నేతాజీ నిధి ఎక్కడ?

నేతాజీ నిధి ఎక్కడ? (17-May-2015)

  • 100 కిలోల బంగారం .. విలువ కొన్ని కోట్లు
  • సుభాష్‌ చంద్రబో్‌సతోపాటే అదృశ్యం
  • దర్యాప్తు చేసేందుకు నెహ్రూ ససేమిరా
 న్యూఢిలీ: నేతాజీ మరణం పై చిక్కుముడి వీడకముందే, ఆయనకు సంబంధించిందే మరో అంశం మరింత సంచలనం సృష్టిస్తున్నది. ఆయన ఆచూకీపై సమాచారం లేనట్టుగానే, భారత జాతీయ సైన్యం పోషణ కోసం పెద్దఎత్తున సేకరించిన నిధులు ఏమయ్యాయనేదీ అంతుబట్టని రహస్యంగానే ఉండిపోయింది. అప్పటి పత్రాలు, ప్రభుత్వ నివేదికలను బట్టి ఈ నిధి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై దర్యాప్తు జరపాలన్న విజ్ఞప్తులను అప్పటి నెహ్రూ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనేది తాజాగా వెలుగు చూసింది. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వానికి, జపాన్‌లోని దౌత్యవేత్తలకు మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలను, ప్రభుత్వంలో అంతర్గతంగా సాగిన ప్రయత్నాలను, నిధికి సంబంధించిన పత్రాలను ఇటీవల ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ మేనజైన్‌ బయటపెట్టింది. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను స్వేచ్ఛను ఇస్తాను’ అన్న నేతాజీ ప్రకటనతో ఉత్తేజితులైన ఎందరో యువతీయువకులు భారత జాతీయ సైన్యంలో చేరిపోయారు. వీరందరి పోషణ, పోరాట అవసరాల కోసం పెద్దఎత్తున నిధులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో 1945 జనవరి 29న రంగూన్‌లో నేతాజీ జన్మదిన వేడుకలు జరిగాయి. జపాన్‌ గుప్పిట్లో ఉన్న రంగూన్‌ అప్పట్లో నేతాజీ సైన్యానికి ప్రధాన స్థావరం. ఆయన అభిమానులు తులాభారం వేయగా, 80 కిలోలు తూగారు. ఆ మేర బంగారం, నగలను వారు సమర్పించారు. మరికొందరు వంటిమీద బంగారం, నగలు ఇచ్చేశారు. ఇలా అంతా కలిపితే సుమారు వందల కిలోలు తేలింది. రంగూన్‌ బ్రిటిష్‌ సైన్యాలవశం కావడంతో ఆ తరువాత కొన్నినెలలకే నేతాజీ బ్యాంకాక్‌కు పయనమయ్యారు. వెళుతూ వెళుతూ ఆ నిధిలో 63 కిలోల బంగారం వెంటతీసుకెళ్లారు. నేతాజీ ఆర్మీ పూర్తిగా ఓటమి పాలైంది. అప్పుడు నేతాజీ వియత్నాంలోని షాయిగోన్‌లో ఉన్నారు. అక్కడినుంచి సోవియట్‌ రష్యాకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఇక ఆ తరువాత ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. చివరి రోజుల్లో నేతాజీని దగ్గరగా చూసిన వాడు హబీబుల్‌ రెహమాన్‌. ఆయన కథనం ప్రకారం, టోక్యో సమీపంలో నేతాజీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన వద్ద నుంచి 11 కిలోల బంగారాన్ని జపాన్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. మరి మిగతా సొత్తు ఏమయిందనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.