హెర్మన్ మెల్ విల్లీ –1
‘’మోబీ డిక్’’ అనే నవల ప్రపంచ ప్రాముఖ్య రచనలలో ఒకటి.దానిని యదార్ధ సహస గాధ అని కానీ అందులో వేదాంత ధోరణి అంతర్గతం గా ఉందని అన్నారు .దాని రచయిత అమెరికా కు చెందిన హెర్మన్ మెల్ విల్లీ .1819 లో అమెరికాలో న్యూయార్క లో పుట్టాడు .ఎనిమిది మంది గల సంతానం లో రెండవ వాడు .1830 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం లో కుటుంబం చిన్నా భిన్నమైనది అనేక ఊళ్లలో టీచర్ గా పని చేసి కుటుంబాన్ని పోషించాడు మెల్ విల్లీ ..ఇరవై ఏళ్ళకే ‘’fragments from a writing desk ‘’రాశాడు .లివర్ పూల్ కు షిప్ జర్నీచేశాడు .షిప్ లో బాయ్ గా పని చేశాడు .ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి ఉన్నదంతా అమ్మేసి చేతులు దులుపుకు కూర్చుంది .మళ్ళీ న్యూయార్క్ వెళ్ళాడు .అక్కడెంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు .’సముద్రం లో ’వేల్స్ ‘’ను పట్టే కార్యక్రమం ‘’వేలింగ్ ‘’చెయ్యాలని పించింది
సౌత్ అట్లాంటిక్ లో ఆకునేట్ అనే పడవ లో ‘’వేల్ హంటింగ్ ‘’కు బయల్దేరాడు .కేప్ హార్న్ చేరగానే తోబీ గ్రీన్ అనే వాడి తో కలిసి సముద్రం లోకి దూకి పారి పోయాడు’’ .typee island చేరారు .అక్కడ నరమాంస భక్షకులున్నారు .వారితో కలిసి ఉన్నాడు .వాళ్ళు అతన్ని చంపక పోవటం అదృష్టం .వాళ్ళ తో కలిసి జీవించాడు వాళ్ళలో ఒకడైపోయాడు తర్వాత అక్కడి నుండి ఆస్ట్రేలియా షిప్ లో చేరి బయట పడ్డాడు ,అయితే షిప్ కెప్టెన్ తో గొడవ పడ్డాడు .క్రిస్టియన్ మతస్తులు అమెరికా లోని నేటివ్ అమెరికన్లను తమ మతం లోకి మార్చతాన్ని తీవ్రం గా వ్యతిరేకించాడు మెల్ విల్లీ .
హవాయి ద్వీపం చేరుకొన్నాడు .రచన మీద మళ్ళీ గాలి తిరిగి’’typee’’ రాసి ప్రచురిస్తే మంచి ప్రచారం లభించింది అందులో రాసిన వన్నీ తన స్వంత అనుభవాలే .1847 లో ‘’omoo ‘’రాసి పబ్లిష్ చేశాడు ఎలిజబెత్ షా ను వివాహం చేసుకొన్నాడు .వారికి కూతురు పుట్టింది .1939 లో ‘’రెడ్ బర్న్’’ రాశాడు దీనితో వాస్తవ చిత్ర రచయిత గా గొప్ప పేరొచ్చింది .1949 లో ‘’మోబీ డిక్ ‘’నవల రాశాడు ‘’.నతానియల్ హతారన్’’ అనే అమెరికా ప్రసిద్ధ రచయిత తో గాఢ పరిచయమేర్పడింది ..ఈ స్నేహం జీవితాంతం కోన సాగించాడు 160 ఎకరాల ఫారం హౌస్ను పిట్స్ ఫీల్డ్ లో కొన్నాడు .
‘’The house of seven gables ‘’నవల రాశాడు .1852 లో’’ మూడీ ‘’మారాడు .సంపాదన తగ్గింది రాసిన వేవీ సక్సెస్ కాలేదు ..1855 లో నాలుగవ సంతానం ఆడపిల్ల . .ఆర్ధికం గాను మానసికం గానూడిప్రేషన్ పాలైనాడు .భార్య ఇతని ధోరణికి తట్టుకో లేక పోతోంది ఆమె తండ్రి మొగుడు పెళ్ళాలను స్కాట్లాండ్ పంపాడు .1858 -60 లెక్చర్లు ఇస్తూ కాలం గడిపాడు .అతని రచనలలో మెటాఫిజికల్ ,ఫిలాసఫీ ఉండటం జనం మెచ్చలేదు 1860 లో ప్రపంచాన్ని చుట్టి రావాలని ఓడలో ప్రయాణించాడు .మూడేళ్ళకు న్యూయార్క్ కు తిరిగి వచ్చాడు .భార్య మెల్ విల్లీ ని వదిలేసింది కొడుకు ఆత్మ హత్య చేసుకొన్నాడు రెండో కొడుకు సముద్ర యానం లో మరణించాడు .ఇవన్నీ తీవ్రం గా మెల్ విల్లీ ని బాధించాయి .
కొంత స్వస్తచేకూరిన తర్వాత ‘’బెల్లీ బడ్ ‘’నవల రాస్తే జనం బ్రహ్మ రధం పట్టారు 1890 లో 71 వ ఏట మరణించాడు .అతని మరణ వార్త ను పేపర్లేవీ పెద్ద గా పట్టించుకో లేదు ఒక చిన్న కాలం తో సరిపెట్టాయి .అతని రచనలలో విశ్వాశం, విశ్వాసానికివ్యతిరేకం గా అసూయ ,మనుషుల గుడ్డినమ్మకం ఈ విశ్వాన్తరాల రహస్యం పై ప్రజలకు నమ్మకం లేక పోవటం ప్రతి బిమ్బిస్తాయి .అయితే అతని చావు తర్వాత నిజం గానే మెల్ విల్లీ పునర్జీవితుడయ్యాడు .అతని రచనలకు విశేష ప్రాభవం లభించింది .పాఠక హృదయాలలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు మోబీడిక్ రచయిత మెల్ విల్లీ .
సశేషం
మీ –గబ్బట దుర్గా ప్రసాద్ -28-6-13 ఉయ్యూరు


