అందరి నేస్తం డికెన్స్-01

ఇంగ్లాండ్ కు చెందిన ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ అందరి వాడు .అందుకే అతన్ని రచయిత గా భావించారు .రచన చదవ గానే అతడు మన నేస్తం అనిపిస్తుంది .అన్నాడు జార్జి ఆర్వెల్ . ఆయనలో అన్నీ వుండటం వల్ల అందరికి స్నేహితుదయాడు అంటాడు జూల్స్ వేర్న్స్ . ”న్యాయానికి స్వర్గం -చెడుకు -నరకం .డికెన్స్ విషయం లో ను ,ఆయన దేశస్తుల విషయం లోను ఇదే సత్యం అన్నాడు ఆండ్రీ గైడ్ .ఆలోచించే హృదయాన్ని ,వేదన చెందే మెడను తప్ప కల లోని అన్ని ప్రతి బంధనాలను డికెన్స్ అదిగా మించాడు .ముస్సోలినీ కేమాల్ పాషా ,హిట్లర్ లు డికెన్స్ రాసిన ”లిటిల్ డోరియాట్ ”చదివి వుంటే నియంత్రుత్వాది కారాన్ని చేలా ఇంచే వారు కాదు అంటాడు బెర్నార్డ్ షా .డికెన్స్ శైలి బాగా లేదు అన్న వారు ఉండ వచ్చు కాని,అతని ఆకర్షణ ను కాదన్న వారు లేరు .అతని క్రిస్మస్ కరోల్ అద్వితీయ రచన .అదో ప్రపంచమే అన్నారు మహా పండితుడు ఫూటే .ఆయన నవల ఒక చిన్న కుటుంబం గురించి ఆక ,సమాజ చిత్రణమే కనిపిస్తుంది .పాత్రల కంటే కారికేచర్ గా పాత్రలను మలిచాడు డికెన్స్.
బాల్యం

డికెన్స్ తండ్రి చార్లెస్ జాన్ డికెన్స్ .ఇంట్లో అందరు ఆయన్ను లేజీ ఫెలో అనే వార్రు .దరిద్రానికి ,పెద్ద మనిషి తరహాకు మధ్య వున్న దిగువ మధ్య తరగతి కుటుంబం .తండ్రి 18 ఏళ్ళ లో 20 సార్లు పైగా ఇళ్ళు మారాడు పెంచిన అద్దె చెల్లించే స్తోమత లేక ..తల్లిది ,తండ్రిది చిన్న పిల్లల మనస్తత్వం .అందుకని కుటుంబ బాధ్యత చిన్నప్పటి నుంచి డికెన్స్ మీదే పడింది .ఒక రకం గా తండ్రి జాన్ కు కొడుకు డికెన్స్ తండ్రి లాగా వ్యవహరించాడు డికెన్స్ జీవిత మంతా చిన్నతనం మీద తలిదండ్రుల మీద ప్రతి చర్యయే .-(reaction ) .తల్లిదండ్రులు చేసే తప్పులకు కొడుకే సాక్షి .కాని అన్నీ తట్టు కోని నెట్టుకు రావటం అలవాటై పోయింది .వాళ్ల దుబార ఖర్చు చూసి ,పనికి విలువ నిచ్చే వాడు .పెళుసు తనం అబ్బింది .విసర్జించ బడ్డ సొత్తు అంతా తాను గా భావించాడు .బాధ్యతా రాహిత్యపు తల్లులు ,అవివేకపు అమ్మలు అంతా ఎలిజబెతేన్ కారి కేచర్లె అంటే పరిహాస చిత్రాలే .అతను చిత్రించిన దుబారా తండ్రు లంతా తండ్రి జాన్ క్లోనులే అన్నారు విమర్శకులు .
పెద్ద కొడుకు డికేంసే కనుక తలిదండ్రులుబాగా వాడుకొన్నారు ,ఆడుకొన్నారు .పీల్చి పిప్పి చేశారు .1812 ఫిబ్రవరి ఏడున లండన్ దగ్గర potrs math లో జన్మించాడు డికెన్స్ . 12 ఏళ్ళకే చాలా చదివాడు .వేర్ హౌస్ లో ఉద్యోగం లో చేర్పించాడు తండ్రి .ఆ వేర్ హౌస్ వైపు ఎప్పుడు వెళ్ళినా ఏడు పు వచ్చేది .ఆ ఉద్యోగానుభావాలు ,కష్టాలు బాధలు అతన్ని రచయిత డికెన్స్ గా మార్చాయి .అది తన జీవితం లో ఒక విద్యాలయమే అయింది .అందులో గడిపిన కాలమ్ నుండే అతని వ్యక్తిత్వం ఆవిష్కరింప బడింది .తన చిన్నతనం , ,తలిదండ్రుల బాధ్యతా రాహిత్యం అతన్ని అన్ని అది కారాలను సవాలు చేసే స్తితికి తెచ్చాయి .అధికారుల ,పెత్తందార్ల దాష్టీకం ,బాధ పడే వాణ్ని చూసి జాలి పద కుండా నిర్లిప్తం గా ఉన్న వారిపై కసి పెరిగింది .ఎదిరించే ధైర్యము వచ్చింది .
విక్టోరియా రాణి పాలనలో హింసించే హెడ్ మాస్టర్లు ,మతి మాలిన టీచర్లు ,బాధ్యతా రాహిత్య పాలనా సర్వత్రా దర్శనం ఇచ్చింది .బెత్తం లేకుండా టీచర్ వుండే వాడు కాదు ఆనాడు .డికెన్స్ ఒక రకం గా అదృష్ట వంతుడే -అలాంటి స్చూల్స్ లో చదవక పోవటమే ఆ అదృష్టం .అక్కడ చదివి వుంటే ఇంత పెద్ద మనిషి ఆయె వాడు కాదు .విద్య మనిషిని శుద్ధి చేస్తుంది .-మళ్ళీ అలాంటి నీచపు పనులు చేయక్కర లేదు అని పించింది .డబ్బు దాచి పెన్నీ వీక్లీలు కొని చది వె వాడు .సాహిత్యం లో ఏ గొప్ప రచయితా లాగా డికెన్స్ చదువు సాగ లేదు .ఏదో సాధారణ విద్యే అబ్బింది .15 ఏళ్ళకే డ్రాపవుట్ గా మిగిలి పోయాడు .తర్వాత ఎల్లిస్ అండ్ బ్లాకు మోర్ అనే లా ఫరం లో చేరాడు .వారానికి 18 షిల్లింగుల జీతం .గంటల తరబడి లండన్ వీధులన్నీ తిరిగే వాడు .అదో జగత్ సహోదరులు వుండే వీధులన్నీ కాలికి బలపం కట్టు కొని తిరిగాడు .వాళ్ళ స్థితి గతులు ,వేష భాషలు అర్ధం చేసు కొనే వాడు .ఇక్కడ జన సమ్మర్దం తక్కువ .అన్ని రకాల మనుషులు కన్పించే వారు .బ్రిటిష్ మ్యూజియం కు వెళ్లి చదివే వాడు .చదవటం అనేది డికెన్స్ జీవితం లో ఒక భాగమే అయింది .అక్కడే న్యూటన్ ,మార్క్స్లను చదివి జీర్ణించుకొన్నాడు .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -03 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

