“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

రామయ్య గారి సాహిత్య కృషి

ఏటుకూరి బలరామ మూర్తి రాసిన ‘’ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ ది హిస్టరి ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంద్ర ‘’అని పుస్తకాన్ని రామయ్యగారు రష్యన్ భాషలోకి అనువదించారు ఈ అనువాదానికి జోర్యా పెట్రుచినోవా ,అనే తెలంగాణా ఉద్యమ విద్యార్ధి సహకరించాడు .అతనే మొట్టమొదటి సోవియెట్ ఫైలాలజిస్ట్ .ఆతను తెలుగు భాష ,సాహిత్యం లో ప్రత్యేక  కృషి చేశాడు రష్యన్ అనువాదం 1956 లో మాస్కో లో ప్రచురింపబడి విడుదలయింది .రామయ్య గారు మొదటి తెలుగు –రష్యన్ నిఘంటు నిర్మాణానికి కృషి చేశారు .దీనికి కొందరు ఇండాలజిస్ట్ లు స్వెత్లానా జీనిట్ ఆధ్వర్యం లో సహకరించారు .

‘’  ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు విజ్ఞానపు  వెన్నెలొచ్చెనమ్మా ,వెల్లువచ్చే నమ్మా ‘’

రామయ్య గారి మాటల్లో ఇండియా సందర్శన విశేషాలు

‘’1963 ఏప్రిల్ లో విమానం ధిల్లీ లో దిగింది .బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలుంది .అంత వేడిని నేనెప్పుడూ భరించలేదు .ఉత్తర దేశాలలోనూ ఇంత ఎండ చూడలేదు .ఏం చేయాలో పాలుపోలేదు .ఎవరొ ఒకరు కరు  నన్ను  కలవటానికి వస్తారని ఎదురు చూస్తున్నాను .రష్యన్ ఎ౦బసీకి మాత్రమె నా రాక తెలుసు .బంధువులనుండి అప్పుడప్పుడు గ్రీటింగ్ కార్డ్ లు అందాయి . వారెవరో  నాకు పూర్తిగా తెలియదు .భగవంతుడికే తెలియాలి ఆ బంధుత్వం .దాదాపు అర్ధ శతాబ్దకాలం  ఈ నేల మీద అడుగు పెట్టనే లేదునేను .

విమానం దిగుతూ మెట్లమీద కొంత గందర గోళం లో నేను నిలిచిపోయాను .ఎదుట జనం బాగా ఉన్నట్లు కనిపించారు .వారందరూ  ఎవరికోసమో  వచ్చినవారు అనిపించింది .నాకోసం అని నేననుకోలేదు  నావెనక ఎవరైనా ఉన్నారేమో చూశాను. కాని ఎవరూ లేరు .నేనే విమానం దిగిన చివరి వాడిని .అప్పుడు తెలిసింది ఈ వచ్చిన వారంతా నాకోసమే, నన్ను కలవటానికే  వచ్చారని .అక్కడ చేరిన జనం నవ్వుతున్నారు .కొందరు పాటలు పాడుతున్నారు .వారందరూ యువకులే అనిపించింది ఆ క్షణంలో .అన్ని వయసుల వారూ అందులో ఉన్నారు .మగ వారు ,ఆడ వారూ కనిపించారు .అందరు అత్యుత్సాహం గా నాదగ్గరకు వచ్చి స్వాగతం చెప్పారు .నాకు ఉక్కిరి బిక్కిరి అయింది .ఆనందం కలిగింది .కంగారు పడ్డాను .విచిత్రం ఏమిటంటే అందులో ఎవరూ నాకు తెలిసిన వారు లేరు  .అంతమంది అంత ఉత్సాహం గా అక్కడ చేరి నాకు  మనస్పూర్తిగా ఆహ్వానం పలకటం నేనెప్పుడూ చూడలేదు .కాసేపు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాను .కాసేపటికి తేరుకొని వచ్చిన వారిలో ఎక్కువ మంది నా బంధువులు కూడా ఉన్నారని తెలుసుకొన్నాను .అర్ధ శతాబ్దం తర్వాత వచ్చిన నాకు వారందరూ కొత్త వారే .కాని అక్కడున్న వారిలో నా ఆంద్ర జనం చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది .అక్కడ చేరిన వారిలో ధిల్లీ వాసులు తమిళులు ఎక్కువ మంది ఉన్నారు .కేరళ నుంచి వచ్చిన వారూ ఉన్నారు .అప్పుడు నాకు ‘’ భారత మాత ‘’నన్ను ఆహ్వానిస్తోంది అనిపించింది .ఒక ఆవిడకు వంగి నమస్కరిస్తే ఆమెకూడా అలాగే చేసింది .ఆమె నవ్వింది .రెండు చేతులు జోడించి సంప్రదాయ బద్ధం గా నమస్కరించింది .’’మీకు కృతజ్ఞులం లాల్ ‘’అన్నదామె .వాళ్ళు నాకు కృతజ్ఞత చెప్పటం ఏమిటి అని పించింది .ఇన్నేళ్ళు అయినా నేను నా భాషను ,ఆచార వ్యవహారాలను మర్చిపోలేదని తెలుసుకొన్నాను .నేను వచ్చింది నాకు ఆరంభాన్నిచ్చిన ఈ నేలకు నేను గౌరవ వందనం ,కృతజ్ఞత చెప్పాలని  . వాళ్ళను మర్చిపోలేదని ,తేలిక భావం తో చూడలేదని వారు గ్రహించారు. వాళ్ళ ఆశలను వమ్ము చేయ లేదని సంతోషించారు .వాళ్ళు అనుకొన్నట్లు నేను తాసీల్దార్ కాలేక పోయానని  ,పనికి రాని  పువ్వుగా ఉండిపోలేదని తెలుసుకొన్నారు .నన్ను చూసినందుకు వారందరికీ సంతోషం సంతృప్తి కలిగింది .నా జీవితం ఆ దేశం లో వ్యర్ధం కాలేదని పొంగిపోయారు .నేను నా జీవితం లో ఇండియాకు రష్యాకు సమానంగా చెందినా వాడిలాగానే ఉన్నాను .భారత మాత పుత్రుడొకడు రష్యాలో ప్రసిద్ధు డయ్యాడని వారు తెలిసి సంబర పడ్డారు .నన్ను చూసి గర్వ పడ్డారు .నాలో వారు  కష్టమైన మార్గం లో పయనించి సత్యం ,సంతోషం లకు చేరువయ్యే భారత దేశాన్ని చూశారనిపించింది   ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to “కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

  1. rasanablog's avatar rasanablog says:

    chaalaa goppa vyaasam. entO aalasyamgaa chooSaanu. doctor kolachala seetaramaiah gaari peru naa chinnapaTi nunchee maa inTlo vinTunnade. appuDappuDu patrikallo kuDaa chadivaanu. anniTikee minchi ma naanna gaaru -Late MVN. Kaparde- Moscow lo doctor seetaramaiah gaarini kalisaaru. Moscow lOnE chaduvukunna maa annayya -Late Mandalaparthy Baburao- kuuDaa aayanni akkaDE kaliSaaDu. vaaLLu aa mucchaTlu tarachu cheppEvaaru.
    inta manchi vyaasam lo kuudaa chinnachnna tappulu dorlaDam vichaarakaram . zora perunicheva (Dr.Z. N. Petrunicheva) “telangaaNa udyama vidyaarthi” kaadu. aame oka mahila, padakOSaaluu, nighanTuvuluu rachincaaru.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.