నా దారి తీరు –27
పామర్రు సంఘటనలు
పామర్రు లో ఉండగానే అడ్డాడలో ఆ నాటి మేటి ఏం.ఎల్.సి.శ్రీ పి.శ్రీ రామ మూర్తి గారు ఉపన్యాసం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను.చాలా గొప్ప వక్త ఆయన .మేము టీచర్స్ గిల్డ్ వాళ్ళం మా నాయకుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు .అయినా శ్రీ రామ మూర్తి గారంటే నాకు అభిమానం .ఆయన వ్యక్తిత్వం బహు దొడ్డది .విషయాలన్నీ క్షున్నం గా తెలిసిన వారు .విషయాన్ని టీచర్ల హృదయాలకు హత్తుకోనేట్లు చెప్పగల నేర్పున్న వారు అని పించింది మొదటి సారి చూసి నప్పుడే .అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయనకు మేము వ్యతి రేకం గా పని చేసినా ,అదేమీ మనసులో పెట్టుకోకుండా చాలా పెద్ద మనసుతో వ్యవహరించేవారు దాదాపు పదేళ్ళ నుండి కృష్ణా జిల్లా రచయితల సంఘం లో వారు కూడా సభ్యులు అవటం వల్ల ఆ సమావేశాల్లో తరచూ కలుస్తూనే ఉన్నాం .ఉయ్యూరు లో సరసభారతి తరఫున ఉయ్యూరు కాలేజి లో మేము నిర్వహించిన సభలకు హాజరై ఎంతో సంతృప్తిని ప్రకటించారు .మనస్పూర్తిగా అభి నందించారు .అంతకు ముందు నేను అసిస్టంట్ గా పని చేసిన కాలం లో ను ,హెడ్ మాస్టారు గా పనిచేసినప్పుడు వారు మా స్కూళ్ళకు వచ్చినప్పుడు నేను సాదరం గా ఆహ్వానించి వారి సభను హుందాగా నిర్వహింప జేసే వాడిని .ఆయన ఎంతో మెచ్చుకొనే వారు .పెద్ద మనసున్న వారు అంత పెద్దరికం తో వ్యవహరిస్తారని శ్రీ రామ మూర్తి గారిని చూస్తె మనకు తెలుస్తుంది. ఆయన్ను చూడగానే చెయ్యి ఆటోమాటిక్ గ పైకి లేచి నమస్కరిస్తుంది .ఆయన సంస్కారం అంత గొప్పది .
తాతమ్మ కలలు సినిమా షూటింగ్
మేము పామర్రు లో పని చేస్తుండగానే నిమ్మకూరు లో అంటే నందమూరి తారక రామారావు గారింట్లో, చేలలో ‘’తాతమ్మ కల ‘’సినిమా షూటింగ్ జరిగింది .దాదాపు రెండు నెలలు జరిగిన జ్ఞాపకం .ఒక సారి గుమాస్తా అంజిరెడ్డి మమ్మల్ని పది మందిని కుదరేసి సైకిలల్ల మీద నిమ్మకూరు తీసుకొని వెళ్ళాడు ముందుగా రామా రావు ఇంటికి వెళ్లాం .అప్పుడు ఆయన షూటింగ్ లో లేడు.అంటే ముఖానికి రంగు వేసుకోలేదు .మమ్మల్ని చాలా ఆప్యాయం గా అలకరించారు అందర్నీ కూర్చో బెట్టారు కాఫీ టిఫిన్లు తెప్పించి తినిపించారు .అంతా అయిన తర్వాతా ‘’బ్రదర్స్ ! షూటింగ్ చూడ టానికి వచ్చినందుకు చాలా సంతోషం .మా వాళ్ళు దారి చూపిస్తారు .పొలం లో షూటింగ్ జరుగుతోంది భానుమతి గారు అక్కడ నటిస్తున్నారు వెళ్లి చూసి రండి నమస్తే ‘’అని చెప్పి తనపని లో తాను వెళ్లి పోయారు అక్కడి నుండి పొలాల గట్లంబడి నడిచి షూటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకొన్నాం .ధాన్యం నూర్పిడులు .షూట్ చేస్తున్నారు భానుమతి పెద్ద ముత్తయిదువు లా పెద్ద బొట్టుతో చేతిలో లావుపాటి కర్రతో అక్కడ కనీ పించింది బాలకృష్ణ ఆ షాట్ లో ఉన్న జ్ఞాపకం .కాసేపు చూశాం .మనవడితో పరాచికాలు ఆడుతున్న భానుమతి షాట్లు తీశారు .ఇది నా జీవితం లో రెండో సినిమా షూటింగ్ .మొదటిది మానికొండలో‘’ఉండమ్మా బొట్టు పెడతా ‘’అయితే ఇక్కడ నిమ్మకూరు లో ‘’తాతమ్మ కల ‘’రెండవది .
పబ్లిక్ పరీక్షలకు ఇంవిజిలేషన్
పామర్రు లో పని చేస్తుండగా పబ్లిక్ పరీక్షలకు వాచర్ గా వెళ్ళిన అనుభవాలు వింతగాను నవ్వు పుట్టిన్చేవిగాను ఉన్నాయి .ఒక సారి పెడసన గల్లుహైస్కూల్ కు వాచర్ గా వేశారు .రోజూ ఉయ్యూరు నుండే వెళ్ళేవాడిని .ఉయ్యూరులో మధ్యాహ్నం పదకొండు గంటలకువిజయవాడ అయ్యంకి బస్ ఎక్కి అక్కడ దిగే వాళ్ళం అది దోరక్క పోతే పామర్రు చేరి, కోడూరు బస్ లో అయ్యంకి దిగి, రిక్షా లేక నడిచి అయ్యంకి నుండి పెడసన గల్లు వెళ్ళే వాళ్ళం .అక్కడి హెడ్ మాస్టారు ఉమా మహేశ్వర రావు గారు .స్తిక్ట్ గా నే ఉన్నట్లు కనీ పించేవారు పిల్లలలకు చదువు ఏమీ లేదని తెలిసింది కనుక కాపీలు కొట్టటం బాగా అలవాటు .దాన్ని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేసే వాడిని .. చినముత్తేవి విద్యార్ధులకు ఇక్కడే సెంటర్ .వాళ్ళ వెంబడి ఆ ఊరి చిన్న కర్ణం ఒకాయన వచ్చేవాడు రోజూ మమ్మల్ని దారిలో కలవటం ‘’మా పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూడండి ‘’ అంటూ ఉండటం మామూలు .సరే అనే వాళ్ళం. మా పని మేము చేసే వాళ్ళం .కాపీలు తెచ్చి లోపలి పంపే ప్రయత్నాలు చేసే వాడు .సాగనిచ్చే వాడిని కాదు నా మీద గుర్రు గా ఉండేది ఆయనా బ్రాహ్మిన్ అవటం కక్కా లేక మింగా లేక అన్నట్లుండే వాడు .అక్కడ పరీక్షలను అంతటిని హెడ్ గారికి సహాయ కారిగా సేకందరిగ్గ్రేడ్ మాస్టారు లీలా కృష్ణయ్య బాగా నిర్వహించేవాడు నల్లగా పొడుగ్గా తెల్లని పంచ లాల్చీ తో చాలా ఆకర్షణీయం గా ఉండేవారు . ఆయన అంటే టీచర్ కమ్యూనిటి లో గొప్ప గౌరవం ఉండేది మంచి టీచర్ గా కూడా పెరున్న్నది .
రెండో అనుభవం గూడూరు .గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్ కు వాచర్ గా వేశారు .అక్కడి హెడ్ గారు క్రిష్నయ్య గారు .గూడూరు సెంటర్ లో దిగి అరమైలు నడిచి వెళ్ళాలి స్కూల్ చేరాలంటే ..అక్కడ కాపీలు బాగా జరుగుతాయని అందరూ ఘోషించే వారు .ఉత్తీర్ణతా శాతం అందువల్లే బాగా వచ్చేది .మేమందరం ఒకే మాట మీద ఉన్నాం .ఎట్టి పరిస్తితి లోను కాపీలను అనుమతించరాదని చాలా కఠినం గా ఉండాలని నిర్నయిన్చుకోన్నాం .అంతే ఎవరమూ బెసగలేదు కాపీ అనేది లేకుండా చేశాం .ముందే జేబులు గదులు చెక్ చేస్తేనే ఇంవిజిలేషన్ కు వెళ్తాం అని హెడ్ గారికి చెప్పాం .పాపం ఆయన ఏమీ చేయలేక వాళ్ళ వాళ్ళతో చెక్ చేయించే వాడు .పైన మేమూ చేసే వాళ్ళం .రోజూ పిల్లలు బిక్క మొహాలేసుకొని పరీక్షలు రాసే వారు. కాగితం మీద కలం కదిలేది కాదు .తీరా పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాతా చూస్తె ఆ స్కూల్ లో 8 శాతం మాత్రమె పాస్ అయ్యారు ఘోర పరాభవం .’’బాబోయ్ !పామర్రు స్కూలు వాళ్ళు వస్తే మన పని ఖతం ‘’అని అనుకొనే వారట .
మూడో స్కూల్ అనుభవం చాలా బాగుంది . అడ్డాడ హైస్కూల్ కు ఒక సారి వేశారు మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు హెడ్ మాస్టర్ .చాలా హుందా గా నిర్వహించారు పిల్లలు కూడా చాలా దిసిప్లినేడ్ గా రాశారు ఎక్కడా కాపీలు ,చూచి రాయటాలు లేవు .మా పని నంతా హెడ్ మాస్టారు చేయటం వల్ల మాకు శ్రమ తప్పింది ఆదర్శ వంతం గా పరీక్షలు నిర్వహించి నందుకు ఆయన్ను చివరి రోజున అభి నందిన్చాము .ఆ రోజుల్లో పరీక్షల చివరి రోజున ఆ స్కూలు వాళ్ళు టీ పార్టీ ఇవ్వటం ఆచారం గా ఉండేది .కొందరు హెడ్ మాస్టర్లు ఘనం గా నిర్వహిస్తే ,కొందరు సాధారణ పార్తీలిచ్చేవారు కొందరుభోజనాలు కూడా పెట్టటం ఉండేది .ఇలా భలే అనుభవాలు కలిగాయి ..
మా అన్నయ్య గారి అమ్మాయి చి .సౌ వేదవల్లి వివాహం
నేను పామర్రు లో ఉండగానే మా అన్నయ్య గారి అమ్మాయి చి సౌ .వేదవల్లి వివాహం లో ఉయ్యూరు లో చేశాం .మా అన్నయ్య 1957 లో నే హాస్పేట్ లో రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి అక్కడే చని పోయాడు .అప్పటి నుంచి మా ఓదిన ,మా అన్నయ్య పిల్లలు వేదవల్లి ,రాం బాబు సంరక్షణ బాధ్యత మా నాన్న గారు తీసుకొన్నారు .మా నాన్న గారు 1961 లో చని పోవటం తో ఇంటికి పెద్ద కొడుకు గా బాధ్యత నేను తీసుకొన్నాను మా అమ్మ మాకు అండగా నిల బడింది ఆ పిల్లలకు ఏ లోపం జరగనివ్వలేదు అందరం మా ఇంట్లోనే ఉండే వాళ్ళం .ఉమ్మడిగా .అమ్మే వంటా వార్పూ .వేదవల్లి హైస్కూల్ చదువు పూర్తిచేసి బెజవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో పి.యు.సి.లో చేరింది హాస్టల్ లో ఉంచాము .వారానికోసారి నేను కాని అమ్మను తీసుకొని వెళ్లి కాని చూసి వచ్చేవాడిని .దానికి ఆ కూడు,వాతావరణం సరిపడలేదు ఆరోగ్యం బాగుండేది కాదు .పి.యు.సి తప్పింది .ఇంటి దగ్గరే ఉండి పరీక్షలకు తయారయ్యేది .మా అమ్మ దాని వివాహ విషయం లో బెంగ పెట్టుకొనేది మా తమ్ముడు కూడా ఇక్కడే ఉండేవాడో లేక పూనా లో డిఫెన్సు లో పని చేసే వాడో గుర్తులేదు .సంబంధాలు చూడమని అమ్మ పోరేది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం
ఒక సారి చిరివాడ వెళ్లాం ఏదో పని మీద .అక్కడ మా రెండో బావ గారు వేలూరి వివేకానంద్ గారి తలి దండ్రులు.వేలూరి కృష్ణ మూర్తిగారు ,అత్తమ్మ గారు ఉన్నారు .వాళ్ళ ఇంటికే వెళ్లాం కృష్ణ మూర్తి గారు శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారికి స్వయాన తమ్ముడే .దగ్గర దగ్గర ఇళ్ళు .శివరామ శాస్త్రి గారి ఇంటి మీద నుంచే మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి .శాస్త్రి గారు వాకిట్లో కూర్చుని రాసుకొంటూ ఉండటం చాలా సార్లు చూశాను .అప్పటికి ఆయన బార్య గారు గతించారు .విభూతి రేఖలతో పంచె కట్టుకొని బ్రాహ్మీ మూర్తి గా ఉండే వారు .ఒకటి రెండు సార్లు వారి దగ్గర కూర్చుని మాట్లాడిన అనుభవం ఉంది .చాలా ఆప్యాయం గా పలకరించేవారు .మా వాళ్లకు మంచి నీటి చెరువు ఇంటి ఆవరణ లోనే ఉంది బియ్యపు మిల్లు ఉంది .అందుకనే ఆయన్ను ‘’మిల్లు కృష్ణ మూర్తి ‘’గారు అనే వారు వ్యవస్స్యం బందీ ఎద్దులు పాలేరు ఉండేవి గడ్డెన్న అనే పాలెఉ బొద్ద పాతిలా పెద్ద ఈసాలతో ఉండేవాడు మా అక్కయ్య పెళ్ళికి అతనే పాలేరు చిరివాడ అడ్డ రోడ్డు నుండి మమ్మల్ని ఒంటెద్దు బండీలో తీసుకొని వెళ్ళే వాడు ఒక సారి మమ్మల్ని పంటకాలువలో బండిని పడేశాడుకూడా
సరే మా అక్కయ్య అత్తారింటికి వెల్లాము .మా వేద వల్లికి ఏదైనా మంచి సంబంధం ఉంటె చెప్పమని మా అక్కయ్య మామ గారు కృష్ణ మూర్తి గారిని అడిగాను .ఆయన ఆలోచించి’’ మా చిరివడలోనే మా ఇంటి పేరు వాడే వేలూరివెంకటేశ్వర్లు గారి అబ్బాయి రామ కృష్ణ ఉన్నాడు పిల్లాడు బుద్ధి మంతుడు గుడివాడ దగ్గర బేతా వోలు లో కుటుంబాన్ని పెట్టి తండ్రి పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు ఆ కుర్రాడు బికాం .పాస్ అయాడు ..సాంప్రదాయం మంచిది .తల్లీ తండ్రీ మంచి వాళ్ళు .తాత మామ్మ కూడా చిరివడలోనే ఉంటారు .స్తితి పరులు ఒక డాబా ఉంది ఇరవై ఎకరాల పొలం ఉంది బాగా పండుతుంది ఈ సంబంధం బాగుంటుందేమో ఆలోచించండి ‘’అన్నారు .సరే నని ఉయ్యూరు వచ్చి మా అమ్మా, మేనమామ లతో సంప్రదించి మేమిద్దరం మా మామయ్యా కలిసి బేతవోలు వెళ్లాం అది ఉదయం పదిగంటల సమయం .రామకృష్ణ తల్లి గారు ఎంతో ఆదరించి ఆహ్వానించారు .టిఫిను కాఫీ ఇచ్చారు భోజనం చేయకుండా వెళ్ళద్దు అన్నారు ‘’కతికితే అతకదు కదా’’ అని మేము అంటే ‘’మనం బంధువులం కతికినా అతకక పోయినా బంధుత్వం ముఖ్యం ‘’అనిచెప్పారామే వెంకటేశ్వర్లు గారు కాసేపటికే వచ్చారు అందరం కలిసి భోజనం చేశాం రామ కృష్ణ ను చూశాం .నల్లగా ఉన్నా ఆకర్శ నీయ మైన ముఖం విజయ నగరం జిల్లా గరివిడి లో ఫెకర్ ఫాక్టరీ లో ఉద్యోగం నెలకు రెండొందల యాభై రూపాయల జీతం .ప్రస్తుతం విశాఖ పట్నం లో ఆఫీసు పని మీద ఉంటున్నాడు .అని వివరాలు తెఉసుకొన్నాము . .రసం, బంగిని పల్లి మామిడి పళ్ళతో కమ్మటి భోజనం చేశాం .అమ్మాయిని వచ్చి చూడమని చెప్పాం
నాలుగైదు రోజుల్లోనే అత్తగారు మామ గారు మరుదులు వచ్చి చూశారు అందరికి నచ్చింది తాత గారు మామ్మ గారు చూసి వెళ్ళారు వీరికి చిరివాడలో ఒక దేవాలయం ఉంది రామకృష్ణ బాబాయి ఒకాయన అక్కడ వీరింటి పక్కనే ఉంటారు .కలివిడి గల కుటుంబం తెలిసిన కుటుంబం అని రెండు వైపులా భావించాం ఇవ్వటానికి మేమూ చేసుకోవటానికి వాళ్ళూ సిద్ధం .అందరికి నచ్చిన సంబంధం కట్న కానుకలు మాట్లాడే లోపల చిరివాడ నుండి వాళ్ళ బంధువు లందరూ మా అమ్మాయిని చూసి వెళ్ళారు
కట్నకానుకల విషయం మాట్లాడుకోవాలి .చిరివాడ లోనే మాట్లాడుకొందాం అన్నారు వియ్యంకులు సరే నన్నాం .నేను ,మోహను మామయ్యా ,ప్రభావతి చిరివాడ వెళ్లాం భోజనాలు అవీ మళ్ళీ మామూలే కట్నం నాలుగు వేలు లాంచనాలు ఇస్తామని చెప్పాం .ఆయన ఎనిమిది వేలు అన్నారు .అమ్మో అంతకు తూగలేము అన్నాం.అయిదు, ఆరు దాకా దేకాము .కానణీ పట్టిన పట్టు వదలలేదు వియ్యంకుడు గారు .అప్పటికి మా బ్రాహ్మణుల కుటుంబాలలో నాలుగు లేక అయిదులో నడుస్తోంది ఆరు వేలు కూడా ఇచ్చిన వారెవరూ లేరు .ఒక్క సారి ఎనిమిది వేలంటే బుర్ర తిరిగి పోయింది .కిమ్కర్తవ్యం .సరే నేనే ధర్యం చేసి ఎనిమిది వేలకు ఖాయ పరచాను .లాంచనాల విషయం లో వాళ్ళేమీ పట్టు బట్టలేదు’’ మా ఆమ్మాయికి ఏమి పెడతారు అని మేము అడగలేదు. వాళ్ళ కోడలు వాళ్ళ ఇష్టం ఏమి పెట్టుకొంటే ఎవరికి కావాలని’’ మా భావన ..అమ్మో ఇంత కట్నమా అని మా వాళ్ళందరూ నిస్స్టూరాలాడారు .తప్పని పరిస్తితి .మళ్ళీ మళ్ళీ సంబంధాలకోసం తిరగలేము ఆన్నీ నచ్చాయి భారమైన తప్పదు అనుకొన్నాము మామామ్య సరే నన్నాడు ..సరే అని అందరం అనుకోని తాంబూలాలు పుచ్చుకోన్నాము మళ్ళీ వాళ్ళూ ఉయ్యూరు వచ్చి తీసుకొన్నారు ‘’ఎన్ని పూటల పెండ్లి ?’’అని సమస్య వచ్చింది .మేము ‘’మూడు పూటలు చేస్తాం ‘’అన్నాము .’’అక్కర్లేదు రెండుపూటలు చాలు’’ అన్నారు వియ్యంకులు వెంకటేశ్వర్లు. గారు సరే నన్నాం ఇక యేర్పాట్లలోకి దిగాలి శ్రావణ మాసం లో వివాహం అని నిరణ యించు కోన్నాం
వివాహ విశేషాలు ఈ సారి
సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -11-6-13 ఉయ్యూరు


Namaste uncle nenu Gayatri ravi from Charlotte , nenu India vachanu mee
phone numbers teliyaledu. Vijaya Lakshmi Ella unnatural? Please me phone
ivandi call chestanu .
Thank you
Gayatri ravi
9885853023
8886856988
LikeLike