ప్రేక్షకులకు మహా స్మైల్ పంచి
చివరికి మహా శోకం మిగిల్చి
”అసలేం జరిగిందో తెలుసుకోకుండా”
నారాయణ వెళ్ళిపోయాడు
నెమ్మదిగా నవ్వుల మలయ సమీరం గా ప్రవేశించి
”గాలి”లా చెలరేగి నవ్వుల సునామీ సృష్టించాడు
తాగినా తాగించినా వాగినా వాగించినా
వెరైటీ ని కల్పించి వినోదం పంచాడు
”రామనాధం గారూ !మీరు ప్రతి దాన్లో వేలు పెట్టి కెలక్కండి ”
”ప్రసాదూ !ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా ” డైలాగులు
వేణు, శ్రీరాంలు ఆవు వేషం లో ఉంటె పాలు పితికినశీను
ఏదీ మర్చిపోలేని మరువరాని సీన్లే పండించాడు
నవ్వుకు తానొక కొత్త అర్ధాన్ని సృష్టించి
నవ్వుల డిక్షనరీలో నింపాడు
అందుకే మహా సంతోషం కలిగించి
మహా శోకం మిగిల్చి దేవలోకం లో
నవ్వులు పంచటానికి వెళ్ళిపోయాడు
అక్కడ ఇంద్రుడినీ చిత్ర గుప్తుడి నీ
ముగ్గు లోకి దించి పెగ్గు లాక్కుంటాడు అనుమానం లేదు
ఆత ను ఇచ్చిన నవ్వుల నజరానాకు .
బాష్పాంజలి తప్ప మనమేం ఇవ్వగలం?
మీ -గబ్బిటదుర్గా ప్రసాద్ –
—
