సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –3

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –3

                                     సాహిత్య పోషణ 
అంకినీడు ప్రభువు కాలమ్ లోనే వేమూరి సుబ్బావధాని ,యడవల్లి అప్పా వధాని మద్దూరి క్రిష్ణావధాని ,కోతమర్తి రామావధాని ప్రభావ ఆది నారాయనావధాని మొదలైన వెద పండితులు వుండే వారు .రాజా గారు చల్ల పల్లి లో సంస్కృత కళా శాల స్థాపించి కావ్యం ,నాటకం ,అలంకార వ్యాకరణాలను ,వేదాన్ని బోధించే ఏర్పాటు చేశారు . అంకినీడు భాషాభి మాని .సంస్కృతాంధ్రాలలో దిట్ట .పండితులతో ఆయన సంభాషణ సమర్ధ వంతం గా వుండేది .
1876 -1921 ప్రాంత పాలకుడు మల్లికార్జున ప్రసాద్ నాయుడు సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడు .ఉర్దూ ,ఇంగ్లీష్ భాషల్లో ప్రవేశమే కాదు పాండిత్యము వుంది .పెదప్రోలు నివాసి వేమూరి నరసింహ శాస్త్రి ”సాహిత్య చక్ర వర్తి ”బిరుదాంకితులు .వీరి సోదరుడు శివ రామ శాస్త్రి ”సంగీతా సాహిత్య సార్వ భౌములు ”గా వాటిలో అభినివేశం వుంది .స్వయం గా వీణా వాయించే వారట .ఆయుర్వేద విద్య ను పెంచి పోషించారు .చల్ల పల్లి లో ఆయుర్వేద విద్యాలయం ఏర్పాటు చేశారు .వ్యాయామ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి పోటీలు నిర్వ హించే వారట .వీరి కుమారుడు అంకినీడు ప్రసాద్ ఆంగ్ల విద్య లో పట్ట భద్రులు .1909 లో తన రెండవ వివాహ సందర్భం గా కవి పండిత సభ నిర్వహించి అనేక మందిని సత్కరించారు .”సుశీల ”అనే నాటకానికి కృతి భర్త అయారు .కృష్ణా పత్రిక లో నిరంతరం వ్యాసాలు రాసే వారు .1912 లో మద్రాస్ లో జరిగిన భాషా చర్చకు అధ్యక్షులు గా వుంది ,శాస్త్ర చర్చ ను సమన్వయ పరచి ,ఆ సభలో పాల్గొన్న వేదం వెంకట రాయ శాస్త్రి ,దివాకర్ల తిరుపతి శాస్త్రి ,చెన్నాప్రగడ భాను మూర్తి వంటి దిగ్దంతులను మెప్పించారు .1927 లోఆంద్ర విశ్వ కళా పరిషత్ కు 25 వేల రూపాయలను విరాళా మిచ్చిన విద్యాభి మాని .  మచిలీ పట్నం లోని ”ఆంద్ర భారతి ”సాహిత్య పత్రిక ను పోషించారు .కాకినాడ ఆంద్ర ప్రచారిణీ గ్రంధమాలకు సహాయం చేశారు .బలిజే పల్లి లక్ష్మీ కంఠం గారు రాజా వారి సాయం తో గుంటూరు లో ”చంద్రికా ముద్రణాలయం ”స్థాపించారు .తర్క శాస్త్ర పారంగాతులైన అద్దె పల్లి సోమ నాద శాస్త్రి వీరి ఆస్థాన విద్వాంశులు .వేటూరి ప్రభాకర శాస్త్రి పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యులు గారు వీరి శిష్యులే .తిరుపతి కవులు తరచుగా ఈ సంస్థానాన్ని సందర్శించి సత్కారాలన్డుకొనే వారు .
దేవర కోట ఆస్థాన పండితుడైన దేవినేని సూర్య ”భగవదను మతం ”హనుమదభ్యుదయం ,చిత్ర కర్నోదంతం ,వీర రస పుత్రీయం ,వైద్య రహష్య దీపిక ,తులసీ చరిత్ర అనే వైవిధ్య భరిత రాకానలను చేశారు .వీరు మిడిల్ స్కూల్ లో తెలుగు పండితులు .మూల ఘటిక కేతన రాసిన ”ఆంద్ర భాషా భూషణం ‘కు సూర్య గారు ”దివ్య ప్రభ ”పేరిట వివరణ రాశారు అది పండిత ప్రసంశ పొందింది .మెరకన పల్లి వాస్తవ్యులైన సూర్య గారు విద్వాత్కవులు ,పండిత సూర్యులు .
 గరిక పర్తి కోటయ్య దేవర 
ఆంద్ర గాయక పితామహులు గా కీర్తి పొందిన గరిక పర్తి కోటయ్య దేవర చల్ల పల్లి ఆస్థాన సంగీత విద్వాంశులు .ఈయన చిన్నతనం గురించి ఒక కధ వుంది .1864 లోబందరు ఉప్పెన లో పసి పిల్లాడు గా వున్న కొత్క్య్య ఉయ్యాల తో సహా నీటిలో కొట్టు కోని పోయి ఒక కుంకుడు చెట్టు కు చిక్కు కుంది.పిల్లాడు క్షేమం .తర్వాత చైనా తనం లోనే కొబ్బరి చిప్పకు గుర్రపు వెంట్రుక కట్టి కమానుతో సంగీతం వాయించే వాడట .గురువు లేకుండానే సంగీతం అబ్బింది .తండ్రి శిక్షణ లో విద్వామ్శుడై వాయులీనం లో ప్రతిభ సాధించారు .హైదరాబాద్ లో గానం తోనూ ,వాయులీనం తోనూ లీనమై సాధన చేస్తుంటే సాలార జంగ్ బహద్దర్ చూసి ముచ్చట పది చిన్నన్న అనే సంగీతా విద్వామ్శునికి అప్పగించి సంగీతం నేర్పమన్నాడు .చివరకు ఆస్థాన సంగీత విద్వామ్శుడైనాడు .తన ప్రతిభను గుర్తించిన రాజా గోపాలాచారి పై వర్ణం రాసి ,భక్తీ చాటాడు .మంచి కర్ణాటక విద్వాంశుడు గా కీర్తి పొందాడు .తంజావూర్ ఆస్థాన పదవి ఇస్తామంటే తిరస్కరించి బందరు చేరి సంగీతా విద్యాలయం ఏర్పరచి ఉచితం గా భోజనం పెట్టి విద్యార్ధులకు నేర్పించాడు .”జంగం కోటయ్య ”అని ఆయన్ను ఆప్యాయం గా పిలిచే వారు .గీతాలు ,వర్ణాలు స్వర జాతులు ,కీర్తనలు రాసిన వాగ్గేయ కారుడు కోటయ్య దేవర .
  శ్రీ మంతు రాజా శివరామ ప్రసాద్ బహద్దర్
1929 లో చల్ల పల్లి ప్రభువైనారు .పట్టాభి శేకానికి దేశం లోని కవులు ,పండితులు విద్వాంశులు హాజరైనారు అంతమంది కవులు ఏ రాజు పట్టాభిషేకానికి రాలేదని ఒక కవి చమత్క రించాడు .తిరుపతి కవులు ,కొప్పరపు కవులు సన్మానాలు అందుకొన్నారు .జమ్మల మడక మాధవ రామ శర్మ తాము రాసిన ”ఆంద్ర ప్రతాప రుద్రీయం ”అభినవ సహదేవ బిరుదాంకితులు ఎజేల్ల శ్రీ రాములు కవి ‘పశు వైద్య వస్తు దీపిక ”,పండిత గొర్రె పాటి వెంకట సుబ్బయ్య ”భట్టు మూర్తే రామ రాజా భూషణా ?”గ్రంధాలను రాజా వారికి అంకిత మిచ్చారు .వాజ్మి మహాధ్యక్షులైన వడ్ల ముడి గోపాల క్రిష్నయ్య గారికి రాజా వారు స్వయం గా స్వర్ణ గండ పెండేరం తొడిగారు .అమ్ముల విశ్వనాధ భాగవతార్ ,స్థానం నరసింహా రావు,గోవింద రాజుల సుబ్బా రావు వంటికలా కారులను సత్కరించారు .తెనుగు లెంక తుమ్మల సీతా రామ మూర్తి గారి ”రాష్ట్ర గానం ”కృతిని అందుకొన్నారు మద్రాస్ రాష్ట్ర శాసన సభ్యులయారు .ఆంద్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యులుగా ,ఆంద్ర మహాసభ అధ్యక్షులు గా వున్నారు .1949 లో తుమ్మల వారి కనకాభిషేక మహోత్సవం లో గండ పెండేరం తొడిగారు .పగటి వేష గాడు సున్నం వీరయ్య తో సహా అన్ని రకాల కళాకారులను సన్మానించారు .”మహతి”పత్రిక  కు మహా రాజ పోషకులయారు .కాజ ,పెడసన గళ్ళు మోపిదేవి శ్రీ కాకుళం గ్రామాలలో ఉన్నత పాత శాలలు నెల కోల్పారు .1966 లో రాజా వారి షష్టి పూర్తీ మహోత్సవం జరిగింది .బెజవాడ గోపాల రెడ్డి అధ్యక్షత వహించారు .కళా కారులందరికి బంగారు పతకాలు ,రవ్వల ఉంగ రాలు ,సువర్ణ కంకణాలు అండ జేశారు వీరి సాహిత్య పోషణ లలితా కళా సేవ ఎన్నదగినవి .”దివి పౌరుషానికి దిద్దిన మీసం శివరామ బహద్దర్”అని పేరు తెచ్చుకొన్నారు.
దివి సీమ దివ్య సీమ .భక్తీ రక్తి ముక్తికి నిలయం .జమీందారీ వారసుడైన నాగప్ప పేరు తో వెలసిన ఆగాయ లంక దగ్గరే కృష్ణ సాగర సంగమం వుంది .అగస్త్యేశ్వర ప్రతిష్టిత సుబ్రహ్మనఎశ్వరుడు కొలువైన నెల .జలదీశ్వర స్వామికి ,బౌద్ధ విహారానికి కేంద్రం ఘంట సాల .మొవ్వ వేణు గోపాలుడు క్షేత్రయ్య పదాలకు కృతి భర్త .శ్రీ కాకుళం ”చింతామణి ”నాటకానికి ఇతి వృత్త మైన కేంద్రం .పాలకులు అమృత హృదయులు .మొదటి ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించిన మండలి కృష్ణా రావు గారు చరిత్రలో స్థిర స్థానం సంపాదించుకొన్నారు విద్యా మంత్రి గా వన్నె కెక్కారు .వారి కుమారుడు బుద్ధ ప్రసాద్ తండ్రిన మించిన తనయుడు .తెలుగు భాషా సాహిత్యాలకు ,సంస్కృతికి అనుఖనం సేవ లందిస్తూ దేశం లోనే ఆదర్శ పురుషుని గా నిలిచారు
సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.