వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1

   వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1

                                                  ద్వాదశం రాసుల పై సూర్య కిరణ ప్రసారం -శృంగేరి
 కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి .ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం .శృంగ గిరే శృంగేరి గా మారింది .ఆది శంకరా  చార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు .శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది .శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్స రాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు .అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు .ఇది 1338 లో నిర్మిత మైంది .
ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి .ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి .సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ,ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం .ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం .స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం .వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు ,పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు ,అన్నీ ఒకే శిలతో నిర్మింప బడి ఉండటం ఆశ్చర్య కరం .ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్క బడి వుండటం ఇంకో విచిత్రాను భూతి .పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించి నట్లు గా అని పిస్తుంది .ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది .
                      శైవ జైన వైష్ణవ సామ రాస్యానికి ప్రతీక ధర్మ స్థల 
కర్ణాటక లో మంగుళూరు నుంచి ౪౦ కి.మీ.దూరం లో వున్న చిన్న గ్రామమే ధర్మ స్థలి .ఇక్కడి శివుడు మంజు నాధుడు .పూజారులు రాజా కుటుంబాలకు చెందిన వైష్ణవులు .ఆలయ నిర్వాహకులు జైనులు .ఇదీ ఇక్కడి విశేషం .మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ ధర్మ స్థలం .మంజు అంటే కన్నడం లో మంచు అని అర్ధం .శివుడు మంచు పర్వత మైన కైలాస గిరి పై ఉంటాడు కనుక ఆ పేరు .”వాడి రాజా తీర్ధులు ”అనే వైష్ణవ స్వామి స్వయం గా ఇక్కడ లింగ ప్రతిష్ట చేశారు .దేవ రాజ హేగ్గడే అనే జైన మతస్తుడు మొదటగా విగ్రహాన్ని ప్రతిష్టించి నట్లు తెలుస్తోంది .”కుడుము ”అనే పేరు వున్న ఈ గ్రామం క్రమం గా ధర్మ స్థలి  అనే పేరు గా మార్పు చెందింది .జైన దేవుని అతి పెద్ద విగ్రహం అత్యాకర్ష ణీయం గా  ఇక్కడికి దగ్గరలో శ్రావణ బెల్గోలా లో వుండటం మరో వింత .నిజాయితీ కి మారు పేరు ధర్మ స్థలి .దొంగతనం అనేది వుండదు .ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఎంత కాల మైనా వుంటాయి .అందుకే ఆపేరు వచ్చింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -03 -12 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

2 Responses to వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1

  1. durgeswara's avatar durgeswara says:

    చాలా బాగుందండి

    Like

  2. శృంగేరి దేవస్థానంలో తన ఆహారమైనట్టి కప్పనే తన పడగనీడన కాపాడుతున్న నాగేంద్రుడు ‘కప్పె చెన్నిగ
    రాయ’ అనే పేరుతో పూజింపబడడం విశేషం. ప్రస్తుత శృంగేరి పీఠాదిపతి మన గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన తెలుగువారే కావడం మరో విశేషం.అక్కడి’ తుంగ’ నది చల్లటి స్వచ్చ జలాలలో అంత ఎత్తున ఎగిరెగిరిపడే పెద్ద చేపలు కూడా శృంగేరిలో చూడ ముచ్చటైన మరో ఆకర్షణ.
    మంజునాథ దేవస్థానం ఉన్నట్టి ధర్మస్థలకు ఒకప్పటి పేరు ‘కురుమపురం’.అందుకే భక్తి గీతాల్లో మంజు
    నాథుడిని ‘నమో మంజునాథా! కురుమపుర వాసా!’అని కీర్తిస్తారు.కురుమపురమే నేడు కుడుమపురం
    అయింది.శ్రీ కృష్ణ దేవరాయల పూర్వులైన కురుమ కులస్థులైన జైనుల ప్రాబల్యం అక్కడ ఎక్కువ.అందుకే దాన్ని కురుమపురం అన్నారు. తుళునాడు లోని ధర్మస్థల,కార్కళ,ముడ బిదరి,గేరసోప్ప ప్రాంతాలన్నిటిలో జైనుల ప్రాబల్యం ఎక్కువ. భగవాన్ బాహుబలి అనే రెండవ జైన తీర్థంకరుడి పెద్ద రాతి విగ్రహాలు ఆ ప్రాంతం అంతటా చూడొచ్చు.మంజునాథ ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్గడవరు .తెలుగు నియోగులను’ ప్రెగ్గడ వారు ‘ లేక పెగ్గడ వారు అంటారు.కన్నడ భాషలో ‘పులి’శబ్దం ‘హులి’గానూ,పల్లి శబ్దం ‘హళ్లి’ గానూ రూపాంతరం చెందినట్లే ‘ప్రెగ్గడ వారు’ అనే తెలుగుపదం కన్నడ భాషలో ‘హెగ్గడవరు’ అయింది.(మన ‘ప’శబ్దాన్ని కన్నడిగులు ‘హ’గా పలుకుతారు).అక్కడి హెగ్గడవరులనే ‘హేగ్డేలు’ అనీ అంటారు.కర్నాటక మాజీ ముఖ్య మంత్రి రామ కృష్ణ హెగ్డే,సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి కే.యస్. హెగ్డే వీరిలో ప్రముఖులు.

    New post on సరసభారతి ఉయ్యూరు

    వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1
    by gdurgaprasad
    వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1

    ద్వాదశం రాసుల పై సూర్య కిరణ ప్రసారం -శృంగేరి
    కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి .ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం .శృంగ గిరే శృంగేరి గా మారింది .ఆది శంకరా చార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు .శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది .శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్స రాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు .అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు .ఇది 1338 లో నిర్మిత మైంది .
    ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి .ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి .సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ,ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం .ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం .స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం .వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు ,పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు ,అన్నీ ఒకే శిలతో నిర్మింప బడి ఉండటం ఆశ్చర్య కరం .ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్క బడి వుండటం ఇంకో విచిత్రాను భూతి .పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించి నట్లు గా అని పిస్తుంది .ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది .
    శైవ జైన వైష్ణవ సామ రాస్యానికి ప్రతీక ధర్మ స్థల
    కర్ణాటక లో మంగుళూరు నుంచి ౪౦ కి.మీ.దూరం లో వున్న చిన్న గ్రామమే ధర్మ స్థలి .ఇక్కడి శివుడు మంజు నాధుడు .పూజారులు రాజా కుటుంబాలకు చెందిన వైష్ణవులు .ఆలయ నిర్వాహకులు జైనులు .ఇదీ ఇక్కడి విశేషం .మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ ధర్మ స్థలం .మంజు అంటే కన్నడం లో మంచు అని అర్ధం .శివుడు మంచు పర్వత మైన కైలాస గిరి పై ఉంటాడు కనుక ఆ పేరు .”వాడి రాజా తీర్ధులు ”అనే వైష్ణవ స్వామి స్వయం గా ఇక్కడ లింగ ప్రతిష్ట చేశారు .దేవ రాజ హేగ్గడే అనే జైన మతస్తుడు మొదటగా విగ్రహాన్ని ప్రతిష్టించి నట్లు తెలుస్తోంది .”కుడుము ”అనే పేరు వున్న ఈ గ్రామం క్రమం గా ధర్మ స్థలి అనే పేరు గా మార్పు చెందింది .జైన దేవుని అతి పెద్ద విగ్రహం అత్యాకర్ష ణీయం గా ఇక్కడికి దగ్గరలో శ్రావణ బెల్గోలా లో వుండటం మరో వింత .నిజాయితీ కి మారు పేరు ధర్మ స్థలి .దొంగతనం అనేది వుండదు .ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఎంత కాల మైనా వుంటాయి .అందుకే ఆపేరు వచ్చింది .
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -03 -12 .
    gdurgaprasad | మార్చి 26, 2012 at 7:42 పూర్వాహ్నం | Tags: ఆలయాలు | Categories: నేను చూసినవ ప్రదేశాలు | URL: http://wp.me/p1jQnd-1nz
    వ్యాఖ్య See all comments
    Unsubscribe or change your email settings at Manage Subscriptions.

    Trouble clicking? Copy and paste this URL into your browser:
    https://sarasabharati.wordpress.com/2012/03/26/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%af/
    Thanks for flying with WordPress.com

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.