విశాఖ చరిత్రపై విలక్షణ రచన
- -జిఆర్కె
- 24/01/2015

సమగ్ర విశాఖ నగర చరిత్ర
రెండవ భాగం
రచన: అంగర సూర్యారావు
పుటలు: 224;
వెల: రూ.200/-
ప్రతులకు: రచయిత,
22-67-6, చోపుదారుగల్లీ
టౌన్‌హాల్ రోడ్,
విశాఖపట్నం- 530001.
సుందర పరిసరాలు, అనుకూల సాగర తీరం వరాలుగా లభించిన విశాఖపట్నాన్ని ప్రపంచం విస్మయం చెందే రీతిలో మహానగరంగా తీర్చిదిద్దుతున్న కీలక సమయాన హుద్‌హుద్ అనే పెనుతుఫాను కకావికలు చేసింది. 2014 ద్వితీయార్ధంలో ప్రకృతి సృష్టించిన విలయాన్ని విశాఖ వాసులు ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వం విశాఖను విశ్వనగరంగా రూపొందించేందుకు స్థిర సంకల్పంతో తిరిగి సమాయత్తమైన విశేష సందర్భంలో ‘సమగ్ర విశాఖనగర చరిత్ర’ గ్రంథం వెలువడడం అత్యంత సముచితంగా వుంది.
గ్రంథకర్త అంగర సూర్యారావు ప్రముఖ రచయిత. 87 సం.ల పరిణత వయస్సులో ఈ బృహద్రచనను చేపట్టడం ప్రశంసనీయం. ప్రస్తుత గ్రంథం రెండవ భాగం. మొదటి భాగం క్రీ.పూ.4వ శతాబ్దినుంచి క్రీ.శ.1942 వరకు విశాఖ చరిత్రను వివరిస్తోంది. అంటే అశోకుడు కళింగరాజ్యంపై దండెత్తిన కాలంనుంచి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం వరకు సంఘటలు ఇందులో చోటుచేసుకున్నాయి. స్వరాజ్యోద్యమ కాలం నాటి సంగతులతో మూడవ భాగం రచన పూర్తిఅయిందని, అది త్వరలో విడుదల అవుతుందని రచయిత తెలియజేస్తున్నారు. నిస్సందేహంగా ఇదొక బృహత్ప్రయత్నం మహావిశాఖ నిర్మాణం యజ్ఞంలో భాగస్వాములైన వారందరికి ఇది ఉత్తమ స్ఫూర్తినిస్తుంది. విషయ బాహుళ్యం, పరిశోధనాత్మక విశే్లషణ, సమాచార సమగ్రత, అభివ్యక్తి స్పష్టత- ఈ రచనలోని ప్రత్యేకతలు. సూర్యారావు సుదీర్ఘానుభవం వున్న రచయిత కావడం, 1947నుంచి సవివర దినచర్యరాస్తూ వుండడం ఆయన కృషికి దోహదకారులయ్యాయి. ఇవి రచనను పఠనీయంగా, ప్రామాణికంగా చేశాయి.
సమీక్షిస్తున్న రెండవ భాగంలో కాంగ్రెసు పార్టీ అవతరణ నుంచి స్వాతంత్య్రావిర్భావం వరకు గల చరిత్రను పొందుపరిచారు. గ్రంథనామం విశాఖ నగర చరిత్ర అని వున్నా వాస్తవానికి దీని పరిధి అతి విశాలం. విశాఖకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. దీనిలో ఆంధ్రుల చరిత్ర, భారతదేశ చరిత్ర, స్వరాజ్యోద్యమ ఘట్టాలు, నాయకులు ఉద్యమకారుల జీవితాలు, ఆనాటి సాంఘిక సంస్కరణలు- ఇంకా ఎనె్నన్నో అంశాలు వివరంగానే తెలియజేశారు. గ్రంథం చివరి భాగంలో విశాఖ భౌగోళిక స్వరూపాన్ని వివరించారు. రచనాప్రణాళికను రచయిత విలక్షణంగా రూపొందించారు. విశాఖ ప్రస్తావన వున్న అంశం నేపథ్యాన్ని సుదీర్ఘంగా చూపుతూ అనేక విషయాలు పాఠకులకు అందించారు. సాధారణ పాఠకులకేకాక పండితులకు, పరిశోధకులకు, చరిత్రకారులకు ఉపకరించే వాస్తవాలను తేదీల

