“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రామయ్య రష్యాకు తిరుగు ప్రయాణం

హృదయ యంత్రం శిదిలమైంది

‘’నేనెక్కిన విమానం తాష్కెంట్ వైపు దూసుకు పోతోంది .నా వెనక ,కిందా ఇండియా ఉంది .పర్వతాలు శిఖరాలు లోయలు నదులు కనిపించి కనుమరుగై పోతున్నాయి .కింద భూమి ,పైన ఆకాశ౦ మాత్రమె  ఉన్నాయి .మళ్ళీ కలిసే దాకా ఇండియా నీకు వీడ్కోలు పలుకుతున్నాను .నా యువ కిశోరాల్లారా !మీకు గుడ్ బై చెప్పను .హలో రష్యా వచ్చేస్తున్నాను .ఎప్పటికైనా నీకూ వీడ్కోలు చెప్పాల్సి౦దేగా నేను .ఇక కాలం పెద్దగా మిగల లేదు .కొన్ని నెలలో రోజులో ?కాని నేను చేయాల్సింది చాల ఉండిపోయిందే .నేను గుండె జబ్బు మనిషిని కూడా .నా ‘’గుండె ఇంజన్ ‘’ముసలిది పనికి రానిది అయి పోయింది .ఇక దానికి ఏరకమైన లూబ్రికంట్లు వాడినా  ,ఎడిటివ్ లు మార్చినా  ఏమీ పని చేసే శక్తి లేదుదానికి .  హృదయ యంత్రం శిధిలమైంది .అవి నిష్ఫలం కూడా .నేనేమీ ముసలివాడినికాను .బాధా పడటం లేదు . అకస్మాతుగా ఊపిరి అందటం లేదు .పై పెచ్చు నీరసం ఒకటి ఏడ్చింది .నీరసం, నీరసం   అదే బాధ .అంతకంటే ఏమీ లేదు .’’

హిమనగాలపై వాయుయాన అనుభూతి  -తన పరిశోధనలతో పోలిక

‘’సర్వ సమర్ధుడు దైవం అయిన  శ్రీరాముడు ఇండియా నుండి లంకకు వెళ్ళాడు .అప్పుడు ఆయనకు విమానం లో ఒక సీట్ లో కూర్చోమని ఆహ్వానించి ఉంటె ,హిమాలయాలమీదుగా ప్రయాణించి, మన పైలట్లు తన లాగా దైవ సమానులు అని ప్రకటించి ఉండేవాడు .అందులోని ఎయిర్ హోస్టెస్ లను అప్సరలు అని ఉండేవాడు .న్యాయానికి అదేమీ అంత ఆశ్చర్య పరిచే గొప్ప విషయం కాదు .’’గాలి కన్యలు ‘’అంద చందాలతో అతిధి మర్యాదలు చేస్తూ హిమాలయాలకంటే ఎత్తైన ప్రదేశాలలో,గగనం లో టీ అంద జేస్తూ  దేవకన్యలను మరిపించేట్లు చేయటం వింతైన విషయం .విమాన కిటికీ లకు బయట -50 డిగ్రీల (మైనస్ యాభై డిగ్రీల )  ఉష్ణోగ్రతః ఉండటం అక్కడే శివ మహా దేవుడు కైలాస శిఖరం మీద కొలువై ఉంటాడంటే నమ్మగలమా?

.పర్వతాలు వరుస తప్పటం కనిపించింది .అది నా పరిశోధనలోని లూబ్రికంట్ ల లక్షణాలను  పోలి ఉందనిపించింది .ఈ పర్వత ,లోయల  వంకరలు లూబ్రికంట్ లలో ఎడిటివ్ లను పోస్తే ఏర్పడే  సెడి మెంట్  ఫార్మేషన్ లాగా ఉందనిపించింది .మేఘాలతో కప్పబడిన పర్వత శిఖరం సెడిమేంట్ అవక్షేపం (ప్రిసిపిటేషన్) ఎర్పడటాన్ని సూచిస్తోంది .వెంటనే నా నోట్ బుక్ తీసి లూబ్రికంట్ ఆయిల్స్ లలో  సెడిమేంట్ ఏర్పడటం లో ఉన్న ఇండక్షన్ కాలం గురించి ఆర్టికల్ రాయటానికి స్కెచ్ తయారు చేసుకొన్నాను .మా  ఫ్లైట్ ఒక  మాలిక్యూల్ లాగా ఉందనిపించింది .  విమానం పైనుంచి కిందికి దిగటం అంటే ఏదో పతనం చెందినట్లు భావించరాదు .అదొక ప్రశాంత మైన ,సుతి మెత్తని ,గంభీర విధానం .నాకు అనుకోకుండా భలే వింత ఆలోచనలోచ్చాయే !వెంటనే దీనిమీద సమగ్రంగా ఆలోచించి  ఈ భూమిక నుండి మంచి వ్యాసం  తాష్కెంట్ చేరుకొనే లోపు రాసెయ్యాలి ‘’.

‘’నాకు వచ్చిన వి బేసిక్ ఆలోచనలా? ఏవి ఇక్కడ  బేసిక్ థాట్స్ ?ఒకటి రెండు మూడు –.మనిషి జీవించటం మంచిదే .ఇంకా 36 ఏళ్ళు జీవించాలి .అది సాధ్యమా ?అంటే అనుమానమే .ప్రసిద్ధ ఇటలీ చిత్రకారుడు, శిల్పి మైకెలేంజిలో89 ఏళ్ళ వయసులో ‘’ఇదేమీ బాగాలేదు .నేను ఇప్పుడే కళ అంటే ఏమిటో  అర్ధం చేసుకోవటం మొదలు పెట్టాను’’అన్నాడు .అంతటి గొప్పవాడే ఆ మాట అంటే ,నా బోటి సామాన్యుడు ఏమనుకోవాలి ? ‘’

ఇ౦జన్ లో వచ్చే కదలికలు గ్లాసులోని నీళ్ళను వణి కేట్లు చేస్తాయి .ఇది తప్ప మిగిలినదంతా ప్రశాంతంగానే ఉంటుంది .విశ్వం మధ్య భాగం లో విమానం మొద్దుబారి పోతుంది. కాని దానికే ప్రమాదం ఉండదు .’’ఆగు .ఒక్క క్షణం ‘’అని ముసలి ఫౌస్ట్ కలగన్నాడు మళ్ళీ యవ్వనం పొందాలని. నాకూయవ్వనం పొందాలని ఉందా?నేను  ఏంతో చేయగలిగాను .చాలు .నాకు యవ్వనం ప్రాప్తిస్తే నేను అంతటి ముసలివాడిని కాదుకదా . నాకు ముసలితనం వచ్చి౦దనుకోను .నాకు ఇంకా 78  ఏళ్ళు మాత్రమే .

రష్యన్ మిరకిల్

‘’  ఈ 78 ఏళ్ళలో ఏం జరిగింది నా జీవితం లో ?నా చేతిలో మొరాకో  బైండింగ్ తో ఉన్న నీలిరంగు మంచి పుస్తకం ఉంది .మట్టి రంగు పర్వతాల కు ఆకాశపు  నీలి ఆభరణం లాగా .చదువుదాం .ఇవిగో చివరి పేజీలు  .ఇక్కడే హీరో ఇంటికి తిరిగి వెడుతున్నాడు .వాండర్ హేంక్ కు ఇంకా నేను సోవియట్ రష్యా ఎందుకు వెళ్ళానో అర్ధం కాలేదు .చాలాసార్లు హేంక్ కోరినట్లు కెరీర్ ను అమెరికాలోనే సాగిద్దామా అనుకొన్నాను .ప్రతి సారీ వచ్చిన అవకాశాన్ని హీరో తిరస్కరించాడు .నిజమే అన్నీ తేలికైనవి, సాధారణమైనవి గా రష్యాలో  ఉండవు .కాని అది అంతముఖ్యమా?ఈ పుస్తకం లో ముఖ్య విషయాన్ని కొట్టి పారేయ టానికి వీలు లేదు .నా సిద్ధాంతం లో యదార్ధం ,నా కొత్త  విధానాలు , ఇంత కాలంగా  అన్నీ నేనే  సృష్టించు కొన్నవే.ఇదంతా నా సృజన మాత్రమే .నేను చేయగలిగినది అంతా చేసేశాను .నేను ఒంటరి వాడిని మాత్రం కాదు .నా పని ,నా మిగిలిన కామ్రేడ్ ల పని నుంచి వేరు చేయలేనిది .ఇవాళ ఎవరూ ‘’రష్యన్ మిరకిల్ ‘’ను కాదన లేరు . యుద్ధ భీభత్సం ,రక్త పాతాలతో శిధిలమై పోయిన దేశం ఆధునిక సర్వతో భద్రమైన ఉన్నత దేశం గా ఎదిగింది అన్నదే రష్యన్ మిరకిల్ . ‘’

‘’ ఇండియా నుంచి రష్యాకు విమానం లో పర్వతాలపై  యెగిరి వస్తున్నాను . స్పుత్నిక్ మార్గాల కిందుగా నా ప్రయాణం సాగుతోంది .నేను ఇంట్లో ఉన్నాను .భూగ్రహం మీద ఉన్నాను  .వేర్నాడ్ స్కి చెప్పిన ‘’మనం సూర్య సంతానం .మనం కాస్మిక్ అయినా భూమిమీద ఉన్నాం .భూమి నీ స్వంత తోట కాని పెరటి తోటకాని కాదు అని అర్ధం చేసుకో .భూమి మన వనం .వెనుక భూమి .దాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేశాం .దాన్ని సంరక్షి౦చు కోలేక పోతున్నాం .మనలో ఉన్న పనికి మాలిన తగాదాలను వదిలేసి ,భూమాతను సరైన క్రమ పద్ధతిలో ఉంచాలి .అప్పుడే మనకు ముఖ్య సత్యం స్పష్టంగా అవగతమవుతుంది .ప్రపంచం ఇంత అద్భుతంగా దర్శన మిస్తోంది అంటే దాన్ని మనమే అలా చేయగలిగాం ‘’అన్నమాటల తో నేను ఏకీభవిస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

‘’

 

 

 

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.