ప్రాచీన కాశీ నగరం –3

ప్రాచీన కాశీ నగరం –3

                                       నవ నాగులు 
ఇతి హాసిక పరి శోధకులు చెప్పే దాన్ని బట్టి చరిత్ర పూర్వ యుగం లో ”భార శివుల ”వంశం మూలాలు కోశామ్భి-కాశి నాగ రాల మధ్య వున్నాయి .వీళ్ళు శివ లింగాన్ని కంఠం లో ధరించే వారు .పట్టాభి షేకం జరిగే తప్పుడు పవిత్ర గంగా జలాన్ని శిరసు పై చల్లు కొనే వారు .దశాశ్వ మేధా యజ్ఞాన్ని చేసి ,ఆవ భ్రుత స్నానం చేసే వారని తెలుస్తోంది .కుషానుల పరి పాలన తర్వాతా వీళ్ళు క్రీ శ.150 లోకాశీ రాజ్యం స్థాపించారని ,కాశి దగ్గ రున్న ”నగవా ”ప్రాంతం అంటే ఇప్పుడున్న కాశీ విశ్వ విద్యాలయం ఉన్న  చోట  వాళ్ళ పేరు తోనే వుందని చరిత్ర కారులు అన్నారు .దశాశ్వ మేధా యజ్ఞం చేసిన తర్వాతా పుట్టిన పిల్ల వాడికి ”హయ నాగ ”అని మొదటి రాజు  పేరు పెట్టి నట్టు తెలుస్తోంది .ఈ భార శివులనే తారు వాత పురాణాల్లో ”నవ నాగులు ”అన్నారు .ఆ రాజులు పల్లవ రాజ దాని కంచిని కాశీ తో పోల్చే వారట .ఉత్తర కాశి అని శాసనాల్లో లిఖించారు .హుయాన్ సాంగ్ కాంచీ లో ౧౦౦ బౌద్ధ ఆరామాలున్నాయని ,౧౦ వేల మంది బౌద్దా చార్యులున్నారని ౮౦ హిందూ దేవాలయాలున్నాయని ,వేలాదిగా దిగంబర జైన సన్యాసులున్నారని రాశాడు .బౌద్ధ పండితుడు ”ధర్మ పాలుడు ”ఇక్కడే పుట్టాడని ,చెప్పాడు .కాంచీ నగరం కాశీ లాగా అన్ని మతాలకు నిలయం  .
 బుద్ధ బోధ 
బుద్ధుడు కాశీ నుంచి ౬౦ మంది భిక్షువుల్ని ,అన్ని దిక్కులకు ,బౌద్ధ ధర్మ వ్యాప్తి కోసం పంపించాడు ”బహుజన హితం గా ,బహుజన సుఖం గా లోక కల్యాణం గా ,దేవ ,మనుష్యులకు మేలు చేసేవి గా ,హితం తో అన్ని చోట్లకు కద లండి .ఆది ,మధ్య అంత్య కళ్యాణ కర మైన ధర్మాలను ఉపదేశిస్తూ ,నడ వండి .సంపూర్ణ పరిశుద్ధ బ్రహ్మ చర్యం పాటించండి .చిన్న దోషాలు చేసే వారు ధర్మాన్ని వినక పొతే చెడి పోతారు .వింటే ధర్మ వేత్త లావు తారు .”అని వారికి ధర్మ బోధ చేసి పంపించాడు .భయ పాడనీ ఖడ్గ మ్రుగాల్లా ,శబ్దాలకు భయ పాడనీ సింహాల్లా ,నీటి బొట్టు అంటని తామ రాకులా ,ఒంటరిగా ఖడ్గ మృగం లా దారి తెన్నూ లేకుండా ముందుకు నడ వండి అని ఉద్బోధించాడు .
Go forward without a path ,fearing nothing like the rhinoceros .even as the lion not trembling at noises -even asa lotus leaf ,unstrained by the water -do thou wander alone like the rhinoceros ”(watters-volume 2)
రాజా తరంగిణి లో కాశి వృత్తాంతం వుంది .”కాశీ వెళ్ళ టానికి అనీ వదులు  కొంటాను ”అని వుంది ”.మాత్రు గుప్తుడు అన్నీ వదిలి యతి గా మారాడు .నేనూ అంతిమ దశ లో కాశీ చేరతాను ”అన్న వాక్యాలూ కని పిస్తాయి .అల్బరూని -కాశీగ్రించి రాస్తూ ”బారికి ౨౦ ఖర్సుల దూరం లో ప్రఖ్యాత ”బనారస్ ”వుంది .ఉత్తరం నుంచి ,అది హిందూ దేశానికి ముఖ్య ద్వారం గా వుంది ”అన్నాడు .ఇలా క్రీ శ.12 శతాబ్ది వరకు ఎక్కడో అక్కడ కాశి ని గురించి పుస్తకాలలో ప్రశంశ కని పిస్తుంది .
 హూన  దండ యాత్ర 
హైహయుల దండ యాత్ర తర్వాత క్రీ.శ.ఆరవ శతాబ్ది వరకు కాశీ పై దండ యాత్రలు లేవు .ఆ తర్వాత శ్వేత హూణుల నాయకుడు ,శైవ మతావ లంబి ,”మిహిర కులుడు ”అసంఖ్యాక సైన్యం తో కాశి రాజ్యాన్ని చేరి ,వందలాది బౌద్ధ విహార  ,స్తూప ,ఆరామాలన్నీ ధ్వంసం చేసి ,వేలాది బౌద్ధులను చంపేశాడు అని ఫాహియాన్ తెలిపాడు .తరు వాత హుయాన్ సాంగ్ వచ్చే సరికి హిందూ ఆలయాలు వంద  దాకా వున్నట్లు రాశాడు .ఇవి హూన దండ యాత్ర తర్వాత వచ్చినవే .మిహిర కులున్ని నర హంతకుని గా బౌద్ధ లేఖకుడు ”గుణ భద్రుడు ” వర్ణించాడు .అతని పేరే సింహ స్వప్నం అన్నాడు . .  .1193 లోమహమ్మద్ ఘోరి ”అసి ”కోట లోని అశేష ధన సంపదను కొల్ల గొట్టి కాశీ వచ్చాడు .అతని సేనాని కుతుబుద్దీన్ ఇబన్ నగ రాన్ని దోచి ,ఆలాయాల్ని ,ఆరామా లన్నీ  నేల మట్టం చేశాడు . ధిల్లీ నుంచి కాశి దాకా వున్న ప్రదేశాన్నంతా ,ఆక్రమించాడు అని మజుందార్ అనే చరిత్ర కారుడు రాశాడు .కొన్ని దేవాలయాలను మసీదు లు గా మార్చాడు .ఔరంగా జేబు తర్వాత వచ్చిన పాలకులు బల హీను లవటం వల్ల మొఘల్ సామ్రాజ్య పతనం జరిగి అయోధ్య నవాబు ”సఫ్దర్ జంగ్ ”వశ మైంది ..అప్పుడే  1775 లో బ్రిటిష్ వారు చేసుకొన్నా ఒప్పందం  ప్రకారం కాశీ, బ్రిటిష్ వారి వశ మైంది .
  ఔరంగ జేబు దుశ్చర్యలు 
1669 లో సెప్టెంబర్ రెండున ఔరంగ జేబు కాశీ విశ్వేశ్వరాలయాన్ని ధ్వంసం చేసి దాని పై మసీదు కట్టాడు .ఆ తర్వాత ,దాదాపు వంద ఏళ్ళ వరకు విశ్వేశ్వరాలయం లేదు .ఇండోర్ మహా రాణి అహల్యా బాయి కి కలలో విశ్వేశ్వరుడు కన్పించి ,మళ్ళీ విశ్వేశ్వర ప్రతిష్ట చేయమని కోరాడు .ఆమె అలాగే చేసి ఆలయం కట్టించింది .ఇప్పుడున్న  ఆలయం ఆమె కట్టించిందే .దీన్ని 1775 లో నిర్మించింది ..బంగారు పూత పూయించి ,స్వర్ణాలయం అనే పేరు తెచ్చిన వాడు లాహోర్ రాజు రంజిత్ సింగ్ .అంతకు ముందు క్రీ.శ. .490 లో కట్టిన ఆలయాన్ని ముస్లిం దండ యాత్ర లో మళ్ళీ ద్వంసమైతే 1585 లోఅక్బర్ మంత్రి రాజా తోడర్ మల్లు పునర్నిర్మించాడు . 1860 లోదక్షిణాదికి చెందిన ”నాటు కోటు చెట్టియార్ల సంఘం ”మూడు వేళలా ,పూజలు ,అభిషేకాలు ,జరిగే  ఏర్పాటు చేశారు . విశ్వేశ్వర లింగం చతురశ్రా కార తొట్టె లో వుంటుంది .అందరు ముట్టుకొని అభిషేకం చేసు కో వచ్చు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.