సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు
సరసభారతి మరియు ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం .శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ముందుగా సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ సి .పి.శాస్త్రి గారు(హైదరాబాద్ ) ఆంగ్లం లో రాసిన ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకానికి సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ‘’దైవ చిత్తం ‘’గా తెలుగులోకి అనువదించిన గ్రంధ౦ ఆవిష్కరణ జరుగుతుంది .దీని కి ముందు మాటలను శతాధిక చారిత్రిక నవలా రచయిత, ప్రముఖ విమర్శకులు డా .శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు రాయటం విశేషం .ఈ గ్రంధానికి ప్రాయోజకులు ,కృతి స్వీకర్త సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా ) అవటం మరో గొప్ప విషయం . పిమ్మట సుప్రసిద్ధ సాహితీ మూర్తులకు స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేయ బడును . తరువాత ‘’మా అన్నయ్య ‘’శీర్షికపై జిల్లాలోని ప్రసిద్ధ కవి మిత్రులచే ‘’కవి సమ్మేళనం ‘’జరుగుతుంది .
సాహిత్య ,సంగీతాభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేయ వలసినదిగా మనవి .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం మార్చి రెండవ వారం లో అంద జేయ బడును .
జోశ్యుల శ్యామలాదేవి మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు
