దశోప నిషత్ సారం –1
— ఉప+ని+శదుల్ అనేది ధాతువు .శదుల్ అంటే విశరణ ,గతి ,ఆవ సాదన అనే అర్ధాలున్నాయి .కార్య రూప సంసారాన్ని ,శరణం అంటే ,శిధిలం చేసి ,అజ్ఞానాన్ని ,ఆవ సాదనం (నశింప )జేసి ,బ్రహ్మ ను గతి గా పొందించేది -ఉపనిషత్ .”విశాన్న మాస్యం ఆత్మ తత్త్వం ఇతి ఉపనిషత్ ”ఆత్మ తత్త్వం దేనిలో పూర్తిగా నిండి ఉన్నదో ,అది ఉపనిషత్ .గురువు సమీ పం లో కూర్చుని నేర్చు కొనే విద్య అనే అర్ధమూ వుంది .మోక్షాన్ని చ్చె విద్యే ఉపనిషద్ విద్య .బ్రహ్మ విద్య ను ప్రధానం గా ఇవి బోధిస్తాయి .దాన్ని నేర్చు కొనే విధానాన్ని తెలియ జేస్తాయి .మనకు ఉన్న దశోపనిషత్ లలో వున్న సారాన్ని గురించి తెలుసు కొందాము .
ఈశా వాస్య ఉప నిషత్
”ఈశా వాస్యం ”అనే మాట తో ప్రారంభ మైంది కనుక ఆ పేరు వచ్చింది .శుక్ల యజుర్వేదానికి చెందింది .18 మంత్రాలున్నాయి .దీని శాంతి మంత్రం ”పూర్ణ మదః పూర్ణ మిదం ,పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే -పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవా వశిష్యతే ”ఇదే అద్వైతం .త్రాడును చూసి పాము అనుకుంటాం .వెలుగు లో తాడు లానే కన్పిస్తుంది .దానిలో మార్పు లేదు .అట్లాగే బ్రహ్మ వస్తువే ప్రపంచం గా కని పిస్తుంది .అయితె బ్రహ్మత్వం లో మార్పు లేదు .అట్లాగే ,సత్య మైన బ్రహ్మమే పూర్ణ వస్తువు .వస్తుత్వం లేని ప్రపంచం మిధ్య .
మొదటి మంత్రం లో ”ఈశా వాస్య మిదం సర్వం యత్కించ జగత్యా జగత్ ”అంటే కన బడేది జగత్తు .అంతా బ్రహ్మమే .అంటే జగత్తు బ్రహ్మము భిన్నం కావు .కనబడే జగత్తు అనే భావాన్ని వదిలి దాని ఆధార మైన బ్రహ్మకై అన్వేషించాలి .ఎవరి ధనాన్ని ఆశించ రాదు .ముముక్షు మార్గాన్ని పొందాలి .మూడు నుంచి ఎనిమిది మంత్రాలలో ఆత్మ సర్వ వ్యాపక మైనదని ,సర్వాత్మ భావన వల్ల శోక మొహాలు లేని నిత్య ,శుద్ధ ,బుద్ధ ,ముక్తి స్వభావం గల బ్రహ్మమే తాను గా మారి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు ..రెండవ మంత్రం లో జ్ఞాన మార్గం తెలియని వారికి భక్తీ ఏ శరణ్య మని నిష్కామ కర్మ రహశ్యాన్ని చెప్పారు .తొమ్మిది నుంచి పద్నాలుగు మంత్రాలలో ,కర్మ ను విడిచి ఉపాసన కాని ,ఉపాసన లేని కర్మ కాని చేయ రాదనీ తెలిపారు .
15 నుంచి 18 వరకు ఉన్న మంత్రాలలో దీని వల్ల లభించే క్రమ మైన ముక్తి తెలప బడింది .ఉపాసకుడు సూర్య గోళం ద్వారా ,బ్రహ్మ లోకం చేరి ముక్తు డౌతాడు .అయితే క్రమ ముక్త్రి మార్గం అను సరించని పుణ్య కర్మ ఏ ధూమాది మార్గం ద్వారా చంద్ర లోకం చేరి ,సుఖాను భావం పొంది ,మళ్ళీ భూలోకం చేరతారు. కనుక ఆ మార్గం కాకుండా ,”అగ్నే నయ సుపదా ”అనే 18 వ మంత్రం లో అగ్ని ద్వారా పునరా వ్రుత్తి రహిత మైన ముక్తి ని పొందాలని సారాంశం .
కేన ఉపనిషత్
సామ వేదానికి చెందినదీ ఉపనిషత్ .”కేన ”అనే మంత్రం తో ప్రారంభ మైంది .నాలుగు ఖండాలు ,34 మంత్రాలు .ఒకటి నుంచి ఎనిమిది మంత్రాలలో ఆత్మ తత్వ నిరూపణ ,తొమ్మిది నుంచి పన్నెండు ,పద్నాలుగు నుంచి ముప్ఫై ఒకటి మంత్రాలలో ”ఆత్మా దుర్విజ్నేయ బోధ ”,32 -34 లలో ”ఆత్మా జ్ఞాన సాధన ,13 లో మనుష్య జన్మ ఉత్క్రుష్టత చెప్ప బడింది .ఇది గురు శిష్య సంవాదం గా ఉంటుంది .జడాలైన దేహం ,ఇంద్రియాలు ,అంతః కరణాలు ,ప్రాణాలు ఎవరి ప్రేరణ చేత ప్రవర్తిస్తున్నాయి అనే ప్రశ్న ను శిష్యుడు వేస్తాడు .వీటన్నిటిని పరమాత్మయే ప్రవర్తింప జేస్తాడని సమాధానం .ఆ పరమాత్మ జ్ఞానమే మోక్షం .ఇంద్రియాలు ,మనస్సు ఆయన్ను తెలియ లేవు .ఏ వస్తువుని వాక్కు తో చెప్ప లేమో ,ఏది వాగింద్రియాలను ప్రవర్తింప జేస్తుందో ,దేని వల్ల మనసు కు మనన శక్తి కలుగు తుందో ,ఏ వస్తు వును మనసు చింతింప జాలదో ,దేని వల్ల ప్రాణానికి చలన శక్తి కలుగు తుందో ,అదియే పరమాత్మ ,బ్రహ్మ వస్తువు .”ద్వితీయాద్వై భయం భవతి ”తానె కదా అని ,తెలియ బడేది కాదు .అంటే ఆత్మా జ్ఞాన స్వరూపం .అంటే ”తెలివియే ఆత్మా ”ద్రస్త్రు దృశ్య భావ విరహిత కేవల ద్రుజ్నంత్రమే ఆత్మ .
ఆత్మకు పుట్టుక లేదు కనుక జాతి మొదలైనవి లేవు .శబ్దములు దాన్ని చెప్ప లేవు .ఆత్మ నిష్క్రియం కనుక క్రియా శబ్దాలు చెప్ప లేవు .రెండో వస్తువు లేదు కనుక సంబంధం లేదు .ఏకం ,అద్వితీయం ,సర్వ వ్యాపకం ,అనంతం కనుక శబ్దాదులు ఆత్మ ను వివ రించ లేవు .”ఆత్మ దుర్విజ్నేయం ”.ఆత్మను తెలుసు కొన్నాను అని తెలిపే వాడు నిజం గా తెలిసి కో లేదని అర్ధం .ఆత్మ తెలియ బడ లేదని భావించే వాడు నిజం గా ఆత్మ తత్త్వం తెలిసి కొన్న వాడు .తెలిసిన వస్తుజ్ఞానం నుంచి ,”నేతి ,నేతి ”ద్వారా తీసేస్తూ పోతే మిగిలిన ఏక రూప జ్ఞానమే ఆత్మ .ఆత్మ జ్ఞానంపొంది తే అమృతత్వం అంటే మోక్షం వస్తుంది .
దేవాసుర యుద్ధం తర్వాత దేవత లంతా గెలుపు తమ శక్తుల వల్లనే లభించిందని విర్ర వీగుతూ ఉత్సవం చేసుకొంటున్నారు .బ్రహ్మం -యక్ష రూపం లో వాళ్ళని పరీక్షిస్తుంది .వారి లోని ఆ శక్తిని తెసి వేస్తె వారు ఏ పనీ చేయ లేక పోతారు .పర బ్రహ్మ సహాయ సంపత్తి వల్లనే క్రియ జరుగు తోందని అనుగ్రహ శక్తి తీసేస్తే నిర్వీర్యత మిగుల్తుందని సారాంశం .ఆ బ్రహ్మమే” ఉమ ”గా దేవేంద్రునికి సాక్షాత్కరించి నిజ బోధ చేసి కళ్ళు తేరి పించింది .ఆత్మ జ్ఞానం ఎలా సాధించాలని శిష్యుడు అడుగు తాడు .వేద వేదంగా అధ్యయనం ,నిష్కామ కర్మాను ష్టానం ,సత్య వ్రతం ,శమ దమాదుల వల్లనే సాధ్యం అని గురువు సమాధానం చెబుతాడు .ఇలాంటి జ్ఞానం పొంద టానికి మానవ జన్మమే ఉత్కృష్ట మైనదని తెలియజేస్తాడు .మానవ జన్మ ను సార్ధకం చేసుకొని మోక్షం సాధించాలి .అదే మాన వ గమ్యం .అని కేనోపనిషత్ సారాంశం .
సశేషం
మీ— గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -03 -12 .

