నా దారి తీరు -31
హెడ్ మాస్టారి బదిలీ
పామర్రు హైస్కూల్ లో చేరి రెండేళ్ళు అయింది .అప్పటికి హెడ్ మాస్టారు రామ క్రిష్నయ్య గారు అయిదారేళ్ళ నుండి ఉన్నట్లు గుర్తు .ఆయనే కావాలనుకోన్నారో లేక పునాది పాడు వాళ్ళు అడిగారో ఆయన్ను పునాది పాడు బదిలీ చేసి నట్లు జ్ఞాపకం .అక్కడి నుంచి ఉయ్యూరు కు ఆ తర్వాతా ఇంకెక్కడికో వేల్లినట్లుంది .రామ క్రిష్నయ్య గారికి బ్రహ్మాండమైన వీడ్కోలు ఇచ్చాం .అప్పుడు పామర్రు పెద్ద కోటి రెడ్డి గారు .తరచుగా స్కూల్ సమావేశాలకు వస్తూందే వారు వారి అబ్బాయి పెళ్లి మంత్రాలు లేకుండా చేసి మమ్మల్ని ఆహ్వానించి గొప్ప విందు చేశారు రామ క్రిష్నయ్య గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు .భార హృదయం తో ఆయన్ను సాగ నంపాము .ఆఫీసు స్టాఫ్ లో నల్లటి లావు పాటి అతను నాగ భూషణం ఉండే వాడు . అతని తో మాట్లామాట్లాడటానికిఅందరు భయ పడే వాడు.ఆఫీసురూం లోకి రానిచ్చే వాడుకాదు .నాకు ప్రవేశం ఉండేది . బల్లి పర్రు నివాసి వాళ్ళ అమ్మాయి చదివేది .తర్వాతా సమితి లో చివరికి జిల్లా పరిషత్ లో పై పదవులు చేశాడు .ఇంక్రిమెంట్ చేయమని అడగటానికి భయ పాడేవాళ్ళు మేస్టార్లు కసురుకొనే వాడు హెడ్ కి చెప్పినా పూజారి వరమివ్వందే సాగదని అందరు బిగ పట్టుకొనే వారు .వెడల్పు పళ్ళతో నల్లగా ఉన్నా తెల్లని బట్టలేసే వాడు .అంజి రెడ్డి ,రాధాకృష్ణ మూర్తి అని ఇంకో జూనియర్ గుమాస్తా ఉండేవారు ఇతను పంచె కట్టే వాడు ఖద్దరు బట్టలే కట్టే వాడు దగ్గరలోని కూచికాయల పూడి నుండి వచ్చేవాడు .నాకు మంచి స్నేహితుడయ్యాడు అతిగా మాట్లాడడు .రెడ్డి అలా కాదు .అన్నీ మీదేసుకొంటాడు బందరు వెళ్లి ఆఫీసు లో పనులు సాధించుకోస్తాడు బొమ్మా రెడ్డి సీతా రెడ్డి అనే స్తానిక నాయకుడికి బంధువు అంతే వాసి .రెడ్డి ఇల్లు స్కూలు ప్రక్కనే .తరచుగా మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్లి కాఫీ యో టీయో ఇప్పించేవాడు అతని కూతురురు కొడుకు అక్కడ నా దగ్గరే చదువు కొన్నారు ..రామ క్రిష్నయ్య గారి ట్రాన్స్ఫర్ బహుశా 1974ఆగస్ట్ లో జరిగి ఉంటుంది .
కొత్త హెడ్ మాస్టారు మోచర్ల పూర్ణ చంద్ర రావు గారు
రామ క్రిష్నయ్య గారి స్తానం లో మోచర్ల పూర్ణ చంద్ర రావు గారు వచ్చి వెంటనే చేరారు ..ఈయన భారీ మనిషి .మంచి పర్సనాలిటీ..పంచ తమాషా గా కట్టే వారు లాల్చీ వేసే వారు పైన ఖండువా ఉండేది కొంచెం స్పోటకం మచ్చలతో చిన్న మొహం తో ఉండేవారు అయన జుట్టు లొంగేది గా ఉండేది కాదు తెల్ల బడిపోయింది వెనక్కి దువ్వె వారు నేను సర్వీసులో మొదటి సారి మోపి దేవి లో పని చేసి నప్పుడు ఆయన నాగాయ లంక స్కూల్ హెడ్ మాస్టారు గా ఉండే వారు .వారి స్కూల్ లో గ్రిగ్ స్పోర్ట్స్ జరిగితే మేము వెళ్లి ఆడం అప్పటి నుంచి ఆయన తో పరిచయం .బ్రాహ్మణ మేస్తార్లందరికి ఒక బ్రాహ్మల ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు ఆయనా మేము కలిసి భోజనం చేశాం .అదీ మా పరిచయం
పూర్ణ చంద్ర రావు గారు రోజూ బందరు నుండే వచ్చే వారు ఖచ్చితం గా ఉదయం తొమ్మిదిన్నర కు స్కూల్ లో ఉండేవారు ఏనాడూ దీన్ని ఉల్లంఘించలేదు మంచి అడ్మినిస్త్రేటార్ గా పేరుంది చలాకీ గా మాట్లాడే వారు అతి లేదు అన్నీ టమ్చన్ గా జరిపే వారు .ఇంగ్లీష్ బోధించేవారు .ఆఫీసు వర్కు బాగా తెలిసినవారు స్కూలు బిల్లులు ఏవైనా పెండింగ్ లో ఉంటె ఆఫీసుకు కు వెళ్లి సాంక్షన్ చేయించేవారు .మంచి వాలీ బాల్ ప్లేయర్ కూడా పంచె పైకి ఎగ కట్టి అదే వారు .ఈ సమయం లోనే ఉయ్యూరు నుండి క్రాఫ్ట్ మేష్టారు కోడె రామ మహన రావు కూడా ఇక్కడికి బదిలీ అయ్యాడు .మేమిద్దరం కలిసే వచ్చే వాళ్ళం . హెడ్ గారు మాంచి చతురులు .ఒక సారి నేను ఒక పది నిమిషాలు ఆలస్యం గా స్కూల్ కు వచ్చాను బస్ దొరక్క పోవటం వల్ల .ఆయన ఏమీ మాట్లాడలేదు .సాయంత్రం నేను ఇంటికి వెళ్ళ బోతుంటే పిలిచి ‘’ప్రసాద్ గారూ !ఇంటి దగ్గర భోజనానికి ఇబ్బంది అయితే కారియర్ తెచ్చుకోండి ‘’అన్నారు అంతే .’’ఇక నుంచి లేట్ గా రావద్దు అన్నీ చూసుకొని సమయానికి రావాలి సుమా ‘’అనే హెచ్చరిక ఉంది ఆ మాటలో వెంటనే గ్రహించి సారీ చెప్పా.మర్నాడు నుండి మళ్ళీ ఎప్పుడూ ఆలస్యం గా స్కూల్ కు వెళ్ళలేదు .పంక్చువాలిటి ని అంత సుతి మెత్తగా చెప్పారాయన .నాకు మార్గ దర్శి అయ్యారు ..
కొత్త పే స్కేల్స్
ఆ కాలం లోనే పే రివిజన జరిగి జీతాలు బాగా పెరిగాయి ఇది వరకు నా జీతం రెండొందల యాభై అయితే జలగం వెంగల రావు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు అమలైన రివిజన్ వల్ల ఒక్క సారి గా 418 బేసిక్ అయింది ఇది వరకు స్కేలు 15-10-300ఉంటె ఇప్పుడు 320-14-460-15-580అయింది .అప్పటి దాకా బ్రహ్మా నంద రెడ్డి యాభై ఆరు రోజులు స్ట్రైక్ చేస్తేముష్టి ఆరు రూపాయలుడి.ఏ.ఇచ్చాడు వెంగల రావు పుణ్యమా అని డి.ఏ.కేంద్రం ఇచ్చే దానీతో లింక్ చేశాడు ఇది ఊహించని జీతం దీనితో పాటు ఆటో మేటిక్ ప్రొమోషన్ స్కేల్లు ఎనిమిదేళ్ళకు పదిహేనేల్లకూ కూడా ఇచ్చాడు .ఇఇది వరకు దాకా మేస్టార్ల జీతం అందరి కంటే తక్కువ గా ఉండేది ఇప్పుడు అందరి కంటే ఎక్కువ జీతం తీసుకొంటున్నాం ‘’.బతక లేక బడి పంతులు పోయి బతకటానికి బడి పంతులు’’అయింది.సాంఘిక స్తాయి పెంచిన ఘనత వెంగళ రావు దే దానికి ఉద్యోగస్తులందరూ రుణ పడి ఉంటారు .అయినా ఇందిరా ప్రభావం లో ఓడిపోవటం దురదృష్టం .
బదిలీ ప్రయత్నాలు
మెల్లిగా గాలి ఉయ్యూరు మీదకు మళ్ళింది వీలైన ప్పుడల్లా ఏం.ఎల్.సి.కోటేశ్వర రావు ను కలవటం ఉయ్యూరు కు ట్రాన్స్ఫర్ చేయమనటం జరుగుతూనే ఉంది నాకంటే ముందే క్రాఫ్ట్ మేష్టారు వెళ్లి పోయాడు ఉయ్యూరు .ఆ రోజుల్లో ఉయ్యూరు ,పామర్రు సెంటర్ల లో ఉద్యోగం చేసే మేస్టార్లు ఏ రోజు ఉంటారో ఏ రోజు బదిలీ అవుతారో తెలీని పరిస్తితి రాజకీయ అండ ఉంటేనే అక్కడ ఉండగలగటం లేకుంటే జెండా బుజాన వేసుకొని సిద్ధం గా ఉండటం నా విషయం లో ఎప్పుడూ బదిలీ చేస్తూనే ఉన్నారు ఏడాదికో రెండేళ్ళకో మళ్ళీ దగ్గరికి చేరుతున్నాను దీనికి కారణం మా కొల్లూరి. ఆయనే నాకు ‘’గాడ్ ఫాదర్ ‘’నేనన్నా ,నా మాట అన్నా అయన కు అభిమానం .దీనికి తోడూ కాంతా రావు కు ఆయన బి.యి.డి క్లాస్ మేట్ .మేమంతా ఒకటిగా ఉండటం ఏదైనా పని కావలసి వస్తే అందరం కట్ట కట్టుకొని బందరు వెళ్లి తెలుగు విద్యార్ధి ఆఫీసు లో ఆయన్ని కలవటం ఒత్తిడి చేయటం మాకు మామూలే .దానికి ఆయన పాజిటివ్ గానే స్పందించే వాడు .
ఉయ్యూరు కు బదిలీ
ఒక ఆది వారం రోజు నేను మధ్యాహ్నం బందరు వెళ్లాను కొల్లూరి ఇంటికి. అప్పుడు అయన చైర్మన్ పిన్నమ నేని తో ఫోన్ లో మాట్లాడుతున్నారు ‘’కోటేశ్వర రావు గారూ !ఉయ్యూరు హైస్కూల్ లో మనం కాలు పెట్టాలంటే దుర్గా ప్రసాద్ గారిని ఉయ్యూరు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే గత్యంతరం లేదు ఆయన అక్కడ లేక పోతే మీకూ, నాకూ కాఫీ ఇచ్చేవాడుండడు నేను ఇదే చివరి సారి చెబుతున్నా మీ రాజకీయాలు తో నాకు పని లేదు మా దుర్గా ప్రసాద్ కు ఉయ్యూరు ఇవ్వాల్సిందే ‘’అని చెబుతూ ఉండగా నేను విన్నాను నాకేమీ తెలీనట్లు లోపలి వెళ్లాను ‘’రండి ప్రసాద్ గారు !ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడాను చాలా గట్టిగా చెప్పాను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయక పోతే కుదరదని చెప్పాను’’అన్నారు . థాంక్స్ చెప్పి ఉయ్యూరు వచ్చాను .ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. మా ఇంట్లో కూడా. ఇలాంటివి బయటికి పొక్కితే పని జరగదని నా అనుభవం .
ఉయ్యూరు లో గండ్రం వెంకటేశ్వర రావు గారి తమ్ముడు, మా వూరి అల్లుడు ఉమా మహేశ్వర రావు బి.కాం.గారు ఫిజికల్ సైన్సు టీచర్ గా ఉన్నాడు .ఆయన ఈ కొత్త టాపిక్స్ ఎలా చెబుతాడో అందరికి ఆశ్చర్యం .ఆయనే కాదు అప్పుడు పామర్రు లో నరసయ్య గారు అనే ఫిజికల్ సైన్సు టీచర్ ఉండేవాడు .పుస్తకం చేతిలో తీసుకొని విద్యార్ధుల ముఖం కూడా చూడకుండా బోర్డు మీద రాయకుండా చదివేశావాడు పావు గంటలో పాఠం అయి పోయేది .మిగతా సమయం అంతా ఖాళీ గా కూర్చునే వాడు లేక పోతే స్వంత పనులు చూసుకొనే వాడు .ఈయన చైర్మన్ గారి పి.ఏ.కు బంధువు .అందుకని సెంటర్ స్కూల్ లో చలా ఇస్తున్నాడు .ఇలానే ఉయ్యూరు లో’’ అయినాల’’ అని ఒకాయన ఉండేవాడు పిల్లల ముఖం చూడకుండా కుర్చీ వెనక్కి తిప్పి కూర్చుని నాలుగు మాటలు గోణుక్కొనే వాడు అంతే ఏమీ చెప్పే వాడు కాదు ఆయన కాకాని గారి నమ్మిన బంటు కనుక ఉయ్యూరు లాంటి సెంటర్ లలో దర్జా గా ఉద్యోగించాడు .కస్టపడి విద్యార్ధులకు అర్ధమయ్యేట్లు చెప్పి ‘’టంగులు తెగే దాకా చెప్పే వాడికి చీటికీ మాటికీ బదిలీలు .అదే రాజ కీయ ప్రాభవం ఉంటె ఎదురు లేదు ఈరకమైన రాకకీయ ప్రాభవం నుండి మేస్తార్లను కాపాడి, కౌన్సెలింగ్ నిర్వహించి గొప్ప ఉప కారం చేశాడు ఆ తర్వాతా ముఖ్య మంత్రి చంద్ర బాబు .ఇది ఒక గొప్ప వరమే మే అయింది ఖాళీ ఉన్న చోటికి వెళ్ళే అవకాశం కాండిడేట్లకు దక్కింది ఏ ప్రయత్నమూ అవసరం లేకుండా .
ఫిబ్రవరి నెలలో నాకు ట్రాన్సఫర్ జరిగింది. ఇది అరుదైన విషయం .ఉయ్యూరు లోని ఉమా మహేశ్వర రావు ను పామర్రు మార్చి నన్ను ఆస్థానానికి బదిలీ చేశారు ఇదంతా కొల్లూరి ఘనతే .ఆయనకు నా మీద ఉన్న గౌరవమే ,అభిమానమే . 10-2-1976 సాయంత్రం పామర్రు హైస్కూల్ నుంచి రిలీవ్ అయి అదే రోజు సాయంత్రం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను అప్పుడు హెడ్ మాస్టారు నాకు మాని కొండలో హెడ్ మాస్టారు గా చేసిన మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు .ను వచ్చి నందుకు ఎంతో సంతోషించారు .స్కూల్ లో చేరి ఇంటికి వచ్చి మా శ్రీ మతికి చెప్పాను అంత రహస్యం గా ఉంచాను ట్రాన్స్ఫర్ విషయాన్ని .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-13- ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

