఞానం, అసమర్ధతా రాజ్యమేలు తాయి ..కనుక సుభిక్షం గా రాజ్య పాలన చేసి ,ప్రజాభిమానం సంపాదించాలి అనే జీవిత సత్యం ఇక్కడ ఆవిష్కరింప బడింది .

మంత్రిత్వాన్ని అంగీకరిస్తూ రాక్షస మంత్రి తాను ఇప్పుడు సేవకుడ నయానని ,రాజు ఎంత గౌర విన్చినా ,సేవకుడి నే కదా అని లోలోపల బాధ పడ్డాడు .”నా కట్టి ఎప్పుడూ నా మిత్రులను కాపాడాలి బ్రహ్మ దేవు దైనా ,కార్య నిర్వహణ లో చాలాకాలానికి నౌకరు అవుతాడు అన్నట్లు వుంది నా పరిస్థితి ”అను కొంటాడు .చంద్ర గుప్తుని కోసం శస్త్రం దాల్చటం గతి లేక మంత్రి పదవి ని అంగీక రించటమే నని కుమిలి పోతాడు .గుండె గూళ్ళు కదిలి పోతున్నట్లు తన మనో భావాన్ని వెళ్ళ దించాడు .అయితె వ్యక్తీ కంటే రాజ్యం పూజ నీయం సేవ నీయం .అని నిర్ణ యించుకొన్నాడు .ఇదంతా అంతః సంఘర్షణ .ఈ విధం గా ప్రతి పాత్ర లో మానవతా ముద్ర ను వేశాడు ముద్రా రాక్షస సృష్టి కర్త విశాఖ దత్త మహా కవి .గుండె లోతుల్ని తడి మాడు ,ఆర్ద్రత కల్గించాడు .కర్తవ్య బోధ చేశాడు .దేశం కోసం సర్వస్వం ధార పోయాలి అనే నిష్టను తెలియ జేశాడు .అసమాన ప్రతిభా వ్యుత్పత్తు లతో నాట కాన్ని మహా రక్తి కట్టించాడు .
అయి పోయింది
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -02 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com