|
నటనకు అర్ధం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన నటనను ఎంత వాడైనా పొగాడాల్సిందే. నటనకు నిలువెత్తు నిదర్శనం కోట శ్రీనివాసరావు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కేంద్రం కోటకు పద్మశ్రీ ప్రకటించడంతో….‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర బృందమంతా కోటకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రంలో కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో యూనిట్ సభ్యులందరూ ఆయనకు విషెస్ తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తున్న కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు నటి స్నేహలతో పాటు నిర్మాత రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కోటకు శాలువా కప్పి ఆయనతో కేక్ కట్ చేయించారు.
|

