తుస్సు మన్న సూపర్ సింగర్స్ ఏడు
52 వారాల సుదీర్ఘ సమయం లో మా టి.వి.ప్రతి బుధ వారం అందించిన సూపర్ సింగర్స్ నిన్న రాత్రి రెండు గంటల’’ సుదీర్ఘ సుత్తి ‘’తో తుస్సుమని ముగి సింది .గాయకులందరూ ప్రతిభా సంపన్నులే వారిని నడిపించే మెంటార్స్ సుప్రసిద్ధ గాయనీ మణులే .నిన్న ప్రోగ్రాం చూసిన తరువాత ఇంత కాలం దీన్ని ‘’సాగాదీయాలా ?’’అని పించక మానదు .నా ఉద్దేశ్యం లో ఎప్పుడో రెండు నెలల క్రితమే దీనికి స్వస్తి పలక వచ్చు .ఈ రెండు నెలల కాలం లో ‘’లాగుడే కాని పరుగే లేదు’’ ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అసలు పాడే వారి నెత్తిన రుద్ది వారి స్వర సమరానికి ఎంతో అంత రాయం కలిపించారని పించింది .దాదాపు స్థానాలు ఎప్పుడో నిర్ణయ మై పోయాయి ప్రేక్షకుల హృదయాలలో .మధ్య మధ్య ఎలిమినేషన్ పేర కొంత కాలం డ్రామా నడిచింది ..మళ్ళీ వారినీ ఏదో పేరు చెప్పి తీసుకొచ్చి ప్రమోషన్ నెపం తో నెత్తిన రుద్దారు. కావాలను కొంటె వారి గాన మాధుర్యాన్ని షో ముందో చివరో విని పిస్తే బాగుండేది
సస్పెన్సు పేరు తో’’ యాంకరుడు ‘’సృష్టించిన హంగామా అంత అవసరమా /?అయిదు నిమిషాలకో సారి భయానక థ్రిల్లర్ సిని మా లో పోజులు అందరితో ను పెట్టించి కంగారు పెట్టాలా ?అందరు సుప్రసిద్దులే వీరందర్నీ అంత ఉత్కంత తో ఉక్కిరి బిక్కిరిచేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నట్లు నటిమ్పజేయడం అనవసరం . చిన్న పిల్లలయితే అది కలిసి వచ్చేది ఇప్పుడు ఎబ్బెట్టు గా వెగటు గా అని పించింది .ఒక రకం గా చెప్పా లంటే ముప్పై ఎపిసోడుల తర్వాతా ఏమీ బాగా లేదు ఎవరూ అంతకు ముందు కంటే బాగా పాడనూలేదు స్థాయి బాగా తగ్గిపోయింది .
అయితే గుడ్డి లో మెల్ల –నిన్న రాత్రి సహకారం అందించిన వాయిద్య కారులను గుర్తించి గౌరవించటం చెప్పుకోదగిన విషయం .జడ్జేస్ లో చంద్ర బోస్ ఒక్కడే ఉన్నది ఉన్నట్లు చెప్పి నట్లు అని పించింది .ఈ మధ్య వచ్చిన శైలజా, అనంత శ్రీరాం లు చిలక పలుకులే పలికారు .వారి మాటలు వింటుంటే ఒక ప్రేరణ కలగాలి అలా కల్గించలేక పోయింది .అసలు నాటకం నిన్న రాత్రి .తెర ఎప్పుడెప్పుడు పడుతుందా హాయిగా పడుకొందాం అను కొంటె క్షణక్షణం సినిమా లా ఏదో లేని పోనీ థ్రిల్లింగ్ సృస్టించ బోయి సహనాన్ని పరీక్షించాడు యాన్కరుడు యమకరుడైనాడు . ఆయన పాడిన పట హావభావాలతో ఉన్నా సందర్భానికి తగి నట్లు లేదని పించటం సహజం ..
యాభై రెండు వారాలు తిరిగి తిరిగి ,ప్రాక్టీసు చేసి చేసి .,ఆడి పాడిన మగ గాయకులకు దక్కింది ఇద్దరికీ కలిపి కేవలం లక్ష మాత్రమె .అంటే ఒక్కోరికి యాభై వేలు .అంటే వారానికి వెయ్యి రూపాయలు ఇది దారుణం గా లేదా ?హేమచంద్ర ను ఎందుకో చిన్న చూపు చూసి నట్లని పించింది .కృష్ణా సమ ఉజ్జీ గా నే పాడాడు .కాని హేమచంద్ర కున్న మెళకువలు తక్కువే అని పిస్తుంది చివరి చివరిలో మంచి పోటీ నిచ్చాడు .అమ్మాయిఅలలో గెలిచినా అమ్మాయి అంజనా సౌమ్య ప్రతిభకు జోహార్లు .ప్రధమ బహుమతి పొందిన టీం నాయకురాలు సునీత సామర్ధ్యం అన్ని ఎపి సోడుల్లోను కనీ పించింది .ఆదర్శ వంత మైన పోటీ ని గాయకుల మధ్య మాత్రమె ఉంటె ఇంకా రాణించేది ఏమైనా మంచి సంగీతాన్ని వారం వరం విని పించే అదృష్టం కలిపించి నందుకు మా టి.వి.ని అభి నందిన్చాల్సిందే .నిన్న రాత్రి ప్రోగ్రాం ఒక గంటలో ముగిస్తే ఎంతో ఊరట కలిగేది అందుకే లాగుడు వల్ల తుస్సు మంది .
మీ —గబ్బిటదుర్గా ప్రసాద్ -20-6-13- ఉయ్యూరు


అనంత శ్రీరాం వ్యాఖ్యలు రొటీన్ గా అనంత స్తుతితో నోటికొచ్చిన మాటలు వదలుతూ అనుభవరాహిత్యంగా అరకొరగా చిరచిరగా అనిపించింది!సాగదీతతో కార్యక్రమం కొండవీటిచాంతాడయింది!ఏ కార్యక్రమమయినా ఇంకాస్త ఉంటే బాగుండునన్నట్లు ఉండాలి!
LikeLike