విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి –6
తనకు ఆవ మానం జరిగిందని ,పై అధికారుల ముందు తల ఎత్తు కోని తిరిగే పరిస్థితి లేదని గ్రహించిన నార్టన్
బళ్ళారి వెళ్లి అక్కడి సైన్యాన్నంతటినీ తీసుకొని ప్రతీ కారేచ్చ తో మళ్ళీ వచ్చాడు .కోట దారి దాపులలో మోహరించాడు .ఇంతలో రెడ్డి కి కష్టాలు ప్రారంభమైనాయి .భార్య మరణించింది .తల్లి కాశీ యాత్రకు వెళ్లి ,అక్కడే చని పోయినట్లు వార్త వచ్చింది .కుంగి పోయాడు .ఇద్దరికీ యధా విధిగా అంత్య క్రియలు నెర వేర్చాడు .అపార సైన్యం బలగం తో నార్టన్ కోటను ముట్ట డించాడు . .అన్ని వైపులా నుండి ఫిరంగి గుండ్ల వర్షం కురి పించాడు .స్వయం గా దొర పర్య వేక్షణ చేస్తూ అతి జాగ్రత్త గా మసలు తున్నాడు .ఆత్మీయులను నరసింహా రెడ్డి సమా వేశ పరిచి ”మనం ఇంత మంది కోట లోనే వుంటే మనకు నిల్వ వున్న ఆహార పదార్ధాలు సరి పోవు .కనుక తెల్ల వాళ్ల కళ్ళు కప్పి ,మనలో కొందరం బయట పడి రాత్రి సమయం లో వాళ్ల తో పోరు సలుపుతూ ,వారికి తెలీకుండా సంబారాలను కోట లోకి చేర వేయాలి .ఇది అతి పకడ్బందీ గా జరగాలి .ఓబన్న ,వెంకన్న బయటి వారికి సాయం చేస్తారు ”అని చెప్పి అందర్నీ ఒప్పించాడు .
ఆ రోజూ రాత్రి సైన్యం తో బయట పడి ,చెట్లలో పుట్టల్లో దాక్కొంటు ,శత్రువుల ఆయుధాలు తగల కుండా తప్పించు కొంటు ,వడిసె రాళ్ళ తో గూబ గుయ్యి మని పిస్తూ ,బాణాలతో రొమ్ము చీలుస్తూ ,తుపాకి గుళ్ళకు గుడ్లు తేలేస్తూ ,బాంబు దెబ్బలకు దేహాలు చిట్లి పోతున్నా ,రెడ్డి దండు వీరోచితం గా పోరాడింది .వేగు చుక్క పొడిచే దాకా యుద్ధం చేసి ,కొందరు ఆంగ్ల సైన్యం వైపు ,కొందరు కోట వైపు పోతూ ,రాత్రి యుద్ధాన్ని కొంత కాలమ్ కొన సాగించారు .నార్టన్ కు ఎప్పటికప్పుడు కొత్త సైన్యం ఆయుధ సామగ్రి అందుతూనే వుంది .పగలు ,రాత్రి యుద్ధం చేస్తూనే వున్నారు .
విప్లవ సింహం కొండ గుహ చేరటం
కోటలో ఒక్క బావి లో మాత్రమే నీరు వుంది .మిగిలిన వి అన్నీ వట్టి పోయాయి .అయినా సాహసమే ఊపిరిగా రెడ్డి పోరాటం చేస్తూనే వున్నాడు .తమల్ని కరువు కాత్సకాలలో ,ఆపత్సమయం లో రెడ్డి ఆడుకొన్నందుకు కృతజ్ఞత తో బోయ సైన్యం అకున్తిత దీక్షతో ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేస్తున్నారు .రెడ్డి బలం క్రమంగా తగ్గి పోయింది .ఫిరంగి దెబ్బలకు కోట విచ్చి పోయింది .ఇంక కోటలో వుంటే శ్రేయస్కరం కాదని భావించి ,తన వారికి తెలియ జేసి ,రాత్రి పూట కోట విడిచి ,శత్రువులకు కని పించ కుండా కొండ గుహలలో చేరాడు .ఎవ్వరికీ తెలియ కుండా గ్రామాలకు వెళ్లి ,వారిచ్చే సహాయం పొందుతూ ,,రాత్రిళ్ళు వైరి గుండె లది రేట్లు విప్ల వ పోరాటం సాగించాడు .ఈ విషయం తెలుసు కో లేని ఆంగ్ల సైన్యం కోటను పేల్చేసింది .లోపలి ప్రవేశించి చూస్తె అంతా ఖాళీ.నిర్జనం గా వుంది .సిగ్గు తో దొర ,సైన్యమూ తలలు వంచు కొన్నారు .
ఎర్ర మల చేరిక
కొండా ,కోనా గాలించి రెడ్డి ఆచూకి తెలుసు కో మని నాలుగు దిక్కులకు నార్టన్ భటుల్ని పంపాడు .వాళ్ల జాడ కని పెడుతూ ,అమాంతం వల్ల పై విరుచుకు పడుతూ సంహరిస్తున్నాడు రెడ్డి ,రెడ్డి దండు .ఒక శని వారం రాత్రి ఓబయ్య ,వెంకన్న లు అహోబిల నరసిమంహ స్వామిని దర్శించ టానికి వెళ్ళారు .వీళ్ళ జాడ కని పెట్టిన ఆంగ్ల సైన్యం వీరిద్దరిని నిర్దాక్షిణ్యం గా కాల్చి చంపి ,పగ తీర్చుకొంది .ఇలా అందరు దూరమవుతున్నా యుద్ధం లోతన వారందరూ చని పోతున్నా ధైర్యం సడల’ నీయ కుండా శౌర్య పరాక్రమాలతో మూడేళ్ళు తెల్ల సైన్యం తో పోరాడాడు .చివరికి పాపం ఏకాకి గా మిగిలి పోయాడు .ఇంక అక్కడ వుండటం ప్రాణా పాయం అని తెలుసు కోని ”ఎర్ర మల ”లోని ”జగన్నాధం ”అనే చోట వున్న నరసింహ స్వామి దేవాలయం చేరి ,ప్రాణాలు దక్కిన్చుకొంటు ఇంకా వ్యూహ రచన చేస్తూనే వున్నాడు . .
విప్లవ సింహం వీర మరణం
యెంత వెతికినా ,నల్లమల ప్రాంతం లో రెడ్డి ఆచూకి దొరక్క పోయే సరికి నార్టన్ దొర తన సైన్యం తో వెనుదిరిగి పోయాడు .మహా వీరుడైన ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ఉనికి కొంత కాలానికి వేగుల వల్ల నార్టన్ తెలుసు కో గలిగాడు .యుద్ధ తంత్రం లో ఆరి తేరిన రెడ్డి ని బంధించటం అసాధ్యం అని అనుకొన్నాడు .మాయో పాయమే సరైన మందు అని భావించి రెడ్డి ఆను పానులు తెలుసు కోవ టానికి కొందరిని ప్రచ్చన్నం గా పంపాడు .
”అల్ప కొండ”అనే గ్రామం లో రెడ్డి బంధువులు అతనికి రోజూ ఒక గోళ్ళ వానితో ఆహార పానీయాలు రహశ్యం గా పంపుతున్నారు .ఎదుట పడి పట్ట్టు కొనే ధైర్యం లేని వెర్రి తెల్ల మూక చాటు మాటు ప్రయత్నాలు చేశారు .ఆ గోళ్ళ వాడిని ప్రలోభ పెట్టి ,డబ్బు ఏరా వేసి ,అతడు ఇచ్చే అన్నం లో మత్తు మందు కలిపించారు .తెల్ల భటులు నిర్బంధించ టానికి సిద్ధం గా వున్నారు .గొల్లవాడు తెక్చిన్క అన్నం మామూలుగా బంధువులు పంపించిండానే నమ్మకం తో దాన్ని ఏ అనుమానం లేకుండా తినేశాడు రెడ్డి .అంతే -మత్తు తో చేష్ట లుడిగి పోయాడు .వెంటనే రంగ ప్రవేశం చేసిన తెల్ల భటులు సంకెళ్ళు వేసి కోవెల కుంట్ల కు తీసుకొని వెళ్ళారు .
ఆఘ మేఘాల మీద అధికార్లు సమా వేశమై వెంటనే ఉరి శిక్ష విధించి ఆలస్యం చేయకుండా అమలు పరి చేరారు . ”జుర్రేటి” దగ్గర ,1847 ఫిబ్రవరి 22 వ తేదీన ఉదయం ఏడు గంటలకు నరసింహా రెడ్డి ని ఉరి తీశారు .ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చిరు నవ్వు తో మాతృదేశ సేవానిరతి తో ప్రాణాలను వదిలాడు .అతను ప్రారంభించిన ఉద్యమం ,ఇంకో పదేళ్ళ తారు వాత ”సిపాయి పితూరీ ”పేర మొదటి స్వాతంత్ర సంగ్రామం గా ఆవిర్భ వించింది .ఝాన్సి లక్ష్మి బాయి ,తాంతియా తోపే త్యాగాలతో అది ఊపు అందుకొని ,చివరికి 1947 ఆగస్ట్ పది హీను న భారత దేశం బానిసత్వం నుండి విముక్తి చెందింది .ఈ మహా మహుల త్యాగాలను జాతి మరువ లేనివి .ఆ స్వాతంత్ర ఫలాలు అందరికి అంద జేయాలి .స్వాతంత్రాన్ని అతి జాగ్రత్త గా కాపాడు కోవాలి .మొదటి స్వాతంత్ర ఉద్యమానికి పదేళ్ళ ముందే ఊపిరు లూదిన విప్లవ సింహం ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చరిత్రలో వేగు చుక్క గా ,ధ్రువ తార గా ,నిలిచి అందరి నీరాజ నాలను అందు కొన్నాడు .ఈ ఫిబ్రవరి 22 న ,నరసింహా రెడ్డి 165 వ వర్ధంతి .ఆ సందర్భం గా ఒక సారి ఆ తేజో మూర్తి ని స్మరించే మహదవకాశం లభించి నందుకు సంతోషం .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -03 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


Fantastic. Thank you very much for this splendid piece.
LikeLike
LikeLike
శ్రీ శైలం లో ఉన్నాయి
On Wed, Sep 3, 2014 at 8:50 PM, సరసభారతి ఉయ్యూరు wrote:
>
LikeLike