విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి —3

విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి —3

                                               హెచ్చరిక 

నరసింహా రెడ్ది చేసిన దాడిని పై అధికారులకు తెలిసింది .అప్పుడు కోవెల కుంట్ల ప్రాంతాలన్నీ  లన్ని కడప మండలం లో ఉండేవి .పట్ట పగలే తాసిల్దార్ని చాపి ,ఖజానాను దోచుకోవటం ఆంగ్లేయ అది కారులు జీర్ణించుకో లేక పోయారు .తమ అధికారాన్ని ధిక్క రించి విప్లవోద్యమం నడుస్తోందని తల్ల డిల్లారు .”కాకేన్ ”అనే మండలాది కారి -నరసింహా రెడ్డి ని యెట్లా గైనా చెర బట్టి తెమ్మని హుకుం జారీ చేశాడు .సాయుధ సైన్యం ఆఘ మేఘాల మీద ఉయ్యాల వాడ చేరింది .అయినా ఊళ్ళో కాలు పెట్టె ధైర్యం చేయ లేక పోయింది .రెడ్డి కి వార్త చేరింది .వచ్చిన సైనికులు భారతీయులే అని తెలుసు కొన్నాడు .వారంతా జీవనం కోసం ప్రభు భక్తీ ని చూపిస్తున్నారని ,భయ పెట్టి పంపిచ్చేద్దాం అని ఆలోచించాడు .అనుచర వర్గం తో అక్కడికి చేరాడు .”పులి నోట్లో చెయ్యి పెట్టి పళ్ళు పీకే ధైర్య వంతులున్న ఈ ప్రదేశానికి ఎన్ని గుండెలతో వచ్చారు ?”అంటూ లేళ్ల మీద ఉరికే సింహం లాగ మీద పడ్డాడు .భయం తో వారంతా పరుగో పరుగు .బోయ దండు వారిని వెంటాడి పట్టుకు తీసుకొని వచ్చి నరసింహా రెడ్డి కాళ్ళ మీద పడేసింది .వాళ్ళు కాళ్ళా వెళ్ళా పడ్డారు .మొదటి తప్పు గా క్షమిస్తున్నానని ,వారి భారతీయ సహచరులకు కూడా హెచ్చ రిక గా తెలియ జేయమని చెప్పి వది లేశాడు .వారంతా బతుకు జీవుడా అంటూ పలాయనం చిత్త గించారు .
   మకాం మార్పు
               వీళ్ళు కడప చేరారు కాని అధికారి గడప తొక్క టానికి భయ పడ్డారు .తను అనుకొన్న పధకం చక్క గా అమలైనందుకు రెడ్డి సంతోషించాడు .బ్రిటిష్ వారు జరిగిన దాన్ని పరాభవం గా పాటించి ,తన్నుప్రాణాలతో బంధించా టానికి శాత విధాల ప్రయత్నిస్తుందని ,ఊహించాడు .శత్రువు అమిత బాల వంతుడు .కనుక ఇక నిత్య పోరాటం తప్పాడు .తగినంత సైన్యాన్ని సామగ్రిని సమ కూర్చు కోవాలని నిర్ణ యించాడు .ఇక్కడి కోటలో ని నీరు ఉప్పు నీరు .అందుకని తానా యుద్ధ తంత్రాన్ని మార్చి ”నొసం దుర్గం ”కు మకాం మార్చాడు .దుర్గం కోట చాలా బలం గా వుంది .తిండికి ,యుద్ధానికి అవసరమైన వన్ని అతి త్వరలో సమ కూర్చుకొన్నాడు .యెంత దూరంలో ఉన్న విష యాన్ని అయినా ”అంజనం ”లో చూసి చెప్ప గల ”గోసాయి వెంకన్న”   అనే సిద్ధుడు రెడ్డి కి సహాయం గా వున్నాడు .అందరు ఆయన్ను మహాత్ముడు అనే వారు .ఆకు మళ్ళ గ్రామం లో వుండే మంత్ర ,జప భగవధ్యాన తత్పరుడు .ఇతరుల మేలు ను కోరే వాడు .అవసరమైతే కత్తి పట్టి యుద్ధం చేయ టానికి సిద్ధం .దేశ భక్తీ అపారం గా ఉన్న మాత్రు దేశ సేవా పరాయణుడు .అతని మంత్ర మహిమ కు ఆశ్చర్య పడి ,రెడ్డి తన ఆస్థానానికి ఆహ్వానించి గౌరవం గా చూసు కొంటున్నాడు . .
  హిత బోధ 
కృష్ణ దేవ రాయల అల్లుడు అలియ రామ రాజుకు బంధువు -”ఔకు నగర ”పాలకుడు ”నారాయణ రాజు ”ను దర్శించి ,రెడ్డి ఆయనకు తానూ చేస్తున్న వి వివ రించాడు .విదేశీయులను తరిమి కొట్టే పవిత్ర  ఉద్దేశంతో నే తానూ ఆయుధం చేబట్టానని ,తన పవిత్ర కార్యానికి చేయూత నిచ్చి ,సహకా రించా మని కోరాడు .రెడ్డి దేశ భక్తికీ ,శౌర్య సాహసాలకు ప్రశంసిస్తూనే ”ప్రభుత్వ నిరంకుశత్వం లో భారతీయులు నలిగి పోతున్న మాట నిజమే .బ్రిటిష్ ప్రభుత్వం బల మైనది .దానిపై బహిరంగ విప్లవం సాగించా లంటే ,ఆచి ,తూచి అడుగేయాలి .దేశ ,కాల ,పరిస్తితులను అధ్యనం చేయాలి .అందరికి తెల్ల వాళ్ళ పై ద్వేషం వున్నా ,యెంత మంది ముందుకు వస్తారో చెప్పటం కష్టం .భారత దేశమంతా ఏక త్రాటి పై నిల్చి ,స్థిర చిత్తం తో పోరాడితేనే ఫలితం వుంటుంది .యెప్ప టి కైనా ఈ విద్వేషాగ్ని ప్రజ్వ రిల్లి ,చివరికి తెల్ల వాళ్ళను మాడ్చి మసి చేస్తుంది .అప్పటి దాకా నీ రక్షణ విషయం లో అతి జాగ్రత్త గా నువ్వు వుండాలి .అదే నీకు మేలు .తెగించి ముందుకు దూకితే మొదటికే మోసం వస్తుంది .కార్య సాధకుడు సమయం చూసి దెబ్బ తీయాలి .తొందర పడితే అనర్ధం .ఇవాళ సాధించ లేక పోయినా ,రేపు మన కల నిజ మౌతుంది .నీకు అవసర మైన సహాయం అందిస్తూనే వుంటాను ఈ ధనాన్ని తీసుకొని ,నీ ప్రయత్నం కోన సాగించు ”అని చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపాడు .దాన్ని తీసుకొని ,నిరాశతో రెడ్డి నొసం గ్రామ దుర్గానికి చేరాడు
   బంగారపు కడ్డి 
తనతో చేయి చేయి కలిపి యుద్ధానికి సాయ పడ తాడతాడను కొంటె ఔకు రాజు  డబ్బు మాత్రమె ఇచ్చి పంపాడని రెడ్డి బాధ పడ్డాడు .అభిప్రాయ భేదం ఉన్నంత మాత్రాన అతన్ని శంకించా రాదనుకొన్నాడు .రాజు చెప్పిందంతా ఆప్త వాక్యం గా భావించాడు .అతను ను చెప్పిన దానిలో విజ్ఞత వుందని భావిస్తూ కొంత ఆలోచిస్తూ జాగ్రత్త గా ఉంటున్నాడు .తెల్ల వాళ్ళ ఉనికిని కానీ పెట్టె వేగులను నియమించాడు .
ముక్క మళ్ళ ,ముది గోడు ,సంజమల గ్రామాల బోయ లంతా నరసింహా రెడ్డి పక్షాన చేరారు .”నరసింహా రెడ్డి కాదు -బంగారపు కడ్డి ”అని అందరు రెడ్డిని పొగుడు తున్నారు .రెడ్డి కోసం ప్రాణ త్యాగం చేస్తే ,స్వర్గం వస్తుందని ,ఇవాళ చస్తే రేపటికి రెండో రోజు- అంతే అనే భావం అందరి లో వ్యాపించింది .పాటలు పాడుకొంటూ నృత్యాలు  చేసుకొంటూ తమంత తామే రెడ్డి బలగం లో చేరి దేశ భక్తి ని చాటు కొంటున్నారు..
సశేషం

  ఉయ్యాల వాడ –2

ఉయ్యాలవాడ -1
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్-01 -03 -12 .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.