ఆనంద రామాయణ విశేషాలు -4

ఆనంద రామాయణ విశేషాలు -4

సీతారాముల జలక్రీడ

రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం ఎంతో అప్రమత్తంగా ఉన్నారు .ఒకరు విసనకర్రతో వీచితే ,మరొకరు వింజామర విసిరారు.ఒకామె ఆసనం తెస్తే ఇంకొకామె తాంబూలం ,మరో ఆవిడ వస్త్రం ,ధనుస్సుఒకావిద ఖడ్గం ఇంకొకతే తీసుకొని చుట్టూ నిలబడ్డారు .అందర్నీ పలకరిస్తూ అంతర్ గృహం చేరాడు రాముడు .సీతా దేవి ఇచ్చిన జలం తో ఆచమనం చేశాడు. ఆసనం పై కూర్చున్నాడు .అందించిన దివ్య ఉదకాన్ని త్రాగాడు .లక్ష్మణుదిని పిలిచి భోజన శాలకు వెళ్లి బ్రాహ్మణుల నందరిని ఆహ్వానించి ఊర్మిళాదులతో అన్నిటిని సిద్ధం చేయించమని చెప్పాడు .

దాసీజనులు సంతోషించేట్లు రాముడు సీతను బాహు బంధం లో బిగించి అక్కడే ఉన్న జలయంత్రం లోకి(స్విమ్మింగ్ పూల్ ) ఎత్తి తోశాడు .వెంటనే తానూ ఎత్తు మీదనుండి అందులోకి దూకేసి సీతతో జలక్రీడలాడటం ప్రారంభించాడు రాముడు . సీతను బాహుబంధం లో బంధించి నీళ్ళలోకి తోసేస్తూ ,నీటిని విపరీతమైన వేగంతో ఆమె పై చల్లుతూ ,పరిమళ భరిత దివ్య తైలాలనూ వెదజల్లుతూ హడావిడి చేశాడు. దీనికి మురిసిపోయిన దాసీలు అనేక రకాల సుగంధ చూర్నాలు ,మంగళ ద్రవ్యాలు తెచ్చి ఇద్దరికీ అందించారు .రెచ్చిపోయిన ఆ జంట యెడ తెరిపి లేకుండా వాటిని ఒకరిపై ఒకరు చల్లుకొంటూ అందరికీ వినోదాన్ని పంచారు .పిచికారీలతో ఒకరిపైఒకరు  వసంతాన్ని  జల్లుకొన్నారు  .రాముడు కనుచూపు తో దాసీలను పరదాల వెనక్కి వెళ్ళమని ఆజ్న ఇవ్వగా వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుకొంటూ వెళ్ళిపోయారు .తమ చుటూ ఎవ్వరూ లేరని అనుకొన్న సీతారాములు హాయిగా ఆనందం గా ఇష్టాపూర్తిగా వినోదంగా  యధేచ్చగా జలక్రీడా సరససల్లాపాలు బహు భంగులు గా చేశారు .

కుసుమ  సుకుమారమైన ముష్టి లతో ఒకరినొకరు కొట్టుకొన్నారు .పరమాత్మ అయిన శ్రీరాముడు మహా మాయఅయిన సీతాదేవి అధరోస్టాన్నిలోక రీతిలో సహజంగా  విలాసంగా చు౦బి౦చాడు  .కుచమర్దనమూ చేశాడు .కంచుకాన్ని స్వయంగా చేతులతో తీసేసి అర్ధాంగిని గాఢంగా ఆలింగనం చేసుకొని సౌఖ్యం అనుభవించాడు .కామకేళీ విలాసాలనన్నిటినీ స్వేచ్చగా చేసి సీత మనసుకు సంతోషం సంతృప్తి కల్గింఛి ,ఆనంద కేళి లో ముంచి తేల్చాడు  రాముడు . ‘’జల యంత్రేషు క్రీడాం చక్రతు స్సుచిరం ముదాః –ముస్టిభ్యాం జానకీరామం తాడయామాస కౌతుకాత్ –సోపితాం తాడయామాస ముష్ట్యా పుష్ప సమానయా –చుంబిత స్యా బింబోస్టం చూర్ణ యామాస తత్కుచౌ –ముక్త్వా తత్కంచుకీ బంధం ఆలింగ్య హృదయే నతాం –ముమొచ కచ్చం శ్రీరామః సీతాయా స్వరేణసః –‘’ఇలా హాయిగా స్వేచ్చగా సీతారాములు జలక్రీడ సలిపారు .

ఇంతలో భోజన సమయమైందనిదని లక్ష్మణుడు  చెప్పటానికి  వస్తే దాసీలు అడ్డగించి సీతారాములు రహస్త్యం గా జలక్రీడలలో ఉన్నారని చెప్పారు .సరే అని భోజన సమయం అయిన్దికనుక వేగిరమే రావలసినదని వారిద్దరికీ చెప్పమని మర్యాదాపురుషుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు .సిగ్గుల మొగ్గయైన ఒక దాసీ పరదాల వెనక నుండే ఆ వార్తను వారిద్దరికీ నివేదించింది .రాముడు వెంటనే గట్టుపైకి వచ్చి వేడినీటితో నలుగుపిండితో సుగంధ ద్రవ్యాలతో తలంటి పోసుకొని సిద్ధమయ్యాడు .సీతాదేవికి కూడా పరిజనం ఇలానే చేసి సిద్ధ పరచారు .ఇద్దరిచేత దివ్య పీతాంబరాలు ధరియింప జేశారు .దారిలో పూలు చల్లుతూ వారిద్దరిని వంట శాలకు తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడ వేచిఉన్న ఊర్మిలా మొదలైన వారు అందరికి వడ్డన చేశారు .రాముడు బంధు మిత్ర మునిగణ పరివారం తో సహా షడ్రసోపేత భోజనాలుఆరగించారు .సీతాదేవి వీవన తో వీస్తూ పరియాచికంగా మాట్లాడి నవ్విస్తూ ఉంది  .తర్వాత సీత అందించిన తాంబూలాన్ని రాముడు తీసుకొని ఆస్వాదించాడు .అందరిభోజనాలు ముగిసిన తర్వాత రాముడు నిద్రాశాలకు చేరాడు .అప్పటికే అక్కడికి చేరుకొన్న సీతా సాధ్వి రాముని రాకకై ఎదురు చూస్తూ నిలిచి ఆహ్వానించి లోనికి తీసుకొని వెళ్ళింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-15 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.