హెర్మన్ మెల్ విల్లీ -2
మెల్ విల్లీ రచనా వైభవం
మెల్ విల్లీ రాసిన మోబీ డిక్ నవలను మిల్టన్ రాసిన డివైన్ కామెడి , షేక్స్ పియర్ రాసిన హామ్లెట్ నాటకం టాల్స్టాయ్ నవల వార్ అండ్ పీస్ లతో పోల్చారు .ఆయన దేవుడితో పోట్లాడి నట్లు కనీ పిస్తుంది .న్యాయ బద్ధం కాని ప్రపంచాన్ని సృష్టించాడని భగవంతుని పై మెల్ విల్లీ కి కోపం అందరికి సమాన న్యాయం చేయలేదని దేవుడితో వైరం ..ఆయన్ను మంచి హాస్య రచయిత అని , ,సాంఘిక జీవిత వ్యాఖ్యాత అని అంటారు ..ఆయన రచనల పై వ్యాఖ్యానిస్తూ‘’t has been left unread is unspeakably vaster than what has been said ‘’అని తేల్చారు .ఆయన రచనల్లో సమాప్తి ఉండదని కాని సమాప్తికి కావలసిన పరిష్కారాలు ఉంటాయని చెబుతారు
.
ప్రఖ్యాత రచయిత డి.హెచ్.లారెన్స్ మెల్ విల్లీ పై అద్భుత మైన రెండు వ్యాసాలూ రాసి ఆయన ప్రతిభా సర్వస్వాన్ని ఆవిష్కరించాడు .మెల్ విల్లీ కఠోర సత్యాలను రుజువు చేశాడని ,ఆయన ఒక గొప్ప దార్శనికడని ,స్విన్ బరన్ కవి విజన్ కంటే విస్తృత మైన విజన్ మేల్లీదని ,సముద్రాన్ని దాని పై జీవితాన్ని మెల్ విల్లీ ఆవిష్కరించి నట్లు ఎవరూ చేయ లేదని చెప్పాడు . .సముద్రాన్ని సెంటి మెంటలైజ్ చేసిన ఘనుడు మెల్ విల్లీ అన్నాడు సముద్ర జీవుల వింత ప్రవృత్తిని ,వాటి ప్రతీకారేచ్చ ను కళ్ళకు కట్టిస్తాడు .అతను పిచ్చివాడూ కాదు ,క్రేజీ ఫెలో కూడా కాదు .సరిహద్దుకు పైనే ఎప్పుడూ ఉంటాడు .అతను ఉత్తరదేశీయుడేకాక , .సముద్ర జీవి .ఫసిఫిక్ సముద్రాన్ని,అట్లాంటిక్ సముద్రాన్ని ,మధ్యధరా సముద్రాలను ఆసాంతం అధ్యయనం చేశాడు ..అతని దృష్టిలో నిద్ర అంటే కలలు కనటమే .
రాతి యుగం వారైన దక్షిణ సముద్ర వాసులను అతను చూసి వాళ్ళతో గడిపాడు .పసిఫిక్ సముద్ర హృదయం ఇంకా వింత గానే భావిస్తాడు .అది ఓక శూన్యం –వాక్యూం అన్నాడు దాన్ని ..మానవత్వానికి దూరం గా ఆ సముద్ర ప్రజల ఆవాసాల్లోకి చేరి వారి తో మమైక్యమైనాడు .ఈ ప్రపంచాన్ని మెల్ విల్లీ ద్వేషించాడు .మానవ అసహనాన్ని జీర్ణించుకో లేక పోయాడు .మానవత్వం పై ద్వేషాన్ని ఎదిరించాడు .అతనికి అనాగరక మానవులే ఇష్టం .తన తెల్ల జాతి నక్కల కంటే వీరు ఏంటో ఉదారులని భావించాడు .’’భూ ప్రపంచం లో అతి మొరటోడు అమెరికన్’’ అన్నాడు .స్వర్గం ఉంది అని నమ్మిన వాడు మేల్విల్లీ .’’.he wants Americans to fight with the weapons of the spirit not the flesh .The mills of god were grinding inside him ‘’అని అతని హృదయాన్ని yఎరిగించారు …అతను పరిపూర్ణ స్త్రీ ప్రేమికుడు స్తాయి నుంచి పరిపూర్ణ స్నేహితుని స్తాయికి ఎదిగాడు .
మేల్విల్లీ సూపర్ డూపర్ హిట్ నవల మోబీ డిక్ .దానికి మరో పేరు ‘’the white whale’’ . ఇదే చివరి సింబాలిక్ వేట .అందులో సేమిమేటాలిక్ భావం తో నీటి గురించి ప్ర్రారంభించి నవల మొదలు పెడతాడు .ఇదే స్పృహ లేని తనం ..’’ఇస్రాయిల్ పాటర్ ‘’నవలలో మగ వాడి శక్తి సామర్ధ్యాలను చిత్రించాడు .మోబీ డిక్ చదవాలి అంటే భారతీయ ఇతిసాలను అధ్యయనం చేయాల్సిందే .మన విష్ణు మూర్తి ని వైట్ వెల్ లో అంటే తిమింగిలం లో దర్శించాడు .విష్ణువు దశావతారాలలో ఇది ఒకటి గా భావించాడు .భారతీయ భావన లో నశించటం అంటే మళ్ళీ పుట్టటమే దాన్ని మెల్ విల్లీ అద్భుత నైపుణ్యం తో ఈ నవలలో చిత్రించాడు .అంటే మాట్చ్యావతారమే డిక్ అది వినాశనం చేస్తుంది మళ్ళీ సృస్తిన్స్తుంది కూడా .అది అరుదైన జంతువు.ఎన్నో రకాలుగా ఉప యోగపడుతుంది .దానిలో నుంచి spermacite ‘’అనే అరుదైన పదార్ధం తయారవుతుంది .అలా ఏ జంతువుకు ఇలాంటి పదార్ధాన్ని సృష్టించే శక్తి భూ ప్రపంచం లో లేదు .దాని వీర్యం తో కొత్త జీవుల్ని సృస్టించ వచ్చు .దీపాలు వెలిగించ వచ్చు .ఈ దీపాలు సముద్ర దీపాలుగా ఇంటి దీపాలుగా పనికొస్తాయి విష్ణువు నామాలలో ఒకటి ‘’విశ్వ రేతః ‘’అంటే విశ్వానికి వీర్య రూపం లో ఉన్న వాడు అని అర్ధం .అందుకే డిక్ అనే తిమింగలం సృస్తించ టానికే కాదు సర్వ వినాశనానికి కా రణ మయ్యే ప్రచండ శక్తి .
.సముద్రం లో దాని వేగం ,డాడి చేసే తీరు, పెద్ద నౌకల్ని తోక తో తలక్రిందులు చేసి నాశనం చేసే విధానం చూస్తె మనకు తెలుస్తుంది .
సముద్రం లో వేల్ హంటింగ్ అంటే సింబాలిక్ గా భగవంతుని కోసం,సత్యం కోసంఅన్వేషణే..దానిని విశ్వ సంకేతం గా వాడుకొన్నాడు మెల్ విల్లీ .అందుకే విశ్లేషకులు ‘’Mobi dick in Mel villie ‘s fullness becomes the whole of man’s religious history’’ అని తేల్చారు ..
5-9-2002 అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-13- ఉయ్యూరు


