|
చిన్న పిల్లలు ఏం చేస్తారు..? ఆటలాడుతారు.. అల్లరి చేస్తారు.. గెంతుతారు.. పోట్లాడుతారు.. నానా హంగామా చేస్తారు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం మాత్రం 11 ఏళ్ల వయసులోనే మూడు డిగ్రీ పట్టాలు సాధించాడు.. అంతేనా..? తొమ్మిదేళ్ల వయసులో టెడ్ టాక్స్‌లో అనర్గళంగా మాట్లాడాడు, నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ర్టేషన్)లో ప్రసంగం ఇచ్చాడు.. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు అవుతాననే చెప్పే అబ్రహం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
తనిష్క్ అబ్రహం కాలిఫోర్నియాలో జన్మించాడు. తనిష్క్ వాళ్ల నాన్న పేరు బిజౌ అబ్రహం, ఈయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమ్మ పేరు తజి అబ్రహం, ఆమె వెటర్నిటీ వైద్యురాలు. అబ్రహం తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు తరలి వెళ్లారు. అమెరికన్ రివర్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొంది అందరినీ అశ్యర్యపరిచాడు. ఈ కళాశాల నుంచి గణితం, సైన్స్, విదేశీ భాషా అధ్యయనం విభాగాల్లో మూడు డిగ్రీలు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రత్యేకత పొందాడు. డిగ్రీ ఫలితాల్లో ఈ బుడ్డోడి జీపీఏ (గ్రేడ్ పాయింట్ ఏవరేజ్) 4.0. అంతేకాదు రివర్ కళాశాల 60 ఏళ్ల చరిత్రలోనే ఇంత చిన్న వయసులో డిగ్రీ పట్టా ఇప్పటివరకు ఎవరూ పొందలేదు. నాలుగేళ్లప్పుడే మెన్సాలో సభ్యుడయ్యాడు. మెన్సాలో మనుషుల ఐక్యు (హై ఇంటెలిజెంట్ కోషంట్) లెవల్‌ని టెస్ట్ చేస్తారు. దీనికోసం మెన్సా స్టాండర్డైజ్‌డ్ ఐక్యూ టెస్ట్‌ని నిర్వహిస్తుంది. ఇందులో కనీసం 98 మార్కులు రావాలి. తని్‌ష్కకు 99.9 మార్కులు వచ్చాయి. ఇతని చెల్లెలు కూడా ఇందులో ఒక మెంబరే. మెన్సాలో అత్యంత పిన్న వయస్కులు వీరు. ఏడేళ్ల వయసు నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండి చదువుతున్న బాల మేధావి తనిష్క్ గురించి మరిన్ని అంశాలు. ![]() |


