ఉత్తరా’’ శోక’’ ఖండం
అది దేవ భూమి ,దివ్య భూమి
అక్కడి గాలి, గంగమ్మ నీరు మహా పవిత్రం
వీటిని పీల్చి, తాగే బతికారు మహర్షులంతా
మానవ తప్పిదం తో, సౌకర్యాల పేరుతో
అంతా మరుభూమిని చేసి తమాషా చూస్తున్నాం
మూడు రోజుల జల ఖడ్గ ధారతో
అంతా నిజం గానే మహా శ్మశానమే అయింది
నాయకులు యువనాయక సంకీర్తన లో మునిగి పోతే
అధినాయకులు నిశ్చేష్ట తో చక్కర్లు చుట్టి వస్తే
మానవత్వం పరి మళించాల్సిన వేళ –ఆదుకోవలసిన
అధికార గణం ‘’నాదే అధికారం’’ అని చిందు లేస్తుంటే
జనం గోడు విని పించుకోన్నాదేవరు ?అక్కున చేర్చుకొన్న దేవరు ?
ఎప్పుడూ ప్రాణాలకు తెగించే సైన్యమే అమ్మ’’ వారి ‘’రూపం లో
సేద దీర్చి ,ఊరటకల్గించి, సాంత్వన చేకూర్చింది
వారిలోనే పరమాత్మ ను దర్శించారు యాత్రికులు
చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .
విద్యుత్ ప్రాజెక్టుల పేరు తో భారీ నిర్మాణాలు
సొరంగాలు నీట మళ్లింపు లు ,ప్రేలుళ్ళు జల విలయం సృష్టించాయి
యుగాంతం ఇదేనేమో నని భీతి కల్గించాయి
‘’ధారీ దేవి ‘’చార్ ధాంప్రాంత సంరక్షురాలైన అమ్మవారు
వద్దని వారించినా ఆమె విగ్రహాన్ని తీసి
మహా పాపం మూట కట్టుకొన్నారు
ఆమె ఆగ్రహానికి గురై జనాన్ని బలి చేశారు నిర్వాహకులు
ఈ మధ్యనే ‘’గాలి ఘనుడు ‘’మన రాష్ట్రం లో
అత్యాశకు పోయి’’ పోచమ్మ అమ్మ వారి గుడి ‘’కూల్చి
,తాను జైలు పాలై సర్వం కోల్పోయి
చేటు తెచ్చుకొన్న సంగతి ఇంకా మనం మరవలేదు
ఇవన్నీ హెచ్చరికలే –గుర్తించి నడవక పోతే ప్రళయమే
కేదార్ నాధుడోక్కడే దిక్కు గా మిగిలాడు –సర్వం గంగార్పణం
వేలను దాటిన మృతులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం
నవ్వు ముఖం తో పోనీల మీద ఎక్కించుకొని
కేదారనాధ దర్శనం చేయించి
ఆరు నెలల రాబడితోమాత్రమె ఏడాది అంతా జీవించే
ఆ ఘర్వాల్ వాసుల గతి ఏమయ్యిందో
ఎన్ని పోనీలు మరణించాయో
వాటి యజమానులు ఎందరు లోయల్లో నదీ గర్భం లో
కలిసి మృత్యు వాత పడ్డారో –తలచుకొంటే నే హృదయ విదారకం !
వీరందరి ఆత్మకు శాంతి కలగాలి
నాకు వీరిలోనే పరమాత్మ కన్పిస్తాడు
సహాయం చేయటానికి ఆదుకోవటానికి
‘’మోడీ ‘’చంద్ర బాబులు’’ ఆదర్శ ప్రాయం గా నిలిచారు
దేవుళ్ళు లాసమయానికి బాధితులకు దర్శనమిచ్చి
అభయమిచ్చి ఆదుకొన్నారు ,ఇళ్ళకు సురక్షితం గా చేర్చారు
వారే దేశానికి ,రాష్ట్రానికి నేత లవ్వాలని
కోరుకొన్న బాధితుల ఆకాంక్ష తీరాలని
దేశానికి రాస్ట్రానికి దిశా దశా నిర్దేశం చేసే అవకాశం
త్వరలోనే వారిద్దరికీ కలుగుతుందని ఆశిస్తున్నారందరూ .
విలయం లోంచి ,విధ్వంసం లోంచి
ఆ ప్రాంతం బయట పడి స్వాస్త్యం పొందాలి
భక్తీ యాత్ర మృత్యు యాత్ర కారాదు
ఉత్తరా ఖండ్ మళ్ళీ మానవ తప్పిదం వల్ల
‘’ ఉత్తరా ‘’శోక ‘’ఖండం కారాదు ,
దేవ భూమి గా .దివ్య ధామం గా విలసిల్లాలి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 26-6-13- ఉయ్యూరు
