నా దారి తీరు -32
ఉయ్యూరు స్కూల్ సమస్యలు –పరిష్కారం
హెడ్ మాస్టార్ని పునాదిపాడు నుంచి ఉయ్యూరు కావాలని తీసుకొచ్చ్చిన ఇద్దరు మేస్టార్లు వెంకటరత్నం ,కోటేశ్వర రావు లు ఆయన చేరిన తర్వాత తమ మాట ఆయన వినకుండా ,తన స్వంత నిర్ణయాలు తీసుకొంటున్నందుకు వీళ్ళకు మంట గా ఉంది .ఆయన పై కారాలు ,మిరియాలు నూరారట .ఆయన్ను గౌరవించటం లేదట .దీనికి తోడు ఇద్దరు యెన్.డి.ఎస్.లు కూడా వారిద్దరికీ దగ్గరయ్యారు వీరితో బాటు నరసింహా రావు అనే సెకండరి గ్రేడ్ టీచర్ కలిశాడు వీరంతా ఒక గ్రూప్ లా ప్రవర్తించే వారట .దీనితో హెడ్ గారికి వీరి మీద పీకల్లోతు కోపం .సూటి పోటీ మాటలు వరండాలో అరచుకోవటాలు జరిగే వట .ఇదంతా నేను ఉయ్యూరు స్కూల్ లో చేరక ముందు నేపధ్యం .అందరు హేమా హేమీ లే ఉన్నారు ఇక్కడ కాని రెండు గ్రూపులు గా విడిపోయారు ఎవరి పార్టీ వారు ఇచ్చుకొనే వారట .ఇదంతా నాకు బాధాకరం గా ఉండేది .ఒక సారి నేను చూస్తుండగానే న్వీరిద్దరూ వరండాలో గట్టిగా అరచు కోవటం చూసి ఇద్దర్ని విడదీసి ఎవరి స్తానాలకు వారిని పంపాను .
ఆ సమయం లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఒక సారి జ్ఞాపకం చేసుకొంటాను .కొత్తపల్లి కృష్ణా రావు పి.ఎఫ్ ప్రభకరరావు డేవిడ్ రాజు సోషల్ మేష్టార్లు . యీసిఎల్ ప్రసాదరావు దేవేంద్ర రావు అనే లెక్కల మేస్టార్లు, సైన్సు మేస్టర్లుగా నేను గిరి రెడ్డి నారాయణ రావు చంద్ర లీలమ్మ మొదలైన వారు తెలుగుకు వి,పూర్ణ చంద్ర రావు ,పిన్నమనేని రంగా రావు ,రామా రావు ,సెకండరి గ్రేడ్ లో కేఆర్ జి కృష్ణ మూర్తి ,కాంతయ్య గారు రామ శేషయ్య ,వగైరా డ్రిల్ మేస్టార్లు వై. రామా రావు ఎస్.వి.సుబ్బారావు జే సుబ్బారావు ,యార్లగడ్డ పూర్ణ చంద్ర రావు ,ఆఫీస్ స్టాఫ్ లో వీరయ్య ,గురుదాస్ సుబ్బారావు మొదలయన వారు..అందరం కలిసి ఉండేవాళ్ళం .క్రాఫ్ట్ టీచర్ రామమోహన రావు డిసిప్లిన్ విషయం బాగా చూసే వాడు .
ఐక్యతా సాధన
నేను ,దేవేంద్ర రావు కలిసి ఎలా అయినా టీచర్స్ లో ఐక్యత సాధించాలని పూనుకోన్నాం .అందరిని సంప్రదించం .అసమ్మతి వర్గం తోను మాట్లాడాం .ఇద్దరు యెన్ డి.ఎస్ లు తప్ప అందరు సరే నన్నారు నరసింహా రావు తో మాట్లాడాము ఆయనా కాదన లేక పోయాడు .అప్పుడు హెడ్ మాస్టారు మిక్కిలినేని వెంకటేశ్వర రావు గారికి విషయం తెలియ జేశాం .ఆయన ఓ.కే.అన్నారు మళ్ళీ ఎవరూ అనవసరం గా ఒకరిపై ఒకరు ద్వేషించుకోరాదని స్టాఫ్ తో చెప్పి కన్విన్స్ చేశాం హెడ్ గారిని కూడా జరిగిందేదో జరిగింది ఇక నుంచి అందరం కలిసి నడుద్దాం పాత విషయాలను మనసులో పెట్టుకొని ఆ టీచర్ల మీద అక్కసు పెంచుకోవద్దని ,వేధించ వద్దని నచ్చచేప్పాం లైన్ క్లియరయింది .అందరికి తలలో నాలుక లాగా ఉండే వాడు ,అందరితోను కలుపుగోలు గా ఉండేవాడు తెలుగు మేష్టారు పూర్ణ చంద్ర రావు ఆయన్నే స్టాఫ్ సెక్రెటరి గా చేశాం .సమస్య ఒక కొలిక్కి వచ్చింది అందరం ఐక మత్యం గా నడిచాం .హెడ్ మాస్టారికి అడ్మినిస్ట్రేటివ్ విషయం లో ఎలాంటి అడ్డంకులు కలగా కుండా దేవేంద్ర రావు నేను సహాయ పడే వాళ్ళం .ఆయన కూడా ఏదైనా సమస్య వస్తే మా ఇద్దరికీ చెప్పే వారు మేము మిగిలిన వారితో చర్చించి పరిష్కరించే వాళ్ళం .దీనితో అందరికి మా ఇద్దరి మీద మంచి గౌరవం ఏర్పడింది .మంచి పని చేయటానికి కొంత పూనిక ఉండాలి ఉంటె అదే దారి చూపిస్తుంది .మొదట్లో ఎన్డిఎస్ లు రాక పోయినాచివరికి వాళ్ళూ మాతో కలిశారు నరసింహా రావు కూడా పట్టు వదిలాడు .హమ్మయ్య అనుకొన్నాం
నేను పామర్రులో పని చేసినప్పుడు కూడా ఉయ్యూరు లో నాకు ఇంటి దగ్గర కనీసం అరడజను మంది పదో తరగతి విద్యార్ధులు ట్యూషన్ కు వచ్చే వారు ప్రైవేట్ అయిన తర్వాతా స్నానం చేసి అన్నం తిని బడికి వెళ్ళే వాడిని .టెన్త్ బి.సెక్షన్ కు నేను ఎప్పుడూ క్లాస్ మేస్టారు గా ఉండేవాడిని దానికే ఇంగ్లీష్ ,ఫిజికల్ సైన్సు చెప్పే వాడిని .మిగిలిన తరగతులకు ఫిజిక్స్ చెప్పే వాడిని .అప్పటికే మా పెద్దబ్బాయిశాస్త్రి పదవ తరగతి ఉయ్యూరు హైస్కూల్ లో పాసయ్యాడు మండలం లో ఫస్ట్ వచ్చాడు.రాత్రి క్లబ్ వారు సత్కరించి బహుమతి అందజేశారు . .ఉయ్యూరు కాలేజి లో ఇంటర్ లో చేరాడు .ఏం.పి. గ్రూప్..రెండో వాడు శర్మ తోమ్మిదిలోకి వచ్చాడు .
ఒక సారి కలపటపు నరసింహా రావు అని ఇదివరకు హెడ్ గారితో పోట్లాడాడని చెప్పిన సెకండరి మేష్టారికి అనుకోకుండా ఒక ప్రమాదం లో కాలువిరిగింది .బహుశా సెలవల్లో అనుకొంటా .ఆయన వేసవి సెలవల తర్వాతా స్కూల్ లో చేరక పోతే జీతం రాదు అసలే ఆయనకు హెడ్ మాస్టారికి ఉప్పూ నిప్పూ లా ఉండేది .నాకు నరసింహారావు గారు కబురు చేసి ఎలాగోలా సాయం చేయమని కోరారు వాళ్ళ అబ్బాయిలు మా అబ్బాయిల క్లాస్ మేట్లు కూడా .ఈయన మాటలు కటలు దాటుతాయి ఊర తాతయ్య గారింట్లో అద్దెకుండే వాడు. అంతా తనకు తెలుసు నని అరచేతి లో వైకుంఠం చూపిస్తాడు .ఎప్పుడూ డబ్బుకోసం చీటీ రాసి వాళ్ళబ్బాయిని ఇంటికి పంపేవాడు నాకు తోచింది ఇచ్చి పంపేవాడిని ఎప్పుడో వీలు పడినప్పుడు తీర్చేవాడు ఇదీ పరిస్తితి నోటి దూల ఎక్కువ . నేనూ దేవేంద్ర రావు కలిసి మాట్లాడుకోన్న్నాం .స్కూల్ తెరిచే రోజు ఆయన వచ్చి సంతకం పెట్టాలి .అయితే ఆయన కాలు నేల మీద మోప లేని పరిస్తితి ..ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు మాకు ఈ పరిస్తితిని హెడ్ మాస్టారికి చెప్పాం ఆయనేమీ ఈయన మీద జాలి చూపించలేదు బ్రతిమిలాడాం .మాన వత్వం ప్రదర్శించి ఔదార్యం చూపండి అని రిక్వెస్ట్ చేశాం .ఆయన మొత్తం మీద మెత్త బడ్డారు ఒక పరిష్కారం సూచించాం .నరసింహా రావు గారు హాస్పిటల్ నుండి సరాసరి కాలి కట్టుతో కారు లో స్కూల్ కు వచేట్లు కారు లోనే ఆయన అటేన్దేన్సు రిజిస్టర్ర్ లో సంతకం పెట్టేట్లు రాజీ కుదిర్చాం .మీరంతా ఔను అంటే నాకేమీ అభ్యంతరం లేదన్నారు హెడ్ మాస్టారు. స్టాఫ్ ను అందర్నీ సంప్రదించి ఒప్పించాం .రిఒపెనింగ్ రోజు అలానే మేము చెప్పి నట్లే కారు లో వచ్చి హెడ్ మాస్టారు దగ్గర కు చేరి సంతకం పెట్టిన్చాం ..ఇప్పుడు నరసింహా రావు గారు పరమ సంతోషించారు మాకు ఎంతో క్రుతజ్ఞాతలు లు చెప్పారు హెడ్ మాస్టారి పెద్దమనసుకు జోహార్ పలికారు .రెండు నెలల తర్వాత ఆయన మళ్ళీ స్కూల్ లో చేరారు .మెట్లు యెక్క లేదు చంకలో కర్ర తో నడక . .ఏం చేయాలి ?మళ్ళీ బుర్ర పెట్టాం నరసింహా రావు గారి క్లాసులన్ని మెట్లు యెక్క నవసరం లేని రూమ్ లో ఏర్పాటు చేయించాం ఆయన సరాసరి రిక్షా లో క్లాస్ రూమ్ లోకి వెళ్ళటం ,పాఠాలు చెప్పటం ఏ తరగతి కి ఆ తరగతి పిల్లలు ఆ రూమ్ లోకి వచ్చే వారు ఆయన ఎక్కడికి కదలక్కర్లేదు ఈ ఏర్పాటుకూ ఆయన ఏంతో సంతోషించాడు ఇది హెడ్ గారి మంచి మనసు.అంతే .నేను దేవేంద్ర రావు ఎప్పుడూ హెడ్ మాస్తారితో ఒక విషయం చెప్పే వాళ్ళం “’మేష్టారు !మీరు కావాలని ఈ స్కూలు కు వచ్చారు మేమంతా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం అందర్నీ సమానం గా చూడండి మీ రిటైర్ మెంట్ ఇక్కడే ఘనం గా జరగాలి ‘’అని చెప్పే వాళ్ళం .ఆయనా మా మాట మన్నించే వారు ఘర్షణ వదిలి సామరస్యం గ ఉండే వారు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-13- ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

