వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం
సంప్రదించే చేరండి తొందర లేదు ”అంది .బతికి బయట పడ్డాం అను కుంటు బయటకు వచ్చే శాడు .
రామా రావు తన్ను తాను అమ్బుజానికి పరిచయం చేసు కొన్నాడు పాపం.”రామా రావు బి.ఏ.ఆన్స్ మీరేనా ?”అని అడిగింది .అవునన్నాడు .చాలా అల్లశ్యం గా వక్చ్చాడని ,200 మంది ఆ పోస్ట్ కు అప్ప్లై చేశారని ,150 మంది బి.ఏ.లు నలభై రూపాయలకే పని చెయ్య టానికి సిద్ధం అని చెప్పారని ,ఏం .ఏ.ల ఉదారత ఏమిటో చూసే ప్రయత్నం లో ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వ లేదని తాను ఏ మాత్రం త్యాగం చేయ గలదో చెప్ప మని ,అడిగింది .రామా రావు పరిస్థితి అడ కత్తెర లో పోక అయింది .ఏం చెప్ప లేక ”ఇంట్లో సంప్ర దించి చెప్తాను ”అన్నాడు .”భార్య తోనా ?వాళ్లకు మగల కంటే ఉదారత ఎక్కువ ”అన్నది .బెంగ పడి రామా రావు ఏమీ అన లేక పోయాడు .ఆమె మళ్ళీ ”మీ వాళ్ళను సంప్ర దించే చేరండి .తొందర లేదు ”అని తాపీగా చెప్పింది .బతికి బయట పడ్డాం అనుకొంటూ బయటికి వచ్చే శాడు .
బయట ”భిక్షాం దేహి ”అనే మాట ఖంగున విని పించింది .రామా రావు ,అంబుజం తొందర గా బయటికి వచ్చే శారు .”డిప్రెషన్ చెంబు మిసెస్ -రామా రావు -ద్వివేదీ బి.ఏ.ఆన్స్ ”అని ”తారు తో ”రాసిన బాగా తోమి ,నిగ నిగ లాడే రాగి చెంబు మీద చూశారు .తులసి దాన్ని చేత్తో పట్టు కోని ,వెనక ,సుందరి ,రమణ ,పద్మ నాభుడు అంతా కలిసి ”భిక్షాం దేహి ”అంతు ,ఇల్లిల్లు తిరుగు తున్నారు .హతాశుడై రామా రావు ,,ఆశ్చర్య పోయి అంబుజం చూశారు .విధి వైపు రీత్యం .ఆది భిక్షువు చూపిన బాటే అది .ఆ కుటుంబాలలో అది మామూలే .అదేమీ నీచమైన పని కాదు .ఉన్నది అమ్ముకొని తినటం అయి పోయి ,భర్త చేసిన ఆకారమ నత్వానికి విసిగి తులసి తీసు కొన్న నిర్ణయమే అది .చాలా మంచి నిర్ణయమే నని పిస్తుంది .అంత కంటే గత్యంతరం లేదామెకు .ఆ పనే భర్త చేసి ఉంటె ,చాలా సంతోషించి ఉండేది .కాని ,ఆ డిగ్రీ భుజ కీర్తు లున్న వాడికి ఇంకా అహం చావా లేదు .అడుక్కుని తినటం కంటే ,అప్పు చేసుకొని జీవించటం మేలు అను కొనే స్వభావం .ఉద్యోగం వచ్చేదే కాని అక్కడా జీతం కోసం ”శాక్రి ఫైస్ ”చేయాల్సి వచ్చింది .ఇవన్నీ ముందే గ్రహించిన తులసి చేసిన నిర్ణయం చాలా విలు వైనది .కడు పు నిండే ఉపాయం కూడా .ఆ నిర్ణయం ఆ కుటుంబాన్ని ఆడుకొంటే ,ఆమె త్యాగం గొప్ప ఫలితాన్ని స్తుంది .అలా సత్ ఫలితం ఉంటున్నందన్న ఆశ తోనే ఆమె ,ఆ వైపు కు అడుగు లేసింది . ఆ కుటుంబానికి తన ఋణం తీర్చుకొంది .తన మరుదులు ,ఆడ పడచు అత్త గారు రెండేళ్ళ నుంచి చేసిన శాక్రి ఫైస్ ముందు ,తాను చేస్తున్న ఈ భిక్షాటన” బలా దూర్” .అనుకోండి .అందుకే అంత కఠోర నిర్ణయం తీసు కొంది .మనసా వ,వాచా ,కర్మణా ,ఎలా గినా ఆ కుటుంబాన్ని సహాయ శక్తులా ఆదు కోవటమే తులసి ధ్యేయం .మాటలు కాదు -చేతలతో చేసి చూపిస్తోంది .బాధ్యత గల భార్యగా ,ఓడినగా ,కొడాలి గా ,ఆమె పాత్ర చిరస్మర ణీయం . కధా ప్రపంచం లో వెలిగి పోయే పాత్ర ”తులసి ”.
శతావ దాని వేలూరి శివ రామ శాస్త్రి గారి శిల్ప కళా నైపుణ్యం అడుగడుక్కీ కన్పిస్తుంది .డిప్రెషన్ వికృత రూపాన్ని ,అన్ని కొనాల్లోనుంచి ,అత్యంత సహజం గా ,చమత్కారం గా ,దయ నీయం గా చూపించి ,కధా చక్ర వర్తి అని పించుకొన్నారు శాస్త్రి గారు .ఆయన కధల్లో ని ”పంచామృతం ”మీకు అందించాను .అవి మనసుకు ఉత్తేజం కల్పించి ,కర్తవ్యాన్ని బోధించి ,ఆనందం కల్గించేవే .ఆ మహా కధక సమ్రాట్టు కు శిరసు వంచి పాదా భి వందనం చేస్తున్నాను . ఆ intellectual giant కు జోహార్లు అర్పిస్తున్నాను .

శ్రీ శివ రాం అశాస్త్రీ గారు జన్మించిన గ్రామం కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గరున్న ”చిరి వాడ అగ్రహారం ”.అక్కడ వారిని చాలా సార్లు దర్శించాను .మాట్లాడిన అనుభవం ఉంది .అప్పటికి సాహిత్యం లో తప్ప తడుగులు వేసే వయస్సు నాది .మా రెండ వ బావ గారు వేలూరి వివేకానంద గారు, శాస్త్రి గారి
తమ్ముడు గారు వేలూరి కృష్ణ మూర్తి (మిల్లు కృష్ణ మూర్తి )గారి కుమారులే .అందుకే చిరి వాడ తో మా బాంధవ్యం వుంది .అలాంటి మహా శతావ దానిని ,సకల శాస్త్ర పారంగతుని ,వేద ,వేదాంత భావ జలధిని ,పద్యం తో పాటు వచనాన్ని పండించి ,గాంధి జీవితాన్ని ,శరత్ సాహిత్యాన్ని అనువ దించి,గురువులైన తిరు పతి కవుల నిజ వారసు లని పించు కొన్న వారు అయిన వేలూరి శివ రామ శాస్త్రి గారిని తెలుగు దేశానికి అందించిన చిరివాడ గ్రామం ధన్య అయింది .అందుకే ”వేలూరి వారి కధా పంచామ్రుతాన్ని ”,మిగిలిన కధా స్రవంతి తో పాటు” చిరివాడ గ్రామానికి ”అంకితమిస్తున్నాను .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -03 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
