వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2

                  శ్రీ రస్తు చిరంజీవి ద్వివేదుల రామయ్య అని పోస్ట్ వచ్చింది .ద్వివేది అని కాని డిగ్రీ కని దాని మీద లేక పోయేసరికి చిన్న బుచ్చు కొన్నాడు .హాన్స్ దొరకు అవమానం అని పించింది .”పేరు చేతనే గౌరవం పుడికి పుచ్చు కొనే వారికి మొండి పేరు -బండ బూతు ”అంటారు కధకులు .అతని మేన మామకు సీరియస్ అని లేఖ సారాంశం .తల్లికి చెప్పి రమ్మని భార్యను కిందికి పంపాడు .ఆమె దిగి ,చెప్పి పైకి రాగానే సమయం కని పెట్టి ,వాటేసుకొని ,నలిపేశాడు .”ఏమిటీ మోట పని ?లంఘనం లో మను గుడుపు ”అని ఈస డించింది .సంధిలో మంత్రం లాగా .అమ్మని ,తమ్ముళ్ళను పంపిస్తా నని తాను వెళ్ళ నని అన్నాడు .అతను వెళ్ళటం మంచిది అంది .ఆమె విరహం భరించ లేని స్వాప్నికుడు కదా .”నీ యెడ బాటు నాకు అనార్కి .అమ్మా ,పిల్లలు వెళ్తే స్వరాజ్ అన్నాడు .పాత్రల స్వభావాలను బహిర్గతం చేసే విలువైన మాటలివి .కాదు”డయార్కి” అందామె .తనకో ఉద్యోగం ఆఫర్ లో ఉండటంవల్ల రావటం లేదని తల్లిని వెళ్లి రమ్మన్నాడు .ఆమె పాపం కొడుకు సంగతి తెలిసి ”మామయ్యకు ఎప్పుడు ఇలానే వస్తుంది లే .నీ ఉద్యోగ ప్రయత్నం చెయ్యి ”అంది .పిల్లల్ని ఇక్కడే వది లేయ మంది కోడలు .అత్త చాలా మంచిది .”వీళ్ళు నెత్తి మీద బండలు .మీరు మోయలేరు ”అన్నది .కోడలు ”బండలు కాదు ,నెత్తికి కిరీటాలు ”అని తన సహృదయత ,వారి పై ప్రేమ వెలి బుచ్చింది .చిన్న కొడుకు ను మాత్రం తీసుకొని తల్లి వెళ్ళింది .అత్త కోడలితో ”ఎన్నడూ ఎరగని దానివి –ఈ ఇంటి మొహం సూది -పొట్ట మాత్రం పాము పొట్ట ”అని అలాంటి సంసారాని భుజాన పెట్టి వెళ్తున్నందుకు బాధ పడింది .
                       వెళ్తూ అత్త ,కోడలికి ఒక పొట్లం ఇస్తూ ”దీనిలో వంట ఇంటి సామానంతా వుంది ”అని చెప్పింది .ఇంట్లోకి వెళ్లి తులసి పొట్లం విప్పితే ,”మట్టెలు ,మంగళ సూత్రాలు ”కన్పించాయి .అవి ”తన సంసార యాత్ర కు దారి బత్తెం ”అట్టం గారి దుఖానికి అర్ధం తెలిసిన్దామెకు .”మంగళ సూత్రం చుట్టూ గుది కట్టిన మగలు లేని వారి మనో రహశ్యాలు అన్నీ ,ఆమె మనస్సు లో మేడి లాయి ”అత్తను అర్ధం చేసుకొన్నా కోడలిగా ఆమె ను ఆవిష్కరించారు శాస్త్రి గారు .ఒక సారి ఆ ఇంటి మ్పరిస్తితి ఫ్లాష్ బాక్ గా కని పించింది .పెద్ద కొడుకు సంసారాన్ని ఉద్ద రిస్తాడని ,చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాడని తల్లి ఉన్నదంతా కొడుకు ,కోడలికి పెట్టి ,మిగిలిన వారిని మాడ్చింది .తాను కాపు రానికి వచ్చే సరికి పిల్లలు ముద్దు గా ,బొద్దుగా నాగా ,నటరా తో ఉత్సవ విగ్ర హాల్లా ఉన్నారు .”ఇపుడు లజ్జా దేవి వారి పై కాపురం ”అని ఆ తేడా ను గొప్ప గా చెప్పారు .”పుండు వంటి పుష్య మాసం లో కూడా కప్పు కోటానికి దుప్పటి లేదు .”పద్మ  నాభుడు గోచీతో ,మూడో వాడు మొల నూలుతో ,మురిసి పోయారట .పెద్ద ఆడ పిల్లకు మాసికల పరికిణీ ,చిన్న దానికి చిరుగులది .రాత్రి పూట వారందరికీ ”ఒకరి చర్మం ఇంకొకరికి దుప్పటి ”దరిద్రాన్ని కళ్ళకు కట్టించారు .పిల్లల కోడిలా తల్లి తన కోకతో వారిని పొదుగు తుంది .ఇదే చివరి నాగ అని తెలుసు కొంది .                         తల్లి చూపే ఆ పిల్లలకు సుగ్రీవాజ్న .భూగోళం వారికి చీకటి గది .అన్నకు పెట్టె వంట కాల వాసనే వాళ్లకు ”మీదు ”ట .అన్నా ,వదినా అనే అర్ధ నారీశ్వ ర మూర్తే వాళ్లకు అది దైవం .దాని లోని నారీ మూర్తి ఇప్పుడు తమకు ప్రత్యక్ష దేవత యై ,ఆ పిల్లలకు ఇప్పుడు సాక్షాత్కరించింది .ప్డ్డ్డున చద్దన్నం లో ఏం తినారని పిల్లల్ని అడిగింది తులసి .చద్దన్నం రుచి చూసి ఆరు నెల లైంది అన్నారు .అన్నయ్య కు ఉద్యోగం వచ్చిన తర్వాత వేడి అన్నం పెడతానని అమ్మ చెప్పిందని ,చలిది అన్నం జబ్బు చేస్తుందని అన్నారు సుందరి ,రమణా .తల్లి పెంపకం వాళ్ల లో అంతటి ఉదాత్త భావాలను కల్గించాయి .లోకజ్ఞా తకు నిదర్శన మైంది .ఉన్న కొద్ది బియ్యం ఉడ కేసి వాళ్లకు పెట్టె ప్రయత్నం చేసింది .నిన్న రాత్రి ,వాళ్ళు ””యెర్ర మందు ”అంటే ఆవ కాయ వేసుకొని తిన్నారట .ఇకా ఏం తిన్నారని అడిగితె ”ఆకాశం ”అన్నారు .అంటే మజ్జిగ .వాళ్ల అమ్మ కూర అదీ వేసి ఎందుకు పెట్ట లేదని అడిగింది .”మీరు చదువు కున్నారుగా అందుకని అమ్మ మీకే పెడ్తుంది ”అని వాళ్ల సమాధానం  .”అన్నాయికి ఉద్యోగం వచ్చింతర్వాత మాగ్గూడా పెడు తుంది” .అన్నది సుందరి .అన్నయ్య తమక్కూడా చదువు చెప్పిస్తాడని అమ్మ చెప్పిందని అన్నాడు రమణ  .ఆశ్చర్య పోయింది తులసి ఆ నిర్వి కార పర  బ్రహ్మ అయిన బర్తను తలచుకొని .
     సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -03 -12 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.