శ్రీ కళ్ళే పల్లి శివరామయ్య – శ్రీమతి కళ్ళే పల్లి వేంకట రమణమాంబ
‘ఆంధ్రలక్ష్మి’ మాస పత్రిక 1921
‘ఆంధ్ర’ పేరు కలిగిన స్త్రీల పత్రిక. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్ర అనే
పదం అనేక సంస్థలకు, వ్యాపారాలకు ఆంధ్ర మహాసభల ప్రభావం వల్ల విరివిగా
వాడటం జరిగింది. అనేక పత్రికలపేరులో ఆంధ్ర అనే పదము ఉపయోగించడము జరిగింది.
అటువంటి పత్రికలలో ఇది ఒకటి. డిసంబర్ 1921 ప్రథమ సంచిక గంజాం జిల్లా ,
బరంపురం పట్టణం నుంచి ప్రచురించబడింది

