సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు
సరసభారతి మరియు ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం .ముందుగా శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ సి .పి.శాస్త్రి గారు(హైదరాబాద్ ) ఆంగ్లం లో రాసిన ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకానికి సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ‘’దైవ చిత్తం ‘’గా తెలుగులోకి అనువదించిన గ్రంధాన్ని సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారి కుమార్తె ,దూర దర్శిని ప్రొడ్యూసర్ శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరిస్తారు .దీనికి ముందు మాటలను శతాధిక చారిత్రిక నవలా రచయిత,చారిత్రక నవలా చక్రవర్తి , ప్రముఖ విమర్శకులు డా .శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు రాయటం విశేషం .ఈ గ్రంధానికి ప్రాయోజకులు ,కృతి స్వీకర్త సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా ) అవటం మరో గొప్ప విషయం .
ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,సుప్రసిద్ద కవి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గుంటూరు(పులిచింతల ) శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు గౌరవ అతిధి గా ,రమ్యభారతి సంపాదకులు ,శాసనమండలి సంభ్యులు శ్రీ వై వి బి రాజేంద్రప్రసాద్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి ,ప్రముఖ కవి, రచయితా, విమర్శకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు , కే.సి.పి-సి ఇ.ఒ. మరియు రోటరీ క్లబ్ గౌరవాధ్యక్షులు శ్రీ జి.వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు .
సుప్రసిద్ధ సాహితీ మూర్తులు,ఆత్మ జ్యోతి మాసపత్రిక గౌరవ సంపాదకులు ,సుమారు 150 సంస్కృత గ్రంధాలను స్వంత ఖర్చులతో ముద్రించినవారు డా.శ్రీ రావి మోహన రావు దంపతులకు (చీరాల ), ,పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, బహు గ్రంధ కర్త డా శ్రీ డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )గారికి ,శ్రీ పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు ,తత్వ శాస్త్ర పారంగత శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మ(విజయవాడ ),గారికి,డా.నాగ రాజు అలిసేటి (యు.జి.సి.పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్, హైదరాబాద్ యూని వర్సిటి )గారికి , ప్రముఖ హరికధా భాగవతారిణి శ్రీమతి మద్దాలి (వై )సుశీల (విజయవాడ ) గారికి ,,పులకేశి, నలచరిత్ర,’ నాటక కర్త, నటులు , సంగీత భూషణ ,’’ది మైండ్ ఆఫ్ గాడ్’’ రచయిత శ్రీ ఎ.సి.పి.శాస్త్రి(హైదరాబాద్ ) గారికి , స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేయ బడును . శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు ఏర్పాటు చేసిన ‘’స్వయం సిద్ధ’’ పురస్కారాన్ని అమర వాణి హైస్కూల్ వ్యవస్థాపక నిర్వాహకులు శ్రీ పి.నందకుమార్ గారికి ,యువ ఆర్కిటెక్ట్ కుమారి చతుర్వేదుల యశస్విని కి ,అంధుడై అందులకు కంప్యూటర్ విద్య నేర్పిస్తున్న ఛి . రామారావు కు అందజేయ బడుతుంది .
తరువాత ‘’మా అన్నయ్య ‘’శీర్షికపై జిల్లాలోని ప్రసిద్ధ కవి మిత్రులచే ‘’కవి సమ్మేళనం ‘’జరుగుతుంది .
సాహిత్య ,సంగీతాభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేయ వలసినదిగా మనవి .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం మార్చి రెండవ వారం లో అంద జేయ బడును .
జోశ్యుల శ్యామలాదేవి మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు

