నాటి ఏకచక్రపురమే నేటి బోధన్
తెలంగాణాలోని పుణ్య క్షేత్రాల్లో ఏకచక్రపురం ప్రముఖమైంది. ఈనాటి బోధన్ పట్టణమే అలనాటి ఏకచక్రపురం. ఈ ప్రాంతంలో వరి ధాన్యం అధికంగా పడటం వల్ల బహుధాన్యపురమనే పేరు కూడా వాడుకలో ఉంది. అదే క్రమంగా బోధన్‌గా మారింది. పాండవులు అజ్ఞాత వాసంలో బ్రాహ్మణులుగా ఈ పురంలో నివసించారన్నది పౌరాణిక కథనం.
బోధన్‌లో చక్రేశ్వరాలయం, రేణుకాదేవి ఆలయం ప్రసిద్ధమైనవి. ఇవి 12 వందల సంవత్సరాల క్రితం నాటివి. చక్రేశ్వరాలయంలో అతి పెద్ద లింగం దర్శనమిస్తుంది. దక్షిణ భారతంలోనే ఇది అతిపెద్ద శివలింగం. ఇది స్వయంభూ శివలింగం. దీని ప్రస్తావన శివలీలామృతంలో ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలో శాండిల్య మహర్షి తన శిష్యులకు వేదవిద్యను బోధించాడట. ఈ ఆలయం నెలకొనడంతో ఏకచక్రపురాన్ని దక్షిణ కాశిగా కూడా పిలుస్తారు.
రేణుకాదేవి ఆలయంతో పాటు కార్తికేశ్వర ఆలయం, నాగేశ్వరస్వామి ఆలయం, రామాలయం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బొజ్జ గణపతి ఆలయం, హనుమాన్ టేకడీ, ఆనంద హనుమాన్, దక్షిణ ముఖి హనుమాన్ వంటి పేర్లతో ఎన్నో హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఇవి కాక సాయిబాబా ఆలయాలు కూడా ఉన్నాయి.
బోధన్‌లోని చక్రేశ్వరాలయాన్ని కాకతీయులు బాగా అభివృద్ధి పర్చారు. మహ్మదీయుల దండయాత్రల కాలంలో ఈ ఆలయాన్ని కాపాడేందుకు భూస్థాపితం చేశారనీ, 1959లో త్రవ్వకాలు జరిపినప్పుడు పెద్ద శివలింగం బయటపడిందని చెబుతారు.
జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌కి 27 కిలో మీటర్ల దూరంలో ఉన్న బోధన్ బౌద్ధ. జైన ధర్మాల సంగమం. తమిళకవి పంపకవి ఇక్కడే నివసించాడని చెపుతారు. ఈ చక్రేశ్వరస్వామివారికి మొక్కుకుంటే సంతానహీనులు సంతానవంతులవుతారని నమ్మకం. స్వామివారికి క్రమం తప్పకుండా, దీక్షగా ప్రదక్షిణాలు చేస్తే, సంతానవంతులు అవుతారన్నది భక్తుల నమ్మకం. చక్రేశ్వరాలయాన్ని సందర్శించేందుకు హైదరాబాద్, నిజామాబాద్‌ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచికూడా భక్తులు వస్తుంటారు. చక్రేశ్వరాలయం, రేణుకాదేవి ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇక్కడ ప్రతిపర్వదినంలోనూ ఉత్సవాలు జరుగుతాయి. ఇరుగుపొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతం పర్యాటక పరంగా కూడా ప్రసిద్ధి చెందింది. పాండవులకాలం నాటి ఏక చక్రపురమే నేటి బోధన్. పౌరాణిక, చారిత్రక ప్రశస్తి చెందిన బోధన్‌లో బౌద్ధ, జైన మందిరాలు కూడా ఉండటం వల్ల ఆ మతాలకు చెందినవారు కూడా ఈ పట్టణానికి వస్తూంటారు. హిందువులకూ, బౌద్ధ, జైనులకు పవిత్రమైన క్షేత్రంగా బోధన్ విరాజిల్లుతోంది.
– స్వామి అనంత
శంకరుల వాణి విశ్వవాణి
ఉదయనుడు, కుమారిలభట్టుక, వీరి పిదప ఆదిశంకరులు, బౌద్ధజైనములను పండితులతో వాదించి ఎదుర్కొన్నారు. ఇందులో ఆదిశంకరులు చేసిన కార్యం అద్వితీయం. అయితే ఆదిశంకరుల అద్వైతం ఎవరో పండితులే అర్థంచేసుకోగలరు. దానిని అనుభవంలోనికి తెచ్చుకొనగలిగినవారు కోటికి ఒక్కరు. బౌద్ధజైనములను ఖండించుటతో బాటు వారొక మహోన్నతమైన కార్యం చేశారు. ఆ కాలంలో దేశంలో ప్రబలిన దుర్మతములను వారు ఖండించి వైదిక కర్మానుష్ఠానములను మరల వాడుకలోకి తెచ్చి బ్రాహ్మణ్యమును, దాని నాయత్వాన్ని పున: స్థాపనం చేశారు.
నాయత్వం అంటే ఈ కాలంలో మాదిరిగా జెండాలు పట్టుకొని ఊరేగింపులూ, సభాధిపత్యములూ పూలమాలలై. బంగారుశాలువలూ కాదు. ఆ నాయత్వం మౌనంగా జరిగింది. అహింస, భక్తీ, ప్రేమ, అపరిగ్రహం, స్వార్ధరాహిత్యం మొదలైన ఆత్మగుణములతో బ్రాహ్మణులు ఉన్న చోటుననే డంభాచారాలకు పోక ప్రజలలో నిర్భయత్వం పెంపొందారు. ఇతరులకు వారు ఆదర్శంగా వున్నారు. భారత దేశమంటే ఏమి? భారతం అంటే ధఱ్మం, భక్తీ, అత్మైశ్వర్యమూ శంకరుల విషయంలో ఆచార్యపదం అర్థవంతమైనది. వారి బోధలు ఒక్క భారతదేశానికీ కాదు. ప్రపంచమంతటికీ.
వారు దేశమంతా విజయ యాత్రలు చేశారు. దుర్మతాలు దేశాన్ని వదలి పారిపోయినవి. వారి విజయం. వారు ధర్మాన్ని పున: ప్రతిష్ట చేశారు. ప్రజలలో జ్ఞానం, భక్తీ, అద్వైతం, పున: స్థానం చేశారు. కర్మం ధర్మమూ ఎప్పుడూ ఇస్తున్నాడు. అంతేకాదు. పాపలక్షణానికి వలసిన సదుపాయాలు అయిన గురువు, శాస్త్రాలను క్షేత్రం కలిపించి సాయపడుతున్నాడు. పాపి కూడస్వర్గానికి పోతాడన్న ఇతర మతస్థుల నమ్మకం కంటే, మన మతంలోచెప్పిన విధానమే చక్కగా వున్నదని వివేచన చేసేవారికి విశదమౌతుంది. ఇందులో పురుషయత్నానికి సమకూర్చటం అతని కరుణావిశేమని చెప్పాలి.
సైన్స్ ప్రకారం పునర్జన్మ ఉందా? అని చాలామంది పరిశోధనలు చేయటానికి ప్రారంభించారు. ఈ శాస్త్ర విభాగాన్ని పారా సైకాలజీ వారి పరిశోధనల వల్ల తేలింది ఏమంటే పునర్జన్మ ఉందని. గడిచిన జన్మలో వృత్తాంతాలు మరువక కొందరు ఏకరువు పెట్టగా, వారు చెప్పిన ప్రదేశాలకు వెళ్లి పరిశోధిస్తే, ఆ వృత్తాంతాలు జరిగినట్లే ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఇట్టు పూర్వజన్మ స్మృతులున్నవారు అందరు పోయిన జన్మలో సాధారణంగా చనిపోక ఆకస్మిక దుర్మరణ ప్రాప్తిచేత చనిపోయారని కూడా ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.

