వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4
”అప రాహ్న సూర్యుడు అతని తలను ,ఖుత్ సూర్యుడు అతని ఉదరమును మల మల మాడ్చెను ”.భార్య జ్ఞాపకం వచ్చి ఇంటికి పరి గేత్తే ప్రయత్నం చేశాడు రావు .మళ్ళీ ఆలోచనలో పడి ”పైసా లేనిచో పర స్త్రీ విముఖుడను మాట ఝూటా -పైసా లేనిచో స్వ ,పర స్త్రీ విముఖుడు ‘అనే జీవిత సత్యాన్ని తెలుసు కున్నాడు .మిగిలిన స్నేహితుడు శర్మ .try and try again అన్నారుగా .శర్మ ఏం .ఏ.బి.ఎల్ .అయినా వాకిట్లో పార్టీల సంద డేమీ లేదు .”ప్లీడర్ల ఇళ్ళు కల్లు అంగళ్లు కదా ఈ సందు ఇంత అరణ్యం గా ఉందేమి ?”‘అని అనుకొన్నాడు .కోర్టు వేళ కదా అని వెళ్లి పోతుంటే శర్మ కన్పించాడు .శర్మ కు చత్వారమే కాక ,రెండు రోజులనుంచి ,”తిమిర రోగం ”కూడా ప్రవేశించింది .అందుకే పాపం కళ్ళ జోడు కూడా పగిలి పోయింది .కొనే స్తోమత లేదు .అందుకనే జోడు అల వాటు మాని వేయాలని నిర్ణ యించు కొన్నాడు .”జోడు పనిని మనసు చేత నే చేయించి సమాధాన పడు తున్నాడు ”అని కధకుని గా శాస్త్రి గారంటారు .
తన నెవరు చూడటం లేదని భావిస్తున్న శర్మ గోడ కున్న తన” నేం ప్లేటు ”ను పీకేసి ఇంట్లో దాచేసి, ఏదో కాగితం తీసి రాస్తున్నాడు .”దారిద్ర్య దేవత వికట హస్తాన్ని ”విస్పష్టంగా చూశాడు రావు .ఇక్కడా హుళక్కే అని అనుకున్నాడు .”శర్మా ది నిహిలిస్ట్ !దేవుడున్నాడని రాస్తున్నావా ?”అని పలకరించాడు .అంత దరిద్రం లోను శర్మ హాష్య ప్రియత్వం ఆగ లేదు .”ఆకాలపు ఎండ ,ఇంటి యల్లుడా !నీ కెందుకీ కాండ దేవుడెక్కడ ఉన్నాడు ?ఉన్న దంతా డిప్రేశానే .యు.పీ.లో గ్రాడ్యు ఎట్లకు పది ఎకరాలు భూదానం గా ఇస్తున్నారని తెలిసి అప్ప్లి కేషన్ రాస్తున్నాను .దాని రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఒక పావలా దానం చెయ్యి ”అన్నాడు శర్మ .”మా ఆయనే ఉంటె ,మంగలి తో పనేమిటి ?”అన్నట్లు ,ఆ పావలా ఉంటె ,ఈ పూట నిర్వి చారం గా గది ఛి పోయేదే అని లోపల అనుకోని ,”ఆ దానం యు.పీ.లో ఒక జిల్లా కు మాత్రమే కనుక నా దానం అప్రశస్తా దానం ”అని తేల్చేసి బయటికి వెళ్ళాడు .ఇలా సుందరం ,మూర్తి ,శర్మా గర్భ దరిద్రాన్ని అను భావిస్తున్నా దానికి అలా వాటు పడి ,ఏదో పని చేస్తూ ,మాటలతో ఊరట చెందుతూ చేరా గని చిరు నవ్వు తో ,కాల క్షేపం చేస్తున్నారు .ఎవరో వస్తా రని ,ఏదో చేస్తారని ,ఎదురు చూడటం లేదు .తమ ప్రయత్నాలను తాము చేస్తూ ,బతుకు బండీ ఈడు స్తున్నారు .చిన్న చిన్న మాటలతో శాస్త్రి గారు మహా గొప్ప గా మదింపు వేసి చూపారు .”ఇలా డిప్రెషన్ బజారు నుండి ,అసలు బజార్లో ”పడ్డాడు ఆశోప హతుడైన రావు ఆన్స్ .వాళ్ళెవరు వ్యవస్థ మీద నిప్పులు చెరగలేదు .ప్రభుత్వం మీద ప్రతీకారం చేస్తామని ఊగి పోలేదు .వామ పక్ష భావాల సుడి గుండం లో పడి కొట్టు కు పోలేదు పరిస్తితులను అర్ధం చేసుకొని ,కాళ్ళ మీద నిలిచే ప్రయత్నాలే చేశారు .దేబిరించి అడుక్కు తినాలని ఆలోచించ లేదు .లేదా ఉన్న వాడిని దోచుకోవాలనే ఆలోచన వారికి లేనే లేదు .బాలన్స్ గా విషయాన్ని అధ్యయనం చేసి ,తమ మార్గాన తాము సాగి పోతున్నారు …
ఇక్కడ ఇంటి దగ్గర ”తులసి ””ఈ రోజూ మా కెవరికి అన్న ప్రాప్తి లేదు ”అను కొంది .మొగుడి నిర్వాకం తెలిసింది .మూడు గంటలు మోగాయి .”నిజం ,నిజం ”అను కోని భోషాణం తలుపు తీసి వెదికి ,వెదికి పెద్ద రాగి చెంబు తీసి ,చింత పండు తో తోమి శుభ్రం చేసింది .
సశేషం వచ్చే దే ఆఖరి భాగం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -03 -12 .
