నాటక రంగానికి వరం మైల వరం -2

నాటక రంగానికి వరం మైల వరం 

                                           నాయన గారు
  ”నాయన గారు ”అని ప్రజలందరి చేత ఆప్యాయం గా  పిలువబడిన చివరి రాజు ఎస్.వి.ఎస్ .ఆర్ .జి .నరసింహా రావు గారు .ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చిన ఉదారులు .నిరాడంబర జీవులు .౧౫ సంవత్స రాలు మైల వరం సమితి అధ్యక్షులు గా పని చేశారు .కృష్ణా జిల్లా పరిషద్ ఉపాధ్యక్షు లైనారు .నూజివీడు ధర్మ అప్పా రావు కాలేజి స్తాపన కు బాగా తోడ్పడ్డారు .ఎన్నో ప్రాధమిక ,ప్రాధమికోన్నత ,ఉన్నత పాథ శాలకు ,జూనియర్ కళా శాలకు ఊపిరి పోశారు .విశ్వ విద్యాలయ సెనేట్ కు సభ్యులయారు .వీరి మరణాంతరం కుమారుడు 1966 లో మైలవరం లో తండ్రి పేరిట జిల్లా పరిషద్ బాలుర ఉన్నత పాథ శాలను నిర్మించారు .ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను ఉదారం గా ఇచ్చే శారు .విద్యా లయాలను నెల కొల్పి ,ప్రజల ఆరోగ్యం పై శ్రద్ధ వహించారు .మైల వరం జమీందారులు గొప్ప వితరణ శీలురు గా వినుతి కెక్కారు .ప్రజా సేవ లో ,కళా సేవ లో ధన్యత చెందారు .
  సాహిత్య సేవ 
మైల వరం సంస్తానా దీషులు ప్రజా హిత కార్య క్రమాలలో ఎలా ప్రజా హృదయాలను దోచుకోన్నారో ,అలాగే సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలను నిర్వ హించి ,వారి మనసులను గెలుచు కొన్నారు .ముఖ్యం గా మైల వరం నాటక కళకు ప్రసిద్ధి చెందింది .ఆఏఏఏణ్డాఆఱూళా సేవ చిర స్మరణీయం .వారి కి ఉన్న అభి రుచి ఆదర్శ ప్రాయమైనది .ఎందరో నాటక రచయితలూ ,నటులు ,మైల వరం లో ఆశ్రయం పొంది ,గౌరవం తెచ్చారు .వారిలోని సృజనను ,ప్రతిభను గుర్తించి ప్రోత్స హించారు కళా బంధువులై నీలి చారు .ఆంద్ర దేశ నాటక రంగ చరిత్ర లో మైల వరం సువర్ణా ధ్యాయం గా నిలిచి పోయింది .
   పాపయ్యప్పా రావు సేవ 
రెండవ రాజా గా ప్రసిద్ధి చెందినా రాజా సూరానేని పాపా రావు బహద్దర్ వారు ”బాల భారతి ”అన్న పేరు తో నాటక సమాజాన్ని నెల కోల్పారు .ఏంటో ధనాన్ని వెచ్చించి ,వ్యయ ప్రయాసలకు ఓర్చి ,తమ సంపదను నాటక రంగానికి వ్యయం చేసిన త్యాగ మూర్తి పాపా రావు .ఇప్పటికీ ఆయన పేరు చెబితే ,కళా కారులంతా ,ముకుళిత హస్తాలతో కై మొద్పులు ఘటిస్తారు .అప్పటి నుంచి నేటి దాకా ఆ సంస్థ కార్య క్రమాలను నిర్వ హిస్తూనే వుంది .పౌరాణిక నాటకాలను ప్రోత్స హిస్తూనే వుంది .కర్నాటక ,మహా రాష్ట్రాల నాటకాలకు ఉన్నంత పేరు ప్రఖ్యాతి ,మైల వరం నాట కాల సమాజాలకు వుంది .నరసింహా రావు చివరి జమీందార్ గా వున్నప్పుడు విశేష మైన కృషి చేసి తెలుగు నాటక రంగం అన్ని విధాల ఉత్క్రుష్టం అని నిరూపించారు .ధనాన్నిమంచినీరు లా ఖర్చు చేసి ,కళా కారులకు వెన్నెముక గా నిలిచారు .
పాపయ్యా రావు ను ”సత్య ధర్మ తేజ ,దాన తేజ ,అభినవాంధ్ర భోజ ”అంటూ అర్ధి జనం కీర్తించారు .”రెండా వ రాజు పాపయ్యా రావు కు సాటి లేరు .ఈ జగతి లోన ”అని కీర్తిస్తూ ఆ రోజుల్లో ,యాచ   కులు బారులు తీరే వారు .వారి కోరికలు తీర్చి ,అర్ధి జన బాంధవుడు గా నిలిచారు .అంటే కాదు .పౌరసనిక నాటకాల ప్రారంభం లో తేరా వెనుక నిలిచి నాటక బృందం అందరు కలిసి పాడే ”పరా బ్రహ్మ , ,పరమేశ్వర పురుషోత్తమ ,సదా నంద ”అన్న పాటను ,పాపయ్యప్పా రావే రాయించి ,పాడించారు .అప్పటి నుంచి ,ఇప్పటి దాకా ,ఆ పాటనే ప్రతి పౌరాణిక నాటక ప్రారంభ సమయం లో ఆంద్ర దేశ మంతా ,పాడటం ఆన వాయితీ గా వుంది .ఆ పాటతో రాజా వారి పేరు శాశ్వతం చేశారు కళా కారులు .సతీ సావిత్రి నాటకాన్ని పాపట్ల లక్ష్మీ కాంతం అనే కవి చేత రాయించారు .దీన్ని ఆధారం గానే దాన్ని సినిమా గా తీశారు .ఆ కధా మాత్రుకే హరి కధలకు మిగిలిన సావిత్రి నాట కాలకు ఆధారం అని అంటారు .”పోవు చున్నావా యమ ధర్మ రాజా ”అనే పాట ఇందు లోనిదే .1912 లో స్తాపింప బడిన ,”బాల భారతి నాట్య మండలి ”ఈ నాటికీ దిన దిన ప్రవర్ధ మానమై వర్ధిల్లి కళా సేవ చేస్తోంది . .
ఈ సంస్తానం లో కొదరు ముఖ్య కవులను గురించి తెలుసు కొందాం .౧౯౦౮-౯౫ మధ్య కాలం లో ఉన్న సూరా వారపు వెంకట సోమ యాజులు ”సుందర కాండ విశ్లేషణ ”,”బాల రామాయణం ‘రాశారు .సూరా వారపు లక్ష్మీ పతి శాస్త్రి ”గాయత్రి మంత్రార్ధ వివేకం ””సంద్యోపాసనా ””వివేక పంచకం ”,రాయటం తో పాటు ,శంకరా చార్య జనం దిన ప్రత్యెక సంచిక ”పాపయ్యప్పా రావు బహద్దర్ షష్టి పూర్తీ సంచిక ”ను తెచ్చారు .నంది వెలుగు వెంక టేశ్వర శర్మ శివుని పై శతకం రాశాడు .అయ్యపు   వెంకట క్రిష్నయ్య జన రంజన విప్లవ సాహిత్యం సృష్టించారు .ముందే చెప్పు కొన్నట్లు ,మల్లాది అచ్యుత రామ శాస్త్రి గారు అహల్య అనే నాటకం తో పాటు ,కొన్నినాటకాలు  రాశారు .నిజం గా మైల వరం నాటక రంగానికి గొప్ప వరం .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -03 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to నాటక రంగానికి వరం మైల వరం -2

  1. muthevi ravindranath's avatar muthevi ravindranath says:

    జనరంజకమైన పరిపాలనతోబాటు కళాసేవ కూడా ఇతోధికంగా చేసిన మైలవరం వెలమ ప్రభువుల విశేషాలు ఎంతో వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. తెలుగు నాటకాల ప్రదర్శన ప్రారంభించే ముందు పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర.. పురుషోత్తమ సదానంద’ అనే పాట చిన్నప్పటినుంచీ అందరం వింటూ వచ్చిందే.దాని మూలం తెలుసుకొనడం ఆనందం కలిగించింది.పాపారావుగారు దానశీలిగా చేసిన వితరణలేకాక సాహిత్య పోషణ,కళా సేవ ఏ పాలకులకైనా ఆదర్శప్రాయం. ‘పోవుచున్నావా.. యమధర్మరాజా’ పాట ఆయన పోషణలో రూపుదిద్దుకున్నదేననే విషయం తెలుసుకొనడం కూడా సంతోషం కలిగించింది.సూరవరపు కవులు,పాపట్ల లక్ష్మీ కాంత కవి,మల్లాది అచ్యుతరామ శాస్త్రి వంటి ప్రముఖులను,’బాలభారతి నాట్య మండలి’వంటి సంస్థలను ఒకసారి స్మరించుకునే అవకాశం కల్పించిన మీకు అభివందనాలు.నిజంగా మీరు పేర్కొన్నట్లు ‘ తెలుగు నాటక రంగానికే మైలవరం ఒక వరం’ అనడంలో ఎట్టి సందేహమూ లేదు.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.