నాటక రంగానికి వరం మైల వరం -1
కృష్ణా జిల్లా విజయవాడకు ముప్పై కి.మీ.దూరం లో వున్న మైలవరం సంస్థానాన్ని సూరానేని వంశస్తు లైన వెలమ దొరలూ పరి పాలించారు .మల్లాది అచ్యుత రామ శాస్త్రి వీరి ఆస్థాన కవి .”అహల్య ”మొదలైన నాటకాలు రాశాడు .జమీందార్లు నాటక కంపెనీ ని స్తాపించి ,బాగా ప్రోత్స హించారు .కృష్ణా జిల్లా లో తెలుగు నాటక రంగం బట్ట కట్టింది మైల వరం లోనే .నాటక రచన ను ప్రోత్స హించి ,ప్రదర్శన ను పకడ్బందీ గా నిర్వహించిన ఘన ట వీరిదే .శ్రీ ఎస్.వి.ఆర్ జి.ఎల్ నరసింహా రావు చివరి జమీందారు .మండలాది పతిగా కూడా పని చేసి ప్రజా సేవ చేశారు .ఇప్పుడున్న శ్రీ సుధా కార రావు సర్పంచ్ గా వుండే వారు .ద్వారకా తిరుమల దేవ స్తానానికి శాశ్వత ధర్మ కర్త .
సంస్థాన ఆవిర్భావం
క్రీ.శ.13 ,14 శతాబ్దాలలో కాకతీయ ఆంద్ర రాజానికి ,దాని వైభవానికి ,మనుగడ కు తోడ్పడిన ప్రసిద్ధ పద్మ నాయక వెలమ ప్రభు లైన రేచర్ల భేతాళ నాయకుడు ,ప్రసాదిత్య నాయుడు ,సింగ నీడులు మైల వరం జమేనదారీ కి మూల పురుషులు .14 వ శతాబ్దపు పాలకుడైన రెండవ సింగమ నేడు ”రసార్నవ సుధాకర ”గ్రంధం రచించాడు .ఇతడే రాచ కొండ రాజ్య స్థాపకుడు .కాకతీయ రాజ్య పథనం తర్వాత ,రేచర్ల సిన్గంనేడు ,కొలని రుద్రుడు ,బెండ పూడి అన్నయ మంత్రి ,ముసు నూరు ప్రోలయ నాయుడు ,ప్రోలయ వేమా రెడ్డి మొదలైన వారు అంతా కలిసి ,మ్లేచ్చులనేది రించి ,తరిమి కొట్టి ,1326 లో ప్రోలయ నాయకుని ఆధ్వర్యం లో ”ఆంద్ర సామ్రాజ్యాన్ని ”స్థాపించారు .ఆ రాజ్యం ఎక్కువ కాలమ్ నిలువ లేదు .తర్వాత అది రాచ కొండ ,కొండ వీడు ,విజయనగర రాజ్యాలుగా విడి పోయింది .రాచ కొండ రాజ్యాన్ని రేచర్ల పద్మ నాయక వెలమ ప్రభువులు 150 సంవత్స రాలకు పైగా పాలించి ,చరిత్ర ప్రసిద్ధి చెందారు .మహమ్మదీయ పాలన లో రాచ కొండ ,కొండ వీడు రాజ్యాలు క్షీణించాయి .క్రమంగా రాచ కొండ పై మూడు రాజ్యాలలో కలిసి పోయింది .రేచర్ల వంశీకులు కాల క్రమంగా చాలా ప్రాంతాలకు వలస పోయారు .వారే పిఠాపురం ,మైల వరం భట్టి ప్రోలు చేరి ఆ ఆ వంశం పేరు తో నిలిచారు .
సూరా నేని వంశీయుల పాలన
అలా చీలిన ఒక శాఖ మైల వరం చేరి 1687 లో సూరానేని వెంకట పతి రాయని నాయకత్వం లో మైల వరాన్ని స్వాధీనం చేసుకొని ,పరిపాలన సాగించారు .ఈయన కుమారుడు నారాయణుడు మైల వరం కోట నిర్మించాడు .ఈ శాఖ రేచర్ల వంశీకులకు 12 వ తరానికి చెంది నది .వీరంతా 1687 నుండి,1947 వరకు 12 తరాలుగా మైల వరాన్ని బాగా పాలించారు .
వీరిలో మూడవ వెంకట పతి రావు 1783 లో నూజివీడు పాలకు దిన మేకా నారయ్యప్పా రావు తో కలిసి ఆంగ్లేయులతో పోరాడి ,స్వాతంత్ర సమరం చేశాడు .గెరిల్లా ఉద్యమానికి ఆంధ్రలో నాంది పలికారు .దీన్ని బట్టి రెండు శతాబ్దాల క్రితమే మైల వరం ,ప్రభువులు ,ప్రజలు స్వాతంత్ర ప్రియులై ఉద్యమ వీరు లైనారని స్పష్ట మౌతోంది .స్వాతంత్ర కాంక్షను ఆంద్ర దేశం లో రగిలించి ,చరితార్దు లైనారు .
ఈ వంశం లో 11 వ తరం వాడైన రాజా సూరానేని పాపయ్యా రావు గొప్ప ప్రజా సేవ కుడు .కళా ప్రియుడు .ఆస్తిని ప్రజా క్షేమం కోసం ఖర్చు చేశాడు .చింతల పూడి జమీ లో వున్న ద్వారకా తిరు మల దేవాలయం (చిన్న తిరుపతి ) ,వీరి కాలమ్ లోనే మైల వరం సంస్థానానికి దక్కింది .అప్పటి నుంచి ఆ వంశీకులే శాశ్వత ధర్మ కర్తలు .అనేక విద్యాసంస్తలు నెల కోల్పారు .చెరువులు తవ్వించారు .దేవాలయాలు నిర్మించారు .త్రాగు నీతి వసతి కల్పించారు .రోడ్లను నిర్మించారు .వేలాది ఏక రాలను పేద లకు పంచిన ఉదార హృదయులు .
ఈ వంశం లోని సోరానేని వెంకట గోపాల రావు బహద్దర్ ప్రజల సంక్షేమ ఆర్య క్రమాలకు ముగ్ధుడు రాలిన విక్టోరియా మహా రాని -01 -01 -౧౮౭౭ లో ”రాజా ”బిరుదు నిచ్చి,గౌరవించింది .వీరు వెంకటేశ్వర ఆలయం కట్టించారు .రధాన్ని చేయించారు .ఆగిరిపల్లి లో కోనేరు త్రవ్వించారు .మంగళ గిరి గాలి గోపురం నిర్మించారు .లోహాలను కరిగించి పని ముట్లు చేసే కర్మా గారం నిర్మించారు .లోహ కారులకు ఇప్పటికీ మైల వరం ప్రసిద్దే .అను వంశం గా వస్తున్న శ్వేత ఛత్రం ,పావు కోళ్ళు దివిటీలు వీరి వివాహ శుభ కార్యాలలో రాచరికపు చిహ్నం గా ఇప్పటికి ఉపయోగించటం ఆన వాయితి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -02 -03 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com