సాహితీ బంధువులకు శుభ కామనలు అంతర్జాలం లో నేను 145 మంది సంస్క్రుతకవుల పై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”నుసరసభారతి నిర్వహించే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకల రోజున అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం జరిగే సభలో ఆవిష్కరింప జేస్తామని ,దీనిని సరసభారతికి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితమిస్తున్నామని ఈ పుస్తకానికి ముద్రణ ఖర్చు అంతా శ్రీమైనేనిగారి మేనకోడలు ,అమెరికాలో ఉంటున్న డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు భరించి పుస్తకం తెస్తూ తన ”కృష్ణ మామ”పై ఉన్న గౌరవాభిమానాలను ప్రకటిస్తున్నారని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .
ఉయ్యూరు కె సి పి లో కెమిస్ట్ గా పని చేసి రిటైర్ అయిన సరసభారతి మిత్రులు ప్రముఖ హాస్య రచయిత శ్రీ టి .వి. .సత్యనారాయణ గారు రాసిన ”పేరడీలు ”కూడా సరసభారతి ముద్రించి మన్మధ ఉగాదినాడు ఆవిష్కరిస్తోందని ఈ పుస్తకాన్ని ప్రముఖ హాస్య జంట స్వర్గీయ బాపు -రమణ లకు అంకితమిస్తున్నామని తెలియ జేస్తున్నాం
మా అమెరికా మేనల్లుడు జె .వేలూరి .స్పాన్సర్ చేస్తున్ననేను నెట్ లో రాసిన ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శ్రీహనుమజ్జయంతి నాడు 13-5-15 బుధవారం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో స్వామి వారల శాంతి కళ్యాణ మహోత్సవం లో ఆవిష్కరిస్తామని దీనిని మా అక్క బావలు శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ దంపతులకు అంకితమిస్తున్నామని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది మీ -దుర్గాప్రసాద్

