ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4
ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -2
అప్పుల వాళ్ళను తప్పించుకోవటానికి రష్యా నుండి కుటుంబం తో పారిపోయిన వాగ్నర్ సముద్రం అల్ల కల్లోలం గా ఉండటం వలన వారం రోజుల్లో చేరాల్సిన ఓడ మూడు వారాలు పట్టింది ఇంగ్లాండ్ చేరటానికి .సముద్ర భీభత్సం ప్రక్రుతి అతనిలో అలజడి రేపి మూడ వ ఒపెరా ‘’ఫ్లైయింగ్ డచ్ మాన్ ‘’కు నేపధ్యం దొరికింది .అంతకు ముందే హీన్స్ రాసిన ‘’మేమాయిర్స్ ఆఫ్ శ్నాబెలోస్కి ‘’చదివి ఉన్నాడు. కనుక ఈ నల్లని మబ్బులతో నిండిన ఆకాశం, గర్జించే సముద్రం ఒక నేపధ్యం గా దానికి చేకూర్చాలని భావన కలిగింది .ఈ కొత్త సంఘటనల ముద్ర మనసులో గాఢమై అలజడి రేపింది .లండన్ నుంచి మధ్య ప్రాచ్యం లోని బోలోన్ చేరి అక్కడ తన రీన్జీ ని మెచ్చిన మేయర్ బీర్ ను కలిశాడు .ఒక నెల గడిపి పారిస్ చేరాడు .చేరిన ఊరుకోకుండా తనకు ఎక్కువ అప్పిచిన వాడికి ‘’మీకు రుణపడి ఉండటం నాకు ఏంతో సంతోషం గా ఉంది ‘’అని ఉత్తరం గిలికి అయిదేళ్ళ తర్వాత తాను కూర్చిన ‘’జూడాయిజం ఇన్ మూజిక్ ‘’లో అతనిని అతనితో పాటు అప్పులిచ్చిన మిగిలిన యూదుల్ని తీవ్రం గా దూషించాడు .
పారిస్ వచ్చాడే కాని వాగ్నర్ బతుకు పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది .నరకం అనుభవించాడు .కటిక దరిద్రాన్ని అనుభవించారు .ఈ పరిస్తితులన్నీ అతని మనో ఫలకం పై తీవ్ర మైన చెరగని ముద్రనే వేశాయి..ఒక గదిలో ఉంటె లాడ్జి వాడొచ్చి ఆక్రమించుకొని ఇబ్బంది పెట్టటమే కాదు వాగ్నర్ భార్య మిన్నా తో బూట్లు కూడా తుడిపించుకొని అవమానించాడు .అప్పటికే భార్య దగ్గర ఉన్నది అంతా ఊడ్చిపారేసిన వాగ్నర్ ఇంకా అడుగూ బొడుగూ ఉన్నాయేమో నని డబ్బు కోసం పీడించి చివరికి ఆమె కట్టుబట్టలు తప్ప ఏమీ లేకుండా చేశాడు ఈ మహానుభావుడు .రొట్టె కొనుక్కోవటానికీ చేతిలో చిల్లి గవ్వ లేని నికృష్ట పరిస్తితి .పోట్టగడవాలి కనుక ఫ్రెంచ్ కవితలకు పియానో ట్యూన్లు కట్టాడు,ప్రూఫ్ రీడింగ్ లు చేశాడు .లిబ్రేట్తో లను అనువాదం చేశాడు .చిన్న నవలలు స్కెచ్ లు వ్యాసాలూ పుస్తక సమీక్షలూ చేశాడు. చివరికి మురికి కూపం గా ఉన్న ఒక చిన్న దియేటర్ లో కోరస్ గ్రూప్ లో స్థానం పొంది పాడాడు కాని ఆర్కెస్ట్ర యజమాని వాగ్నర్ పాట సరిగ్గా పాడలేదని ,పాడటం రాదని గ్రహించి తీసేశాడని వాగ్నారే చెప్పుకొన్నాడు .ఇలా పారిస్ బులపాటం తీరింది .
తిండిలేక మాడుతూ దుర్భర ఒంటరి జీవితం గడుపుతూఉన్నా ‘’రీంజి ‘’కి సంగీతం కూరుస్తూనే ఉన్నాడు .దీని ని ప్రదర్శించటానికి డ్రెస్ దేయిన్ లోని ఒపేరా హౌస్ అంగీకరించింది .బెర్లిన్ లో హిట్ అయిన ‘’దిఫ్లైయింగ్ డచేస్ ‘’ను కూడా ప్రదర్శించే ఏర్పాటు జరిగింది .ఈ డచేస్ ప్రతి ఒపేరా హౌస్ లో ప్రతిధ్వనిస్తూనే ఉంది .తన జీవితపు చీకటిని ప్రతిఫలింప జేశాడు .భర్తకోసం సర్వస్వాన్ని త్యాగం చేయటానికి హక్కు కోరిన స్త్రీ కద అది .ఒక విధం గా ఇది వాగ్నర్ జీవిత చరిత్రే జర్మనీ లో ఉండటానికి నోచుకోలేక పారిస్ లో కనీసం ఉండటానికి ఇల్లుకూడా లేని జీవిత పరిస్తితి .మూడేళ్ళ ఈ దీన హీన నికృష్ట దుర్భర జీవితానికి తెరపడి ఆశా సూర్యోదయం అయింది .జీవితం లోచీకటి పోయి వెలుగు రేఖలు ప్రసరించటం ప్రారంభ మైంది .
అప్పు చేసి ప్రయాణం టికెట్లు కొనుక్కొని రీంజి ప్రదర్శన కోసం డ్రెస్ డేయిన్ వెళ్ళాడు .ప్రదర్శన విపరీతమైన విజయాన్ని సాధించి బీద వాడిని భాగ్య వంతుడిని చేసింది .డచేస్ కూడా ప్రదర్శింపబడి ఆదాయాన్ని పెంచింది .ముప్ఫై రెండేళ్ళు నిరాశలో లో మగ్గిన వాడికి ముప్ఫై మూడవ ఏట అదృష్టం తలుపు తట్టింది .’’రాయల్ కండక్టర్ ‘’ఉద్యోగం వరించింది .హాయిగా కాలు కదల్చకుండా కూర్చునే ఉద్యోగం గౌరవం. కాని మనవాడికి సంతృప్తి తక్కువ .ఆరేళ్ళు ఇక్కడే గడిపాడు . రొటీన్ గా రోజూ రిహార్సేల్స్ ,ప్రదర్శనలతో బోర్ కొట్టింది గురుడికి .సమకాలీన సంగీత కర్తలు మెండేల్సాన్,షూమన్ లతో పెద్దగా పరిచయం పెట్టుకోలేదు కారణం వారిని తనకు పోటీదార్లుగా భావిం చటమే .జీతం బాగానే ముడుతోంది కాని విలాసాలకు మరిగి వచ్చింది చాలటం లేదు .మళ్ళీ అప్పుల ఊబిలో నిలువునా కూరుకు పోయాడు .’’జేసేస్ ఆఫ్ నజారేత్ ‘’,ఫ్రెడరిక్ బార్బరోసా ‘’అనే రెందు సంగీతనాటకాలకు సంగీతం చేయాలనుకొన్నాడు కాని రెండిటినీ వదిలేశాడు ,చివరికి డ్రెస్ డేయిన్ లో ‘’ట్రాన్స్ హేజర్ ‘’కు తర్వాత ‘’లోహేన్గ్రిన్ ‘’ లకు మాత్రం సంగీతం చేశాడు.ఇటాలియన్ శైలి ఒపెరాను ‘’దుస్తుల్లో కచేరి ‘’-concert in costume ‘’అని గేలి చేసేవాడు .
వాగ్నర్ కూర్చే సంగీతం లో సంగీతం సాహిత్యం ,నటన పూర్తిగా కలిసి పోయి ఉండేవి .అతనిలోని నాటకకవి పురి విప్పి నాట్యం చేసేవాడు .అతని ఊహ అత్యద్భుతం .అతని పాత్రలు రక్తమాంసాలతో సజీవం గా ఉంటాయి .ఆ కాలం లో వాగ్నర్ తన’’ లోహెన్ గ్రిన్ ‘’లో శక్తి యుక్తులన్నీ విజ్రుమ్భి౦భి౦ప జేసి ఉన్నత శిఖరం చేరాడు ని విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు .అది వాగ్నర్ యుగం అన్నారు .ప్రశాంత మైన కాలం అని కితాబిచ్చారు . యెంత గొప్ప పేరు వచ్చిందో అంతే గొప్పగాడ్రెస్ డేయిన్ లో ‘’అప్పుల డ్రెయిన్’’ లో దిగిపోయాడు .డ్రెస్ డేయిన్ ఆర్కెస్ట్రాలో తీవ్రమైన మార్పులు చేయాలని సూచించేవాడు కాని .ఎవరూ పట్టించుకో లేదు .సంస్కరణ చేద్దామంటే ఒప్పుకోక పోయే సరికి తిరుగుబాటు దారుడిగా అవతారం ఎత్తాడు వాగ్నర్ .రష్యా అరాజక వాది అంటే అనార్కిస్ట్ అయిన బకూనిన్ తో కలిసి ‘’సీగ్ ఫ్రీడ్స్ డెత్ ‘’అనే మహాకావ్య కధను తీసుకొని సంగీతం కూర్చాడు .అరిస్టాక్రసి కి వ్యతిరేకం గా సాగే కధగా తీర్చాడు .1849లో దేశం లో అశాంతి నెలకొని ప్రజలు తిరుగుబాటు చేశారు .వీదులన్నితికి బారికేడ్స్ పెట్టి సైన్యం పహరాకాసింది.తిరుగుబాటు దారులపై సైన్యం తుపాకీ గుళ్ళ వర్షం కురిపించింది .వాగ్నర్ విప్లవవాదుల పక్షం లో చేరి పాల్గొన్నాడు ..తిరుగుబాటును సైన్యం అణచేసి నాయకులను అరెస్ట్ చేసింది .వాగ్నర్ ఒక’’ కోచ్ వాలా’’ వేషం లో వీమర్ కు పారిపోయాడు .అక్కడ ఫ్రాంజ్ లిజ్ అనే తన’’ట్రాన్స్ హేజర్ ‘’ను ప్రదర్శంచిన అతని దగ్గర శరణార్ధిగా ఉందామనుకొన్నాడు .ఆయన ఒప్పుకోలేదు .జర్మనీలో ఎక్కడా ఉండటానికి నీడ దొరక లేదు .అతన్ని అరెస్ట్ చేయటానికి పోలీస్ వారంట్ సిద్ధం గా ఉంది .లీజ్ చూపిన ఔదార్యం తో ఎవరికీ తెలియకుండా జూరిచ్ చేరి భార్య మిన్నాను కలుసుకొన్నాడు .ఇక్కడే పదేళ్ళు ప్రవాస జీవితం గడిపాడు ఆ సంగీత కర్త వాగ్నర్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-15- ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,467 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

