|
ఆమె రెల్లిలోక వైతాళికురాలు
ఆమె పేరు చెబితే చాలు కక్షలు కట్టిన కుల వివక్షలు చెంబులు పట్టుకొని పారిపోతాయి మానవ మలమూత్రాల్ని పరిశుభ్రంచేసే గంగా భాగీరధురాలు అవమానాల గరళాన్ని దాచుకున్న తిట్ల కెరటాల సముద్రురాలు తరతరాల తాతల నేతివాసనల్నే కాదు వాళ్ళు వదిలేసి వెళ్ళిన వారసత్వాల పీతి వాసనల్ని పీల్చుకుంటూ వచ్చిన పీడితురాలు ఆమె పాదం మోపితేనే మరుగుదొడ్లకు విముక్తి భగవంతుడి ప్రసాదమైనా అమ్మవారి తీర్థమైనా ఆమె చేతిలో పవిత్రం కావాల్సిందే వేలవేల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో భూమి పీతి గంపల చుట్టే తిరుగుతూ వస్తోంది ఉదయాన్నే సిగ్గులేని సూర్యుడు సత్తురేకుల మీదుగా చీపురు కట్టల మీదుగా ఉదయిస్తూంటాడు అది నిన్నటి కథ ఇప్పుడా వూళ్ళో కొత్త ఉషోదయం ఏ పాకీ పడతీ నెత్తిమీద మలం బుట్టలతో కనిపించట్లేదు ఏ వృద్ధ మెహతర్ మైళ్ళదూరం నడిచి అశుద్ధాన్ని అవతల పారేయట్లేదు ఇప్పుడే కార్మికురాలూ ఖర్మకాలి కంపుకొట్టే మరుగుదొడ్ల నరకంలో దుర్భర శ్వాస పీల్చుకోవట్లేదు ఉషా చామర్! సఫాయిరాణిలా దూసుకొచ్చి ఒక పోరాటమే ప్రకటించింది ఒక మల యుద్ధమే చేసింది సొంత ఆస్తి ఉన్నట్టు సొంత శౌచాలయాలు కట్టుకోవాలని కట్టడి చేసింది కుల నిర్మూలనే కాదు మల నిర్మూలన జరగాలని గర్జించింది పారిశుద్ధ్య కార్మికురాళ్ళకు పనిగౌరవం కల్పించింది అమానుషత్వ బానిసత్వంలోంచి బాలకల్ని బయటికి లాగింది ఒకస్వేచ్ఛా ప్రపంచాన్ని చూపించింది ప్రపంచం ఆమెవైపు చూసేలా చేసింది ఆమె గొంతు వినబడిందా వీధులన్నీ వినయపూర్వకంగా నిలబడతాయి ఆమె కాలు కదిపిందా దుర్లభాలన్నీ ‘సులభా’లైపోతాయి ఆమె నోరు విప్పిందా ఆత్మగౌరవాలన్నీ అత్తరుపూల దండలై ఆమె కంఠాన్ని అలంకరిస్తాయి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దాకా ఆమె కీర్తి పరిమళం పరివ్యాప్తించింది ఇప్పుడు రాజస్థాన్‌లోని ఆల్వార్ గ్రామం రెల్లిపేటలో ఉషోదయమంటే ఆమె రూపమే కనిపిస్తుంది ఎండ్లూరి సుధాకర్
9246650771
(2008 న్యూయార్క్‌లో ‘ప్రిన్సెస్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్’ కిరీటాన్ని దాల్చిన ఉషా చామర్‌ని బ్రిటన్ దేశం కూడా
|

