ప్రాచీన భారతీయ విద్యాలయాలు
ఇక్కడ ‘ధర్మగంజ్’ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ‘ధర్మ గంజ్’ అనగా ధర్మం కావలసిన వారు దానిని స్వీకరించ టానికి సిద్ధంగా వుంచిన చోటని అర్థం. ఇందులో రత్నసాగరం, రత్నోదధి, రత్నరంజయ అనే మూడు అంతస్థుల భవనాలు ఉండేవి. ఇక్కడ 10 సరోవరాలుండేవి.
తక్షశిల వైదిక విద్యాలయాలలోకెల్లా ప్రసిద్ధమైనది. ఇది అతి పెద్ద వైదిక విశ్వవిద్యాలయం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యాకేంద్రాలు తక్షశిల విశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా ఉండేవి. వైద్యవిద్యను సంపూర్ణం కావించుటకు జీవకుడు తక్షశిలలో ఏడు సంవత్సరాలు నివసించాడు. వైద్యశాస్త్రం, యుద్ధ విద్య, వేదవిద్యలు, తర్కశాస్త్రం వంటివి ఇక్కడ బోధించేవారు.
భారతదేశంలో రామాయణం, వి జ్ఞాన నిలయలు జరిగిన కాలం నుండీ ప్రసిద్ధ విద్యాలయాలుండేవి. బదరిక, నైమిశార్యం కాశీ, తక్షశిల వైదిక విద్యాకేంద్రాలు. నలంద, వల్లబి, విక్రమశిల, బదంతపురం బౌద్ధవిద్యాకేంద్రాలు. ఈ విద్యాలయాలు ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతి గాంచినవి. అందువల్ల వీటిని విశ్వవిద్యాలయాలుగా పేర్కొనవచ్చు.
బ్రాహ్మణ గురువులు వైదిక విద్యాకేంద్రాలలో విద్యాబోధన చేసేవారు. ఈ విద్యాకేంద్రాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్వవ ర్ణాల వారికి మాత్రమే ప్రవేశం ఉండేది. శూద్రులను విద్యార్జ నకు నాడు అనర్హులుగా పరిగణించేవారు. బ్రాహ్మణ విద్యార్థు లకు మతం, తత్త్వ విచారం, వేదాలు – బ్రాహ్మణికాలు, ఉపని షత్తులు బోధించేవారు.
క్షత్రియులకు రాజనీతి, యుద్ధ విద్యలు బోధించేవారు.
విద్యార్జన దశలో విద్యార్థులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తొలుత పండిత గృహంలో తరువాత వనభూములలోని ఆశ్రమాలలు విద్యాబోధన జరిగేది. వీరికి ఖగోళశాస్త్రం శబ్ద ఉత్పత్తి శాస్త్రం, వ్యాకరణం వేదాధ్యయనంతో పాటు నేర్పించే వారు. అధ్యయనంతోపాటు ఆశ్రమ విద్య నియమాల ననుస రించి శారీరక శ్రమ చేయాలి. మత ఉత్సవాలు నిర్వహించాలి సామాన్యజీవనం గడపవలసి వుంటుంది.
పరిషత్‌లు అని పిలువబడే వైదిక విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, ధర్మశాస్త్రాలు, తత్త్వశాస్త్రాలను విద్యార్ధులు అధ్యయనం చేసేవారు.
బదరిక విద్యాలయం హరిద్వార్ వద్ద ఉండేది. వేదాంత విద్య లకు ఈ విద్యాలయం ప్రసిద్ధి చెందినది. బ్రహ్మసూత్రాలలోని వేదాంత సారాన్ని ఇచట బోధించేవారు. వ్యాసమహర్షి మహాభారతాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రచారం చేసారని, శంకరాచార్యుల వారు క్రీ.శ. 8వ శతాబ్దంలో రామానుజా చార్యులు ఇక్కడికి వచ్చి విశిష్టాద్వైత మతాన్ని ప్రచారం చేసి ప్రాచు ర్యంలోకి తెచ్చారు. తరువాత కాలంలో మధ్వాచార్యుల వారు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిం చారు.
వైదిక విద్యాల యాలలో ప్రసి ద్ధిగాంచి నది కాశీ. ఆయు ర్వేద విద్యారహస్యాలు తెలి సిన జీవకుడు ఇక్కడ ఉండే వాడు. చరకుడను వైద్యశాస్త్రవేత్త
కూడా ఇక్కడ ఉండేవాడు. అష్టాంగ వైద్య శాస్త్రాన్ని ఇతడు వ్యాప్తిచేసాడు. బించి సారుడు, బుద్ధుడు మొదలగు వారు ఇక్కడ చికిత్సలు చేయించుకొనేవారని ప్రతీతి. స్వదేశీ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసించేవారు.
తక్షశిలవైదిక విద్యాలయాలలోకెల్లా ప్రసిద్ధమైనది. ఇది అతిపెద్ద వైదిక విశ్వవిద్యాలయం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యాకేంద్రాలు తక్షశిల విశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా ఉండేది. వైద్యవిద్యను సంపూర్ణం కావించుటకు జీవ కుడు. తక్షశిలలో ఏడు సంవత్సరాలు నివసించాడు. వైద్య శాస్త్రం, ఆయుద్ధ విద్య, వేదవిద్యలు, తర్కశాస్త్రం ఇచట బోధించేవారు.
ఈ విద్యాలయంలో ప్రవేశా కి విద్యార్థులు 1000 నాణలు చెల్లించి అనుమతి పొందేవారు. ధనం చెల్లించలేని విద్యార్థులు పగలు గురువుకు చేసి, రాత్రిపూట విద్యాభ్యాసం చేసేవారు.
రాజులు విద్యాలయ పోషణకు ధనాన్ని విరాళాలుగా ఇచ్చేవారు.
బౌద్ధయుగంలో నలంద ప్రసిద్ధి పొందిన విద్యాలయం. పాట్నా జిల్లాలోని బౌరగాన్ ప్రాంతంలో ఈ విశ్వవిద్యా లయం ఉండేది. దీనిని శక్రాదిత్యుడను రాజు నిర్మించగా తరు వాత కాలంలో ఇచట బుధగుప్తుడు, తధాగత గుప్తుడు, బాలా దిత్య, వజ్ర అనే రాజులు అనేక భవనాలు నిర్మించారు.
ఇక్కడ ‘ధర్మగంజ్’ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ‘ధర్మ గంజ్’ అనగా ధర్మం కావలసిన వారు దానిని స్వీకరించ టానికి సిద్ధంగా వుంచిన చోటని అర్థం. ఇందులో రత్నసాగరం రత్నోదధి, రత్నరంజయ అనే మూడు అంతస్థుల భవనాలు ఉండేవి. ఇక్కడ 10 సరోవరాలుండేవి.
ఇందులో ప్రజ్ఞాపారమితా సూత్రాలు, దివ్యగ్రంథాలు, తాంత్రిక విద్యాగంథ్రాలు వుండేవి. ఈ విశ్వవిద్యాలయంలో 18 బౌద్ధ దర్శనాలు, మహాయానము, హేతువిద్య, శబ్ద విద్య చికిత్సా విద్య, తంత్రశాస్త్రం, సాంఖ్య, వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేసేవారు.
సూత్రాలకు వ్యాఖ్యానం చేసేవారు 1000మంది, 30 రకాల శాస్త్రాలను బోధించేవారు 500 మంది, 50 శాస్త్రాలను బోధించ గలవారు 10 మంది ఉండే వారు. సర్వశాస్త్రాలను బోధించగల ఆచార్యుడు ఒక్కడు ఉండేవాడు. అతనే శీలభద్రుడు ఇతనినే ధర్మనిధి అని అంటారు.
ఈ విశ్వవిద్యాలయంలో 8 కళాశాలలు 300లకు పైగా భవనాలు ఉండేవి. ఇక్కడ నాగార్జునుడు, అశ్వఘోషుడు వసు బంధు, దిజాగుడు, కమల శీల, సంఘమిత్ర, శాంతి రక్షిత, వీరదేవ, మంజ శ్రీదేవ మొదలైగు ప్రసిద్ధ ఆచా ర్యులుండేవారు.
ఇక్కడ విద్యాకార్యక్రమాలు నిర్ణీత కాల బద్ధమై ఉంటాయి. దినానికి ఎనిమిది జాములుగ నుండేది. ప్రతిజాముకు నాలుగు సార్లు ఢంకానినాదం, ఖారావము చేసేవారు.
మొదటి జాము ఢంకా నినాదానికి అందరూ స్నాన మాచరిచేవారు. రెండవ జాముకు ముందే భోజనం పూర్తి చేసేవారు.
విద్యాభ్యాసం కోసం బొఖారా, కొరియా,చైనా, టిబెట్టు దేశాల నుండి విద్యార్థుల ఇక్కడికి వచ్చేవారు.
ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు శాంతి రక్షితుడు. పద్మ సంభవుడు టిబెట్‌లో బౌద్ధ సంస్కృతిని వ్యాప్తి చేసేవారు.
విక్రమశిల విశ్వవిద్యాలయం బీహార్ లోని భగల్ పూర్ సమీపంలో ఉండేది. క్రీ.శ. 9వ శతాబ్దంలో ధర్మపాలుడను రాజు దీనిని స్థాపించాడు. ఈవిశ్వవిద్యాలయంలో విద్యా భ్యాసం చేసిన వారికి ప్రత్యేక గౌరవ సూచకమైన బిరుదు నిచ్చేవారు. పండిత అనే బిరుదుతో వారిని పిలిచేవారు. ఇక్కడ ఆరు కళాశాలలు ఉండగా, ఒక్కొక్క కళాశాలలో 108 మంది ఉపాధ్యాయులుండేవారు. ఇందులో 800 మంది ఉపాసకులు ఒకేసారి సమావేశమగుటకు ఒక సమావేశ ప్రదేశం ఉండేది. రాజుల పోషణతో ధర్మ సత్రాల ద్వారా ఇచటి వారికి భోజన సదుపాయాలు ఏర్పరచారు.
ఇచట బౌద్ధతంత్రం, వ్యాకరణం, వేదాంతం తర్కం శాస్త్రా లను బోధించేవారు, చాణిక్యుని కాలంలో ఆరుగురు తార్కి కులు ద్వారపాలకులుగా ఉండేవారు. తూర్పు ద్వారం వద్ద రత్నాకర శాంతి, పశ్చిమ ద్వారం వద్ద, వాగీశ్వర కీర్తి, ఉత్తర ద్వారం వద్ద నరోపుడు, దక్షిణ ద్వారం వద్ద ప్రజ్ఞాకర మతి, ప్రధమ సింహ ద్వారం వద్ద రత్న వ్రజుడు, గర్భద్వారం వద్ద జ్ఞాన శ్రీమిత్రుడు ఉండేవారు. ధర్మపాలుని కాలంలో ఈ విద్యా లయానికి కులపతిగా జ్ఞాన పాదుడు ఉండేవాడు. జ్ఞానపాదు డు రాసిన తంత్ర శాస్త్రం టిబెట్ భాషాసాహిత్యంలో ముఖ్యమైన గ్రంథాలు. వైరోచన రక్షితుడు వంజిక, రత్నవాద చక్రం వంటి సంస్కృత గ్రంథాలను రాసాడు. మైత్రిక రాకు మారి దుడ్డాదేవి వల్లభి విహారాన్ని నిర్మించినది క్రీ.శ. 6వ శతాబ్దంలో ధారానేనుడు శబప్ప పాదవిహారాన్ని నిర్మించడానికి ధనం సహాయం చేసాడు. దీని నిర్మాణం బాధ్యాతలు భదంత స్థిరమతి నిర్వహించాడు. స్థిరమతి, గుణమతి అనే ఆచార్యులు ఈ విశ్వవిద్యాలయంలో ఉండేవారు. ఇచట విద్యార్థులు మూడు సంవత్స రాల కాలం వుండి విద్యాభ్యాసం చేసేవారు. ఇచట 10,000 మంది భిక్షకులు వుండేవారని తెలుస్తున్నది. పాలవ వంశీకుడైన గోపాలుడు క్రీ.శ. 8వ శతాబ్దంలో బదంత పురం విద్యాలయాన్ని నిర్మించారు. ఇది బిహార్‌లో ఉండేది. ఈ విద్యాలయంలో బౌద్ధ, బ్రాహ్మణ విద్యలు రెండూ నేర్పించే ఏర్పాటు ఉన్నందున ఈ విద్యాలయానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ విద్యాలయాల వల్ల భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆసియాఖండమంతటా వ్యాపించాయి.

