’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రామయ్య వెంకన్న దర్శనం

‘’ నాకు తెలియ కుండా ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి .అంతా మారిపోయింది .అంతా కొత్తగా కనిపిస్తోంది .అందులో చాలా నాకు తెలియని విషయాలే .నేను యిక్కడ యవ్వనం లో ఉన్నప్పుడు నాకేం తెలిసి౦ది కనక?ఉయ్యూరు ,మద్రాస్, కొలంబో .అప్పుడు ధిల్లీ అంటేనే బహుదూరం అని పించేది .ఇప్పడు ‘’అబ్ ధిల్లీ దూర్ నహీ ‘’అనిపిస్తుంది .బొంబాయి మరో దేశపు ఓడ రేవు అనిపించేది .ఇప్పుడే నా మాతృదేశం గురించి సరైన అవగాహన ,,పరిచయం కలిగింది .ఒక సరిహద్దునుంచి ఇంకొక సరిహద్దుకు జరిగింది నా పయనం .’’ఇండియా ఎలా అనిపిస్తోంది ?’’అని అడిగితె నా సమాధానం ఒక్కటే ‘’నేను మొట్ట మొదటి సారిగా ఇండియాలో ఉన్నాను ‘’అని .

‘’   ‘’ఏడుకొండలెక్కి  వేంకటేశ్వరుని దర్శించా .ఆశ్చర్యకరమైన చోటు. భౌతిక ఆరోగ్యానికి, మానసిక అనుభూతికి మంచి ప్రదేశం అది .అక్కడి ప్రక్రుతి సౌందర్యానికి ముగ్దుడనయ్యాను . కనులారా ఆ సౌందర్యాన్నిఆస్వాదించి  ఆరాధించాను .ఈ ప్రదేశం గురించి నాకు తెలుసు .నాన్న దీని గురించి కధలు గాధలుగా చెప్పేవారు . దేశం నలుమూలలనుంచి భక్తులు యాత్రికులు వచ్చి శ్రీ మహా విష్ణు స్వరూపుడైన బాలాజీని దర్శిస్తారు .ఈ రోజు  కూడా భక్త జనసముద్రం  పొంగిపోయి ఉందిక్కడ .దేవాలయ సందర్శనం తర్వాత ఆరోగ్య కేంద్రాలను దర్శించాను .ఎందుకిలా చేశానో తెలీదు .  .ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో తెలియటం లేదు .కొద్దికాలం లో ఈ అమూల్య అద్భుత  ప్రక్రుతి సంపద ఒక జాతీయ పార్క్ గా రూపు దాల్చి వర్కర్ల  విశ్రాంతి కి ,చికిత్సకు ఉపయోగ పడుతుంది  .’’

‘’నాకు కూడా ఇక్కడ విశ్రాంతి అనుభావి౦చాలనే ఉంది .ఈ ట్రిప్ ఉత్సాహం గా ఉన్నా ,బాగా అలసట అనిపించింది .ఒక అనుభూతి ముద్ర నుంచి మరో దానికి వెళ్ళే వీలు కనిపించలేదు .నాకు ఇండియా చూడాలని ,దాన్ని గురించి వినాలని ,అంతటినీ  జీర్ణించుకోవాలని అతి తొందరగా ఉంది .ఇదే మొదటి సారి ఇదే చివరిసారి వచ్చిన అవకాశం .అంతేకాదు ఎందరెందరితోనో చర్చలు సమావేశాలు జరుగుతూ ఉండటం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ,సమావేశాలలో,సభలలో  ప్రసంగించటం జరిగింది .అనేక సమస్యలపై  చర్చి౦చు కోన్నాం .వేల మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చాను ,నాకు అంతా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా అర్ధమైంది .ఇండియా అంతా ఒకే  దీర్ఘ దినం లో  చూశాను అన్న భావన కలిగింది .

భారతీయులలో చోటు చేసుకోన్నమార్పు

‘’ డిబేట్ లలో నేనేమీ బలవంతంగా నమ్మించటం కాని ,ఒప్పించటం కాని చేయ లేదు .నాదృక్కోణం లో విషయ వివరణ చేశాను అంతే.నేను చెప్పేదాని కంటే వినటానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చాను .నాతొ సంభాషించేవారి గురించి నాకు ఎక్కువ తెలిసిందా లేక వారికి నా గురించి ఎక్కువ తెలిసిందా అంటే తేల్చి చెప్పటం కష్టం .చాలా సార్లు సంభాషకులు చెప్పింది వినటానికే ఎక్కువ అవకాశ మిచ్చాను .కాని నాగురించి ,,నా పరిశోధనాంశాల గురించి ,సోవియట్ దేశం గురించి చెప్పాల్సినవన్నీ చెప్పేవాడిని .వీళ్ళకు నా దేశం గురించి ఎక్కడినుంచి ఎందుకు ఇంత  అభిమానం  కలుగుతోందో తెలియదు .నాకు తెలిసింది ఏమిటంటే వీరికి ప్రపంచం లో అన్ని విషయాలు కావాలి .ఇదే నవ భారత ప్రత్యేక లక్షణం .అయితే సోవియట్ రష్యా గురించి ‘’ అభిరుచి మాత్రం ప్రత్యేకం .సోవియట్ దేశ అభివృద్ధి వీరిని  ఒక అయస్కాంతం  లాగా ఆకర్షిస్తోంది .అణచి వేత  సృ౦ఖలా బద్ధమైన  రష్యా దేశం ఆ సంకెళ్ళు తెంచుకొని , వెనుకబాటు తనాన్ని అధిగమించి ,నిరక్షరాస్యతను పాతి బెట్టి ,ఆకలిని  రోగాల్ని అంతం చేసి,కొత్త బలీయమైన సర్వ  సమృద్ధద్ధమైన  పారిశ్రామిక దేశం గా స్వయం శక్తితో  మారిందని ఇక్కడి ప్రజలు గ్రహించారు .,భారదేశ ప్రజలు కూడా అలానే  ఇండియా బలీయమైన దేశం గా అభి వృద్ధి  చెందుతుందన్న    సంపూర్ణ  విశ్వాసం తో ఉన్నట్లు నాకు అనిపించింది .ఇదే నేను కోరు కొన్నది , నాపర్యటన పర్యవసానం అదే  అయినందుకు సంతృప్తిగా ఉంది’’ .

వెయ్యి డాలర్ల(రూబుల్) ప్రశ్న

‘’ చాలా మందికి నా స్వవిషయాలపై ఆరాటం ఎక్కువగా కనిపించింది .అందరూ తెల్ల వాళ్ళున్న రష్యా దేశం లో ఇండియన్ అయిన నేను అసాధారణ, అత్యున్నత శిఖరాలను  ఆ సంఘం లో అధిరోహించటానికి అవకాశాలు రావటం ,చాలా ముఖ్యమైన శాస్త్ర జ్ఞానం వృత్తిగా ఎంచుకోవటం ,అనేక  ప్రాజెక్ట్ లకు ,తీసుకొన్న విషయాలకు  జీవం పోయటం వారికి అమితాశ్చర్యాన్ని కలిగించింది .వారు దీన్ని ఊహించలేకపోవటమేకాదు ,గ్రహించనూ లేక పోయారు. ఇది ఆ దేశం లో ఒక ఇండియన్ కు సాధ్యమా అనుకొన్నారు .ఆ దేశం ఇతనికి ఇంతటి గొప్ప తనాన్ని కట్ట బెట్టిందా అనే సంభ్రమం లో నాభారతీయ సోదరులున్నారు .దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు .అది సరే ఎవరికీ దక్కని అరుదైన ‘’సుప్రీం సోవియట్ అవార్డ్ ‘’రామయ్యకు అందజేయటం ఏమిటి ?అనుకొన్నారు కూడా .కలయో వైష్ణవ మాయ యో లాగా ఉంది వారి పరిస్తితి .ఎందుకు సుప్రీం సోవియెట్ ఈ ఇండియన్ ను గుర్తించి ఆదరించింది ,అభిమానించింది తనవాడు అనుకొన్నది? ఇదే అగ్రాహ్యమైన విషయం .’’థౌసండ్ డాలర్(రూబుల్ ) ప్రశ్న ‘’ అయింది వారికి . దీనికి సమాధానం వారే తెలుసుకోవాలి రాబోయే కాలం లో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.