ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -129
53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్
అమెరికన్ నవలాకారులలో అతి వెర్రిగా అణగ దొక్కబడిన ,నిషేధింపబడిన వాడు దియోడర్ డ్రైజర్..అయినా అదే పట్టుదలతో తనను తాను కాపాడుకొన్న ధీరుడు .ప్రచురణకు కాంట్రాక్ట్ కుదుర్చుకొన్న రెండు పెద్ద సంస్థలు అతని రచనలను ప్రచురించ టానికి తిరస్కరింఛి, మిగిలిన చిన్నా చితకా పబ్లిషర్ లను కూడాఅసలు వాటిని చదవ కుండానే ప్రచురించ నీయ కుండా చేశాయి .అతనేదో దేశ ద్రోహం లాంటి నేరం చేశాడని ,ఆయన రచనలు అమెరికా జాతికి అవమాన కరమని .అశ్లీల సాహిత్య కారుడని ముద్ర వేశారు .చిన్నతనం నుంచే ఈ విద్వేషాన్ని అనుభవించటం మొదలు పెట్టి జీవితాంతం అనుభవిస్తూనే ఉన్నాడు .ఒక అభద్రతాభావం జీవితాంతం అతన్ని వెంటాడింది .అందుకే రాసిన దానిలో గందర గోళం కనిపిస్తుంది .
అసలు పేరు దియోడర్ హెర్మన్ ఆల్బర్ట్ డ్రైజర్.27-8-1871న అమెరికాలోని ఇండియానా రాష్ట్రం లో ఉన్న టెర్రెహాట్ లో జన్మించాడు .ఇల్లు పాడుపడిన దెయ్యాలకొంప .జబ్బు పడినట్లు నీరసంగా కనిపించే కొడుకు ఆరోగ్యం కోసం తల్లి ప్రక్కనే ఉన్న ముసలి మంత్ర గత్తేను పిలిపించి దెయ్యం పట్టి అలా చిక్కిపోతున్నాడేమో చూసి వదిలించమని కోరింది .తండ్రిజాన్ పాల్ కేధలిక్ .ఇలాంటి నమ్మకాలు లేనివాడు .ఏ ఇబ్బంది వస్తుందో నని జర్మనీ పారిపోయాడు ఆయన జీవితం లో విఫలుడు .బ్రహ్మాండమైన ఫాక్టరీకి సంపన్న యజమాని .దివాలా తీసి లేబరర్ గా పనిచేస్తున్నాడు .ఇంటిబాధ్యత అతని మేన్నోనైట్ భార్య వహించి ఒక బోర్డింగ్ హౌస్ ను నిర్వహిస్తూ వాషింగ్ పనీ చేబట్టింది .13మంది సంతానం లో దియోడర్ 12వ వాడు .ఆ కుటుంబం అంతా వేయించిన బంగాళాదుంపలు ,పాప్ కారన్ తిని బతికింది ..రైల్ రోడ్ ప్రక్కనే ఉండటం తో వాగన్లలోని బొగ్గు దొంగలించి అమ్మి సొమ్ము చేసుకొనేవారు .ఎవరికీ చెప్పులు కూడా ఉండేవికావు .తల్లి చేసిన ఇస్త్రీ బట్టల్ని బుజాలపై మోసుకొంటూ డోర్ డెలివరి ఇచ్చేవాడు దియోడర్.పేదరికపు కోరల్లో గిలగిల లాడి పోతున్న సంసారాన్ని చూసి ఏమీ చేయలేక తన నిస్సహాయ స్థితికి వ్యధ చెందేవాడు .అన్నలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి బాధ్యత లేని తమ జీవితానందాలను కధలుగా చెబుతూంటే ఆశ్చర్య పోయేవాడు .ఏదీ సాధించకపోయినా తండ్రి ఆడపిల్లలను తల్లినీ సాధిస్తూ ఇబ్బంది పెట్టటం సహించ లేక పోయేవాడు .తన తల్లి దయ సానుభూతి ప్రేమ ఉన్న మాతృమూర్తి అని తెలుసుకొని ఆరాధించేవాడు .
పెద్దకొడుకులు లాగా వీడు దారి తప్పకూడదని తండ్రి డ్రైజర్ను చర్చి స్కూల్ కు పంపించాడు .అక్కడి మత బోధ ఒంటికి పడలేదు .తట్టుకో లేక పోయాడు .నల్ల డ్రెస్ వేసుకొన్న ప్రీస్ట్ లంటే భయమేసేది .నవ్వుకు తావేలేదక్కడ .నిత్య కర్మకాండ మరింత భయపెట్టింది .కుటుంబం అక్కడి నుంచి ఇండియానా లోనే మరో ప్రాంతానికి మారింది .మనవాడు ఇక్కడ అయిష్టంగానే ఉండిపోయాడు ,చికాగోకు ఫామిలీ చేరినతర్వాత ఊరట లభించింది .చిన్నతనం లో ఆడుకొనే ఆటలు అతనికి దూరమయ్యాయి .బాల్యం అంతాఆనంద రహితంగానే గడిచిందని బాధ పడేవాడు .17ఏళ్ళు రాకముందే ఒక మురికి రెస్టా రెంట్ డిష్ వాషర్ గా,స్టవ్ తుడవటం ,కార్ చెకర్ గా పని చేశాడు .18వ ఏట వారానికి 5డాలర్లు సంపాదించాడు .అతని పూర్వపు టీచర్ ఇండియానా యూని వర్సిటి లో పని చేసే అవకాశం కల్గించాడు..19వ ఏట తల్లి చనిపోయింది .ఆమె అనారోగ్యం తో చర్చికి హాజరు కాలేక పోయేది .అందుకని ఆమె చనిపోతే ప్రీస్ట్ వచ్చి అంత్యక్రియలు జరపటానికి నిరాకరించాడు .ఇవన్నీ ఈయువకుడి పై ప్రభావం కలిగించి అసలే చర్చి అంటే ఏహ్యభావం ఉన్న దియోడర్ కు ఆ సంప్రదాయం పై పూర్తీ వ్యతిరేకత ఏర్పడిపోయింది ‘.
పొట్ట పోషణకోసం రియల్ ఎస్టేట్ కాన్వాసర్ గా ,వాగన్ డ్రైవర్ గా ,చిన్న చిన్న పనులు చేస్తూ ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో చేరాడు .ఇరవై ఏళ్ళకే రిపోర్టర్ చేస్తూ ప్రపంచం లోని కస్టాలు బాధలు వ్యధలు ,ప్రజల ,పాలకుల ఉదాసీనత అర్ధం చేసుకొన్నాడు .అందులో ఏదీ వార్తకాదని యదార్ధ గాధ అని తెలుసుకొన్నాడు .సెయింట్ లూయీ కి మారి తన పేపరుకు స్కూల్ టీచర్ పరీక్ష నిర్వహించి సారా వైట్ అనే ఆమ్మాయి తో పరిచయమై ప్రేమించి ,అయిదేళ్ళ తర్వాత పెళ్ళాడాడు .పెళ్ళికాక ముందే చార్లెస్ డికెన్స్ ,డూ మారినర్ ,హతారన్ ,బాల్జాక్ రచనలన్నీ క్షుణ్ణంగా చదివి జీర్ణం చేసుకొన్నాడు .సెయింట్ లూయీ నుండి టోలెడో,క్లీవ్ లాండ్ ,పిట్స్ బర్గ్ ,కూ చివరికి న్యూయార్క్ కూ చేరాడు .అప్పటికే అతని సోదరుడు పాల్ ,ఇద్దరు అక్కలు అక్కడేఉంటున్నారు .అక్కడ కెరీ అనే రెస్టారంట్మేనేజర్ గా ఉన్న ఆమెను ఒకడు ముగ్గులోకి దింపి ,ఆమెతో ఉడాయి౦చేశాడు .15వేల డాలర్లు నొక్కేసి బొక్కేసిన వాడినే పెళ్లి చేసుకొంది.వాడికి అన్నిరకాల సాయం చేసింది .తన సోదరి ధనవంతుడైన వాడినిస్టపడి ,కడుపు తెచ్చుకొంటే ఆమెకు అండగా నిలిచింది .ఈ కెరీ అంటే డ్రైజర్కు వీరాభిమానం .ఈమెనే తన నవలలో ముఖ్య పాత్రగా చిత్రించాడు .అక్కలకు ,పాల్ కు భారం కారాదని భావించి వేరే ఒక అచ్చిరాని చోట రూమ్ అద్దెకు తీసుకొన్నాడు .’’న్యూ యార్క్ వరల్డ్ ‘’పత్రికలో ఉద్యోగం వచ్చింది .కొద్దికాలానికే డిస్మిస్ చేశారు .తిండిలేక ఇబ్బందిపడ్డాడు .రోజూ పస్తులే .పాల్ వచ్చి బాసటగా నిలిచాడు .పాల్ డ్రసర్ గా పిలువ బడే ఇతను గుర్తింపు పొందిన గొప్ప నటుడు ,ఎంటర్ టైనర్.అనేక పాప్యులర్ సాంగ్స్ పాడి రికార్డ్ చేసినవాడు .అందులో బార్బర్ షాప్ మెలడీలు ,సెంటి మెంటల్ త్రిల్లర్లూ ఉన్నాయి .300పౌండ్ల స్తూలకాయుడు పాల్ .మనవాడికంటే 15ఏళ్ళు పెద్ద .హానికర రక్త హీనత వలన 1906లో పాల్ చనిపోతే ‘’మై బ్రదర్ పాల్ ‘’అంటూ విపరీతంగా ఏడ్చేశాడు .అతనితోకలిసి తయారు చేసిన ఒక పాట ఆల్ టైం రికార్డ్ అయింది .తన పబ్లిషింగ్ ఫార్మ్ లో ఇతనికి అవకాశమిచ్చాడు .ఈ సంస్థ పాటలు ,కధలతో ఒక మేగజైన్ తెచ్చి ‘’ఎడిటర్ అండ్ అరెంజర్ ‘’అని గౌరవంగా ముద్రించాడు .అవినీతి తో కూరుకు పోయిన మెట్రో రాజకీయాలను ,పురాతత్వ శాస్త్రం ,ఐరోపా పరిస్తితులు ,మహిళా భవితవ్యం ,మద్యపాన వ్యసనం ,కుజ గ్రహం లో జీవరాశి మొదలైన విషయాలపై సంపాదకీయ రచనలు చేసే బాధ్యత డ్రైజర్ కు అప్పగించాడు ఇతను తన సమర్ధతను చాటి భేష్ అనిపించుకొన్నాడు . ,
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-16-ఉయ్యూరు
.

