అందరి నేస్తం డికెన్స్ –3

అందరి నేస్తం డికెన్స్ –3

         డికెన్స్ కు పన్నెండు మంది పిల్లలు .౨౨ ఏళ్ళ తర్వాత భార్య కాతేరిన్ తన్ను అసలే ప్రేమించలేదని ,ఆమె లో ప్రేమ మృగ్యం అని సంచలనాత్మక ప్రకటన చేశాడు .ఆరోజుల్లో ఇంగ్లీష్ మధ్య తరగతి కుతుమాల వారు పుస్తకాలను కోని చదివే వారు కాదు .అప్పుడు పుస్తకాల ఖరీదు పదిన్నర శిల్లిన్గుల అర గినియా .ఇవాల్టి వంద డాలర్లకు సమానం .అయితె డికెన్స్ రాసిన వన్నీ సీరియల్ రచనలే .పిక్విక్ పేపర్లలో తన మేధస్సును ,స్వభావాన్ని రంగ రించి కొత్త రూపాన్ని సృష్టించాడు .శక్తి నంతా కూడ గట్టి ,అధిక శ్రమ తో రెండు వారాలు దృష్టి నంతా నిలిపి సీరియల్ పూర్తి చేసే వాడు .అవగానే విశ్రాంతి పొంది ఇంకోటి మొదలు పెట్టె వాడు .ఇలా ఏక ధాటిగా ౪౦ ఏళ్ళు సుదీర్ఘ రచనా వ్యాసంగం చేశాడు .ధాకరే కు నలభై ఏళ్ళకే జుట్టు నేరిస్తే ,డికెన్స్ చాలా చలాకీ గా పెద్ద మనిషి గానే వున్నాడు .

పిక్విక్ పేపర్స్ అరుదైన ,ఏ వర్గీ కరణకు అందని అడ్డు కోలేని నవల .అది నిజం గా నవల అనలేం .అదొక గొప్ప పుస్తకం అన్నాడు జార్జి ఆర్వెల్ .దాన్ని ఒక పుస్తకం గానే బేరీజు వేయాలి .అందర్నీ పూర్తి సంతృప్తి పరచిన పుస్తకం .అద్భుత యత్న కృత నవల .అందులోని హాష్య సన్ని వేషాలను రాసే టప్పుడు డికెన్స్ బిగ్గరగా నవ్వే వాడట .అది ”పిక్వేరియాన్ ఫ్రేం ఆఫ్ మైండ్ ”ను తెలుపుతున్దంటారు .చెడుపై మంచి మాత్రమే చివరికి విజయం సాధిస్తుందని సందేశం .ఆనందాన్ని పంచటమే ధ్యేయం .గొప్ప కామెడి గా ప్రశిద్ధి చెందింది .ఫ్రెంచ్ వాళ్ల ఫార్స్ లాంటిది అని విశ్లేషకుల భావన .నవ్వు పుట్టించే పుస్తకం మాత్రమే కాదు .1827 మే 12 న ప్రారంభమైంది .భాషా స్కలితాలు ,విడ్డూర మైన విషయాలు ,మాటల గారడీ ,ప్రభావితం చేసే పేర్లు అందులో వున్నాయి .సంఘటనల పరంపర ,టాగ్ ఫ్రేజులు ,సరదా పాత్రలు ,బాజ్ మాటలు (గుస గుసలు )పుష్కలం గా వున్నాయి .80 కి పైగా పాత్రలున్నాయి .ఇందులో ode of an expiring frog” అనేది  సరదా  జారదా .1836 -38 కాలాన్ని పిక్విక్ యియర్స్ అన్నారు .1938 వచ్చే సరికి  ఇంగ్లాండ్ లో అత్యంత ప్రముఖులలో డికెన్స్ ఒకడైనాడు .  .దీన్నే పిక్వీకియాన్ వరల్డ్ అన్నారు .అవి పారిశ్రామిక విప్ల వాణికి ముందు రోజులు .కోచ్ లు బాగా వున్న కాలమ్ .అప్పటికి లండన్ ఇంకా ఒక పెద్ద గ్రామమే .ఈ నవల వల్ల నవలా శైలి లో ,నవల రాసే విధానం లో విప్ల వాత్మక మైన మార్పులు వచ్చాయి .మార్కెటింగ్ లో గొప్ప ప్రగతి సాధించింది .ముసలి రాజు పోయి యువరాణి ఇంగ్లాండ్ కు రాజైన కాలమ్ అది .అప్పటికే యువ నవలా రచయిత గా డికెన్స్ గుర్తింపు పొందాడు .ప్రేశాకులకు ఏమి కావాలో అతనికి బాగా తెలుసు .వాళ్ళు దేనికి భయ పడుతున్నారో ,వాళ్ల కలలేమితో ,తెలిసి రాసాడని జాన్ ఇర్వింగ్ అన్నాడు .
1822 లో ప్రఖ్యాత నవలా రచయిత సర్ వాల్టర్ స్కాట్ మరణించాడు .అతనితో నవల చని పోయిందని అందరు భావించారు .విక్టోరియన్ నవల ఇంకో ఏడేళ్లకు కాని బయటకు రాలేదు .ఈ ఖాళీ ని డికెన్స్ పూరించాడు తన శృంఖల నవలలల తో .సాంఘిక ,రాజా కీయ ,వ్యంగ్య రచనలు సంగీతా శాలల మూగ భాష ,మేలో డ్రామా ,వీధి మనుషుల భాష ,పట్టాన చరిత్ర లతో దయా పూరిత రచనలు చేశాడు డికెన్స్ .ఇందులో విక్టోరియన్ రుచి పెరిగి ఫిక్షన్ ఎదిగింది .పిచ్చి ఆమిక్ సీరియళ్ళను ఉల్లాస భరిత నవల గా మార్చిన ఘంట డికెన్స్ దే .చీకటి వెలుగులను మిశ్రమం చేసి ,కొత్త పోకడ పోయాడు .అసంగత విషయాలను స్వచ్చత తో నింపాడు .అంతవరకూ ఏ నవలా చేయని పని పిక్విక్ చేసింది .లింగ ,వయస్సు ,అంతస్తులను అదిగా మించి ఆడ మగ పిల్లలను చదువు కున్న వారిని చదువు లేని వారిని అందర్నీ ఆకట్టు కొంది .అన్ని తరగతుల వారు ఆదరించారు .యువకులకు ”బొజ్ ”ఆదర్శ పురుషుదయాడు (కల్ట్ ఫిగర్ )పెద్దలకు 18 వశతాబ్దపు గొప్పనవలను   గుర్తుకు తెచ్చింది .న్యాయాధి కారులు బెంచి మీద కేసుల విరామ సమయం లో దీన్ని చాదివే వారు .వ్యాపారస్తులు తమ వస్తువులను వీటి అత్తలలో వుంచి అమ్మే వారు .ప్రతి వాడు డికెన్స్ తమ కోసమే రాస్తున్నాడు అనే హావం కలిగించాడుఅని పించుకొన్న మేధావి డికెన్స్ .అదే సౌందర్య దర్శనం గా సాధించిన విజయం .పిక్విక్ పిచ్చి (మేనియా )ఎక్కించాడు డికెన్స్ ఆ కాలానికి అదంతా కొత్త దానమే .సమాజ పద్ధతులు ,వాణిజ్యం ,సాంకేతికత ,పారిశ్రామికత లోని కుట్ర ,కుతంత్రం ఈ కొత్త రచనకు దారి తీసింది .మేనియా గా చదువరులను పట్టుకుంది .నవల ఒక వినిమయ వస్తువు గా చలామణి లోకి వచ్చింది దీని వల్లనే .(commadity )వేలాది మంది కోని చదవటం దీని ప్రత్యేకత .ముద్రణ అయిన వెంటనే ఎగబడి ,కోని చదివే స్తితికి సమాజాన్ని తెచ్చాడు డికెన్స్ ,.అమెరికా ఇండియా ,కెనడా లలోను ఇదే పరిస్థితి .అంత క్రేజ్ ను సృష్టించాడు .పిక్విక్ పేపర్ల కధే జనసంమాట మైన సంస్కృతీ ,ఆధునిక మార్కెటింగ్ కధ .మాస్ -అంటే సామాన్య జనం  చదివిన మొదటి నవల అదే .ఆ సంస్కృతిని నిలు వెళ్ళా వ్యాపింప జేశింది .చాలా చౌకగా కాగితం అట్ట పై పేపర్ పాక్ ఎడిషన్ గా వచ్చిన తొలి నవల అది .కల్పనా సాహిత్య చరిత్రలో వచ్చిన మొదటి నవల .అందరికి అందుబాటు ధర .జన సామాన్య సంస్కృతిని ప్రభావితం చేయటమే కాదు అదే జన సామాన్య సంస్కృతీ అయింది .లిటరేచర్ గా పిలవబడి నప్పటికీ పూర్తి హాశ్యమే వ్యంగ్యమే .పాథకులు ఎదురు చూసే స్థాయికి సాహిత్యాన్ని తీసుకు వచ్చిన ఘనత డికెన్స్ దే .అంటే కాదు సీరియల్ గా రాయాలన్న ఆలోచనా ఆయనదే .మొదటి పుస్తకం విడుదల అయిన రోజున లండన్ కు దూరం గా ఉండాల్సి వచ్చింది .అదే సక్సెస్ అయింది .అంటే ఇంకా ఏపుస్తకం విడుదల అయినా లండన్ లో వుండే వాడు కాదు అంత సెంటి మెంట్ ఏర్పడింది .పిక్విక్ పేపర్స్ లో 35 బ్రేక్ ఫాస్ట్ లు ,32 దినార్లు ,10 టీలు ,10 లంచులు ,ఎనిమిది సప్పర్లు ,59  ఇన్నులు (ఇన్స్ )వున్నాయని లెక్క వేశారు .865 మంది మనుషులున్నారు .దీన్ని స్టేజి మీద ఆడారు .ప్రతి పేజి లో ఒక కొత్త కారెక్టర్ ,.కధ ౧౬౮ ప్రదేశాలలో జరుగు తుంది .బైబిల్ తర్వాత ప్రపంచం మొత్తం మీద అధికం గా అమ్ముడైన పుస్తకం .అదే ఆల్ టీం     రికార్డ్ .చదవ  గల   వారి  సంఖ్యను  ,కోని   చదివే  వారి   సంఖ్య  తో  భాగిస్తే  ఎనభై  ఒక్క  శాతం  తో  ఈ  నవల  అన్నిటికంటే ముందుంది .గాన విత్ ది విండ్ నవలకు ఈ నిష్పత్తి నలభై మాత్రమే .బెస్ట్ సెల్లార్ పుస్తకం అంటే అదీ కొల మానం .ఈ నవల ఇంగ్లీష్ వకాబ్యులరి ని సుసంపన్నం చేసింది .ఇంగ్లీష్ డిక్షనరీ లో డికెన్స్ వాడిన మాటలన్నీ చేరి శోభను చేకూర్చాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -03 -12 .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.