ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-2
అస్తిత్వ వాద పిత -సోరేన్ కీర్క్ గార్డ్
పందొమ్మిదవ శతాబ్దపు డేనిష్ వేదాంతి కీర్క్ గార్డ్ .జీవితకాలం లో బాగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు .అసలుపేరు సోరెన్ ఆబె కీర్క్ గార్డ్ .దాదాపు మూడు వందల సంవత్సరాలు అతన్ని అందరూ మర్చేపోయారు .ఆ తర్వాత అతని గొప్ప తనాన్ని తెలుసుకొని ఆరాధించటం ప్రారంభించారు .క్రైస్తవ మిస్టిక్ గా భావించారు. ఆయన చెప్పిన కొత్త వేదాంతం చాలా వ్యతిరేకతను పొందింది .అస్తిత్వవాదాన్ని తెరపైకి తెచ్చాడు .5-5-1813లో కోపెన్ హాగెన్ లో జన్మించిన నూట ఇరవై నాలుగు ఏళ్ళ వరకు ఆయన రాసిన దానికి దేనికీ ఇంగ్లీష్ అనువాదం రాలేదు .ఆయన గురించిన కనీస సమాచారమూ తెలియనే లేదు .అదృష్టం బాగుండి 1940 లో ఆయన ప్రతిభను గుర్తించి సెయింట్ ఆగస్టేన్ తర్వాత కీర్క్ గార్డ్ వంటి మాట ప్రవక్త ,మనస్తత్వ శాస్త్ర వేత్త జన్మించలేదని ప్రశంసించారు .చర్చి ధోరణిలోని నిరంకుశత్వాన్ని ఎదిరించాడాయన . కఠిన నియమ నిబంధనలను కాదన్నాడు .
తండ్రి గొప్ప పవిత్ర వ్యాపార వేత్తయే కాని ప్రైవేట్ జీవితం లో పెద్ద పాపి .కొడుకును మతం లోకి లాగే ప్రయత్నం చేశాడు .నరక లోకం అగ్ని గురించి చెప్పి భయ పెట్టేవాడు తండ్రి ..ఆ వాతావరణం అతనికి సరిపడలేదు .’’నేను పుట్టినప్పుడే ముసలివాడిని .’’అని చెప్పుకున్నాడు .తనకు పసితనం బాల్యం యవ్వనం దూరమైనాయని వ్యధ చెందేవాడు .తండ్రి అంటే భయం కోపం పగ ద్వేషం అతనిలో నరనరాన వ్యాపించాయి దీనితో ఏ ఆనందాన్ని అనుభవించలేక పోయాడు .ప్రేమించటం అంటే ఏమిటో తెలియనే తెలియదు .అమ్మాయిలూ ఐ లవ్ యు చెప్పినా ,ఆ మధురానుభూతి కలిగేదికాదు .ప్రేమించిన అమ్మాయి ఈయన దగ్గర్నుంచి లవ్ సిగ్నల్స్ రాకపోతే వేరోకడిని పెళ్లి చేసేసుకోన్నది .ఈ భావాలను ఒక గొప్ప రచనగా ‘’యైదర్ ఆర్’’పేరిట రాశాడు .
మత వేదాంతం పై ద్రుష్టి పెంచుకొని మారుపేర్లతో వరుసగా అనేక గ్రంధాలు రాశాడు .అందులో ‘’ది కాన్సెప్ట్ ఆఫ్ ఐరనీ ‘’,ఫియర్ అండ్ ట్రెం బ్లింగ్ ‘’,వగైరాలున్నాయి .అతని దృష్టిలో ప్రతి నిర్ణయం రిస్క్ తో కూడినదే .అనంతత్వం చేతిలో నడిచే మనిషి తన నిర్ణయాన్ని సర్వం –శూన్యం ల మధ్య ఏదో దాన్ని ఎన్నుకోవాలి అన్నాడు .ఈ భావాన్నే ఇబ్సన్ ‘’బ్రాండ్ ‘’మొదలైన నాటకాలలో ప్రతిఫలింప జేశాడు .ముప్ఫై వ ఏట మత తత్వ శాస్త్రాన్ని గురించి తీవ్రం గా ఆలోచించి రాశాడు. ఈ భావాలు పాశ్చాత్య బుర్రల్ని వేడెక్కించింది కలవరపరచింది .వ్యంగ్యం, సందేశం కలగా పులగం చేసి విజ్రుమ్భించి రాశాడు .వ్యవస్తీక్రుతమైన ప్రతి వ్యవస్థ మీద తిరగబడ్డాడు .అధిక్షేపణ, అవహేళన లతో వారి మన స్తిమి తాన్ని దెబ్బ తీశాడు .యాంత్రిక యుగం లో మనిషి నిస్సహాయుడే కాకుండా నిరాశా వాదిగా మారిపోతున్నాడని బాధ పడ్డాడు .’’man became helpless and hopeless ‘’అన్నాడు .మనిషికి ఉన్న ఒకే ఒక ఆశ ఏమిటంటే తన ఉనికిని అర్ధం చేసుకోవటం మాత్రమె అని చెప్పాడు .మత బోధనలు ఆచారాలు మనిషిని దేవుడి దగ్గరకు చేర్చలేవని మనిషి స్వయం గా సూటిగా భగవంతునితో సంబంధం పెట్టుకోన్నప్పుడే అది సాధ్యం అన్నాడు .మనిషికి ఉన్న జ్ఞానం తెలివి తేటలు అతని అణకువ కు నిదర్శనం గా ఉండాలన్నాడు . వాటిని త్యాగం చేసుకొని దేవుని సమీపాన్ని పొందాలి అని చెప్పాడు .’’the existent individual is not a Being but a Becoming ‘’అనే సత్యాన్ని విశదీకరించాడు .క్రైస్తవ మతం కూడా ‘’is a Becoming –an endless progress through anxiety ,in security ,and suffering .It ceases to be Christianity when it sinks complacently into peace of mind ‘’అని రావాల్సిన మార్పును ఖచ్చితం గా సూచించాడు కీర్క్ గార్డ్ .
క్రైస్తవ ఫాదరీల దౌష్ట్యాన్ని ,అవివేకాన్ని ,పెత్తనాన్ని ,డబ్బు మనస్తత్వాన్ని ఎండగట్టాడు .యేసు క్రీస్తు చెప్పిన పరమ సత్యాలను వీరందరూ నీరు గార్చి స్వంత వ్యాఖ్యానాలతో ప్రజలకు మతాన్ని దూరం చేస్తున్నారన్నాడు ‘’.చర్చి క్రిష్టియానిటీని పూర్తిగా బహిష్కరించింది –‘’Church has practically abolished Christianity in the name of Christ ‘ అని నిర్మోహ మాతం గా చెప్పాడు కీర్క్ గార్డ్ .క్రీస్తును అడ్డం పెట్టుకొని ఆడే దొంగాటల వల్ల క్రైస్తవం పరువు గంగలో కలుస్తోందని వాపోయాడు .మత పెత్తనం పై విమర్శగా ‘’అటాక్ అపాన్ క్రిసేండం ‘’రాశాడు .మతాధికారుల పద్ద్ధతి ఎలా ఉందంటే ‘’for them Christianity does not exist –and yet they live on it ‘’అని కడిగిపారేశాడు .
సమకాలీన జీవితం లో అసంబద్ధతను వ్యతిరేకించి తిరస్కరించి ప్రక్షాళన కోసం పాటుబడ్డ మత వేదాంతిగా కీర్క్ గార్డ్ చరిత్ర పుటల్లో నిలిచాడు .ఈ విధం గా ఇ౦త నిర్మోహ మాటం గా మాట్లాడితే మతపెద్దలు సాహిస్తారా? ఎదిరించారు అణగ దొక్కే ప్రయత్నాలు చేశారు .పత్రికల వాళ్ళూ ఎదురు దాడి చేశారు .కార్టూనిస్ట్ లకు చేతినిండా పని దొరికింది .ఆయన బాహ్య ఆక్రుతిపై వ్యంగ్యాత్మక కధనాలు కార్టూన్లు గుప్పించారు కీర్క్ గార్డ్ సిం ప్లిసిటి ని ,హుమిలిటిని కోరాడు .’’man is a social paradox ,he is his own reason for being and yet he is nothing without the transcendent power of God .’’అని మనిషి శక్తిని చెప్పాడు. మనిషి కాలం లో జీవిస్తాడని ,కాని అతను తప్పకుండా కాలాతీతమైన భావన కలిగిఉండాలని ,ఉత్క్రుస్టత వైపు పయనం సాగించాలని మానవ మేధకు పరిమితికి మించిన జ్ఞానాన్ని పొందే ప్రయత్నం నిర౦ తరం చేయాలని కోరాడు .
తాను ఏమి కోరుకొంటున్నాడో చెబుతూ ‘’what I require is a voice as piercing as a lynx;s eye ,as terrible as the sigh of a giant ,as persistent as a cry of nature in order to deliver my self of what is in my mind ,to shake the bowels of anger ,sympathy ,and understanding .అన్నాడు .పరిస్తితులు చాలా తెలికైపోయాయని వాటిని కస్ట తరం చేసే ప్రయత్నాలు కావాలని కోరుకొన్నాడు కర్క్ గార్డ్ .ఇంతగొప్ప వేదాంతి నలభై మూడవ ఏట రోడ్డుమీద నడుస్తూ మూర్చ వచ్చిపడి పోయాడు .చూసిన వారు ఆస్పత్రిలో చేర్చారు అప్పటికే నడుమునుంచి క కింది భాగ మంతా పక్షవాతం వచ్చింది కదలలేని పరిస్తితి .మళ్ళీ గుండెపోటు వచ్చి 11-11-1855లో కర్క్ గార్డ్ నలభై మూడవ ఏట మరణించాడు .
సందట్లో సడేమియా లా మత పెద్దలు తమను కీర్క్ గార్డ్ వ్యతిరేకించ బట్టే పక్షవాతం పాలైనడని తమ పక్షపాత బుద్ధి పొని చ్చుకోకుండా కూశారు .తగిన శాస్తి జరిగిందని సంబరాలు చేసుకొన్నారు .సమకాలీనుల మెప్పు పొందక పోయినా ఈ కాలం లో కర్క్ గార్డ్ తిరుగులేని మత వేదాంతిగా ఆరాధింప బడుతున్నాడు .’’వాస్తవం ‘’పై ప్రశ్నలు సంధించాడు .అతని భావనలు ఆధారం గ ఫ్రాంక్ కాఫ్కా , ధామస్ మాన్ లు అనేక రచనలు చేసి గుర్తింపు పొందారు .నకిలీ క్రైస్తవాన్ని ఎదిరించాడు .’’mans affirming existence is greater than all the concepts of his intellect ‘అన్నది కీర్క్ గార్డ్ నిశ్చితాభిప్రాయం .దీన్ని ఆధారం చేసుకొని నోబెల్ ప్రైజ్ విన్నర్ జీన్ పాల్ సాత్రే అస్తిత్వవాదాన్ని అభి వృద్ధి చేశాడు . ఆధునిక మానవుడు ప్రకృతికి దూరమైపోతున్నాడని ,శాస్త్ర సాంకేతికలతో భగవంతుని నుండి తొలగిపోయాడని కీర్క్ గార్డ్ బాధ పడ్డాడు .’’ఇవాళ మానవుడు ఒక స్థాన భ్రంశం చెందిన మనిషి –displaced person ‘’అని సానుభూతి చెందాడు .
![]()
![]()
కీర్క్ గార్డ్ ప్రభావం మనవ మనస్తత్వ శాస్త్రం మీద చాలా ఉంది .క్రిస్టియన్ సైకాలజీ .ఎక్సిస్టేన్షియల్ సైకాలజీ, థెరపీలకు ఆద్యుడు .అస్తిత్వవాదమే మానవ వాదం అన్నాడు ‘ఫాదర్ ఆఫ్ ఎక్సిం స్టేలిజం ‘’అంటారు గార్డ్ ను .అస్తిత్వ వాదం తో మతాన్ని కొత్తమలుపు తిప్పిని ,దేవునికి మనిషికి మధ్య చర్చి చర్చిపెద్దలు అడ్డుగోడాలని భావించి ఆ గోడల్ని కూల ద్రోసె ప్రయత్నం చేసి చరిత్ర ప్రసిద్ధుడైనాడు కీర్క్ గార్డ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-15-ఉయ్యూరు

