వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –1

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –1

                శ్రీ వేలూరి శివ రామ శాస్త్రి గారి కధలు అనగానే అందరికి ముందు గా గుర్తొచ్చేది ”డిప్రెషన్ చెంబు ”కధ .అంత ప్రాచుర్యం పండిన కధ అది .1930 ప్రాంతం లో భారత దేశాన్ని ఒక ఊపు ఊపిన ఆర్ధిక మాంద్యం (finacial depression )మానవ జీవితాలతో ఎలా ఆటలాడు కొన్నదో చూపిన కధ .అందరు ,మెచ్చి అందరికి నచ్చిన కధ .శ్రీ శాస్త్రి గారి సంభ్హాశానా రచనా చమత్క్రుతికి ,కధా సంవిధానానికి ,శిల్ప  నైపుణ్యానికి ఉదాహరణ గా నిలిచిన కధ .మనస్సుల తో సయ్యాట లాది ,అంతటి కస్తాల లోను ఒకింత గుండె ధైర్యాన్ని ,కర్తవ్య పరాయనత్వాన్ని చూపిన కధ .ఈ ఇంప్రెషన్ తో ఆ డిప్రెషన్ లోకి ప్రవేశిద్దాం .
             లిటరేచర్ ఆనర్స్ ఫాస్ట్ క్లాస్ లో పాసై రామా రావు ఉద్యోగం దొరక్క బోర్డ్ మాత్రం బయట కట్టు కున్నాడు .ఆ డిగ్రీ కి ఉద్యోగం ఇచ్చే వారే లేరు .దానికి అంత ఘనత .”పొమ్మన గానే లేచి పో గల నియమాలకు లోబడి పాతిక రూపాయిలకే బి.ఎడ్ లు కో అంటే కోటి మంది దొరుకు తూంటే ,ఈ ఎమ్మీ లకు విద్యాలయాలు బెదిరి పోతున్నాయట ”.ఒక వేల ఏ ఇరవై కో బేరం కుదిరినా ఏం.ఏ.అయిన రామా రావు ద్వివేది బి,ఏ.హాన్స్ లొంగడు .పైగా డిప్టీ కలెక్టర్ గారి అల్లుడాయే .మరీ గౌరవ భంగం .ఉభయ భ్రస్టుత్వం ఉపరి సన్యాసం .”ఈ నాణెం ”చదువుల టంక సాల లో తప్ప మరో చోట చెల్లదు .కనుక వేరే డిపార్ట్ మెంట్ ఆలోచనా లేదు .అయితె తల్లి ,పెళ్ళాం బాధలు చూడ లేక అన్ని చోట్లకు కన్నీళ్లు తుడవ టానికి అప్ప్లై చేశాడు .పెట్టి నప్పుడల్లా ,తల్లి నగో ,పెళ్ళాం నగో తాకట్టు .ఇదీ పరిస్థితి .”కరువు వచ్చి ,కలిసి రావటం లేదు ”అని తల్లి దేవుణ్ణి తిడుతూ ఊరట పొందు తోంది .పెళ్ళాం తులసి కి విషయం తెలుసు .భర్త పోస్టల్ డిపార్ట్ మెంట్ కు ,పోలిస్ డిపార్ట మెంట్ కు అప్ప్లై చేస్తున్నా ”తనమగని చదువుకు ,ఆ ఉద్యోగానికి బదరీ బాద రాయణ సంబంధమే ”నని తెలుసు .”ముక్కోటి నాడు ముక్తి ద్వారాలే తెరువ బడ తాయి .కాని రామా రావు మేడ బంద్ .అతని స్నేహితు లేవ రైనా వస్తే ”లేరు ”అని పంపించేస్తుంది భార్య తులసి .
 రామా రావు గది నిండా గ్రీకు నగ్న చిత్రాలు ,ఆంద్ర కళా చిత్రాలు వేలాడు తాయి .బల్ల పై ”ప్రాచ్య రసాయనముల తో పాటు అప్రాచ్య రసాయనాలు ఉన్నాయి .బీరు వాలో కోహ్ల వాత్యాయనుల మొదలు మేరి స్తోపెస్ తారు వాటి వరకు ”గల సకల సారస్వత మంతా నిండి పోయింది .అతని సకల గునాభి రామత్వానికి ఇది చాలు .అతనికి భార్య పై ప్రేమ ,మామ కారం .”ఆమె గవాక్షం వైపు చూస్తె బెంగ .అత్త గారు కోడల్ని పిలిస్తే వియోగం .పుట్టింటి వారు రాసే జాబులు అతని పాలిటి విడాకులు .ఇలా తులసికి అనేక వేషాలు వేసి ఆమె ను విడిచి ఉండలేని వాడు గా ఉంటూ నగలన్నీ హారతి కర్పూరం చేసే శాడు .ఇలా ఒక ఏడాది గడిచింది .
ఆ ఊళ్ళో  కాలేజి లో          ట్యూటర్ పోస్ట్ ఖాళీ అని అరవై రూపాయలు జీతం అని ఆర్డర్ వచ్చింది .దాన్ని ”ముష్టి ఎత్తు కోవ టానికి పాస్ ”అన్నాడు .దాన్ని భార్య కు చూపించే సాహసం చేయ లేక దాచేశాడు .అతని పధ్ధతి ఆమెకార్ధ మైంది .”నాగాలా కరిగి పోయే ,సంసారమా గంపంత ,కాలమా పచ్చి కరువు .ఈతడా ఈహా మృగ నాయకుడు ”అని భర్తనూ అంచనా బానే వేసింది .పరిస్థితిని సమీక్షించింది .అత్త గారు తన పిల్లలకు అన్నం పెడు తోంది .”ఆవ కాయ అన్నం”.పిల్లలు కూరా ,పెరుగు అని గోల చేస్తున్నారు .వాటి ముఖం చూసి ఎన్నాళ్లైందో .ఏదో మాటల్లో పెట్టి దాన్నే తిని పిస్తోంది అత్త గారు .పైన ఉన తులసి తో శృంగారం ప్రారంభించ బోయాడు రావు .ఆమెకు విపరీతం గా కోపమొచ్చింది .పరిస్తితుల్లోంచి తప్పు   కొనే తన భర్త అంటే వెగటు పుట్టింది .తన్ను కాసేపు వంటరిగా వదిలెయ మని కోరింది .”ఇది వైరాగ్యానికి సమయం కాదు ”అన్నాడు .ఆమె చాలా తెలివిగా ”రోగం ,నిదానం ,మందు ,మాకు, నాకు బాగా తెలుసు .ఇదే సరైన సమయం ”అని వాయించింది .అతన్ని ”ఆడంగి రేకు ”అంది .తల్లినీ ,తమ్ముళ్ళను పోషించ లేని వాళ్ళను 
మగ వాళ్ళు గా చూసే వాళ్ళు ఇంకో జన్మ లో కాదు ఈ జన్మ లోనే గుడ్ల గూబలు ”అంది .ఆడది దగ్గరుంటే అతనికి చాలని అంది ”.హాన్స్” గారికి పౌరుషం హెచ్చింది .మాట్లాడితే జాగ్రత్త గా మాట్లాడమని లేక పొతే మీద పది కొత్త మంది .”భార్య వంటి పరమ నీచు రాలు ఈ జగత్తు లో లేదు ”అని భార్య గా తాను ఏమీ చేయ లేక పోవటాన్ని గుర్తుకు తెచ్చు కుంటు బాధ పడింది .తనవి అత్త గారివి నగలు హరించే శాడని చివరికి ప్రధానపు ఉంగరం కూడా కిళ్ళీ కొట్టు బాకీ తీర్చటానికి ఇచ్చేశాడని ,మేడ ను తాకట్టు పెట్టాడని నిష్టూరం గా అన్నది .చిల్లి గవ్వ సంపాదన లేక పోయినా శృంగారానికేమీ తక్కువ లేదు అని దేప్పింది .కళ్ళు మూసుకో వద్దు అన్నది ..కిందికి దిగి పరిస్థితి ని గమనించ మని హెచ్చ రించింది .
తన తో కిందికి అస్తే శికారైనా వెళ్తానన్నాడు .”నీ మనసు ఫిరాయించి నట్లుంది ”అన్నాడు .అతనితో తాను వస్తే అతనొక పెద్ద ఉద్యోగాస్తుదని అందరు అనుకొంతారని అతని భ్రమ .అది తెలిసే రానని చెప్పింది .”అంతా డిప్తి కలెక్టర్లు కాలేరు ”అన్నాడు  వ్యంగ్యం గా .అయినా ఎవరి పొట్ట వారు పోషించుకొంటారు అంది .”యెంత దప్పికైనా చాతకం ఆకాశ గంగకు ఎదురు చూస్తుంది .చెరువులకు ఎగ బడదు ”అన్నాడు చదివిన సాహిత్యం ఒలక బోస్తు .మండి పోయింది తులసికి .”యెంత మాట ?గుంతల మీదికే ఎగ బడిన్దిప్పుడు .”అని తగి లించింది .ఆవిడ భావం ఆతనికి అర్ధ మై నగల విషయం లో దెప్పుడు అని గ్రహించి ,దానికో కోటింగ్ ఇచ్చాడు .”ఏమి తులసీ !నీ నగలు ,మా అమ్మ నగలు నావి కావూ ?అవి గుంతలా ?నస్త్రీ స్వాతంత్ర మర్హతి అని తెలీదా ?”అన్నాడు రావు .ఆమె సహనపు చివరి హద్దు మీద ఉంది .”డొక్కల కరువు వస్తే మగాళ్ళు ముందర తల్లులని ,తరువాత పెళ్ళాలని విరుచుకు తినేస్తారు .హిందూ దేశం లో పెళ్లి అనే ఆచారం ఎప్పుడు అంత రిస్తుందో కదా ?అని వాపోయింది .”విడాకు లిచ్చేట్లున్నావే ”అన్నాడు వ్యంగ్యం గా .”విడాకు లివ్వటమే వస్తే ఆంద్ర దేశం లో తులసి మొదటిది .”అంది అప్పటికింకా విడాకుల బిల్లు రాలేదని గుర్తు చేస్తూ .పరిస్తితుల ప్రాబల్యమే ఆమె తో అన్ని మాటలని పించింది .కర్తవ్యతా మూధత్వం తో భర్త వుంటే ,ఏ ఆడ డైనా అనే మాటలే ఇవి .
             సశేషం
                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -03 -12 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.