గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి
472 –శ్రీ కొరవి రామ కవి
కార్వేటి నగర జమీందారుల ఆస్థానకవి శ్రీ కొరవి రామ కవి .సంస్కృత రచనలు –‘’దశ రూపక పధ్ధతి ,కువలయానంద ,విశ్వ గుణ దర్శన చంపు వ్యాఖ్య ,మొదలైనవి రచించారు .
47 3-శ్రీ శిస్టు కృష్ణ మూర్తి శాస్త్రి
కాళహస్తి జమీందార్ల ఆస్థానకవి .’’యక్షోల్లాసం ,మదనాభ్యుదయభాణం,కంకణాబద్ధ రామాయణం మున్నగు సంస్కృత రచనలు చేశారు .
47 4 –శ్రీ పురుషోత్తమ పండితులు
వెంకట గిరి ఆస్థానపు ఈ కవి ‘’కుమారా యాచ నృపాల ‘’,చతుష్టష్టి విద్యా సంగ్రహం ‘’సంస్కృతం లో రాశారు .
47 5 –శ్రీ కందుకూరి నాగ నాద సూరి
ఇరవై వ శతాబ్ది నియోగి బ్రాహ్మణుడు .’’మీనాక్షీ కళ్యాణ చంపు ‘’,రామ విజయ చంపు ,మొదలైన చంపువులు రాసి చంపూ కవిగా ప్రసిద్ధుడైనాడు .కందుకూరి చొక్కనాద కవి శిష్యుడు .శేషమాంబ కుమారుడు .మలయధ్వజుని కూతురు మీనాక్షి వివాహ వర్ణనే మొదటి చంపువు .
47 6 –శ్రీ వత్తిపల్లి నర కంఠీరవ శాస్త్రి
వెంకట లక్ష్మి ,సాంబశివ ల కుమారుడు .తిరుపతి సంస్కృత కళాశాలలో ప్రసిద్ధ సంస్క్రుతాచార్యుడు .ఇరవయ్యవ శతాబ్ది ముందే చనిపోయాడు .చాలాకావ్య రచన చేశాడు కాని లభించినవి కొన్ని లఘుకావ్యాలు మాత్రమె .అవే –శ్రీ వెంకటేశ్వర స్తోత్రం శ్రీ జ్ఞాన ప్రసూనామ్బికా స్తోత్రం ,మాత్రమె అచ్చయ్యాయి మిగిలినవి వ్రాతప్రతి లోనే ఉండిపోయాయి
47 7 –శ్రీ విక్కిరాల శేషాచార్య
కాళహస్తి కవిగా ప్రసిద్ధులు .’’మదన విజయ భాణం’’అనే దాన్ని మదనమంజరి ,పల్లవ శేఖరుల ప్రేమ పెళ్ళిగా రాశారు .47 8 –బాణాల శేష సూది
వాదూల భావనారాయణ శిష్యుడు .శ్రీ కృష్ణుని పై పద్య గద్య రచన చేశాడు ..
47 9 –శ్రీ చంద్ర గిరి వేంకటాచార్య –శ్రీనివాసాచార్య మనవడు .తాతాచార్య కుమారుడు .చంద్ర గిరి వాసి .’’శృంగార భూషణ భాణం ‘’,ను వామన భట్ట భాణుని రచనకు అనుకరణగా రాశాడు
480 –శ్రీ మాడభూషి అనంత శయనం అయ్యంగార్
సంస్కృత మహా విద్వాంసుడు .మత గ్రంధాలు సంస్కృతం లో రాశారు ..లోక సభ మాజీ స్పీకర్ .
శ్రీ తిరుచానూర్ కృష్ణ కవి మంగా పుర నివాసి .’’సత్యభామా పరిణయం ,అనే అయిదు అంకాల నాటకం ,రాశాడు.సర్వశ్రీ ఎస్ వి ఎస్ కృష్ణమాచార్యులు ‘’మృత సంజీవనం భాణం ‘’,జయలక్ష్మి వృక్ష శాస్త్రంపై రచన ,చేశారు .
481 –డా.యెన్ సి వి.నరసింహా చార్యులు(19 23 –
7-8-19 23జన్మించిన ఆచార్యులవారు సాహిత్య శిరోమణి విద్వాన్ బి ఓ ఎల్ బి ఏ .వేదాంత వారధిని సంస్క్రుతకలాశాలలో పని చేశారు .100పైగా సంస్కృతం లో రిసెర్చ్ పేపర్లు రాసిన ఘనత ఆయనది .ఆయన రాసిన ‘’ముక్తా మౌక్తికమాల ‘’మానవ జీవితాన్ని తీర్చి దిద్దుకోవటానికి ఉపకరించే విలువైన గ్రంధం .ఇందులో 232 ముక్తకాలున్నాయి దేనికదే సాటి .తిరుపతి లో సుప్రసిద్ధ కవిగా పేరొందారు .’’వాచస్పతి ‘’బిరుదు ,రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .’’పండిత రాజ ‘’,సాహిత్య విశారద ‘’గౌరవాలుపొందారు .
482- శ్రీ వి ఆంజనేయ శర్మ
సంస్కృతం లో అఖండ పండితుడు మహా కవి ‘’శ్రీ పరమ హంస ,శ్రీ శారదా దేవి ‘’వీరి మహత్తర రచనలు .’’కవిరాజ హంస ‘’,’’దర్శన కళానిధి ‘’.వీరి బిరుదులు .
483-శ్రీ ఎస్ హెచ్ .రఘునాదాచార్య
తిరుపతి సంస్క్రుతకాలేజి వైస్ చాన్సెలర్ .సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేశారు .’’రామ విజయ కావ్య ‘’రచయిత.’’దశావతార సుప్రభాతం ,మరొక రచన .
48 4 –ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి
బహు ముఖీన ప్రతిభగలవారు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ .అనేక విధ కావ్య రచన చేశారు .’’శ్రీశ వింశతి ‘’,శ్రీ జగన్నాధ షోడశి ,శ్రీ గురు ప్రపత్తి ‘’ధన్యాస్టకంలను రాసి ‘అన్నిటిని కలిపి ‘’వన మాల ‘’అనే సార్ధక నామం తో ప్రచురించారు మధుర మంజుల కవిత్వం ఇందులో ప్రవహించింది .జాషువాగారి ‘’పిరదౌసి .కరుణశ్రీ ‘’కుంతీకుమారి ‘’లను సంస్కృతీకరించారు .
485 –ప్రొఫెసర్ హరే కృష్ణ శతపది
తిరుపతి సంస్క్రుతకాలేజి వైస్ చాన్సలర్ .ఒరిస్సా వారైన ఈయన జగన్నాదుని ఒడి లో నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒడిలోకి చేరారు .సంస్కృతం లో సంస్కృతీ ,వారసత్వం లపై యాభై వ్యాసాలూ రాశారు .అనేక అంతర్జాతీయ పురస్కారాలన్డుకొన్నారు .ఒరిస్సా సాహిత్య అకాడెమి అవార్డ్ ,దిల్లీ సంస్కృత అకాడెమి అవార్డ్ మొదలైనవి వీరి కీర్తి కిరీటం లో కలికి తురాయిలు .సంస్కృతం లో అనేక కావ్యాలు రాశారు .ఆయన కవిత్వం లో పదాలు నాట్యం చేస్తాయి .వీరి ‘’మహోదధి సుప్రభాతం ‘’విశేష ప్రాచుర్యం పొందింది .ఇందులో ఉన్నవి 28 శ్లోకాలు మాత్రమె. భావన పరమ వైభవం గా ఉంటుంది .మహోదధి స్తోత్రం లో అయిదు శ్లోకాలు ,మంగళాశాసనం లో మూడు శ్లోకాలున్నాయి .పూరీ క్షేత్రమైన శ్రీ క్షేత్రం లో ఉన్న సముద్రానికి అక్కడి జగన్నాధ స్వామికి ఉన్న సంబంధాన్ని విశేషంగా వర్ణించారు కవి .మహోదధి కి జగన్నాధుని అల్లునిగా చిత్రించారు .తనకుమార్తె శ్రీమహా లక్ష్మిని సముద్రుడు జగన్నాదునికి భార్యగా సమర్పించి మామగారైనాడు .హిమవంతుడు తన కూతురు పార్వతీ దేవిని శివుని అర్ధాంగిని చేసి మామగారైనట్లు గా ఇది ఉంది ..కవిత్వం పూరీ సముద్రంలా ఉప్పొంగి హృదయాలను రసప్లావితం చేస్తుంది .
చిత్తూరు జిల్లాకవులు పూర్తీ .కడప ,కర్నూల్ కవుల పరామర్శ చేద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ 9- 15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

