‘’దర్శనేయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ విశేషాలు

‘’దర్శనేయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ విశేషాలు

10-1-15 శనివారం

సరసభారతి ప్రచురించిన 14వ పుస్తకం ,నేను రాసిన తొమ్మిదవ పుస్తకం  నెట్ లో రాసిన ఆరవ పుస్తకం ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ సభ సరసభారతి 74 వ సమావేశం గా 11-1-15 ఆదివారం సాయంత్రం అయిదుగంటలకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న ఆర్య వైశ్య కళ్యాణ మందిరం లో ఘనం గా జరిగింది .ఒక రకం గా ఈ కార్యక్రమం రెండు రోజులు జరిగినట్లు లెక్క

దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి జన్మ దినోత్సవం .

జనవరి 10 వ తేదీ శనివారం సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం ,సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారల ఆరాధనోత్సవం కూడా .అందుకని పదవ తేదీ ఉదయం ధనుర్మాస ప్రత్యెక పూజలో శ్రీ త్యాగ రాజ స్వామి వారల చిత్రపటానికి పూల మాల వేసి ‘’నేను రాసినఅస్తోత్తరం’’ తో పూజ చేశాం . శనివారం సాయంత్రం  శ్రీ మైనేని వారి పుట్టిన రోజు పండుగను శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఘనం గా జరిపాం .శ్రీ మైనేని దంపతుల పేరిటస్వామి వారలకు ప్రత్త్యేక పూజ చేయించి ,ప్రత్యేకం గారెండుకిలోల పిండితో  అరిసెలు ప్రసాదం గా చేయించి ,వాటితోస్వామివారలకు  పూజ కూడా చేసి వచ్చిన భక్తులకు  ప్రసాదం గా అందజేశాం .శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకుమిగిలినవి ఆదివారం తెనాలి నుండి వచ్చే శ్రీ కోగంటి సుబ్బారావు గారి కుటుంబానికి బందుగణానికి ,మిత్ర బృందానికి అంద జేయాలని భావించాం .పిల్లలు మైనేని వారికి ‘’హేపీ బర్త్ డే ‘పాటపాడగా చప్పట్లతో ఇక్కడినుండే అమెరికా వినిపించేట్లు శుభా కాంక్షలు తెలియ జేశాం .మైనేని వారు కోరిన ప్రకారం శ్రీ సువర్చలాదేవికి ,శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి ,శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్టు కు  పట్టు చీర జాకెట్ ,పట్టుపంచలు కొని గోపాల కృష్ణ  దంపతులు అందజేసినట్లు గా స్వాములకు అంద జేశాం . పూజారి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ కు, శ్రీ బలరాం గారికి మైనేని వారు కొనిపించిన పట్టు బట్టలు కట్ట బెట్టి శాలువాలు కప్పాం.స్వామి వారల పాదాల చెంత ‘’దర్శ నీయ దైవ క్షేత్రాలు ‘’ఒక పుస్తకం ఉంచి ,పూజారి గారితో స్వామి సన్నిధిలో ఆవిష్కరింప జేశాం .అంటే మొదటి నుంచీ మైనేని వారి పుట్టిన రోజున పుస్తకావిష్కరణ జరగాలన్న కోరిక ఈ విధం గా నేర వేరింది .శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవ సందర్భం గా ‘’పంచ రత్న కీర్తనలు ‘’కాసేట్ పెట్టి వినిపించాం .ఉదయం స్వామి వారి సన్నిధిలో సంగీత గురువు శ్రీమతి సూరి రాజ్య లక్ష్మి గారు ఒక గంట సేపు త్యాగ రాజ కీర్తనలు గానం చేసి ఆ సంగీత పెన్నిదికి ఘన నివాళులు అర్పించారు .అనుకోకుండా ఈ రోజు కార్యక్రమం వైభవం గా ,సంతృప్తికరం గా జరిగింది .

11-1-15- ఆదివారం

ఈ రోజు కార్యక్రమాన్ని అమెరికాలో ఉన్న మైనేని గోపాల కృష్ణ గారి కుటుంబం ,చూడటానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశాం .ఉయ్యూరులో ఒక సాహిత్య కార్యక్రమం ఇలా ‘’లైవ్ ‘’లో తిలకించటం ఇదే మొదలు. ఆ కీర్తి సరస భారతికి దక్కింది .కళ్యాణ మండపం చాల సువిశాలం గా అన్ని హంగులతో కన్నుల పండువుగా ఉంది. వేదిక పై కార్యక్రమం చాలా రక్తి కట్టింది .దూరం గా ఉన్న వారందరూ చూసి చాలా అభినందించారు .కళ్యాణ మండపం అద్దె పదివేల రూపాయలకు పైనేఉంటుంది . కాని మా రమణ మిత్రుడు శ్రీ వెంట్రప్రగడ ఆంజనేయులు చొరవతో ఉచితం గా రూపాయి ఖర్చు లేకుండా లభించింది .దీనికి  ఆంజ నేయుల్ని అభినందించాలి .కార్యక్రమ ఏర్పాట్లు అన్నీ దగ్గర ఉండి పర్య వేక్షిస్తూ ఆతను చేసిన సేవ మరువ రానిది .

సంగీత కచేరి

ఈ రోజు కూడా శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం నిర్వహించాం .సాయంత్రం అయిదుగంటలకు విజయ వాడకు చెందిన రేడియో ఆర్టిస్ట్ శ్రీ పి. ఇంద్ర కీలాద్రి శర్మగారు తన బృందం తో కచేరీ చేశారు .వయోలిన్ పై కుమారి వి లక్ష్మి ,మృదంగం పై ఛి ఆదిత్య ఆయనకు సహకరించారు .సుమారు నలభై అయిదు నిమిషాలపాటు కచేరీ వివిధ గీతాల తో జరిగింది .కచేరీ బృందానికి శ్రీ గోపాల కృష్ణ గారు మాతో కొనిపించిన నూత్న వస్త్రాలు ,అందజేసి శాలువాలు కప్పి పుష్పమాలలతో సత్కరించి సరసభారతి ముద్రించిన పుస్తకాల సెట్ ను అందరికి అందించి ప్రత్యేకం గా ఈ కార్య క్రమం కోసం తయారు చేయించిన  సంక్రాంతి ,తెనాలి రామాలయం లతో కూడిన ముచ్చటైన జ్ఞాపికలను అంద జేశాం .బృందానికి మైనేని వారు ఏర్పాటు చేసిన 2,౦౦౦ రూపాయల పారితోషికాన్ని సరసభారతి తరఫున అంద జేసి వారందరికీ గొప్ప సంతృప్తిని కల్గించాం .

శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారల సేవలో శ్రీ కోగంటి బంధుగణం

క్షేత్రాలు అంకితం పొందే ఎనభై అయిదేళ్ళ జ్ఞాన వయో వృద్ధులు శ్రీ కోగంటి సుబ్బారావు గారు ,కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనుమలు ,మనుమరాళ్ళు మిత్ర బృందం తో కార్లలోతెనాలి నుండి బయల్దేరి  సాయంత్రం అయిదింటికి ఉయ్యూరు కు చేరి, సభలో పాల్గొన్నారు .వారిని ముందుగా దగ్గరలోనే ఉన్న మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయానికి తీసుకొని వెళ్లి అష్టోత్తర పూజను  వారి గోత్రనామాలతో  పూజారి గారితో చేయించి  పులిహోర ప్రసాధం గా చేయించాం .హారతి ఇప్పించి ,మంత్రం పుష్పం యదా విధిగా చెప్పించి ,తీర్ధ ప్రసాదాలను ఇప్పించాం .వారిని అడగ కుండా గోత్రనామాలు పూజారిగారు చెప్పటం వారికి అమితాశ్చర్యం వేసినట్లు కనిపించింది .ముందుగానే నేను గోపాల కృష్ణ గారి నుండి కోగంటి వారి గోత్రం భాస్కరేంద్ర గారి గోత్రం అడిగి తెప్పించి పేర్లు ,పూజారికి రాసి ఇచ్చి ఉదయం సహస్రనామ పూజ సాయంత్రం అస్తోత్తరం చేయించాను .సుబ్బారావు గారికి,  వారికుమారులు శ్రీ శివ ప్రసాద్ గారికి  అల్లుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు గారికిమొదలైన వారికి పూజారి గారితో స్వామి వారి శేష వస్త్రాలు కప్పించాను .ఆడవారికి అమ్మవారి జాకెట్ ముక్కలను అంద జేశాం .వారెవరూ ఇలా జరుగుతుందని ఊహించలేదు .అందరి ముఖాల్లో ఏంతో  వెలుగు, ఆనందం సంతృప్తి జ్యోతకం అయింది .సుబ్బారావు గారు పరవశించి పోయినట్లు కనిపించింది .సుబ్బారావు గారిని చూడటం ఇదే మొదటి సారి .గోపాల  కృష్ణ  గారికి వారిపై అంత అభిమానం ,ఆరాధనా ఎందుకు ఉన్నదో చూడగానే అర్ధమైంది .ఆ ముఖం లో గొప్ప ప్రశాంతత ,కళ్ళల్లో పెద్ద వెలుగు ,ఆ పంచె కట్టు దానిపై చక్కని షర్టు మహా హుందాగా ఉన్నారు .ఇలాంటి ఉన్నత మూర్తికి ఈ గ్రంధం అంకితమిచ్చి నేనూ సరసభారతి ధన్యమౌతోందని అనిపించింది. మైనేని గారి కోరిక ఈ విధం గా తీరుతున్నందుకు మహదానందం గా ఉంది .ఆ పర్సనాలిటీ కళ్ళల్లో ,మనస్సులో నిండిపోయింది .గొప్ప వ్యక్తీ ని చూశాననే ఆనందం తో మనసు పరవళ్ళు తొక్కింది .దేవాలయం అంతా కోగంటి వారి బంధుగణం తో అభిమానులతో కిక్కిరిసి పోయింది .స్వామి సేవలో అందరూ ధన్యులయ్యారు .

ఆవిష్కరణ సభ

దేవాలయం నుంచి అందరం వచ్చి కళ్యాణ మదిరం చేరాం .అప్పటికే ముఖ్య అతిధి నది సంపాదకులు ఈ నాటి పుస్తకావిష్కరణ కర్త శ్రీ జలదంకి ప్రభాకర్ గారు ,ఆత్మీయ అతిధి శ్రీ చలపాక ప్రకాష్ గారు వచ్చి కూర్చున్నారు .దాదాపు నూట పాతిక మంది తో మందిరం కళకళ లాడింది .మైనేనిగారి బావగారు శ్రీ అన్నే హనుమంతరాగారు చెల్లెలు శ్రీమతి  హేమలత గారు వచ్చారు . గౌరవ అతిధిగా రావాల్సిన ‘’అఖిల భారత వాసవీ ట్రస్ట్ –పెనుగొండ –ఉపాధ్యక్షులు శ్రీ బొండాడ రామ మోహన రావు గారు క్రితం రోజు అనుకోకుండా కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినందున రాలేక పోయారు .ఒకటవ తేదీకూడా వారి తో మాట్లాడాను .వస్తానని ఖచ్చితం గా చెప్పారు .సభకు హాజరైన వారందరికి స్వీటు హాటు ఉన్న పాకెట్ అందించారు. టీ ఏర్పాటు చేశాం .మధ్యలో బిస్కట్లు మళ్ళీ రెండో సారి తేనీరు అందజేశాం

సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి అతిధులను పేరు పేరునా వేదికపైకి ఆహ్వానించింది .అందరికి కమలా ఫల ద్వయం తో సరసభారతి సభ్యులు ,మా మనవాళ్ళు మనవ రాళ్ళు కోడళ్ళు స్వాగతం పలికారు . నేను శ్రీ కోగంటి సుబ్బారావు గారిని పరిచయం చేసి వేదికమీడకు ఆహ్వానించాను శ్రీ జలదంకి ప్రభాకర్ గారిని  ఛి బాలాజీ  ,చలపాక ప్రకాష్ గారిని శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అన్నే హనుమంతరావుదంపతులను   మా పెద్దకోడలు శ్రీమతి సమత ,శ్రీ రామి నేని భాస్కరేంద్ర రాగారిని శ్రీ శ్రీమతి శివలక్ష్మి ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ దంపతులనుమా మనుమరాలు ఛి రమ్య చక్కగా స్పష్టమైన ఉచ్చారణ తో స్క్రిప్ట్ చదివి పరిచయం చేసి అందరి ప్రశంసలు పొందారు.అందరికి  జంట కమలాలతో స్వాగతం చెప్పారు .

సభాధ్యక్షునిగా నేను ప్రసంగిస్తూ సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు తెనాలి వారిని ఉయ్యూరు వారిని ఈ విధం గా ఇక్కడ కలిపారని ఈ కార్యక్రమం ఖర్చు ,పుస్తక ముద్రణ ఖర్చు ఈ బందుగణానికి యధోచిత నూత్న వస్త్రాల సమర్పణ అంతా ఆయనదే నని ఇందులో ఏ మంచి పని అయినా, ఘనత అయినా మైనేని వారికే చెందుతుందని ఏ చిన్న లోపం ఉన్నా అది నాకు మాత్రమే చెందుతుందని అన్నాను .ఇప్పటికి నాలుగు పుస్తకాలు స్పాన్సర్ చేసి సరసభారతికి కొండంత అండగా గోపాల కృష్ణ గారున్నారని ,వారికి ఉయ్యూరు మీద ఉన్న అభిమానం మరువరానిదని. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకు విరాళాలు అందజేసి తోడ్పడ్డారని చెప్పాను  నాలుగు సార్లు పుస్తకాన్ని అంకితం తీసుకోమని గోపాల కృష్ణ గారిని అడిగినా సున్నితం గా తిరస్కరించి ఒకటి ‘’సిద్ధ యోగిపున్గవులు ‘’వారి తల్లిగారు శ్రీమైనేని సౌభాగ్యమ్మ గారికి ,రెండవది ‘’మహిళా మాణిక్యాలు ‘’తమ ధర్మ పత్ని శ్రీమతి సత్య వతి గారికి మూడవది ‘’పూర్వాంగ్ల. కవుల ముచ్చట్లు ‘’తమ బావ గారు డాక్టర్ శ్రీ రాచ కొండ నరసింహ శర్మ,ఏం డి . గారికి నాలుగవది అయిన ‘’దర్శ నీయ దైవ క్షేత్రాలు ‘’తనకు మార్గ దర్శి అత్యంత ఆప్తులు  గొప్ప మిత్రులు ,తన జీవితాన్ని తీర్చి దిద్దిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి –‘’శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితమివ్వమని చెప్పి ఇప్పించిన విశాల హృదయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అని చెప్పాను .ఇటీవలే అంతర్జాలం లో 145 మంది సంస్కృత కవులపై రాసిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను మైనేని వారికీ చెప్పకుండానే నెట్ ద్వారా ఎవరికీ రూపాయ ఖర్చు లేకుండా  అంకితమిచ్చానని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశాను .ఇప్పుడు దాని సి డి ని శ్రీ సుబ్బారావు గారు ఆవిష్కరిస్తారని అది గోపాలకృష్ణ గారికి మహా ఆనందం కలిగిస్తుందని చెప్పాను .దీనికి గురుభాక్తిగా ఆయన నాకు ఏదో చేయాలని భావించారని ఆయన సహృదయత నాకు గురు దక్షిణ అనిఇంకేమీ అక్కర్లేదని మెయిల్ రాసి తెలియ జేశానన్నాను .కాని ఆయన ఊరుకొనే రకం కాదు .వెంటనే సరస భారతి, శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల కార్యక్రమాలను చిత్రీకరించటానికి వీలుగా ఒక’’ సోని వీడియో కెమెరా ‘’కొనిచ్చి గురు దక్షిణ చెల్లించారని ఇక నేనేను ఏమీ మాట్లాడలేక పోయానని వివరించాను .అయితే రెండురోజుల క్రితంశుక్రవారం  రాత్రిఆయన ఫోన్ చేసి ‘’గీర్వాణం ‘’పుస్తకాన్ని తన మేనకోడలు , డాక్టర్ శర్మ గారి కుమార్తె ,అమెరికాలో డాక్టర్ గా ఉంటున్న శ్రీమతి జ్యోతి గారుస్వంత ఖర్చులతోసరసభారతి ద్వారా  ముద్రించి  అ౦ద జేయటానికి సంసిద్ధత వ్యక్త పరచారని తెలిపారు చాలా ఆనందం వేసిందని వారికి కృతజ్ఞతలు తెలియ జేయమని చెప్పానని అన్నాను .దీనిలో భాగాస్వాములవ్వటానికి జ్యోతిగారి సోదరీమణులు కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలియ జేశాను. సరసభారతి కి ఇప్పటికి అయిదు పుస్తకాలు ముద్రించి ఇచ్చిన ప్రకాష్ గారి ఆత్మీయత మర్చిపోలేనిదని ,ఈ పుస్తకాన్ని కూడా వారే తీసుకు రావటానికి ముందుకొచ్చారని ,అలాగే శ్రీ టి వి సత్యనారాయణ గారు రాసిన ‘’పేరడీలు ‘’కూడా సరస భారతి ముద్రిస్తోందని దాన్ని స్వర్గీయ బాపు –రమణ లకు అంకితమిస్తున్నామని తెలియ జేశాను .13 -51-15 బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా మా మేనల్లుడు ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (అమెరికా)  స్పాన్సర్ చేస్తూ అతని తలిదండ్రులు ,మా అ అక్కా బావలు అయిన శ్రీ వేలూరి వివేకానంద శ్రీ మతి దుర్గ గార్లకు అంకితం ఇస్తూ160 దేవాలయ చరిత్రలున్న   ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’ఆవిష్కరణ స్వామి సన్నిధిలో చేస్తామని తెలియ జేశాను . ఇందరు బంధు గణం తో అభిమానులతో ఈ వేదిక, హాలు మెరిసిపోవటం ఏంతో గొప్పగా ఉందని చెప్పి గ్రంధావిష్కరణ చేయ వలసిందిగా ప్రభాకర్ గారిని కోరాను

పుస్తకావిష్కరణ

దర్శనీయ దైవ క్షేత్రాలుగ్రంధా విష్కరణ ను శ్రీ జలదంకి ప్రభాక ర్ గారు చేసి మొదటికాపీ ని సుబ్బారావు గారికి అంద జేశారు.తర్వాత వేదిక పై ఉన్న అతిదులందరికి అంద జేశారు . తరువాత సభకు హాజరైన వారందరికీ పుస్తకాలను సరస భారతి కార్య కర్తలు అందజేశారు .ప్రభాకర్ గారు గ్రంధం లోని కొన్ని ముఖ్య విషయాలపై ప్రసంగించారు ప్రకాష్ గారు ఈ పుస్తకాన్ని ‘’అమూల్యం ‘’అని ప్రచురించటం ఏంతో  హర్షణీయ మైన విషయ౦  అన్నారు .శ్రీ భాస్కరేంద్ర క్లుప్తంగా ఒక పండుగ వాతావరణం గా ఈ కార్య క్రమం జరిపినందుకు అభినందించారు .శ్రీ అన్నే హనుమంతరావు గారు ఉయ్యూరుతో తమకున్న అనుబంధాన్ని మా తండ్రిగారు మృత్యుంజయ శాస్త్రి గారు మా తమ్ముడు కృష్ణ మోహన్ వారి సరస్వతీ ట్యుటోరియల్ కాలేజీ లో పని చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు .కోగంటి వారి పెద్దకోడలు శ్రీమతి పుష్పలత చక్కగా ఇంత గొప్ప వేడుక ఇక్కడ జరగటం తమల్ని అందరిని ఆహ్వానించి గౌరవించటం జీవితం లో మరపు రాని సంఘటన అని ఇది గోపాల కృష్ణ గారి పెద్ద హృదయానికి నిదర్శనమని అన్నారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –సి డి ఆవిష్కరణ .

నేను అంతర్జాలం లో రాసి నెట్ ద్వారా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితం ఇచ్చిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’సి డి ని శ్రీ కోగంటి సుబ్బారావు గారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి నన్నూ శ్రీ గోపాల కృష్ణ గారిని అభి నందించారు .ఈ సి డి ని మైనేనిగారికి వారికోసంవారి డబ్బుతో  కొన్న పట్టుపంచె ,ఉత్తరీయం శాలువావారి శ్రీమతి శ్రీమతి సత్యవతిగారికి కొన్న పట్టు చీర జాకెట్ ,పసుపు కుంకుమ ,మొదలైన వాటితో బాటు పాక్ చేసిన పాకెట్  ను  శ్రీ అన్నే హనుమంతరావు దంపతులకు అందజేసి శ్రీ గోపాల కృష్ణ గారికి అందజేయ మని కోరాను .

సన్మాన సంరంభం

ముందుగా ఈ నాటి కృతి భర్త శ్రీ కోగంటి సుబ్బారావు గారి ని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టి చందనం పూసి పన్నీరు చల్లి గులాబీ పుష్పహారం వేసి .సెంట్ రాసి ,తాంబూలం అందించి బొట్టుపెట్టి  మైనేని వారు ,కోగంటి వారి కోసం మాతో కొనిపించిన పట్టు బట్టలు కప్పి వారి శ్రీమతికి పట్టు చీర జాకెట్ పసుపు కుంకుమ అందించి ,శాలువా వేసి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అంద జేశాం .గోపాల కృష్ణ గారు అమెరికా నుండి శ్రీ చలపాక ప్రకాష్ గారి ద్వారా ఆర్డర్ ఇప్పించి చేయించిన ‘’శ్రీ లక్ష్మీ నరసింహ బంగారు కాయిన్ ‘’ను శ్రీ సుబ్బారాగారికి సభా మఖం గా అంద జేశాము. సుబ్బారావు గారు సంక్షిప్తం గా ప్రసంగించి తనకు జరిగిన ఈ సత్కారానికి గోపాల కృష్ణ గారి ఔదార్యానికి వితరణకు బంధు ప్రేమకు ,పెద్దల యెడ ఉన్న గౌరవాభిమానాలకు మురిసిపోతున్నానని సరసభారతిద్వారా ఉయ్యూరు వచ్చే గొప్ప అవకాశం కల్పించి నందుకు కృతజ్ఞతలు తెలియ జేశారు

తరువాత కృతి కర్త అయిన నాకు మా శ్రీమతి ప్రభావతికి జలదంకి వారు కోగంటి వారు పై విధం గానే సన్మానం చేశారు .ఉయ్యూరు హైస్కూల్ లో నాకు డ్రిల్ మాస్టారు ,ఆ తర్వాత సహా ఉపాధ్యాయులు అయిన పెద్దలు శ్రీ సూరపనేని వెంకట సుబ్బారావు గారు ఈ కార్యక్రమాని విచ్చేసి నా మీద ఉన్న అభిమానాన్ని చాటి నాకు నూతన వస్త్రాలతో సత్కారం చేసి నా గురించి అభినందన వాక్యాలు పల్కి ఆశీర్వ దించటం నేను చేసుకొన్న పూర్వ  జన్మ సుకృతం .

ఆ తర్వాత శ్రీ అన్నే హనుమంతరావు దంపతులకు ,శ్రీ భాస్కరేంద్ర దంపతులకు శ్రీ కోగంటి శివ ప్రసాద్ దంపతులకు శ్రీ ప్రభాకర్ గారికి శ్రీ చలపాక ప్రకాష్ గారికి అదే తీరులో ఘనం గా నూతన వస్త్రాలు శాలువా దండలు జ్ఞాపికలు చందన సత్కరాలు చేశాం .అందరూ ఏంతో ఆనందాన్ని వ్యక్తీకరించారు .సభకు రాలేక పోయిన కోగంటి వారి రెండవ కుమారులు శ్రీ శ్రీనివాసరావు శ్రీమతి అరుణ  దంపతులకుకూడా కొన్నవాతిని సుబ్బారాగారికి అందజేశాం . మనుమలు ,శ్రీ అవినాష్ శ్రీ మతి భారతి ,శ్రీ ఆశ్వాంత్ శ్రీమతి హారిక  సుబ్బారావు గారి మనుమ రాళ్ళు కుమారి మయూరి ,కుమారి హరిణి  ,హనుమంతరావు గారి మనుమరాలు కుమారి తన్వి లకు  కోగంటి వారి ఆజన్మ  మిత్రులుశ్రీ అన్నే వెంకటేశ్వర్లు గారికి ,వారి శ్రీమతి గారికి  మైనేని వారు అభిమానం తో మాతో కొనిపించిన నూతన వస్త్రాలు ,జ్ఞాపికలు మొదలైనవి అందజేసి మైనేని వారి కి అత్యంత ఆనందాన్ని కల్గిన్చాం . అమెరికా లో ఉండి ప్రత్యక్ష ప్రసారం లో  ఆ దంపతులు వీక్షించి ఏంతో కనుల పండువుగా జరిగిన ఈ కార్యక్రమానికి సంతోషించి ఉంటారు .మా అబ్బాయి రమణ ,కోడలు శ్రీమతి మహేశ్వరి లకు మైనేని వారుకోనిపించిన నూతన వస్త్రాలు ,శాలువా ,జ్ఞాపిక పుష్పహారం చందనాది సత్కారాలతో సత్కరించారు .ఇదంతా ఒక పెళ్లి వేడుకలాగా  జరిగింది .ఒక సాహిత్య కార్యక్రమం ఇంత వైభవం గా జరగటం నేనెప్పుడూ చూడలేదు .వస్త్రాల నాణ్యతలో ,శాలువాల విలువలో ఎక్కడా మైనేని గారు రాజీపడలేదు అన్నీ నంబర్ వన్ గా ఉండాలని కోరారు అలానే చేశాం .జ్ఞాపిక విషయం లోనూ ఏంతో జాగ్రత్త తీసుకొన్నాం

ఈ కార్యక్రమాని విజయ వాడ నుండి వచ్చిన ప్రసాద్ గారికి ,శాలువా జ్ఞాపికలతో సత్కరించాం. సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మికి ,ప్రచార కార్య దర్శి శ్రీ వీరమాచనేని బాల గంగాధర రాగారికి పుష్పహారం శాలువా చందనాది సత్కారం జ్ఞాపిక లతో సన్మానం చేశాం ,కళ్యాణ మండపాన్ని ఉచితం గా ఇప్పించి ఈ కార్యక్రమం బాగా జరగటానికి సహకరించిన శ్రీ వెంట్ర ప్రగడ  ఆంజ నేయులను కూడా పై విధం గా సన్మానించి కృతజ్ఞతలు తెలియ జేశాం .

కోగంటి వారికి తెనాలి లో పంచి పెట్టటానికి 250 పుస్తకాలను ,భాస్కరేంద్ర గారికి మదన పల్లిలో పంచటానికి సుమారు 150 పుస్తకాలను ఇచ్చాం  ఏంతో సంతోషం గా వారు వాటిని తీసుకు వెళ్ళారు .ఈ విధంగా ఆవిష్కరణ రోజునే సుమారు 500 పుస్తకాలను ఉచితం గా అందరికి అందజేసి ఏంతో సంతృప్తి చెందాం

తరువాత ఘన మైన విందు ఏర్పాటు చేశాం .అన్ని పదార్ధాలు చాలా రుచికరం గా శుచిగా ఉన్నాయని మెచ్చుకొంటూ భోజనం చేశారు వచ్చిన వారందరూ .కిళ్ళీ కూడా చాలా బాగుందని మెచ్చారు .అన్నే వెంకటేశ్వర్లుగారు మరీ మరీ మెచ్చుకొన్నారు .శ్రీ ఆంజనేయ స్వామి వారికి చేయించిన అరిసెలు ప్రసాదం గా కోగంటి వారి బందుగణానికి అంద జేసింది మా శ్రీమతి ప్రభావతి  అరిసెల  ఐడియా ఆవిడదే .బాగా క్లిక్ అయింది .అందరికి ఉపయోగపడింది  జనవరి ఒకటి వైకుంఠ ఏకాదశినాడు స్వామి వారలకు చేసిన లడ్డూ పూజ ప్రసాదం లడ్డూ లను కూడా తెనాలి వారందరికీ అందించింది  వారి ఆనందానికి అవధి లేదనిపించింది వారి ముఖాలలో కనిపించిన సంతృప్తిని చూస్తే.

ఆవిష్కరణ కార్యక్రమం లో నేను ఆలోచన చేసినదాన్ని మా అబ్బాయి రమణ చక్కగా అమలు అయ్యేట్లు పూర్తీ బాధ్యతలు తీసుకొన్నాడు .ఆహ్వానాలు ,బానర్లు జ్ఞాపికలు ,స్టేజి ఏర్పాటు మైకు ,ప్రత్యక్ష ప్రసారం ,పుస్తకం డి టి పి అందులో దేవుళ్ళ దేవాలయాల ఫోటోల డి తీపి చేసిన శుశీల్ తో పెట్టించటం దగ్గరుండి సంతృప్తిగా చేశాడు .మైనేని వారి మన్ననలు అందుకొన్నాడు .సభను ఆసాంతం అద్భుతం గా నిర్వహించిన శ్రీమతి శివలక్ష్మి కి ప్రత్యెక అభినందనలు కెమెరా వాయిస్ రికార్డర్ లతో కార్యక్రమాన్ని కవర్ చేసిన మా సాంకేతిక సలహా దారు శ్రీ గంగాధర రావు గారిని యెంత పొగడినా తక్కువే .ఇందరి సహకారం తో ఈ కార్యక్రమం రూపు దిద్దుకొని ,అద్భుతం గా నిర్వ   హింప బడి అందరి ఆనందానికి హేతువైనది . జ్ఞాపిక రూప శిల్పి జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ కు   సరసభారతి కృతజ్ఞతలు .ఈ గ్రంధాన్ని ఇంత అందంగా ముద్రించి మాకు అందజేసిన శ్రీ రామా ఆఫ్ సెట్ ప్రింటర్స్ వారికి ,కవర్ పేజీ డిజైనర్ శ్రీ కళాసాగర్ గారికి ,దగ్గరుండి ముద్రణ విషయం లో జాగ్రత్తలు తీసుకొని అందజేసిన ఆత్మీయులు చలపాక ప్రకాష్ గారికి అభినందనలతో కృతజ్ఞతలు .

సభ లో పదనిసలు

1-కచేరీ వారు నాలుగున్నరకు వస్తానని అయిదుంబావుకు రావటం చిరాకు అనిపించింది

2-త్యాగరాజ అరధనోత్సవం లో త్యాగరాజ స్వామి కీర్తనలుపాడక పోవటం అన్నమయ్య పాటలు పాడి లాగుడు సంగీతం తో విసుగు తెప్పించటం అసహనాన్ని కలిగించింది .

3-ప్రత్యక్షప్రసారం మొదటి అరగంట లో నెట్ అందక ఇబ్బంది పెట్టింది తరువాత వీయిన అన్ని సోర్సులను ఉపయోగించి ప్రసారం  అంతరాయం కాకుండా జాగ్రత్త పడటం తో కొంత టెన్షన్ తగ్గింది

4- నది సంపాదకులు గ్రంధాన్ని గురించి చక్కగా క్లుప్తం గా ప్రసంగించ కుండా శాఖా చంక్రమణం చేయటం, అసలు అందులో సరుకు ఏముందో తెలియ జేయక పోవటం  మరీ ఇబ్బంది పెట్టింది

5-గౌరవ అతిధి రాకపోవటం –చాలామంది కి నిరాశ కల్గించింది

6-కోగంటి వారి కుటుబ సభ్యులు తాముకూడా సుబ్బారావు గారికి  తలొక   శాలువా కప్పటం దండ వేయటం చేయక పోవటం పద్ద వెలితి .చక్కని అవకాశాన్ని సద్వినియోగం చెసుకకో లేకపొయారేమో అనుకొన్నాను .ఆ ఎనభై అయిదేళ్ళ వృద్ధ జ్ఞానమూర్తిన ఉయ్యూరులో సత్కరించే మహద్భాగ్యం వారుకోల్పోయి నందుకు బాధగా ఉంది .

7- కుటుంబ సభ్యులలో భాస్కర్ ,పుష్పలత్ గార్లు తప్ప మిగిలిన వారు సుబ్బారావు గారి గురించి రెండుమాటలు చెప్పక పోవటం భావ్యం అనిపించలేదు .

సరిగమలు

1-మా కుటుంబ సభ్యులు దాదాపు హాజరై తలొక పనిలో భాగ స్వాములవ్వటం సంతోష కరమైన విషయ౦

2- చిన్నపిల్లలు కూడా హుషారుగా పాల్గొని తమ వంతు బాధ్యత నేర వేర్చటం

3-మా గుడి దగ్గరున్న  బడ్డీ బుడ్డి సోదరులు నిలబడి సేవలందించటం

4- మా గుడి అర్చకులు తమ ధర్మాన్ని సక్రమం గా నిర్వర్తించటం

5- వెయ్యి ఆహ్వానాలు పంచితే 125 మంది అంటే పదికి ఒకరు వంతున రికార్డ్ గా హాజరవటం

6- కార్యక్రమం ఒక గొప్ప వేడుకగా జరగటం .

7-ఇదొక తీపి గుర్తుగా మిగిలిపోవటం

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-15 –ఉయ్యూరు

 

 

.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.