సాహిత్య సరస్వతి లీల- ముక్త్యాల సంస్థానం -1
పశ్చిమ కృష్ణా లో కృష్ణా నదీ తీరం లో వెలసిన సంస్థానం ముక్త్యాల .వాసి రెడ్డి వారిది .కమ్మ ప్రభువుల పాలన లోనిది .ఇక్కడి కోట శోభాయ మానం గా వుంటుంది .కృష్ణమ్మా నడుముకు అలంకరించిన మేఖల లోని మేలిమి బానారు పథకం లా వుంటుంది అని కవులు వర్ణించారు .బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రం ,ప్రముఖ వాణిజ్య కేంద్రం అయిన జగ్గయ్య పేట కు పది కిలోమీటర్ల దూరం లో వుంది .బహుముఖ సేవలతో ప్రజలను ఆకట్టు కొన్న సంస్థానం ముక్త్యాల .ఈ సంస్థానానికి ”చింతల పాటి పంటు ”అనే పేరు వుంది .1802 లో వాసి రెడ్డి వెంకటాద్రి నాయుని పేర ”చింతల పాటి పంటు ”గా నమోదు అయింది .౧౮౪౮ లో నాయుడు చని పోగానే దీనితో పాటు అమరా వాటి సంస్థానం కూడా జప్తు చేయ బడింది .1864 లో ఈస్ట్ ఇండియా కంపెని స్వాధీనం అయింది .1863 లో వాసి రెడ్డి భవానీ ముక్త్యేశ్వర ప్రసాద్ బహద్దర్ కు ముక్త్యాల సంస్థానం దాఖలు పరచ బడింది .ఇందులో 23 గ్రామాలున్దేవి .వాసి రెడ్డి వారు వల్లుట్ల గోత్రోద్భావులు .

ముక్తికి నిలయ మైన క్షేత్రం గా .ముక్తి నేల గా ముక్త్యాలను భావిస్తారు .సాహితీ సరస్వతి గజ్జే కట్టి ఆడిన పవిత్ర నిలయం .ముక్త్యాల సమీ పం లో కృష్ణా నది ఒంపులు తిరిగి ,వయ్యారం గా కను విందు చేస్తుంది .ఉత్తర వాహిని గా కృష్ణ ప్రవహిస్తున్దిక్కడ .అందుకే ఈ క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యం .పులి చింతల వైపు తిరిగి 200 మైళ్ళు ప్రవహించింది కృష్ణ .ముక్త్యాల లేక పొతే కృష్ణా నది కృష్ణా జిల్లా కు దక్కేది కాదేమో నని అభి ప్రాయం.ఇక్కడి నుంచి తూర్పుగా ప్రవహించి బంగాళా ఖాతం లో కలుస్తుంది .

సంస్థానం ఏర్పడిన విధం
అమరావతి నేలిన రాజా వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తాతలు ముగ్గురు .పెద్దాయన రాఘవయ్య ,రెండవ ఆయన రామన్న గారికి సంబంధించిన వెంకటాద్రి నాయుడు ,మూడో తమ్ముడు చంద్ర మౌళి అని చరిత్ర చెబుతోంది .ఈ చంద్ర మౌళి గారి కుతుమ్బీకులే ముక్త్యాల సంస్థానాధీశులు .ఈ ముగ్గు రన్న దమ్ములని నందిగామ పరగానాకు అది పతులు చేశాడు ధిల్లీ పాదుషా షాజహాన్ .చక్రవర్తి ని మెప్పించి వీరు జమీందారు ,మిరాసి మన్నే ,చౌదరి ,రాజా బహద్దర్ ,దేశాయ్ ,సర్దేశ్ ముఖి బిరుదుల్ని పొందారు .ఆస్తుల పంపకం లో చింతల పాడు జమీ ,చంద్ర మౌలికి దక్కింది .దానిలోనే ముక్త్యాల వుంది .అందుకే ”చింతల పాడు వంతు జమీందారీ ”అయింది .1760 లో రాజా వాసి రెడ్డి రామ లింగాన్న ముక్త్యాల కోట ను నిర్మించాడు .అదే రాజా దాని అయింది .1792 లోమేజర్ బీత్సన్ రాజా వారి అభి వృద్ధి కార్య క్రమాలను చూసి మెచ్చి మిగిలిన చోట్ల కూడా ఇలాంటి వే జరిగేట్లు చూడమని ఆదేశించాడు .రాజా గారి ముందు చూపు తో కరువు తప్పింది .

1863 లో అధికారం చే బట్టిన భవానీ ఈయన కుమారుడు ఉమా మహేశ్వర ప్రసాద్ మంచి ఏలిక గా గుర్తింపు పొందాడు . ,వెంకటాద్రి .తండ్రి తర్వాత ఉమా మహేశ్వర ప్రసాద్ రాజయ్యాడు .పుత్రులు లేక పోవటం తో తమ్ముడు వేంకటాద్రి కుమారుడు చంద్ర మౌలీశ్వర ప్రసాద్ ను దత్తత చేసుకొన్నాడు .చంద్ర మౌళి గారి భార్య వల్ల చల్ల పల్లి జమీందార్ మళ్లి కార్జున ప్రసాద్ కుమార్తె .వీరికి సంతానం లేదు .రెండవ భార్య గా శాక మూరి వారి అమ్మాయి కనక వల్లీ దేవి ని వివాహ మాడాడు .1918 లో వీరికి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ పుత్రుని గా జన్మించారు .ఈ యన చల్ల పల్లి జమీందార్ అంకినీడు బహద్దర్ గారి కుమార్తె ను పెళ్లి చేసుకొన్నాడు .వీరి పుత్ర రత్నమే చూడా నంద రామ గోపాల కృష్ణ చంద్ర కుమార్ ప్రసాద్ .చంద్ర మౌళి గారి తమ్ముడు దుర్గా సదా శివేస్వర ప్రసాద్ జయంతి పురం రాజా అయారు .చల్ల పల్లి రాజా శివ రామ ప్రసాద్ గారు ఉమా మహేశ్వర ప్రసాద్ గారి కుమార్తె భవానీ దేవి గారి పుత్రుడు .అంటే దౌహిత్రుడు .రామ గోపాల కృష్ణ వర ప్రసాద్ గారికి చల్ల పల్లి రాజా అంకినీడు కుమార్తె రాజ్య లక్ష్మి నిచ్చి వివాహం చేశారు .ఈవిడ శాసన సభ్యురాలు గా వుండేది .నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రామ గోపాల కృష్ణ ప్రసాద్ రాజ్య లక్ష్మి దంపతులే ముఖ్య కారణం .రాజ్య లక్ష్మి గారి కుమార్తె ఇందిరా గారు ఉయ్యూరు కే.సి.పీ లిమిటెడ్ యజమాని వెలగ పూడి దత్తు గారి భార్య .
స్వాతంత్ర ఉద్య మానికి జమీందారి బాగా సహకరించింది .పంచములకు ఆలయ ప్రవేశం కల్గించారు .హరిజనోద్ధరణ కు పూర్తిగా సహక రించారు .స్వాతంత్ర సమర యోధులకు అజ్ఞాత యోధులకు రక్షణ కల్పించారు .ఇక్కడి ముక్తేశ్వర స్వామి ఆలయం ,దైవం పవిత్ర మైనవిఅని 11 వ శతాబ్ది శాసనం వల్ల తెలుస్తోంది .కోట చాలా ముచ్చట గా వుంటుంది .ఎత్తైన సింహ ద్వారాలు ,ఇనుప గుబ్బల తో మొన దేలి వుంటాయి .లోపల విశాల మైన ఆవరణ .ఆయుర్వేద రసాయన శాల వుంది .ఆసవాలు ,అరిష్టాలు ,నిల్వ చేసే గది వుంది .ఉచిత ఆయుర్వేద చికిత్స ఇక్కడి ప్రత్యే కథ .ఘోషా పధ్ధతి లో రాణీ వాసం .కోటలో జరిగే సాంస్కృతిక కార్య క్రమాలు చూడ టానికి అంతపుర స్త్రీలకూ జలతారు పరదా వెంక కూర్చునే వారు .పెద్ద ఘంట వుంది .సంస్థానం మూడు అంతస్తుల భవనం .విశాల మైన గదులు .కళాత్మకం గా దర్బారు హాలు నిర్మించారు .సంస్థానాధీశులు కొలువుండే ది ఇక్కడే .ప్రజల కష్ట సుఖాలు విని తగిన పరిష్కారాలు చేసే వారు .ఈ సభాస్థలి లోనే ఎందరో కవులు ,కళా కారులు తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి ,రాజుల మెప్పు పొందే వారు .భువన విజయాన్ని గుర్తుకు తెచ్చే మందిరం ఇది .యజ్న యాగాలకు ప్రత్యెక ఏర్పాట్లున్నాయి .రాజుల ఇలా వేలుపు బాలా త్రిపుర సుందరీ దేవి విగ్రహం అత్యంత ఆకర్షణీయం గా వుంటుంది .కోటకు నాలుగు వైపులా బురుజులున్నాయి .కోటకు ప్రక్క నుంచే కృష్ణ ఉత్తర వాహిని గా ప్రవహిస్తుంది .నదీ గర్భం లో బలి చక్ర వర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం వుందని చెప్పు కొంటారు .కృష్ణ అవతలిది గుంటూరు జిల్లా .పశ్చిమాన తెలంగాణా .ఉతారం తూర్పు లలో కృష్ణా నది .ఉమా మహేశ్వర స్వామి కరుణా కటాక్షం పొందిన దివ్య క్షేత్రం ముక్త్యాల .ఉమా మహేశ్వర ప్రసాద్ బహద్దర్ శాసన సభ్యులు గా రాణింపు పొందారు .ప్రపంచ తెలుగు సభల అద్యక్షు రాలు ఇందిరా దత్తు గారు 2004 లో ముక్త్యాల కోటలో సాహిత్య సభలు జరిపి పూర్వుల బాట లో నడి చారు .తరువాత సాహిత్య పోషణ గురించి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -03 -12


సత్యం శంకరమంచి అమరావతి కథల్లో వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి ప్రస్తావనతో నాలుగైదు కథలుంటాయి.
LikeLike