ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107
46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్
యవ్వనం లోనే ‘’నేను నిజాయితీ ఉన్న అహంకారి ,కపట మానవత్వం ఉన్న వాళ్ళలో దేనిని ఎంచుకోవాలను కొంటె ,నేను ఆనేస్ట్ ఆరోగెన్స్ నే ఎంచు కొంటాను దీనిలోంచి మారటానికి నాకేమీ కారణం కనిపించలేదు ‘’అని ధైర్యంగా చెప్పిన వాడు ,’’ఇంత వరకు నా లాంటి మహా గొప్ప ఆర్కిటెక్ట్ పుట్టలేదని ,ఇక పుట్టడని ,నేను చరిత్రలో ఎన్నడూ జన్మించని అతి గొప్ప ఆర్కిటెక్ట్ గా నిలబడి పోతాను ‘’అని చాలెంజీగా చెప్పిన వాడు దాన్ని రుజువు చేసుకొన్న వాడూ ఫ్రాంక్ లాయడ్ రైట్ .ఆయనకు 70ఏళ్ళు వచ్చేసరికి అభిమానులు పొంగిపోయారు ,విమర్శకులు ఆయన అహంకారం చాలా నిజాయితీతో కూడినదే నని అంగీకరించారు .80వ ఏట ఆయన లాంటి ఆర్కిటెక్ట్ కొత్త ప్రపంచం లో జన్మించనే లేదనీ ,అత్యంత సృజన శీలి ,అన్నికాలాకు ఆయనే జీనియస్ అని ఏకగ్రీవ నిర్ణయానికి అందరూ వచ్చారు .ఆయనను ‘’ఫుజియామా ఆఫ్ అమెరికన్ అర్కి టేక్చర్ ,ప్రకాశించే అత్యున్నత శిఖరం ‘’అని ప్రశంసించారు .
ఫ్రాంక్ లాయడ్ రైట్ 8-6-1869న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం లో ఉన్న రిచ్ లాండ్ సెంటర్ లో పుట్టాడు .తల్లి అన్నా లాయడ్ జోన్స్ వెల్ష్ హాటర్ ,యునిటేరియన్ ప్రీచర్ విస్కాన్సిన్ కు వలస వచ్చిన ఆయన కూతురు .తండ్రి విలియం రసేల్ కారీ రైట్ ఇంగ్లీష్ వాడు .కనెక్టి కట్ లోని హార్ట్ ఫోర్డ్ నుంచి వచ్చాడు .తండ్రి లా ,మెడిసిన్ చదివి తర్వాత రెండూ వదిలేశాడు .డజను కు పైగా ఉద్యోగాలలో వేలుపెట్టాడు కాని ఎందులోనూ నిలబడలేక చివరికి సంగీతం నేర్చి మినిస్టర్ అయ్యాడు .విస్కాన్సిన్ లో సంగీత ప్రచారం చేస్తూ అన్నా ను కలిశాడు .ఆమెను పెళ్లి చేసుకొన్నాకే ప్రీచర్ అయ్యాడు .వారి మొదటి సంతానమే ఫ్రాంక్ .ఇద్దరు ఆడపిల్లలు జెన్నీ ,మాగినేల్ లు .ఫ్రాంక్ కు మూడో ఏడు వచ్చాక తండ్రిని బోస్టన్ చర్చ్ కు ఆహ్వానించారు .అక్కడకు వెళ్ళినా ఎక్కువ కాలం ఉండక బాక్ టు పెవిలియన్ గా విస్కాన్సిన్ కు తిరిగోచ్చేశాడు .మాడిసన్ లో మ్యూజిక్ కన్సర్వేటరి ప్రారంభించాడు .ఇందులో చెయ్యి కాల్చుకొని ఎందులో వేలేట్టినా,వివాహం తో సహా ఏదీ కలిసిరాక ఫైల్యూర్ గా మిగిలిపోయాడు .తల్లి మాత్రం ఫ్రాంక్ మీదే ద్రుష్టి పెట్టింది .తల్లి గారాల కూచి అయ్యాడు ఫ్రాంక్ లాయడ్ రైట్ .అతనిలో ఆమె జీవించింది అంటే అతిశయోక్తి కాదన్నాడు చరిత్ర కారుడు .తలిదండ్రుల మధ్య సయోధ్య సాగ లేదు .విడిపోయారు .తండ్రి ఇల్లు విడిచి వెళ్లి, మళ్ళీ కనిపించ నే లేదు .
తల్లి అన్నాకు పెద్ద పెద్ద భవనాలంటే మహా ఇష్టంగా ఉండేది .ఫ్రాంక్ కడుపులో పడినప్పుడే దరిద్రం తో బాధ పడుతున్నా ,తనకు మొదటి సంతానం మగపిల్లాడే కలగాలని వాడు ఆర్కిటెక్ట్ కావాలని కోరుకొన్నది .ఏంతో త్యాగం చేసి కొడుకును చదివించింది .కాని 14ఏళ్ళ వయసులో అతడు దారి చూపెవాడుకాని ,స్వంతకాళ్ల పై నిలబడేవాడు గా కాని అని పించలేదు .అతని అంకుల్ ఫారం లో పని చేసి ఏదో కొంత సంపాదించేవాడు .కాలేజి లో చేరి ,మధ్యాహ్న సమయాలలో ఒక ఆర్కిటెక్ట్ ఆఫీస్ లో పని చేస్తూ ఫీజుకు సరిపడా డబ్బు సంపాదించేవాడు .విస్కాన్సిన్ యూని వర్సిటి లో ఆర్కిటెక్చర్ కోర్సు లేనందున సివిల్ ఇంజినీరింగ్ లో చేరాల్సి వచ్చింది .దానికి విచారించలేదు .పైగా ఇమిటేషన్ వలన ఆర్కి టేక్చర్ మీద మోజు మరింత పెరిగిందన్నాడు .
యూని వర్సిటీ లో చదువుతూనే ,ఏదో పని చేస్తూనే ఉన్నాడు .ఇక ఇక్కడ చదవటం వృధా కాల క్షేపమే అని పించింది .ఇంటి దగ్గరే ఏదో స్వయం గా సాధిస్తూ జీవికకు డబ్బు సంపాది౦చాలను కొన్నాడు .తల్లి చెప్పినట్లు మాడిసన్ చికాగోలకు వెళ్ళాడు కాని ఉపయోగ పడలేదు .ఆర్కి టేక్చరల్ ఫార్మ్స్ లో పని చేస్తూ వదిలేస్తూ వారానికి ఎనిమిది డాలర్లు ఆర్జిస్తూ ,పది డాలర్లు అప్పు తీసుకొని వారానికి రెండు డాలర్లు తీరుస్తూ తల్లికి ఆర్ధిక సాయం అందించాడు .ఇప్పుడే జీవితం లో సరైన నిర్ణయం తీసుకో గలిగానని సంతృప్తి చెందాడు ఫ్రాంక్ .జీతం పెంచమని కోరితే తిరస్కరిస్తే ,ఉద్యోగం వదిలేసి మరో కొత్త ఉద్యోగం లో ఎక్కువ జీతం లో చేరుతూ గడిపాడు .తాను జీతానికి కాని ,పనికి కాని పనికి రానని తేల్చుకొన్నాడు .మళ్ళీ పాత ఫార్మ్ లోనే చేరుతానని చెప్పి అంగీకరించగా చేరి బాగానే సంపాదిస్తూ తల్లిని చెల్లెళ్ళను చికాగో కు తెచ్చి తనతో పాటు ఉండేట్లు చేశాడు .కుటుంబం ఓక్ పార్క్ లో స్థిర పడింది

