| మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో.. |
 |
|
చరిత్రలో మొట్టమొదట జరిగిన ఆధిపత్య పోరు.. ప్రపంచ యుద్ధం. జర్మనీ అధికార కాంక్ష వల్ల ఎన్నో లక్షల మంది సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాల్ని కోల్పోయారు. భారతదేశం ఎన్నో లక్షల మంది సైనికులను ఈ సమరానికి మద్ధతుగా పంపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఇచ్చిన తోడ్పాడు ఎనలేనిది.. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం.
మొదటి ప్రపంచ యుద్ధం… యూర్‌పలో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలైలో జర్మనీ, ఆస్ర్టియా, హంగేరి, ఒట్టోమన్ మొదలైన దేశాలకు గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, జపాన్ (మిత్ర దేశాలు) దేశాలకు మధ్య ఈ యుద్ధం జరిగింది. దాదాపు 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది మామూలు ప్రజలు చనిపోయారు.
- ఆస్ర్టేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలకు మించి సైనికులను మిత్ర రాజ్యాలకు మద్దతుగా భారతదేశం పంపింది. దాదాపు 15 లక్షల మంది భారత సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు.
- బ్రిటన్ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం ‘విక్టోరియా క్రాస్ హానర్స్’. భారత సైనికులు 11 విక్టోరియా క్రాస్ హానర్స్ పొందారు. మొత్తం మీద 13,000 వేర్వేరు పతకాలు భారత సైనికులు పొందారు.
- మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారత సైనికులు స్వదేశానికి రాకుండానే ఆఫ్ఘాన్ మూడో యుద్ధం, వజీరిస్తాన్ దండయాత్ర మొదలైన వాటిల్లో పాల్గొన్నారు.
- మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు 53,486 మంది చనిపోగా, 64,350 మంది గాయపడ్డారు. 3,762 మంది కనిపించకుండా పోయారు. వారిలో కొంతమంది జైలులో బందీలుగా ఉండిపోయారు.
- యుద్ధం వల్లనే కాదు ఫ్రాన్స్‌లో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా భారత సైనికులు చనిపోయారు. అక్కడ ఉండే విపరీతమైన చలి వల్ల దాదాపు 9,000 మంది సైనికులు చనిపోయారు.
- సైనికులు, వస్తు రూపేణా కాకుండా దాదాపు 900 కోట్ల రూపాయల్ని యుద్ధం కోసం భారతదేశం ఖర్చు చేసింది.
- 43,737 మంది ఇతర సిబ్బంది(వంటవాళ్లు, పనివాళ్లు) భారత సైనికుల వెంట వెళ్లారు.
- అందరికంటే ముందుగా భారత్‌దేశ సైనికులే యూరప్ చేరుకున్నారు.
- ఫ్రాన్స్ వీధుల్లో తొలిసారి మార్చ్ ఫాస్ట్ చేసిన ఘనత మన సైనికులదే.
- యూరప్ నుంచి ఆఫ్రికా, చైనా దేశాల వరకు అన్ని దేశాల్లో భారతీయ జవానులు యుద్ధం చేశారు.
- బిక్‌నూర్(మహారాష్ట్ర) మహారాజా గంగ సింగ్ యుద్ధం కోసం తమ పోలీసు బలగాల(కామెల్ కార్ప్స్)ను పంపించాడు. ఫ్రాన్స్, ఈజిప్ట్, పాలస్తీనా దేశాల్లో వీటి సేవల్ని ఉపయోగించుకున్నారు. పాటియాలా మహారాజు భూపిందర్ సింగ్ గల్లిపోలి(ప్రస్తుత టర్కీ)లో జరిగిన యుద్ధంలో పోరాడాడు.
- యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే భారత దేశం తన తోడ్పాటును అందించింది. 7 కోట్ల విలువైన మందు గుండు సామాగ్రిని, 6 లక్షల మెషిన్ గన్స్, రైఫిల్స్, యుద్ధ వాహనాలను అందించింది.
- నాలుగు సంవత్సరాల యుద్ధ సమయంలో ఆర్మీ క్లాత్ డిపార్డ్‌మెంట్ 41,920,223 దుస్తుల్ని ఉత్పత్తి చేసింది.
- 1,302,394 మంది సిబ్బందిని, 1,72,815 జంతువులను 369.1 మిలియన్ టన్నుల సరుకును భారతదేశం అందజేసింది.
- ప్రస్తుత లెక్కల ప్రకారం 7,420,800,000 రూపాయలను భారతదేశం యుద్ధం కోసం ఖర్చు చేసింది.
|
|