ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108
46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -2
ఇరవై వ ఏడు వచ్చే లోపే ఫ్రాంక్ కు అడ్లర్ ,సల్లివాన్ ఫార్మ్ లో డ్రాఫ్ట్స్ మాన్ డిజైనర్ గా ఉద్యోగం వచ్చింది .చికాగో లో నే కాక అమెరికా అంతటిలోను లూయీ సల్లివాన్ గొప్ప అభ్యుదయ ఆర్కిటెక్ట్ .అతని దగ్గర పని చేయటం చాలాకస్టమే కాని రైట్ అంకిత భావం తో యజమాని సందేశం ‘’ఫారం ఫాలోస్ ఫంక్షన్ ‘’ను అనుసరించి పని చేశాడు .ఫ్రాంక్ ఆయన్ను ‘’లీబల్ మీస్టర్ ‘’అని గొప్పగా చెప్పుకోనేవాడు .అది అతనికి మాంచి యవ్వనోద్రేక కాలం .కేధరిన్ టోబిన్అనే అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు .పెళ్లి అయ్యే నాటికి కుర్రాడికిఇంకా 21రాలేదు .ఆమెకు 18మాత్రమే .సల్లివాన్ ఫ్రాంక్ కు డబ్బు అప్పు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నాడు .మనవాడు అయిదేళ్ళ కాంట్రాక్ట్ రాసి నెల వారీ వాయిదాలలో అప్పు తీరుస్తానని రాశాడు .వంట ఇంటి మీద ‘’truth is life ‘’అని ము౦దు రాసి తర్వాత ‘’it occurred to me that Life is Truth ‘’అని కలిపాడు .
ఆరుగురు పిల్లలు పుట్టారు .మామూలు తండ్రిగా ఉండటానికి ఇష్టంగా ఉండేదికాదు .ఆదర్శమైన తండ్రి గా ఉండాలని భావించాడు .ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీత వాయిద్యాలలో శిక్షణ ఇప్పించాడు .భార్య పియానో బాగా వాయించేది .కొడుకు జాన్ తండ్రి గురించి చెబుతూ ‘’నాన్న బీతొవెన్ లా ఉండేవాడు .కొడుకులు గుర్తింపు పొందే జీవితాలతో రాణించాలని ఆయన కోరిక .సౌందర్యారాధన ఉండాలని కోరేవాడు .అది ఇంట్లో నుంచే ప్రారంభమవాలని చెప్పేవాడు ‘’అని రాశాడు .ఇంకా కాంట్రాక్ట్ కాలం ఉన్నా నెమ్మది నెమ్మదిగా ప్రైవేట్ పనులు చేయటం మొదలు పెట్టాడు .యజమానికి తెలిసి కోప పడ్డాడు .అయినా లెక్క చేయకుండా ఉద్యోగానికి నీళ్ళు ఒదిలేశాడు .తర్వాత తానూ చేసింది తప్పు అని తెలుసుకొని సల్లివాన్ తో చనువుగానే ఉండేవాడు .25వయసు వచ్చేనాటికే చికాగో లో ప్రైవేట్ ప్రాక్టిస్ ప్రారంభించాడు .కమిషన్లు మాత్రం వదలలేదు .ఆతను డిజైన్ చేసిన భవనాలు ప్రత్యేకతతో ఆకర్ష ణీయంగా చూడ ముచ్చటగా ఉండేవి .అందరూ వీటిపై మోజు చూపించారు .అతనికి క్లెయింట్ లెవ్వరూ లేరు .అభిమానులూ ఆరాధకులే ఎక్కువ గా ఉండేవారు .డబ్బు విషయం లో అజాగ్రత్త వలన దివాలా పరిస్థితి ఏర్పడింది .భార్య భర్తలిద్దరూ చెక్కులపై సంతకాలు చేసి ఇస్తే బౌన్స్ అయి పరువు పోయేది చాలినన్ని నిధులు లేక పోవటం వలన .ఇక బ్యాంక్ లో డబ్బు లేదని తెలుసుకొని ‘’God give me the luxuries of life ,and I will willingly do without the necessities ‘’అని ప్రార్ధించిన గడుసు పిండం రైట్ .
పనిలో విజయాలుఉన్నా దేశం లో గుర్తింపు నెమ్మదిగా వచ్చింది .ఎవరో ఒకరిద్దరు తప్ప అతని సహ ఆర్కి టెక్ట్ లు ఫ్రాంక్ సృజనను తక్కువ గా అంచనా వేశారు .యెగతాళి చేశారు ,చెత్త అన్నారు .అతని డిజైన్ లు ఆచరణ సాధ్యం కావని తిరస్కరించి పక్కన పడేశారు .స్వయంగా ఆతను చూపిన చొరవను అర్ధం చేసుకోలేక పోయారు .ఫ్రాంక్ కు నలభై ఏళ్ళు వచ్చేసరికి యూరప్ లో అతని పనితనం ను ప్రస్తుతించి అభిమానించి నెత్తి కెత్తు కొన్నారు . అతను సాధించిన మహోన్నత విజయాలను జెర్మనిలోని ఒక పబ్లిషింగ్ హౌస్ రికార్డ్ గా ప్రచురించి ప్రపంచానికి అతని సృజనాత్మక శక్తిని తెలియ జేసింది .సమకాలీన ఫాషన్ లను త్రోసి రాజని ,కొత్త అభి వృద్ధి విధానాలతో అతనికే ప్రత్యేకమైన ‘’ఆర్గానిక్ అర్కి టేక్చర్ స్టైల్’’ఆవిర్భవించింది .అనవసర నగిషీలు ,విదేశీ బాణీలు వదిలేసి ఉన్నత పవిత్ర శైలిని పక్కకు పెట్టి ,సంపూర్ణ స్వయం సిద్ధ ఆక్రుతులకు రూప కల్పన చేశాడు .రాజీ లేని మనస్తత్వం అతనిది .’’principle is the only safe precedent ‘’అనేదే అతని ఆదర్శం .రైట్ స్వయం గా డిజైన్ చేసినమొట్టమొదటి భవనం చాలా చిన్నదేకాని విప్లవాత్మకమైనది .1893నాటికి ఇళ్ళు అన్నీ ఎత్తైన బేస్ మెంట్ లతో ,అటకలతో ,ఇంటికి మించి చూరు తో ,వాలు రూఫింగ్ లో నిలువుగా ఉండే కిటికీలతో పెట్టెల లాగా ఒక పెట్టెలో ఎన్నో పెట్టెలు లాగా ఉండేవి .గదులన్నీ ,డోర్లతో పార్టిషన్ లతో ,హాళ్ళు చీకటి గుయ్యారాల్లా ఉండేవి .ముందుగా అసహ్యంగా కనిపించే బేస్ మెంట్ కన్నాలను తీసి పారేశాడు .అటకలను ఎత్తేశాడు .గదులను విశాలంగా నివాస యోగ్యం గా మార్చాడు .ఫైర్ ప్లేస్ ఏర్పాటు చేశాడు .ఇంటికి ఇంటీరియర్ స్పేస్ అనేది కొత్తగా కల్పించాడు .దీనితో ‘’ఆర్గానిక్ ఆర్కి టేక్చర్’’ కు ప్రాణ ప్రతిష్ట చేశాడు .వంట గది సకల సదుపాయాలతో ఆకర్షణీయంగా వచ్చింది .డైనింగ్ ఏరియా కు లివింగ్ రూమ్ కు స్థానం కల్పించాడు .దీనినే ‘’ఓపెన్ ప్లాన్ ‘’అన్నారు .ఫర్నిచర్ కు వీలు ఉండేట్లు ఫ్లోర్ స్పేస్ లన్నీ లివింగ్ రూమ్స్ అయ్యాయి .టేర్ర్రేసులు , బాల్కనీలు కొత్తగా వచ్చాయి .ఇంటా బయటా విశాల మైన ఆవరణ ఏర్పడి ముచ్చటగా ఉంది .తరువాత అనేక మార్పులు పొందాయి .’’sense of spacious ness ‘’కు అధిక ప్రాదాన్యమిచ్చాడు రైట్ .
వస్తువుకు ,డిజైన్ కు ఒక చక్కని సంబంధమేర్పడింది. గొప్ప నాటకీయ మార్గ దర్శి గా .విజేతగా ఆర్కి టేక్చర్ లో స్థిరపడ్డాడు రైట్ .ఒకే నమూనాకు మూసపద్ధతిలో ఉండిపోకుండా అవసరాన్ని బట్టి విధానం మార్చాడు .కాని సమకాలికులు మాత్రం మార్పులు చేర్పులతో కాల క్షేపం చేశారు .న్యు యార్క్ లోని సస్పెండేడ్ గ్లాస్ వాల్డ్’’లీవర్ హౌస్ ‘’ఫ్రాంక్ రైట్ సృజనకు పరాకాష్ట .కాని దీన్ని ‘’కర్రలపై పెట్టె ‘’అని గేలి చేశారు .కారణం ఒకహామా లోని బార్తిల్స్ విల్ ‘’ఆకాశ హర్మ్యం ‘’ముందు వాళ్లకు ఇది ఆనలేదు .ప్రతి కొత్త చోటా నూతన విధానం లో సృజన మేళ వించి డిజైన్ చేసి నిర్మింప జేశాడు .నిత్య నూతనత్వం అతని ప్రత్యేకత .
రైట్ వినూత్న విధానం లో కొంత భాగం ఆతను వాడే మెటీరియల్ కూ ,భాగస్వామ్యం ఉంది .రాయికి ఉన్న శక్తిని ఆయన గుర్తించాడు .గుళ్ళు గా ఉండేవాటి తో తరంగ ఆకృతులను కల్పించాడు .బఫ్ఫెలో లో 1904లో కట్టిన ‘’లార్కిన్ బిల్డింగ్ ‘’రాయి సున్నాన్ని వాడి ఆశ్చర్య పరచాడు .అతి ఆడంబరాన్ని తగ్గించాడు .వస్తువుల స్వభావం తెలుసుకొని వాటిని విని యోగించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-16-ఉయ్యూరు

