http://bhagavatamanimutyalu.org/IBamC1.html
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో
తిరుపతిలో
పవిత్రమైన అఖండ ఆవిష్కరణ కార్యక్రమానికి సాదర ఆహ్వానం
(January 15,16, 17, 2015 సంక్రాంతి పండుగ రోజులు)
మన చరిత్రలో, తెలుగు సాహిత్య పురోగతిలో, హిందూ మత సంస్కృతిలో మొదటి సారిగా ఒక నూతన ప్రక్రియ కు ఈ సంక్రాంతి పండుగ పుణ్యక్షేత్రమైన తిరుపతి లో శ్రీకారం చుట్టనున్నది. పోతనామాత్యులవారి భాగవతం నుండి కొన్ని ఆణిముత్యాలని ఏరి, వాటిని రాగ యుక్తంగా పాడించి, అర్థం వివరిస్తూ అటు ప్రాచీన , ఇటు అత్యానుధిక ఆధునిక సాంకేతిక పరికరాలు, అంతర్జాల మాధ్యమాలలో కొద్ది క్షణాలలోనే అందుబాటులో ఉండే ఒక సమగ్ర ప్రణాళిక పూర్తి అయిన సందర్భంగా ఆ పర్వదినాలలో ఆయా ఉత్పత్తులని యావత్ ప్రపంచానికి అందించే ఒక పవిత్రమైన ఆవిష్కరణ కార్యక్రమానికి, మూడు రోజుల భాగవత ప్రవచనానికి అందరూ ఆహ్వానితులే.
సంధాన కర్త, నిర్వాహకులు:
iBAM Org (భాగవత ఆణిముత్యాల పేరిట నెలకొల్పబడ్డ లాభాపేక్ష లేని అమెరికా సంస్థ)
ప్రత్యేక సహకారం:
హిందూ ధర్మ ప్రచార పరిషత్ (తిరుమల తిరుపతి దేవస్థానం) & వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
తేదీలు: జనవరి 15, 16 & 17, 2015 (సంక్రాంతి పండుగ రోజులు)
మొదటి రోజు: (జనవరి 15):
సూర్యోదయం సమయం: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలకు పోతన భాగవత ఆణిముత్యాల నూతన తాళపత్ర గ్రంధ సమర్పణ, ప్రత్యేక పూజ
సాయంకాలం: సుమారు 4: 00 నుండి 5:00 వరకూ: తిరుపతి నగర వీధులలో గజేంద్రుడి అంబారీ పై స్వామి ఆశీర్వదించిన పోతన తాళ పాత్ర గ్రంధాల ఊరేగింపు.
Venue: Tirumala Tirupati Devasthanams Administrative Building Pranganam, Tirupati.
కార్యక్రమం
(5:30 నుండి 9:00 వరకూ)
“పోతన ఆణి ముత్యాల ఉత్పత్తులు” ఆవిష్కరణ. (తాళ పత్ర గ్రంధం, వెబ్ సైట్, ఐ ఫోన్, ఐ పాడ్ వంటి పరికరాలలోకి డౌన్ లోడ్ చేసుకునే డిజిటల్ టెక్నాలజీ అప్లికేషన్స్, జి MP 3 సీడీ మొదలైనవి) మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే మూడు రోజుల భాగవత ప్రవచన ప్రారంభం.
ప్రధాన అతిథులు: Dr. D. Sambasiva Rao Garu, IAS, Chief Executive Officer, TTD
శ్రీ బి.వి. పాపారావు (తెలంగాణా ప్రభుత్వ సలహాదారు)
ప్రత్యేక అతిథులు: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, శలాక రఘునాథ శర్మ గారు, ఊళపల్లి సాంబశివ రావు గారు, ఎల్.వి. సుబ్రమణ్యం గారు, నేమాని పార్థ సారధి గారు, డా. చొదిమెళ్ళ చంద్ర శేఖర్, TTD అధికార బృందం, భాగవతుల ఆనంద మోహన్ (హ్యూస్టన్), దువ్వూరి అరుణ్ కాంత్ (హ్యూస్టన్), రమణి విష్ణుభొట్ల (ఆస్టిన్)
పూర్తి వివరాలకు iBAM సంస్థ అధ్యక్షులు పుచ్చా మల్లిక్ (ఇండియా ఫోన్ నెంబర్ 82206-30540) ని పిలవండి.
(రాజమండ్రి లో జరిగిన తొలి విడత ఆవిష్కరణ సభ)- మల్లిక్ పుచ్చా గారు, jజొన్నవిత్తుల గారు, శలాక రఘునాథ శర్మ గారు, సాంబశివ రావు గారు, నేమాని పార్థు తదితరులు
సంకల్ప ప్రేరణలు: “ఐ – భాగవతం ఆణి ముత్యాలు” కి ముఖ్య ప్రేరణ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలలో తరచూ ప్రస్తావించే “పోతనామాత్యుల పద్యాలు ముత్యాలు. వాటిలో కొన్నైనా రోజూ పఠించడం ఎంతో మంచి అలవాటు. అంతే కాకుండా జీవితంలో వచ్చే ఒడుదుడుకులను తట్టుకునే మానసిక బలాన్ని , రక్షణను ఇస్తాయి. ఆ ఒడుదుడుకులను దాటే చక్కటి దారిని, దైవ బలాన్ని అందిస్తాయి. ఇది తథ్యం “ అనే హిత వాక్యాలు. ఆ భావ వీచికపోతన భాగవతం లోని 7012 పద్యాలలో అతి చక్కని 324 పద్యాలని ఆని ముత్యాలుగా ఎంచుకునే మా సత్సంకల్పాన్ని ప్రేరేపించాయి.
మా ముఖ్యోద్దేశ్యం: 324 పోతన భాగవత ఆణి ముత్యాలను సుప్రసిద్ధ పండితుల చేత ఎంపిక చేయించి, టీకా , తాత్పర్యాలతో సహా తరతరానికి పెరుగుతున్న అనంత అద్భుత జ్ఞాన పిపాస సామర్ధ్యాలతో అలరారుతున్న మన నవతరానికి అందించడమే కాక, అత్యాధునిక విభిన్న బహుళ సాంకేతిక సంచారణులు మొదలైన అంతర్జాల సాధనాలతో అలవోకగా ఆడేసుకుంటున్న ఈ నాటి , భావి తరాల పిల్లల చురుకుతనం స్థాయికి దీటుగా ఈ క్రింది నాలుగు విధాలుగా సర్వులకు, సర్వవేళలా, సర్వేత్రా సర్వ సిద్దంగా పోతన భాగవత ఆణిముత్యాలను …..ముఖ్యంగా వీనుల విందైన ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉంచడం.
మా ఉత్పత్తులు
- iBAL : భాగవత ఆణి ముత్యాలు పట్టిక (ప్రత్యేకంగా ఎంపిక చేసిన 324 పద్యాలు)
- iBAP: వెబ్ సైట్ లో భాగవత ఆణి ముత్యాలు తెలుగు యూనికోడ్ లిపి లో పొందు పరచడం.
- iBAPP: వెబ్ సైట్ లో ఆణి ముత్యాల ప్రతి పదార్ధం యూనికోడ్ తెలుగు లిపి లో పొందు పరచడం.
- iBAT వెబ్ సైట్ లో ఆణి ముత్యాల తాత్పర్యం యూనికోడ్ తెలుగు లిపి లో పొందు పరచడం.
- iBAA: 324 భాగవత ఆణి ముత్యాలు పద్యాలు భావ గర్భితంగా గానం చేసి ఆడియో రూపొందించడం
- iBAB: ప్రతి పదార్థ, తాత్పర్య సహిత “పోతన ఆణి ముత్యాలు” గ్రంధ ప్రచురణ.
- iBATP: ప్రతి పదార్థ, తాత్పర్య సహిత “పోతన ఆణి ముత్యాలు” తాళ పత్ర గ్రంధ విశిష్ట ప్రచురణ
సాధించిన ప్రగతి: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, శలాక రఘునాథ శర్మ గారు మొదలైన పండితులు ఆధ్యాత్మిక సౌరభాలు, భక్తీ తత్త్వం, నీటి బోధలు, ఋజు మార్గ నిర్దేశం , భగవత్ లీలల ఔన్నత్యాన్ని ప్రమాణంగా తీసుకుని 324 ఆణి ముత్యాల ఎంపిక, ప్రతి పదార్థము, తాత్పర్య రచన పూర్తీ అయింది. సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థ సారధి ప్రధాన గాయకుడిగా ఆయన సంగీత నిర్దేశకత్వంలో అనేక మంది సహా గాయనీ గాయకులూ, వాద్య సహకారాలతో రికార్డింగ్ ఇంచుమించు పూర్తి అయింది.

