’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14
శాంతి సంరక్షణలో రామయ్య
జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake of defending peace ‘’ మాట చెవుల్లో రింగు మంటూనే ఉంది .ఒక సారి అశోక చక్రవర్తి గుర్తుకు వచ్చాడు కళింగ యుద్ధం గెలిచి ,ఆయుధ విసర్జన చేశాడు .లెనిన్ దేశాలమధ్య శాంతి ఉండాలన్నాడు .కాని ఇప్పుడు ఆస్ట్రియా ,జెకోస్లోవేకియా ,పోలాండ్ ,స్పెయిన్ లు యుద్ధ జ్వాలల పొగలతో నిండిపోయి ఉన్నాయి .మందు గుండు సామగ్రి పొగలే అవి .ఆ వాసన రష్యా సరిహద్దుల దాకా వచ్చేసింది .ఇలాంటి పరిస్తితులోస్తే అశోకుడు మళ్ళీ కత్తి పట్టేవాడు అనుకొన్నారు రామయ్య ఇలాంటి ఆలోచనలు మనసులో సుళ్ళు తిరిగి తిరిగి అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు .తన శక్తి యుక్తులు సామర్ధ్యం అన్నీ రష్యా దేశ రక్షణ ను బలోపేతం చేయటానికే ఉపయోగించాలని నిర్ణయించుకొన్నారు .ఆ రోజుల్లో ఒక రోజు ఒక గంట లాగా గడిచిపోయింది రామయ్యగారికి ఆయన బృందానికి .
జర్మనీలో ఫాసిజం పతనం -రిపబ్లిక్ అవతరణ
గేర్నికా తర్వాత కొప్పెన్ చార్జి హాండ్ ఓవర్ చేయటానికి వచ్చాడు .ఆతను లేకుండా ఎలా పని చేయాలో అర్ధం కాలేదు .వెళ్ళ వద్దని చెప్పారు రామయ్య .అతను వినలేదు .రక్షణ లేని తన ప్రజలను ఆ ద్రోహులు విచక్షణా రహితం గా చంపేస్తుంటే ఇక్కడ ఉండలేనన్నాడు .అన్నిటికంటే ఆత్మ గౌరవం ముఖ్యం అన్నాడు .తానూ నిజాయితీగల మనిషిని అని రుజువు చేసుకోవాలన్నాడు .కోపెన్ తన రిపబ్లిక్ ను రక్షించుకోవటానికి క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు .యుద్ధం లో అతనికేమైందో తెలియదు .యుద్ధం అయిపోయిన తర్వాత అతను క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోష పడ్డారు .గాయాలైనా బతికి బయట పడ్డాడు .రిపబ్లిక్ పతనం అయిన తర్వాత పైరెంసేస్ నుండి ఫ్రాన్స్ కు వెళ్ళాడు .పోలీసుల కోరలనుండి తప్పించుకో గలిగాడు .అదృష్ట వశాత్తు కోపెన్ ను నాజీలకు అప్పగించటం జరగ లేదు .దేశభక్తి యుద్ధం లో కోపెన్ సోవియట్ యూనియన్ తరఫున పోరాడాడు .ఫాసిజం పతనం అయిన తర్వాతనే జర్మనీలో కాలు పెట్టాడు .జర్మనీ డెమోక్రాటిక్ రిపబ్లిక్ లో ప్రముఖ సైంటిస్ట్ లలో రాజకీయ వేత్తలలో ప్రముఖుడైనాడు కోపెన్ .ఒక సారి ‘’కాంగ్రెస్ ఆఫ్ దిడిఫెన్స్ ఆఫ్ పీస్ ‘’లో కోపెన్ కనిపించాడు .రామయ్యగారికి ఆనందంగా షేక్ హాండ్ ఇచ్చి ‘’ఇదీ నా జర్మనీ ‘’అని పొంగిపోతూ చెప్పాడు గర్వంగా .అప్పుడు రామయ్యగారికి’’ సంతోషపు అదృష్టం ప్రజల సుఖం కోసం పోరాడి నప్పుడే లభిస్తుంది’’అని తెలిసింది .
నిజమైన కామ్రేడ్
రామయ్యగారు తానూ రష్యన్ నిర్మాణపు పనివాడుగా ఉండేవాడినని పోల్చుకొన్నారు .తాను జియాలజిస్ట్ అయి ఉంటె గొప్ప నిర్మాణాలు చేసి ఉండేవాడిని అనుకొన్నారు .అయినా తాను కార్మికుల సమీపం లో ఉండే పని చేశారు .రామయ్య గారిలో ఉన్న పని నైపుణ్యాన్ని చూసి వాళ్ళు మహదానందం పొందేవారు .మిగిలిన వారిలాగా రామయ్య గారు ఉ౦డేవారు కాదు .’’నా శరీరం రంగు ను బట్టి కాదు .వారిని అర్ధం చేసుకోవటం లో నేను ముందుండే వాడిని ‘’ఆని చెప్పుకొన్నారు మాటల కామ్రేడ్ కాదు చేతల కామ్రేడ్ రామయ్య .అధికారులు హోదా ఉన్నవారు పెట్టుకొనే స్పెషల్ కాప్ ను కాకుండా వర్కర్లు పెట్టుకొనే టోపీ ని పెట్టుకొనే వారు రామయ్య .ఇదే చాలా సదుపాయం గా ఉండేది .లాబ్ లోని వారు దీనికి ఆశ్చర్య పోయేవారు .కాని తన పధ్ధతి మార్చుకోలేదు .వర్కింగ్ క్లాస్ కు అతి సన్నిహితం గా ఉండటం లో రామయ్య ఆనందాన్ని అనుభ వి౦చేవారు .
తనజీవితం లోని సంఘటనలను వారితో పంచుకోమని కోరేవారు .కాని రామయ్య ఏమీ మాటాడే వారుకాదు .చాలా సార్లు బతిమాలిన తర్వాత చెప్పారు తన గురించి వారికి .తన తండ్రి తనను తీర్చి దిద్దారని ,పని ఎలా చేయాలో బోధించారని ,తాను బొగ్గు రూమ్ లో ,బరువులు మోయటం లో పని చేశానని కనుక వర్కింగ్ క్లాస్ అంటే సహజంగా ఇష్టం అని చెప్పారు .ఈ టోపీ నే రామయ్యగారు జీవితాంతం పెట్టుకొన్నారు .అదే హాపీ ఆయనకు .రష్యా రివల్యూషన్ ప్రజలను అణచి వేతనుండి స్వేచ్చను ప్రసాదించి ,విద్య ,ఐచ్చిక సేవ లను అంద జేసింది .అంత మాత్రాన రివల్యూషన్ వారికి ఒక్క నిమిషం లో అన్నీ సమకూర్చలేదుకదా .అయితే ఒక గొప్ప మార్పు ‘’మనపని మన దేశం ,మన అకాడెమిక్ పావ్లోవ్ ,మన సోవిఎట్ మొదలైనవి మహా ఇష్టంగా ప్రజలు మాట్లాడుకొంటున్నారు. ఒకరికొకరు దగ్గరైపోతున్నారు .ఇప్పుడు రష్యా ఒక స్వయం సిద్ధ రాజ్యం గా ఎదుగు తోంది. దానికి తన సర్వ శక్తులు ఒడ్డు తున్నాను అనే గొప్ప సంతోషం రామయ్యగారికి కలిగింది .
రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం
జపాన్ అంతా అణుబాంబు దాడిలో ధ్వంసమై పోయింది .రాజధాని టోక్యో సగం బూదడిదయింది .స్నేహితుడు హషిమాటో చెప్పిన నిజాలు ఇవి .అతని ఇల్లు కుటుంబం అడ్రస్ లేరు .అయితేయేం ఇపుడు అసలైన జపాన్ ఏర్పడింది అని సంతోషించాడతను .శిధిలాలనుంచి నూతన జపాన్ ఆవిర్భ వించింది .హాషి మాటో ఆత్మహత్య చేసుకొందామనుకొన్నాడు కాని మారిపోయి రాజుకు విదేయుడైపోయాడు .అతనిది ‘’సమురాయ్ గర్వం ‘’జపాన్ ఆర్దికాభి వృద్ధిలో కనులు మిరుమిట్లు గొలిపే స్థాయిని చేరుకొన్నది .ఫీనిక్స్ పక్షి బూడిద లోంచి మళ్ళీ పుడుతుందట .అలానే జపాన్ కూడా ప్రపంచం లో నేడు అగ్రాభాగాన అన్నిటా నిల్చింది .అదీ ఆప్రజల ,పాలకుల వజ్ర సంకల్పం .కాలం అనేక మార్పులు తెస్తుంది .అందులో మనం ఒదిగి పోవాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15-ఉయ్యూరు

